Talk time
-
బీఎస్ఎన్ఎల్ దివాలీ స్వీట్
సాక్షి, ముంబై: ఫెస్టివ్ సీజన్లో దేశీయ ప్రధాన టెలికం కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే జియో దీపావళి బొనాంజా ప్రకటించగా ఇదే బాటలో ఇతర కంపెనీలు కూడా పయనిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ దివాలీ ఆఫర్ ప్రకటించింది. దీపావళి పండుగ సందర్భంగా 8.8శాతం టాక్ టైంను అదనంగా అందిస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. వివిధ టాప్‌అప్‌లపై ఈ అదనపు టాక్ టైంను ఆఫర్ చేస్తోంది. ఆ ఆఫర్ 25 అక్టోబర్ నుంచి నవంబరు 15 దాకా మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది. కాగా జియో వార్షికప్లాన్కు పోటీగా బీఎస్ఎన్ఎల్ కూడా వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. Enjoy this Diwali with #BSNL. Get extra talk value upto 8.8% on top up plans. pic.twitter.com/qnDIwni3T8 — BSNL India (@BSNLCorporate) October 24, 2018 -
ఒక రూపాయి డిపాజిట్ చేస్తే...
న్యూఢిల్లీ: పొదుపుఖాతాలపై ఇండస్ట్రీలోనే ఉత్తమ వడ్డీరేట్లు అందిస్తున్నామంటున్న ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ తన ఖాతాదారులను ఆకట్టుకునేందుకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ బ్యాంక్‌లో నగదు డిపాజిట్ చేసిన ఖాతాదారుడికి అదనపు ప్రయోజనాలు అందిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. ఎయిర్టెల్ చెల్లింపుల బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో జమచేసే ఒక్కో రూపాయికి ఒక నిమిషం టాక్ టైమ్ ను అందిస్తోంది. వినియోగదారులకు ఎక్కువ వడ్డీ రేట్లు అందించడంతోపాటు పాటు ఈ అదనపు ప్రయోజనం ద్వారా ఎక్కువ ఖాతాదారులను ఆకర్షించాలనే లక్ష్యంతో ఈ ఆఫర్ ఇస్తున్నట్టు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ , ఎండీ, సీఈఓ శశి అరోరా తెలిపారు. ఉదా : ఒక కస్టమర్ రూ .1000 లను పొదుపు ఖాతాలో జమచేస్తే అతను / ఆమెకి 1000 నిమిషాల ఉచిత టాక్ టైం లభిస్తుంది. ఎయిర్ టెల్ నుంచి ఎయిర్ టెల్ కి దేశీయ కాల్స్ కోసం ఈ టాక్ టైంను వాడుకోవచ్చు. అలాగే మొదటిసారి డిపాజిట్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని కూడా బ్యాంక్ స్పష్టం చేసింది. కాగా పైలట్ ప్రాతిపదికన రాజస్థాన్ లో నవంబర్ 23 న ప్రారంభమైన ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ 7.25శాతం వడ్డీ అందిస్తోంది.దీంతోపాటు లక్ష రూపాయల వ్యక్తిగత ప్రమాద బీమా క్పలిస్తోంది. నాన్ ఎయిర్ టెల్ కస్టమర్లు కూడా తన ప్రత్యేక ఎయిర్ టెల్ రీటైల్ కౌంటర్ల ద్వారా ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంక్ ఖాతాను తెరవచ్చని పేర్కొన్న సంగతి తెలిసిందే. -
రూ.99కే 35,000 సెకన్ల టాక్‌టైం!
రెండు రోజులు మాత్రమే స్పెషల్ ఆఫర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ టెలినార్ రూ.99 విలువ గల స్పెషల్ టారిఫ్ వోచర్‌ను 28 రోజుల కాల పరిమితితో ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఏదైనా ఇతర నెట్‌వర్క్‌కు 17,500 సెకన్ల లోకల్, ఎస్టీడీ టాక్టైంతో పాటు సొంత నెట్‌వర్క్‌కు 17,500 సెకన్ల టాక్‌టైంను ఇస్తోంది. ఈ నెల 27, 28న మాత్రమే ఈ వోచర్ లభిస్తుంది. -
రూ.300 రీచార్జ్ చేసుకుంటే రూ. 433 టాక్ టైం
హైదరాబాద్ : కొత్త వినియోగదారులకు మొబైల్ కాల్ రేట్లలో 80 శాతం వరకూ డిస్కౌంట్ ఇస్తున్న ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ తాజాగా నూతన సంవత్సరం కానుకగా వినియోగదారులకు ఎక్స్ట్రా టాక్ టైమ్ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా రూ.290 రీచార్జ్ చేసుకుంటే రూ.320 టాక్‌టైమ్‌ను అందిస్తోంది. అలాగే రూ.300 రీచార్జ్ చేసుకుంటే రూ.433, రూ.890 రీచార్జ్ చేసుకుంటే రూ. 1,000, రూ.2,000 రీచార్జ్ చేసుకుంటే రూ.2,300, రూ.3,000 రీచార్జ్ చేసుకుంటే రూ.3,450, రూ. 5,000 రీచార్జ్ చేసుకుంటే రూ.6,000 టాక్‌టైమ్ అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ వచ్చే నెల 2వ తేదీ వరకూ కొనసాగుతుందని తెలిపింది. వివరాలకు 1503కి డయల్ చేయాలని సూచించింది. -
ఆర్‌కామ్ లాభం 48% క్షీణత
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో టెలికం దిగ్గజం రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) నికర లాభం ఏకంగా 48.5 శాతం క్షీణించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 156 కోట్లకు పరిమితమైంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో రూ. 303 కోట్ల లాభం నమోదు చేసింది. అప్పట్లో వ్యాపార పునర్వ్యవస్థీకరణతో రూ. 550 కోట్ల మేర వన్‌టైమ్ ఆదాయం రావడం వల్ల గత గణాంకాలు భారీగా ఉన్నాయని, అది మినహాయిస్తే వ్యాపార పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని ఆర్‌కామ్ సీఈవో గుర్దీప్ సింగ్ తెలిపారు. త్రైమాసికాల వారీగా చూస్తే మూడో క్వార్టర్‌తో పోలిస్తే లాభం రూ. 108 కోట్ల నుంచి 44 శాతం మేర పెరిగినట్లయిందని వివరించారు. మొత్తం మీద నాలుగో త్రైమాసికం సంతృప్తికరంగానే సాగిందని సింగ్ పేర్కొన్నారు. ఆదాయం 5 శాతం పెరిగి రూ. 5,130 కోట్ల నుంచి రూ. 5,405 కోట్లకు చేరింది. నికర రుణ భారం 3.3 శాతం పెరిగి రూ. 40,178 కోట్లకు చేరింది. వడ్డీ వ్యయాలు 21 శాతం ఎగిసి రూ. 907 కోట్లుగా నమోదయ్యాయి. ఇక మొత్తం ఆర్థిక సంవత్సరానికి ఆదాయం 3 శాతం పెరిగి రూ. 21,238 కోట్లుగాను, నికర లాభం 55 శాతం పెరిగి రూ. 1,047 కోట్లుగాను నమోదైంది. పెరుగుతున్న ముడి వస్తువుల ధరల సమస్యను అధిగమించే ప్రణాళికలో భాగంగానే ఉచిత టాక్‌టైమ్ తగ్గింపు, టారిఫ్‌ల పెంపు చేపట్టినట్లు సింగ్ పేర్కొన్నారు. ప్రస్తుతం మొత్తం ఆదాయంలో జీఎస్ఎం వైర్లెస్ డేటా వాటా 72 శాతంగా ఉందని తెలిపారు. -
యాడ్ క్లిక్ చేస్తే టాక్ టైం ప్రీ....