
ప్రభుత్వ టెలికం కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) ఎప్పటికప్పుడు చౌక రీచార్జ్ ప్లాన్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. తాజాగా కొత్త బడ్జెట్-ఫ్రెండ్లీ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇది వినియోగదారులకు అపరిమిత కాలింగ్, రోజువారీ డేటా, ఉచిత ఎస్‌ఎంఎస్ వంటి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది.
కొత్త ప్లాన్ ప్రయోజనాలు
రూ. 347 ధరతో బీఎస్‌ఎన్‌ఎల్ ప్రవేశపెట్టిన ఈ ప్లాన్ వినియోగదారులకు ఢిల్లీ, ముంబైలోని ఎంటీఎన్‌ఎల్ (MTNL) ప్రాంతాలతో సహా దేశం అంతటా ఉచిత అపరిమిత కాలింగ్, ఉచిత జాతీయ రోమింగ్‌ను అందిస్తుంది. అదనంగా, రోజుకు 2GB హై-స్పీడ్ డేటాను, రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లను యూజర్లు ఆనందించవచ్చు.
ఈ ప్లాన్ 54 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అదనపు బోనస్‌గా బీఐటీవీ (BiTV)కి ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను అందుకుంటారు. ఇది 450 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్‌లు, వివిధ రకాల OTT యాప్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది.
నెట్‌వర్క్‌ను విస్తరించడం ద్వారా సేవలను మెరుగుపరచడంపై బీఎస్‌ఎన్‌ఎల్ దృష్టి సారిస్తోంది. కంపెనీ 65,000 కొత్త 4జీ టవర్లను విజయవంతంగా అమలులోకి తెచ్చింది. దేశం అంతటా తమ వినియోగదారులకు మెరుగైన కనెక్టివిటీని అందించేందుకు ఈ సంఖ్యను త్వరలో లక్షకు పెంచాలని యోచిస్తోంది.
ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం ఆపరేటర్‌ను పునరుద్ధరించే ప్రయత్నంలో, మెరుగైన సర్వీస్ డెలివరీని లక్ష్యంగా చేసుకుని బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ నెట్‌వర్క్‌లను అప్‌గ్రేడ్ చేయడానికి ప్రభుత్వం ఇటీవల రూ. 6,000 కోట్ల ప్యాకేజీని ఆమోదించింది.
బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించే విస్తృత ప్రయత్నంలో ఇది భాగం. ఇటీవలి సంవత్సరాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ పునరుద్ధరణ కోసం ప్రభుత్వం రూ.3.22 లక్షల కోట్ల సాయాన్ని ప్రకటించింది. 2007 తర్వాత మొదటిసారిగా బీఎస్‌ఎన్‌ఎల్ లాభాల్లోకి వచ్చింది. 2025 ఆర్థిక సంవ్సతరం మూడవ త్రైమాసికంలో రూ.262 కోట్ల నికర లాభాన్ని నివేదించింది.
Comments
Please login to add a commentAdd a comment