new prepaid plan
-
జియో కొత్త ప్లాన్.. వాటి కన్నా అధిక వ్యాలిడిటీ
ప్రయివేటు టెలికం కంపెనీల మధ్య పోటీ రోజురోజుకీ పెరుగుతోంది. టారిఫ్‌లు పెంచిన తర్వాత యూజర్ల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో వారిని ఆకట్టుకునేందుకు జియో కొత్త కొత్త ప్లాన్లను తీసుకొస్తోంది. ఇప్పటికే మార్కెట్లో టాప్‌గా ఉన్న జియో.. ప్రత్యర్థుల కంటే అధిక వ్యాలిడిటీతో మరో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది.జియో తీసుకొచ్చిన కొత్త ప్లాన్ రూ.999. ఇది 98 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. రోజూ 2జీబీ హైస్పీడ్ డేటా, అన్ని నెట్‌వర్క్‌లకు అన్లిమిటెడ్ కాలింగ్, 100 ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి. అవకాశం ఉన్న యూజర్లు అన్లిమిటెడ్ 5జీ డేటాను ఆస్వాదించవచ్చు. వీటితో పాటు జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ వంటి విస్తృతమైన జియో సేవలు కాంప్లిమెంటరీగా లభిస్తాయి.వోడాఫోన్-ఐడియాలో రూ.998, ఎయిర్‌టెల్‌లో రూ.979లతో ఇలాంటి ప్లాన్లే ఉన్నా అవి కేవలం 84 రోజుల వ్యాలిడిటీని మాత్రమే అందిస్తున్నాయి. అయితే వోడాఫోన్-ఐడియా రూ.998 ప్లాన్ విభిన్నమైన ఫీచర్లను అందిస్తోంది. ఇందులో అర్ధరాత్రి నుండి ఉదయం 6 గంటల వరకు అపరిమిత డేటా వినియోగాన్ని అనుమతించే బింగే ఆల్ నైట్ ఫీచర్, వారాంతపు డేటా రోల్ఓవర్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.అదనంగా సోనీలివ్ ఉచిత సబ్స్క్రిప్షన్ లభిస్తుది. ఇక ఎయిర్టెల్ రూ.979 ప్లాన్ 2జీబీ రోజువారీ డేటా, 100 ఎస్ఎంఎస్లను అందిస్తుంది. -
రేపటి నుంచే కొత్త రీచార్జ్ ప్లాన్లు.. ఇక నెలకు కనీసం..
ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్లపై టారిఫ్ పెంపును ప్రకటించాయి. ఆయా కంపెనీలు 25 శాతం వరకు పెంచాయి. ఇవి మరి కొన్ని గంటల్లో అమల్లోకి వస్తాయి. ఎయిర్టెల్, జియో కొత్త ప్లాన్లు జూలై 3 నుంచి, వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్లు జూలై 4 నుంచి వర్తిస్తాయి.మునుపటి ప్లాన్ల మాదిరిగానే, మూడు టెల్కోలు వేర్వేరు యూజర్ల కోసం ఉద్దేశించిన వేర్వేరు బండిల్స్‌ను అందిస్తున్నాయి. వీటిలో నెలవారీ, త్రైమాసిక, వార్షిక రీఛార్జ్ ప్లాన్లు ఉన్నాయి. అయితే చాలా మంది నెలవారీ ప్లాన్లను రీచార్జ్ చేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో మూడు టెల్కోలకు సంబంధించిన మంత్లీ మినిమమ్ రీచార్జ్ ప్లాన్ల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం..ఎయిర్టెల్ రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ఎయిర్టెల్ తన కనీస నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్ ధరను రూ .179 నుంచి రూ .199 కు పెంచింది. ఈ ప్లాన్‌తో 28 రోజుల వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ కాలింగ్, 2 జీబీ 4జీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ ఉంటాయి. కేవలం కాల్స్, మెసేజింగ్ కోసం సిమ్ కార్డును ఉపయోగించాలనుకునే వారికి ఈ ప్లాన్ చాలా మంచిది.జియో రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్జియో అత్యంత తక్కువ నెలవారీ రీఛార్జ్ ప్లాన్ ధర రూ .199. ఇది రూ .155 నుంచి భారీగా పెరిగింది. 28 రోజుల వాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్ ద్వారా అపరిమిత కాలింగ్, 300 ఎస్ఎంఎస్లు, 2 జీబీ 4జీ డేటా లభిస్తుంది. హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఉండి, ఎక్కువ మొబైల్ డేటాను ఉపయోగించని వారికి ఈ ప్లాన్ బాగా సరిపోతుంది.వీఐ రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్వొడాఫోన్ ఐడియాలో కూడా అత్యంత సరసమైన నెలవారీ రీఛార్జ్ ప్లాన్ ధర రూ .199. ఈ ప్లాన్‌తో 28 రోజుల వ్యాలిడిటీ, 2 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, 300 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. -
ఎయిర్టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్, 30రోజులు వాలిడిటీతో
సాక్షి,ముంబై: దేశీయ టెల్కో దిగ్గజం భారతీ ఎయిర్టెల్ యూజర్లకు సరికొత్త ప్లాన్‌ను అందిస్తోంది. 30 రోజులవాలిడిటీతో రూ.199 విలువైన కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా డేటా పెద్దగా వాడని యూజర్లకోసం ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఎందుకంటే 30 రోజులకు గాను కస్టమర్లకు అందించే మొత్తం డేటా కేవలం 3జీబీ మాత్రమే. అలాగే అపరిమిత వాయిస్ కాలింగ్, 30 రోజులకు 300 ఎస్ఎంఎస్ లు ఉచితం. అయితే రోజుకు 100 మెసేజ్‌లకు పరిమితం. ఎయిర్టెల్ వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా వినియోగదారులకు రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది. -
ఎయిర్టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ టెలికం సంస్థ భారతి ఎయిర్టెల్ తమ వినియోగదారులకు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకువచ్చింది. రూ. 279 రూ. 379 రీచార్జ్‌తో రెండు కొత్త ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను ఎయిర్టెల్ తమ వెబ్సైట్లో వెల్లడించింది. ఈ రీఛార్జ్‌లో ఆన్లిమిటెడ్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లను అందిస్తుంది. వీటికి ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తోపాటు నాలుగు లక్షల జీవిత బీమాను అందిస్తోంది. ఎయిర్టెల్ ప్రీపెయిడ్ రూ. 279 రిఛార్జ్ చేసుకుంటే రోజూ 1.5 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు పొందవచ్చు. ఈ ప్యాక్ గడువు 28 రోజులని తెలిపింది. అలాగే రూ. 379 రీచార్జ్ చేసుకుంటే అన్లిమిటెడ్ కాల్స్, కేవలం 6 జీబీ డేటా, 900 ఎస్ఎంఎస్లు మాత్రమే పొందడానికి వీలు ఉంటుంది. ఈ ప్లాన్ గడువు 84 రోజులు ఉంటుంది. ఈ ప్లాన్లు ఎయిర్టెల్ నెట్‌వర్క్‌తోపాటు ఇతర అన్ని నెట్‌వర్క్‌లకు వర్తిస్తుంది. రూ.379 రీచార్జ్ ఫాస్టాగ్ కొనుగోలుపై రూ.100 క్యాష్‌బ్యాక్‌ను కస్టమర్లకు అందిస్తోంది. వీటితోపాటు వింక్ మ్యూజిక్, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఇటీవలే ఎయిర్టెల్ వినియోగదారులకు భారీగా కోత విధించగా.. తాజాగా రెండు కొత్త ప్లాన్లను ప్రకటించి యూజర్లకు కొంత ఊరటనిచ్చింది. ఇటీవల అన్ని టెలికాం సంస్థలు ప్రీపెయిడ్ ధరలను భారీగా పెంచిన విషయం తెలిసిందే. తమ కంపెనీ నష్టాలను పూడ్చేందుకే ఈ ధరలను పెంచుతున్నట్లు సదరు టెలికాం సంస్థలు పేర్కొన్నాయి. ఇక కొత్త ఎయిర్టెల్ ప్లాన్.. జియో, వొడాఫోన్ ఆఫర్లతో పోల్చితే మెరుగ్గానే ఉంది. జియో కూడా ప్రస్తుతం ఇలాంటి ఆఫర్‌నే అందిస్తుండగా ఆఫ్-నెట్ కాల్స్ చేసుకోడానికి ఐయూసీ ఛార్జీలు చెల్లించాలనే షరతు ఉంది. -
బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్.. 5జీబీ డేటా
సాక్షి, ముంబై: భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. రూ. 90 రోజుల చెల్లుబాటుతో రూ. 109 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ తాజాగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. "మిత్రం ప్లస్" పేరుతో తీసుకొచ్చిన ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో మొత్తం 5 జీబీ డేటాను అందిస్తుంది. దీంతోపాటు రోజుకు 250 నిమిషాల వాయిస్ కాలింగ్ సదుపాయం లభ్యం. కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ప్రస్తుతం ఉన్న (రూ.49, రూ. 40, 500 ఎమ్‌బి డేటా, 15 రోజుల వాలిడిటీ) మిత్రం ప్లాన్లతో పాటు అందుబాటులో ఉండనుంది. బీఎస్ఎన్ఎల్ కేరళ వెబ్సైట్లో లిస్టింగ్ ప్రకారం రూ. 109 మిత్రం ప్లస్ ప్లాన్ 5 జీబీ డేటా, ముంబై ఢిల్లీ, సర్కిల్‌లతో సహా భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా ప్రతిరోజూ 250 నిమిషాల వాయిస్ కాలింగ్‌ను అందిస్తుంది. అయితే కేరళ సర్కిల్లోని బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు మాత్రమే ఈ ప్లాన్ వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా మిగతా సర్కిళ్లకు త్వరలోనే రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకురానుంది. అయితే ఎపుడు అందుబాటులోకి వచ్చేదీ స్పష్టత లేదు. -
వొడాఫోన్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్
సాక్షి, ముంబై: టెలికాం సంస్థ వొడాఫోన్ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రూ.69 ల ఒక కొత్త ప్రీ పెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. 28 రోజల వాలిడిటీ ఉన్న ఈ ప్లాన్‌లో 150 నిమిషాల వాయిస్ కాల్స్, 250 ఎంబీ డేటా ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తోంది. అలాగే పలు సర్కిల్స్‌లో ఈ ప్లాన్‌లో ఎస్ఎంఎస్లు కూడా ఉచితం. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ, అస్సాం, బీహార్, జార్ఖండ్, ఢిల్లీ, ముంబై ప్రాంతాల్లో మాత్రమే ఈ ప్లాన్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. తన ఆల్ రౌండర్ ప్రీ పెయిడ్ ప్లాన్లలో ఈ కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. తన పోర్ట్ఫోలియోలోఇప్పటికే లాంచ్ చేసిన రూ .45 , 35, 65, 95, రూ .145 ప్లాన్లకు కొనసాగింపుగా దీన్ని తీసుకొచ్చింది. -
బీఎస్ఎన్ఎల్ స్టార్ మెంబర్షిప్ @498
సాక్షి,ముంబై: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్‌లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) రెండు తెలుగు రాష్ట్రాల వినియోగదారులకు బంపర్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్టార్ మెంబర్షిప్ ప్రోగామ్‌ను లాంచ్ చేసింది. 498 రూపాయల సరికొత్త స్టార్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా భారతి ఎయిర్టెల్ థాంక్స్ లాయల్టీ ప్రోగ్రామ్‌కు ధీటుగా ఈ సరికొత్త ఎత్తుగడతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. త్వరలోనే అన్ని సర్కిల్స్‌లోను అమలు చేయనున్న స్టార్ ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ ప్రస్తుతానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అందుబాటులో ఉంది. రూ.498 స్టార్ మెంబర్షిప్ ప్లాన్ 30 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్, 30జీబీ డేటా, 1000 ఎస్ఎంఎస్లు ఉచితం. వాలిడిటీ 365 రోజులు. కానీ, ఈ ప్లాన్‌లో అందించే డేటా, వాయిస్‌కాల్స్, ఇతర సేవలు మాత్రం 30 రోజులకే పరిమితం. అయితే తరువాత చేసుకునే రీచార్జ్‌లపై డిస్కౌంట్‌ను అందిస్తుంది. ఉదాహరణకు ఎస్టీవీ రూ. 99 ప్రీపెయిడ్ ప్లాన్ స్టార్ సభ్యునికి రూ.76 కే అందుబాటులో ఉంటుంది. ఇదే మాదిరిగా వివిధ రీచార్జ్‌లపై స్టార్ మెంబర్లకు ప్రత్యేక డిస్కౌంట్లు లభిస్తాయి. -
వోడాఫోన్ కొత్త ప్లాన్ : కొత్త కస్టమర్లకే
సాక్షి, ముంబై: వోడాఫోన్ కొత్త రీచార్జ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. రూ.351 ల ప్రీపెయిడ్ ప్లాన్‌లో అన్లిమిటెడ్ కాలింగ్ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్ వాలిడిటీ 56 రోజులు. ఫస్ట్ రీచార్జ్ ప్లాన్‌గా తీసుకొచ్చిన ఈ ప్లాన్ వోడాఫోన్ కొత్త సిమ్ వాడే కొత్త యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఇందులో అన్ లిమిటెడ్ కాలింగ్‌తోపాటు ఎస్ఎంఎస్ కూడా సదుపాయాన్ని అందిస్తున్నట్టు వోడాఫోన్ తెలిపింది. -
బీఎస్ఎన్ఎల్ దసరా ఆఫర్: రోజుకు 2జీబీ డేటా
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ దసరా ఆఫర్‌గా స్పెషల్ టారిఫ్ వోచర్‌ను లాంచ్ చేసింది. ప్రధాన ప్రత్యర్థులు జియో, ఎయిర్‌టెల్‌కు సవాలుగా బీఎస్ఎన్ఎల్ చవకైన ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. లిమిటెడ్ ఆఫర్‌గా తీసుకొచ్చిన ఈ ప్లాన్‌తో కస్టమర్లను ఆకర్షిస్తోంది. ప్రీపెయిడ్ చందాదారుల కోసం ఒక ప్రత్యేక ఎస్టీవీ ప్రారంభించింది. రూ .78 ధరకే, అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఆఫర్ చేస్తోంది. ఈ పరిమితి కాలంగా లాంచ్ చేసిన ఇది అక్టోబర్ 15 నుండి భారతదేశం అంతటా అందుబాటులోకి వచ్చింది. అయితే, ప్రణాళిక కొన్ని ఆసక్తికరమైన ప్రయోజనాలను అందిస్తుంది. రోజుకు హై-స్పీడ్ 2జీబీ డేటాఆఫర్ చేస్తోంది.10 రోజుల వాలిడిటీ అంటే మొత్తం 20జీబీ డేటా వినియోగించుకోవచ్చు. అంతేకాదు 3జీబీ టెక్నాలజీ ఫాస్ట్ వీడియో కాలింగ్ ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఇందులో అపరిమిత వీడియో కాల్స్ కూడా అందిస్తోంది. Make this festive season even more joyful in just Rs. 78. Enjoy unlimited data and voice with #BSNL STV 78. pic.twitter.com/bW9Wg84day — BSNL India (@BSNLCorporate) October 15, 2018 -
బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు ఫ్రీడమ్ ఆఫర్
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల కోసం 'ఫ్రీడమ్ ఆఫర్ - చోటా ప్యాక్'ను ప్రకటించింది. దీని కింద తన ప్రీపెయిడ్ కస్టమర్లకు 9 రూపాయలు, 29 రూపాయలతో రెండు సరికొత్త ప్లాన్లను అందుబాటులో ఉంచింది.ఆగస్టు 10 నుంచి ఈ ‘ఫ్రీడమ్ ఆఫర్- చోటా ప్యాక్’ ప్లాన్లు అమల్లోకి వచ్చాయి. 9 రూపాయల ఫ్రీడమ్ ఆఫర్- చోటా ప్యాక్ కింద బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ సబ్స్క్రైబర్లకు అపరిమిత వాయిస్ కాల్స్(ఢిల్లీ, ముంబై మినహాయించి), 80కేబీపీఎస్ స్పీడులో 2జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్యాక్ వాలిడిటీ ఒక్క రోజే. ఈ ప్రయోజనాలను ఆగస్టు 10 నుంచి ఆగస్టు 25 మధ్యలో ఎప్పుడైనా పొందవచ్చు. అదేవిధంగా 29 రూపాయల ఫ్రీడమ్ ఆఫర్-చోటా ప్యాక్ కింద ఢిల్లీ, ముంబై ప్రాంతాలను మినహాయించి, మిగిలిన ప్రీపెయిడ్ కస్టమర్లకు అపరిమిత వాయిస్ కాల్స్, 80కేబీపీఎస్ స్పీడులో రోజుకు 2జీబీ డేటా, రోజూ 100 ఎస్ఎంఎస్లను ఆఫర్ చేస్తోంది. ఆగస్టు 25 వరకు ఈ ప్లాన్ ప్రయోజనాలు మారవు. ఆ అనంతరం రోజుకు 1జీబీ డేటానే ఆఫర్ చేయనుంది. వారానికి 300 ఎస్‌ఎంఎస్‌లనే అందిస్తోంది. బీఎస్ఎన్ఎల్ ఇటీవలే 27 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్‌పై ఏడు రోజుల పాటు రోజుకు 1జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. దాంతో పాటు అపరిమిత కాలింగ్ ప్రయోజనాలు, 300 ఎస్ఎంఎస్లను అందిస్తోంది. -
జియోకి కౌంటర్ : ఐడియా సూపర్ ప్లాన్
సాక్షి, ముంబై: రిలయన్స్ జియోకి కౌంటర్‌గా ఐడియా సెల్యులార్ కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సరసమైన ధరల్లో డేటాను అందిస్తున్న టాప్ టెలికాం ఆపరేటర్ జియోకు పోటీని ఎదుర్కొనేలా ఇతర కంపెనీలు కొత్త టారిఫ్‌లను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐడియా కూడా కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్‌ను అందిస్తోంది. 28రోజుల వాలిడిటీలో ఈ కొత్త రూ. 227ల ప్రీపెయిడ్ ప్యాక్‌ను లాంచ్ చేసింది. ఇందులో అపరిమిత కాల్స్, డేటా ప్రయోజనాలతో పాటు అన్లిమిటెడ్ ఉచిత డయలర్ టోన్లు అందిస్తుంది. రోజుకు 3జీ/ 2జీ 1.4జీబీ డేటాను అందిస్తుంది. అంటే మొత్తంగా 39.4జీబీ డేటాను కస్టమర్లు వాడుకోవచ్చు. దీంతోపాటు రోజుకు 100ఎస్ఎంస్లు ఉచితం. ముఖ్యంగా అన్లిమిటెడ్ డయలర్ టోన్, మిస్డ్ కాల్ అలర్ట్ ఈ ప్లాన్‌లో ప్రత్యేక ఆకర్షణ. దీంతోపాటు ఐడియా అన్లిమిటెడ్ ధమాకా ఆఫర్‌ను కూడా ప్రకటించింది. 199 రూపాయల రీచార్జ్ ప్లాన్లతో కలిపి కొన్ని ఎంపిక చేసిన రీచార్జ్‌లపై ప్రిపెయిడ్ కస్టమర్లకు క్యాష్‌బ్యాక్, ఇతర బహుమతులను ఆఫర్ చేస్తోంది. -
టారిఫ్ వార్ : బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
సాక్షి, చెన్నై: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా టారిఫ్ వార్‌లో చురుగ్గా కదులుతోంది. తాజాగా జియో, ఎయిర్‌టెల్‌కు దీటుగా ఓ నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించింది. రూ.1,999 లకు నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను మంగళవారం లాంచ్ చేసింది. ఈ ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకు 2 జీబీ చొప్పున సంవత్సరమంతా ఉచిత డేటా అందిస్తుంది. దీంతో మొత్తం అన్ని రోజులకు గాను 730 జీబీ డేటా వినియోగదారులకు లభించనుంది. దీంతోపాటు అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. జూన్ 25నుంచి సెప్టెంబర్ 22 వరకుమాత్రమే ఆ ప్లాన్ అందుబాటులో ఉంటుందిని బీఎస్ఎనల్ తెలిపింది. అయితే ఈ ప్లాన్ ప్రస్తుతం తమిళనాడు సర్కిల్ వినియోగదారులకు మాత్రమే లభిస్తున్నది. ప్రమోషనల్ ఆఫర్ కింద ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టారు. త్వరలో ఇతర సర్కిల్స్‌లోనూ ఈ ప్లాన్‌ను లాంచ్ చేయాలని బీఎస్ఎన్ఎల్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా జియోలో రూ.1,999 ప్లాన్‌లో రోజులో ఎలాంటి పరిమితి లేకుండా మొత్తం 125 జీబీ డేటా ఆఫర్ చేస్తోంది. అయితే ఈ ప్లాన్ వాలిడిటీ 180 రోజులు మాత్రమే. -
ఎయిర్టెల్ కొత్త రీచార్జ్ ప్లాన్
సాక్షి,ముంబై: భారతి ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఇప్పటికే పలు ప్రీపెయిడ్ ప్లాన్ల సమీక్షలతో కస్టమర్లను తనవైపు తిప్పుకుంటున్న ఎయిర్టెల్ తాజాగా మరో ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.558 ప్రీపెయిడ్ ప్లాన్‌పై కస్టమర్లకు భారీ డేటా ప్రయోజనాలను అందిస్తోంది. ప్రధాన ప్రత్యర్థులు జియో, వోడాఫోన్‌లకు పోటీగా తాజా రీచార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.558 ప్లాన్‌లో 3జీబీ డేటాను రోజువారీ అందిస్తుంది. వాలిడిటీ 82రోజులు. అంటే ఈ ప్లాన్ రీచార్జ్ ద్వారా వినియోగదారుడు మొత్తం 246 జీబీ డేటానువాడుకోవచ్చు. అలాగే అన్లిమిటెడ్ వాయిస్‌కాలింగ్ సదుపాయం, 100 ఎస్ఎంఎస్లను కూడా ఆఫర్ చేస్తోంది. కాగా ఇటీవలి కాలంలో ప్రీపెయిడ్ రీచార్జ్‌ప్లాన్లను సవరించుకుంటూ వస్తోంది. జియో, వోడాఫోన్‌లాంటి రీచార్జ్ ప్లాన్లను ధీటుగా తన ప్రీపెయిడ్‌ప్లాన్ల రివ్యూ చేపడుతూ డబుల్ డేటా అఫర్ చేస్తున సంగతి తెలిసిందే. -
ఎయిర్టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్
సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం సంస్థ భారతి ఎయిర్టెల్ తన ప్రధాన ప్రత్యర్థి జియోకు పోటీగా సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. జియో 448 రూపాయల రీచార్జ్ ప్లాన్‌కు ధీటుగా రూ.449 ల కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను దేశవ్యాప్తంగా తన కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు రోజుకు 2 జీబీ డేటా వాడుకోవచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ 70 రోజులు. అంటే మొత్తం 140 జీబీ డేటాను అందిస్తోంది. దీనితోపాటు అన్లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. జియోలో ఇదే తరహాలో రూ.448 ప్లాన్ అందుబాటులో ఉండగా ఆ ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకు 2జీబీ డేటా వస్తుంది. మొత్తం 84 రోజుల వాలిడిటీకి 168 జీబీ డేటా లభిస్తుంది. తాజాగా ఈ ప్లాన్‌కు పోటీగానే ఎయిర్టెల్ రూ.449 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. -
జియోకు డైరెక్ట్ కౌంటర్: ఎయిర్టెల్ కొత్త ప్లాన్
సాక్షి, ముంబై: టెలికాం ఆపరేటర్ భారతి ఎయిర్టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తాజాగా తీసుకొచ్చింది. టెలికాం పరిశ్రమలోకి దూసుకొచ్చిన రిలయన్స్ జియో 149 రూపాయల ప్లాన్‌కు కౌంటర్‌గా ఎయిర్టెల్ ఈ సరికొత్త ప్లాన్‌ను లాంచ్ చేసింది. రూ.149 రూపాయల ప్రీ పెయిడ్ ప్లాన్ లో రోజులు 1 జీబీ డేటా చొప్పున 28 జీబీ 3జీ/4జీ డేటాను అందిస్తున్నారు. దీంతో పాటు అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఉచితం. వాలిడిటీ 28రోజులు. అయితే 28 రోజుల వాలిడిటీ ఉన్న జియో 149 రూపాయల ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డేటా అందిస్తోంది. -
ఎయిర్టెల్ దూకుడు: మరో ఆకర్షణీయ ప్లాన్
సాక్షి, ముంబై: టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్ దూకుడు ప్రదర్శింస్తోది. కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ప్రకటించిన మరుసటి రోజే మరో సరికొత్త ప్లాన్‌తో యూజర్లను ఆకర్షిస్తోంది. తాజాగా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించింది. అదే రూ.249 ప్లాన్. రూ.249రీఛార్జ్ ద్వారా వినియోగదారులు రోజుకు 2 జీబీ (3జీ/4జీ) డేటా అందిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 28రోజులు. అంటే మొత్తంగా 56జీబీ డేటా పొందవచ్చు. దీంతోపాటు అన్లిమిటెడ్ కాలింగ్ (లోకల్,ఎస్టీడీ) 100ఎస్ఎంఎస్లు ఉచితం. దీంతోపాటు రూ.349 ప్యాక్‌ను కూడా ఎయిర్టెల్ పునరుద్ధరించింది. ఇప్పటి వరకూ అందిస్తున్న 2.5జీబీ డేటా స్థానంలో తాజాగా 28రోజుల పాటు రోజుకు 3జీబీ డేటాను అందించనుంది. కాగా రూ.499 రీఛార్జ్‌తో నిన్న (మంగళవారం) కొత్త ప్రీపెయిడ్‌ను ప్రకటించింది. ఇందులో ఉచిత లోకల్, ఎస్టీడీ కాల్స్‌తో పాటు, రోజుకు 2జీబీ డేటాను 82 రోజుల పాటు అందిస్తున్న సంగతి తెలిసిందే. -
వాటికి పోటీగా ఐడియా కొత్త ప్లాన్
సాక్షి,ముంబై: రిలయన్స్ జియో, ఎయిర్టెల్ తరువాత మరో టెలికాం ఆపరేటర్ ఐడియా సెల్యులార్ సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను. ప్రకటించింది. ఎయిర్టెల్, జియో రీచార్జ్ ప్లాన్ తరహాలోనే ఈ కొత్త రీచార్జ్ ప్లాన్‌ను వెల్లడించింది.రూ. 93 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో రోజుకి 1 జీబీ 3జీ డేటా అందించనుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 10 రోజులు. ఐడియా వెబ్సైట్ అందించిన సమాచారం ప్రకారం అన్లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్ ఆఫర్ చేస్తోంది. అయితే రోజుకు 250 నిమిషాలు , వారానికి వెయ్యి నిమిషాల టాక్ టైం వరకే ఈ ఉచిత ఆఫర్ పరిమితం. ఈ పరిమితి దాటిన తరువాత సెకనుకు 1 పైసా వసూలు చేస్తుంది. అయితే ఉచిత ఎస్ఎంఎస్లు, రోమింగ్స్ కాల్స్ లాంటి ప్రయోజనాలు లేవీ లేవు. అలాగేరూ. 93 ప్రీ పెయిడ్ ప్లాన్ ఎంపిక చేసిన నెంబర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. వాణిజ్యేతర వినియోగం కోసం మాత్రమే వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. కాగా ఎయిర్టెల్ రూ.93 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ కూడా 10 రోజుల పాటు 3జీ / 4జీ డేటా 1జీబీ అందిస్తుంది. అలాగే రోజుకు 100 ఎస్ఎంఎస్లు కూడా ఉచితం. జియో కూడా రూ.98ల ప్రీపెయిడ్ రీఛార్జి ప్రణాళికలో 14 రోజుల వ్యవధిలో 2.1జీబీ 4జీ డేటాను 140 ఎస్ఎంఎస్లు కూడా ఉచితంగా అందిస్తుంది. -
బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ‘స్వాగతం’
సాక్షి, హైదరాబాద్: బీఎస్ఎన్ఎల్ మరో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘స్వాగతం’పేరుతో ప్రయోగాత్మకంగా మూడు నెలల కాలానికి గత మేలో మార్కెట్లోకి తేగా వినియోగదారుల నుంచి మంచి స్పందన రావటంతో దాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తున్నట్టు బీఎస్ఎన్ఎల్ శుక్రవారం ప్రకటించింది. రూ.21 చెల్లిస్తే 180 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్‌లో... మొదటి రెండు నెలలకు అన్ని అన్-నెట్, ఆఫ్-నెట్ కాల్స్‌కు రెండు సెకన్లకు ఒక పైసా చొప్పున, మొదటి రెండు నెలలకు ఆన్-నెట్ ఎస్మెమ్మెస్కు ఐదు పైసలు, ఆఫ్-నెట్ ఎస్సెమ్మెస్‌కు 15 పైసలు చొప్పున చార్జి చేస్తారు. 400 సెకన్ల ఆన్-నెట్ కాల్స్, 200 సెకన్ల ఆఫ్-నెట్ కాల్స్, 20 (ఎనీ నెట్) ఎస్సెమ్మెస్‌లు, 5ఎంబీ డేటా ఉచితంగా అందుతాయి. నార్మల్ టారిఫ్ పరిధిలోకి వచ్చాక... ఆన్-నెట్ లోకల్ కాల్స్‌కు సెకన్‌కు 1.2 పైసలు, ఎస్టీడీకి 1.5 పైసలు చొప్పున, ఆఫ్-నెట్లో సెకన్‌కు 1.5 పైసలు చొప్పున చార్జి చేయనున్నట్టు బీఎస్ఎన్ఎల్ తెలిపింది. ఇతర వివరాలకు 1503 నెంబర్లో సంప్రదించాలని సూచించింది.