సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్ తన ప్రధాన ప్రత్యర్థి జియోకు పోటీగా సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. జియో 448 రూపాయల రీచార్జ్ ప్లాన్‌కు ధీటుగా రూ.449 ల కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను దేశవ్యాప్తంగా తన కస‍్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు రోజుకు 2 జీబీ డేటా వాడుకోవచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ 70 రోజులు. అంటే మొత్తం 140 జీబీ డేటాను అందిస్తోంది. దీనితోపాటు అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. జియోలో ఇదే తరహాలో రూ.448 ప్లాన్ అందుబాటులో ఉండగా ఆ ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకు 2జీబీ డేటా వస్తుంది. మొత్తం 84 రోజుల వాలిడిటీకి 168 జీబీ డేటా లభిస్తుంది. తాజాగా ఈ ప్లాన్‌కు పోటీగానే ఎయిర్‌టెల్ రూ.449 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment