
సాక్షి,ముంబై: రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ తరువాత మరో టెలికాం ఆపరేటర్ ఐడియా సెల్యులార్ సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను. ప్రకటించింది. ఎయిర్‌టెల్, జియో రీచార్జ్ ప్లాన్ తరహాలోనే ఈ కొత్త రీచార్జ్ ప్లాన్‌ను వెల్లడించింది.రూ. 93 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో రోజుకి 1 జీబీ 3జీ డేటా అందించనుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 10 రోజులు.
ఐడియా వెబ్‌సైట్ అందించిన సమాచారం ప్రకారం అన్‌లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్‌టీడీ కాల్స్ ఆఫర్ చేస్తోంది. అయితే రోజుకు 250 నిమిషాలు , వారానికి వెయ్యి నిమిషాల టాక్ టైం వరకే ఈ ఉచిత ఆఫర్ పరిమితం. ఈ పరిమితి దాటిన తరువాత సెకనుకు 1 పైసా వసూలు చేస్తుంది. అయితే ఉచిత ఎస్‌ఎంఎస్‌లు, రోమింగ్స్ కాల్స్ లాంటి ప్రయోజనాలు లేవీ లేవు. అలాగేరూ. 93 ప్రీ పెయిడ్ ప్లాన్ ఎంపిక చేసిన నెంబర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. వాణిజ్యేతర వినియోగం కోసం మాత్రమే వర్తిస్తుందని కంపెనీ తెలిపింది.
కాగా ఎయిర్‌టెల్ రూ.93 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ కూడా 10 రోజుల పాటు 3జీ / 4జీ డేటా 1జీబీ అందిస్తుంది. అలాగే రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉచితం. జియో కూడా రూ.98ల ప్రీపెయిడ్ రీఛార్జి ప్రణాళికలో 14 రోజుల వ్యవధిలో 2.1జీబీ 4జీ డేటాను 140 ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉచితంగా అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment