ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్లపై టారిఫ్ పెంపును ప్రకటించాయి. ఆయా కంపెనీలు 25 శాతం వరకు పెంచాయి. ఇవి మరి కొన్ని గంటల్లో అమల్లోకి వస్తాయి. ఎయిర్‌టెల్, జియో కొత్త ప్లాన్లు జూలై 3 నుంచి, వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్లు జూలై 4 నుంచి వర్తిస్తాయి.
మునుపటి ప్లాన్ల మాదిరిగానే, మూడు టెల్కోలు వేర్వేరు యూజర్ల కోసం ఉద్దేశించిన వేర్వేరు బండిల్స్‌ను అందిస్తున్నాయి. వీటిలో నెలవారీ, త్రైమాసిక, వార్షిక రీఛార్జ్ ప్లాన్లు ఉన్నాయి. అయితే చాలా మంది నెలవారీ ప్లాన్‌లను రీచార్జ్ చేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో మూడు టెల్కోలకు సంబంధించిన మంత్లీ మినిమమ్ రీచార్జ్ ప్లాన్ల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం..
ఎయిర్‌టెల్ రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్
ఎయిర్‌టెల్ తన కనీస నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్ ధరను రూ .179 నుంచి రూ .199 కు పెంచింది. ఈ ప్లాన్‌తో 28 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాలింగ్, 2 జీబీ 4జీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ ఉంటాయి. కేవలం కాల్స్, మెసేజింగ్ కోసం సిమ్ కార్డును ఉపయోగించాలనుకునే వారికి ఈ ప్లాన్ చాలా మంచిది.
జియో రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్
జియో అత్యంత తక్కువ నెలవారీ రీఛార్జ్ ప్లాన్ ధర రూ .199. ఇది రూ .155 నుంచి భారీగా పెరిగింది. 28 రోజుల వాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్ ద్వారా అపరిమిత కాలింగ్, 300 ఎస్ఎంఎస్‌లు, 2 జీబీ 4జీ డేటా లభిస్తుంది. హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఉండి, ఎక్కువ మొబైల్ డేటాను ఉపయోగించని వారికి ఈ ప్లాన్ బాగా సరిపోతుంది.
వీఐ రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్
వొడాఫోన్ ఐడియాలో కూడా అత్యంత సరసమైన నెలవారీ రీఛార్జ్ ప్లాన్ ధర రూ .199. ఈ ప్లాన్‌తో 28 రోజుల వ్యాలిడిటీ, 2 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, 300 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment