టారిఫ్‌ వార్‌ : బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త ప్లాన్‌ | BSNL introduces Rs 1,999 plan with 2GB data per day and more | Sakshi
Sakshi News home page

టారిఫ్‌ వార్‌ : బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త ప్లాన్‌

Published Tue, Jun 26 2018 6:24 PM | Last Updated on Tue, Jun 26 2018 6:24 PM

BSNL introduces Rs 1,999 plan with 2GB data per day and more - Sakshi

సాక్షి,  చెన్నై:  ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ కూడా టారిఫ్‌ వార్‌లో చురుగ్గా కదులుతోంది. తాజాగా జియో, ఎయిర్‌టెల్‌కు దీటుగా ఓ నూతన ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను ప్రారంభించింది. రూ.1,999 లకు  నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను మంగళవారం లాంచ్‌ చేసింది.  ఈ ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకు 2 జీబీ చొప్పున  సంవత్సరమంతా ఉచిత డేటా  అందిస్తుంది. దీంతో మొత్తం అన్ని రోజులకు గాను 730 జీబీ డేటా వినియోగదారులకు లభించనుంది. దీంతోపాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.  జూన్‌ 25నుంచి సెప్టెంబర్‌ 22 వరకుమాత్రమే ఆ ప్లాన్‌ అందుబాటులో ఉంటుందిని బీఎస్‌ఎనల్‌  తెలిపింది. అయితే ఈ ప్లాన్ ప్రస్తుతం తమిళనాడు సర్కిల్ వినియోగదారులకు మాత్రమే లభిస్తున్నది. ప్రమోషనల్ ఆఫర్ కింద ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టారు. త్వరలో ఇతర సర్కిల్స్‌లోనూ ఈ ప్లాన్‌ను లాంచ్ చేయాలని బీఎస్‌ఎన్‌ఎల్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

కాగా  జియోలో రూ.1,999 ప్లాన్‌లో రోజులో ఎలాంటి పరిమితి లేకుండా మొత్తం 125 జీబీ డేటా  ఆఫర్‌ చేస్తోంది.  అయితే ఈ ప్లాన్ వాలిడిటీ 180 రోజులు మాత్రమే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement