స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తన వినియోగదారుల కోసం 'ఫ్రీడమ్ ఆఫర్ - చోటా ప్యాక్'ను ప్రకటించింది. దీని కింద తన ప్రీపెయిడ్ కస్టమర్లకు 9 రూపాయలు, 29 రూపాయలతో రెండు సరికొత్త ప్లాన్లను అందుబాటులో ఉంచింది.ఆగస్టు 10 నుంచి ఈ ‘ఫ్రీడమ్ ఆఫర్- చోటా ప్యాక్’ ప్లాన్లు అమల్లోకి వచ్చాయి.
9 రూపాయల ఫ్రీడమ్ ఆఫర్- చోటా ప్యాక్ కింద బీఎస్‌ఎన్‌ఎల్ ప్రీపెయిడ్ సబ్‌స్క్రైబర్లకు అపరిమిత వాయిస్ కాల్స్(ఢిల్లీ, ముంబై మినహాయించి), 80కేబీపీఎస్ స్పీడులో 2జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్యాక్ వాలిడిటీ ఒక్క రోజే. ఈ ప్రయోజనాలను ఆగస్టు 10 నుంచి ఆగస్టు 25 మధ్యలో ఎప్పుడైనా పొందవచ్చు.
అదేవిధంగా 29 రూపాయల ఫ్రీడమ్ ఆఫర్-చోటా ప్యాక్ కింద ఢిల్లీ, ముంబై ప్రాంతాలను మినహాయించి, మిగిలిన ప్రీపెయిడ్ కస్టమర్లకు అపరిమిత వాయిస్ కాల్స్, 80కేబీపీఎస్ స్పీడులో రోజుకు 2జీబీ డేటా, రోజూ 100 ఎస్‌ఎంఎస్‌లను ఆఫర్ చేస్తోంది. ఆగస్టు 25 వరకు ఈ ప్లాన్ ప్రయోజనాలు మారవు. ఆ అనంతరం రోజుకు 1జీబీ డేటానే ఆఫర్ చేయనుంది. వారానికి 300 ఎస్‌ఎంఎస్‌లనే అందిస్తోంది.
బీఎస్‌ఎన్‌ఎల్ ఇటీవలే 27 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్‌పై ఏడు రోజుల పాటు రోజుకు 1జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. దాంతో పాటు అపరిమిత కాలింగ్ ప్రయోజనాలు, 300 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment