ప్రయివేటు టెలికం కంపెనీల మధ్య పోటీ రోజురోజుకీ పెరుగుతోంది. టారిఫ్‌లు పెంచిన తర్వాత యూజర్ల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో వారిని ఆకట్టుకునేందుకు జియో కొత్త కొత్త ప్లాన్‌లను తీసుకొస్తోంది. ఇప్పటికే మార్కెట్‌లో టాప్‌గా ఉన్న జియో.. ప్రత్యర్థుల కంటే అధిక వ్యాలిడిటీతో మరో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది.
జియో తీసుకొచ్చిన కొత్త ప్లాన్ రూ.999. ఇది 98 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. రోజూ 2జీబీ హైస్పీడ్ డేటా, అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ కాలింగ్, 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. అవకాశం ఉన్న యూజర్లు అన్‌లిమిటెడ్ 5జీ డేటాను ఆస్వాదించవచ్చు. వీటితో పాటు జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ వంటి విస్తృతమైన జియో సేవలు కాంప్లిమెంటరీగా లభిస్తాయి.
వోడాఫోన్-ఐడియాలో రూ.998, ఎయిర్‌టెల్‌లో రూ.979లతో ఇలాంటి ప్లాన్‌లే ఉన్నా అవి కేవలం 84 రోజుల వ్యాలిడిటీని మాత్రమే అందిస్తున్నాయి. అయితే వోడాఫోన్-ఐడియా రూ.998 ప్లాన్ విభిన్నమైన ఫీచర్లను అందిస్తోంది. ఇందులో అర్ధరాత్రి నుండి ఉదయం 6 గంటల వరకు అపరిమిత డేటా వినియోగాన్ని అనుమతించే బింగే ఆల్ నైట్ ఫీచర్, వారాంతపు డేటా రోల్‌ఓవర్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.అదనంగా సోనీలివ్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ లభిస్తుది. ఇక ఎయిర్‌టెల్ రూ.979 ప్లాన్ 2జీబీ రోజువారీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment