సాక్షి,ముంబై: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్‌లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) రెండు తెలుగు రాష్ట్రాల వినియోగదారులకు బంపర్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్టార్ మెంబర్‌షిప్ ప్రోగామ్‌ను లాంచ్ చేసింది. 498 రూపాయల సరికొత్త స్టార్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా భారతి ఎయిర్‌టెల్ థాంక్స్ లాయల్టీ ప్రోగ్రామ్‌కు ధీటుగా ఈ సరికొత్త ఎత్తుగడతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. త్వరలోనే అన్ని సర్కిల్స్‌లోను అమలు చేయనున్న స్టార్ ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ ప్రస్తుతానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అందుబాటులో ఉంది.
రూ.498 స్టార్ మెంబర్‌షిప్ ప్లాన్
30 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్, 30జీబీ డేటా, 1000 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం. వాలిడిటీ 365 రోజులు. కానీ, ఈ ప్లాన్లో అందించే డేటా, వాయిస్‌కాల్స్, ఇతర సేవలు మాత్రం 30 రోజులకే పరిమితం. అయితే తరువాత చేసుకునే రీచార్జ్‌లపై డిస్కౌంట్‌ను అందిస్తుంది. ఉదాహరణకు ఎస్‌టీవీ రూ. 99 ప్రీపెయిడ్ ప్లాన్ స్టార్ సభ్యునికి రూ.76 కే అందుబాటులో ఉంటుంది. ఇదే మాదిరిగా వివిధ రీచార్జ్‌లపై స్టార్ మెంబర్లకు ప్రత్యేక డిస్కౌంట్లు లభిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment