membership programme
-
జొమాటో తన కస్టమర్లకు షాకిచ్చిందిగా...కానీ ఇక్కడో ట్విస్ట్
సాక్షి,ముంబై: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తన కస్టమర్లకు షాకిచ్చింది...కాదు కాదు..మరో కొత్త స్కీంతో కస్టమర్లను ఆకర్షించనుంది. ఈ నేపథ్యంలోనే లాయల్టీ ప్రోగ్రామ్ ‘జొమాటో ప్రో’ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్కీం కింద ఇక కస్టమర్లకు అదనపు డిస్కౌంట్లు, ఫ్రీడెలివరీ లాంటి ఫెసిలిటీలు రద్దు అన్నమాట. కస్టమర్ అడిగిప్రశ్నకు సమాధానంగా ట్విటర్లో స్పందించిన జొమాటో ‘జొమాటో ప్రో’ సేవలపై ఈ మేరకు వివరణ ఇచ్చింది. గడువు ముగిసిన ప్రో మెంబర్‌షిప్‌ను రెన్యువల్ చేయడం కుదరదని జొమాటో తెలిపింది. దీనికి వెనుకకారణాలను మాత్రం జొమాటో స్పష్టం చేయలేదు. జొమాటో ప్రో, ప్లస్ లకు కొత్తగా సభ్యత్వం ఇవ్వడం లేదు. అయితే ఇప్పటికే మెంబర్షిప్ వాలిడిటీ ఉన్నవారు తమ ప్రయోజనాలు యధావిధిగా పొందుతారు. సభ్యత్వ గడువు ముగిసిన తర్వాత, దాన్ని పొడిగించలేరు/ పునరుద్ధరించలేరు అని జొమాటో ప్రతినిధి తెలిపారు. (Electric Scooters: కేవలం వేలం వెర్రేనా? సర్వేలో షాకింగ్ విషయాలు) ఇటీవలికాంలో జొమాటో రోజూ ఏదో ఒక విధంగా వార్తల్లో ఉంటూ వస్తోంది. నిన్నగాక మొన్న హృతిక్ రోషన్ యాడ్‌కు సారీ చెప్పిన జొమాటో 'ప్రో' అనే మెంబర్షిప్ ప్రోగ్రామ్‌ను నిలిపివేయడం విశేషం. ఇప్పటికే ప్రో ప్లస్‌కు గుడ్ బై చెప్పేసింది. అలాగే క్రెడిట్ కార్డ్ నిబంధనలను కూడా సవరించిన సంగతి తెలిసిందే. (పండుగ సీజన్: డిపాజిటర్లకు బ్యాంకుల బంపర్ ఆఫర్) మరోవైపు తన వినియోగదారుల కోసం "కొత్త ప్రోగ్రామ్"ను లాంచ్ చేయనుందట. అప్డేట్ చేసిన ప్రోగ్రామ్‌తో మెరుగైన సేవలందిస్తామని, మరిన్ని ఆఫర్లు/అప్డేట్స్ కోసం వేచి ఉండాలంటోంది. దీనికోసం కస్టమర్లతో, రెస్టారెంట్ భాగస్వాములతో ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నామని పేర్కొంది. కొత్త ప్రోగ్రాం టైమ్‌లైన్‌ను పేర్కొనలేం గానీ రావడం పక్కా అని తెలిపింది. (ఇదీ చదవండి: వడ్డీల భారం, చేతులెత్తేసిన మరో స్టార్టప్) Hi there, we regret hearing this from you. Please be informed that Zomato Pro Plus is unavailable for renewal as we are working on a new experience for you. We will get back with an update soon. We'd also like to thank you for being a part of the Zomato Pro program.[1/2] — zomato pro (@ZomatoProHelp) August 22, 2022 -
బీఎస్ఎన్ఎల్ స్టార్ మెంబర్షిప్ @498
సాక్షి,ముంబై: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్‌లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) రెండు తెలుగు రాష్ట్రాల వినియోగదారులకు బంపర్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్టార్ మెంబర్షిప్ ప్రోగామ్‌ను లాంచ్ చేసింది. 498 రూపాయల సరికొత్త స్టార్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా భారతి ఎయిర్టెల్ థాంక్స్ లాయల్టీ ప్రోగ్రామ్‌కు ధీటుగా ఈ సరికొత్త ఎత్తుగడతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. త్వరలోనే అన్ని సర్కిల్స్‌లోను అమలు చేయనున్న స్టార్ ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ ప్రస్తుతానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అందుబాటులో ఉంది. రూ.498 స్టార్ మెంబర్షిప్ ప్లాన్ 30 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్, 30జీబీ డేటా, 1000 ఎస్ఎంఎస్లు ఉచితం. వాలిడిటీ 365 రోజులు. కానీ, ఈ ప్లాన్‌లో అందించే డేటా, వాయిస్‌కాల్స్, ఇతర సేవలు మాత్రం 30 రోజులకే పరిమితం. అయితే తరువాత చేసుకునే రీచార్జ్‌లపై డిస్కౌంట్‌ను అందిస్తుంది. ఉదాహరణకు ఎస్టీవీ రూ. 99 ప్రీపెయిడ్ ప్లాన్ స్టార్ సభ్యునికి రూ.76 కే అందుబాటులో ఉంటుంది. ఇదే మాదిరిగా వివిధ రీచార్జ్‌లపై స్టార్ మెంబర్లకు ప్రత్యేక డిస్కౌంట్లు లభిస్తాయి. -
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు
సాక్షి, అమరావతి బ్యూరో/అమరావతి/విజయవాడ/ఇంద్రకీలాద్రి: రానున్న రెండేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ ఊహించని రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకుంటాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం విజయవాడలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం పార్టీ అభిమానులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధ్యక్షుడు ఎవరో చెప్పలేని స్థితిలో ఉందని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఫ్రంట్ ఫ్రంట్ అంటూ తిరిగిన 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి టెంటే ఊడిపోయిందని పరోక్షంగా చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఏపీలో మాజీ సీఎం కుమారుడు, తెలంగాణలో సీఎం కుమార్తె ఓటమి చెందారన్నారు. ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. అంతకుముందు కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణ భారతి ట్రస్ట్, ముప్పవరపు ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రతిభకు పురస్కారం కార్యక్రమంలో పాల్గొన్న కిషన్‌రెడ్డి... వచ్చే ఐదేళ్లలో భారత్ బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని, దేశంలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఈ కార్యక్రమం సందర్భంగా కిషన్‌రెడ్డితో గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ భేటీ అయ్యారు. గత కొంత కాలంగా ఆయన బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గంటపాటు ఈ భేటీ జరగడం గమనార్హం. మరోవైపు విజయవాడలో దుర్గమ్మను దర్శించుకున్న కిషన్‌రెడ్డి... తెలుగు రాష్ట్రాలు దేశంలో అగ్రరాష్ట్రాలుగా సమన్వయంతో ముందుకెళ్లాలని, కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని అమ్మవారిని కోరుకున్నట్లు మీడియాకు తెలిపారు. -
సీనియర్లకు 'సభ్యత్వ నమోదు' అప్పగించాలి: వీహెచ్
సికింద్రాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు (వీహెచ్) ఆదివారం హైదరాబాద్‌లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలోని సీనియర్లకు కూడా ఈ పార్టీ సభ్యత్వ నమోదు బాధ్యత అప్పగించాలని ఆయన అభిప్రాయపడ్డారు. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ పార్టీ సమావేశాలకు దూరంగా ఉండటం సరికాదని వీహెచ్ అభిప్రాయపడ్డారు. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సీనియర్లంతా పాల్గొనాలని వీహెచ్ సూచించారు. ఆదివారం సికింద్రాబాద్ లోని ఇంపీరియర్ గార్డెన్స్ లో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాల నుంచి భారీగా నాయకులు తరలివచ్చారు. -
క్లాస్రూమ్ పాలిటిక్స్
-
ఒకరిద్దరు నేతలు పార్టీ వీడినా నష్టం లేదు: లోకేష్
తెలంగాణలో ఒకరిద్దరు నేతలు పార్టీని వీడినంత మాత్రాన ఎలాంటి నష్టం లేదని టీడీపీ నాయకుడు, ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు లోకేష్ వ్యాఖ్యానించారు. నవంబర్ 3వ తేదీ నుంచి రెండు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని చేపడతామని ఆయన చెప్పారు. ఈసారి 25 లక్షల మందితో సభ్యత్వాన్ని నమోదు చేస్తామన్నారు. ఇతర రాష్ట్రాల్లో డిసెంబర్ నెలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. అయితే, సభ్యత్వం కోసం వంద రూపాయలు చెల్లించిన వారికి మాత్రమే ప్రమాద బీమా సదుపాయం వర్తిస్తుందని, సాధారణ సభ్యులకు అది వర్తించబోదని లోకేష్ స్పష్టం చేశారు.