
ఒకరిద్దరు నేతలు పార్టీ వీడినా నష్టం లేదు: లోకేష్
తెలంగాణలో ఒకరిద్దరు నేతలు పార్టీని వీడినంత మాత్రాన ఎలాంటి నష్టం లేదని టీడీపీ నాయకుడు, ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు లోకేష్ వ్యాఖ్యానించారు. నవంబర్ 3వ తేదీ నుంచి రెండు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని చేపడతామని ఆయన చెప్పారు.
ఈసారి 25 లక్షల మందితో సభ్యత్వాన్ని నమోదు చేస్తామన్నారు. ఇతర రాష్ట్రాల్లో డిసెంబర్ నెలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. అయితే, సభ్యత్వం కోసం వంద రూపాయలు చెల్లించిన వారికి మాత్రమే ప్రమాద బీమా సదుపాయం వర్తిస్తుందని, సాధారణ సభ్యులకు అది వర్తించబోదని లోకేష్ స్పష్టం చేశారు.