హైదరాబాద్: తెలంగాణలో గూండాలరాజ్యం నడుస్తోందంటూ ట్విట్టర్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేశ్‌పై కేసు నమోదు చేయాలని తెలంగాణ అడ్వొకేట్స్ జేఏసీ నేతలు హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు ఆదివారం బంజారాిహ ల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌ని జేఏసీ కో-కన్వీనర్ కొంతం గోవర్దన్‌రెడ్డి, అధికార ప్రతినిధి ఉపేంద్ర, వెంకటేశ్వర్‌రెడ్డి కలిశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను హిట్లర్‌గా పేర్కొంటూ ఈ నెల 14న ట్విట్టర్‌లో లోకేశ్ చేసిన అనుచిత వ్యాఖ్యల వల్ల తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
లోకేశ్‌పై తెలంగాణ లాయర్ల జేఏసీ ఫిర్యాదు
Published Mon, Nov 17 2014 1:22 AM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM
Advertisement
Advertisement