సాక్షి, హైదరాబాద్: బీఎస్‌ఎన్‌ఎల్ మరో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘స్వాగతం’పేరుతో ప్రయోగాత్మకంగా మూడు నెలల కాలానికి గత మేలో మార్కెట్‌లోకి తేగా వినియోగదారుల నుంచి మంచి స్పందన రావటంతో దాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తున్నట్టు బీఎస్‌ఎన్‌ఎల్ శుక్రవారం ప్రకటించింది.
రూ.21 చెల్లిస్తే 180 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్‌లో... మొదటి రెండు నెలలకు అన్ని అన్-నెట్, ఆఫ్-నెట్ కాల్స్‌కు రెండు సెకన్లకు ఒక పైసా చొప్పున, మొదటి రెండు నెలలకు ఆన్-నెట్ ఎస్మెమ్మెస్‌కు ఐదు పైసలు, ఆఫ్-నెట్ ఎస్సెమ్మెస్‌కు 15 పైసలు చొప్పున చార్జి చేస్తారు. 400 సెకన్ల ఆన్-నెట్ కాల్స్, 200 సెకన్ల ఆఫ్-నెట్ కాల్స్, 20 (ఎనీ నెట్) ఎస్సెమ్మెస్‌లు, 5ఎంబీ డేటా ఉచితంగా అందుతాయి. నార్మల్ టారిఫ్ పరిధిలోకి వచ్చాక... ఆన్-నెట్ లోకల్ కాల్స్‌కు సెకన్‌కు 1.2 పైసలు, ఎస్టీడీకి 1.5 పైసలు చొప్పున, ఆఫ్-నెట్‌లో సెకన్‌కు 1.5 పైసలు చొప్పున చార్జి చేయనున్నట్టు బీఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది. ఇతర వివరాలకు 1503 నెంబర్‌లో సంప్రదించాలని సూచించింది.
బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ‘స్వాగతం’
Published Sat, Aug 24 2013 6:21 AM | Last Updated on Fri, Sep 1 2017 10:05 PM
Advertisement
Advertisement