ఇదో కొత్తరకం సైబర్‌ మోసం! | Cyber Criminals Stolen Money From Bank With Help Of Land Registry In Bihar, Check Tweet Inside | Sakshi

ఫోన్లు రావు.. ఓటీపీ అడగదు.. ఇదో కొత్తరకం సైబర్‌ మోసం!

Published Thu, Jul 11 2024 7:16 PM | Last Updated on Thu, Jul 11 2024 7:39 PM

cyber criminals stolen money from bank with help of land registry in bihar

సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకు కొత్త పద్దతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. మొబైల్‌ ఫోన్‌కు ఎటువంటి సమాచారం రాకుండా చేస్తూ అకౌంట్‌లో నుంచి డబ్బు దోచేస్తున్నారు. ఈ తరహా  మోసం ఇటీవల  బిహార్‌లోని పూర్నియాలో వెలుగులోకి వచ్చింది. మొబైల్‌ ఫోన్‌కు వన్‌ టైం పాస్‌వర్డ్‌ (ఓటీపీ), బ్యాంక్‌ నుంచి కాల్‌ రాకుండా, ఇలా ఎటువంటి క్లూ కూడా లేకుండా డబ్బులు దోచుకున్న ఘటనకు సంబంధించిన వీడియోను హర్యానా ఐపీఎస్‌ అధికారి పంకజ్‌ జైన్‌ సోషల్‌ మీడియలో పోస్ట్‌ చేశారు.

బిహార్‌లోని పూర్నియా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘వెబ్‌సైట్‌ నుంచి భూమి రికార్డుల పత్రాల వివరాలు సేకరించి ఆ రికార్డుల్లో ఉన్న సమాచారాన్ని బ్యాంకులో చొరబడి తారుమారు చేశారు. భూరికార్డుల్లో ఆధార్‌కార్డు, బయోమెట్రిక్‌లను తారుమారు చేసి నకిలీ వేలిము​ద్రలు సృష్టించారు. ఈ విధంగా మొబైల్‌ ఫోన్‌కు కాల్‌, ఓటీపీ రాకుండానే మోసానికి పాల్పడ్డారు’ పోలీసులు తెలిపారు. ఇలా మోసాలకు పాల్పడుతున్న ముఠాలో 8 మందిని అరెస్ట్‌ చేశామని పోలీసులు తెలిపారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement