extra data
-
జియో డబుల్ ధమాకా ఆఫర్
టెలికాం ప్రత్యర్థుల గుండెల్లో ఎప్పడికప్పుడూ రైళ్లు పరిగెత్తించే రిలయన్స్ జియో తన కస్టమర్లకు గుడ్‌న్యూస్ అందించింది. కంపెనీ తన ప్రీపెయిడ్ యూజర్లకు కొత్తగా డబుల్ ధమాకా ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద అదనంగా తన యూజర్లకు 1.5 జీబీ డేటా ఇవ్వనున్నట్టు తెలిపింది. ఎయిర్‌టెల్‌కు పోటీగా జియో ఈ ఆఫర్‌ను మంగళవారం ప్రకటించింది. ఎయిర్టెల్ ఇటీవలే తన రూ.149, రూ.399 ప్లాన్లపై అదనంగా 1 జీబీ డేటా అందించనున్నట్టు తెలిపింది. దీనికి కౌంటర్‌గా జియో తన ఎంపిక చేసిన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్‌లపై అదనంగా 1.5 జీబీ డేటా ఇవ్వనున్నట్టు పేర్కొంది. అయితే ఎయిర్టెల్ ఈ అదనపు డేటాను ఎంపిక చేసిన యూజర్లకు ఇస్తే, జియో తన యూజర్లందరికీ ఈ ఆఫర్‌ను అందుబాటులో ఉంచింది. నేటి నుంచి జూన్ 30 వరకు ఈ ఆఫర్ యూజర్లకు అందుబాటులో ఉంటుంది. డబుల్ ధమాకా ఆఫర్‌తో పాటు, ఈ ఆపరేటర్ కొత్తగా రూ.499 రీఛార్జ్ ప్యాక్‌ను కూడా 3 నెలల వాలిడిటీతో లాంచ్ చేసింది. ఈ కొత్త ప్యాక్‌పై రోజుకు 3.5 జీబీ డేటా అందించనున్నట్టు తెలిపింది. కొత్త జియో డబుల్ ధమాకా ఆఫర్.. రోజుకు 1.5 జీబీ డేటా పొందే రూ.149, రూ.349, రూ.399, రూ.449 ప్యాక్ యూజర్లు ఇక నుంచి రోజుకు 3జీబీ డేటా పొందనున్నారు. రోజుకు 2 జీబీ డేటా పొందే రూ.198, రూ.398, రూ.448, రూ.498 ప్యాక్ యూజర్లకు ఇక నుంచి రోజుకు 3.5 జీబీ డేటా లభ్యం. రోజుకు 3 జీబీ డేటా పొందే రూ.299 ప్యాక్ యూజర్లు ఇక నుంచి రోజుకు 4.5 జీబీ డేటా పొందనున్నారు. రోజుకు 4 జీబీ డేటా పొందే రూ.509 ప్యాక్ యూజర్లకు ఇక నుంచి రోజుకు 5.5 జీబీ డేటా లభ్యం. రోజుకు 5 జీబీ డేటా పొందే రూ.799 ప్యాక్ యూజర్లు ఇక నుంచి రోజుకు 6.5 జీబీ డేటా పొందనున్నారు. దీంతో పాటు 300 రూపాయలు, ఆపై మొత్తాల అన్ని రీఛార్జ్‌లపై జియో 100 రూపాయల డిస్కౌంట్ ఆఫర్ చేయనుంది. 300 రూపాయల కంటే తక్కువ మొత్తాల రీఛార్జ్‌లపై 20 శాతం తగ్గింపు ఇస్తోంది. అయితే ఈ డిస్కౌంట్ల కోసం మైజియో యాప్, పేటీఎం వాడుతూ ఫోన్‌పే వాలెట్ ద్వారానే రీఛార్జ్ చేయించుకోవాలి. పైన పేర్కొన్న ప్యాక్‌ల వాలిడిటీలను మాత్రం కంపెనీ మార్చలేదు. డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాల్స్, 100 ఉచిత ఎస్ఎంఎస్లు, జియో యాప్స్ యాక్సస్‌ను పొందవచ్చు. మరోవైపు తాజాగా తీసుకొచ్చిన రూ.499 రీఛార్జ్ ప్యాక్, 91 రోజుల వాలిడిటీలో అందుబాటులో ఉండనుంది. దీనిపై రోజుకు 3.5 జీబీ డేటాను కంపెనీ ఆఫర్ చేస్తోంది. మొత్తంగా ఈ ప్యాక్‌పై 318 జీబీ డేటాను యూజర్లు పొందనున్నారు. ఈ ఆపరేటర్ గతేడాది డిసెంబర్లో రూ.499 రీఛార్జ్ ప్యాక్‌ను లాంచ్ చేసింది కానీ ఆ అనంతరం ఈ ప్యాక్ ధరను రూ.449కు తగ్గించింది. -
ఆ ఫోన్ ఉన్నవారికి జియో ఎక్స్ట్రా డేటా
న్యూఢిల్లీ : రిలయన్స్ జియో ఎల్వైఎఫ్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ ఎల్వైఎఫ్ స్మార్ట్ ఫోన్లు వాడే కస్టమర్లకు 20 శాతం అదనపు డేటా ప్రయోజనాలను అందించనున్నట్టు పేర్కొంది. మైఎల్వైఎఫ్ వెబ్ సైట్ లో ఈ విషయాన్ని తెలిపింది. అయితే ఈ ఆఫర్ కేవలం రూ.6,600 నుంచి రూ.9,700 మధ్యలో ధర కలిగిన హ్యాండ్ సెట్ వాడే వారికి మాత్రమే అందుబాటులో ఉంటుందని పేర్కొంది. అంటే వాటర్ సబ్ బ్రాండ్ మోడల్ కిందకి వచ్చే వాటిపై మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తోంది. ఈ ప్రకటనతో ప్రస్తుతం 1జీబీ 4జీ ఉచిత డేటాను పొందుతున్న ఎల్వైఎఫ్ స్మార్ట్ ఫోన్లు కలిగిన యూజర్లు ఇకనుంచి రోజుకు 1.2జీబీ డేటా పొందనున్నారు. ఇటీవలే ఎల్వైఎఫ్ స్మార్ట్ ఫోన్ అమ్మకాలు పడిపోయినట్టు రిపోర్టులు వచ్చాయి. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో ఎల్వైఎఫ్ కస్టమర్ల కోసం స్పెషల్ గా ఈ ఆఫర్ తీసుకొచ్చింది. ముందు కూడా ఎల్వైఎఫ్ స్మార్ట్ ఫోన్ హ్యాండ్ సెట్ ఉన్నవారికే రిలయన్స్ జియో ఆఫర్లు అందుబాటులో ఉండేవి. అనంతరం జియో ఇతర స్మార్ట్ ఫోన్ కంపెనీలతో భాగస్వామ్యం ఏర్పరుచుకోవడంతో ప్రతి స్మార్ట్ ఫోన్ యూజర్ కు ప్రస్తుతం ఈ ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. ఎల్వైఎఫ్ స్మార్ట్ ఫోన్లు రూ.2999 నుంచే అందుబాటులో ఉండటం, ఉచిత 4జీ డేటా వస్తుండటంతో అప్పట్లో ఈ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో సంచలనం సృష్టించాయి. రిలయన్స్ జియో 4జీ వాయిస్ ఓవర్ ఎల్టీఈ స్మార్ట్ ఫోన్లు అన్ని రిలయన్స్ రిటైల్స్ లోనూ దొరుకుతున్నాయి. -
ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్: 1000జీబీ డేటా ఫ్రీ
ముంబై: దేశీయ టెలికాం మేజర్ భారతి ఎయిర్ టెల్ మరో బంపర్ ఆఫర్‌ను అందిస్తోంది. ఎయిర్ టెల్ బ్రాండ్ బ్యాండ్ కస్టమర్లకు అదనపు డేటా ప్రయోజనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎంపిక చేసిన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్‌లో అదనపు డేటా ప్రయోజనాలను అందిస్తోంది. 1000 జీబీ ని ఉచితంగా అందిస్తోంది. ఏప్రిల్ 16 తరువాతి ఖాతాదారులకు, ఇప్పటికే బ్రాడ్‌బ్యాండ్ సేవలను అనుభవిస్తున్న కస్టమర్లు బోనస్ డేటాను పొందవచ్చు. ఈ 'బోనస్' ఆఫర్ ఎయిర్టెల్ వెబ్ పోర్టల్‌లో యాక్టివ్ గా ఉంది ఉదాహరణకు, ఢిల్లీలో రూ .899 ప్లాన్ 30 జీబీకి బదులుగా ప్రస్తుతం 60 వేగవంతమైన డేటాను అందిస్తోంది. రూ 1099 ప్లాన్‌లో ఇపుడు 90 జీబీ (గతంలో 50 జీబీ) ఆఫర్ చేస్తోంది. రూ .1299 ప్లాన్ లో 125 జీబీ (గతంలో 75 జీబీ) ఆఫర్ చేస్తోంది. రూ .1499 ప్లాన్ గతంలో 100 జీబీ డేటాతో పోలిస్తే 160 జీబీ అందిస్తోందిఈ భారీ ప్రయోజనాలను దాదాపు అన్ని నగరాల్లో అందుబాటులో ఉంచింది. వెబ్సైట్ ప్రకారం రూ.899 ప్లాన్ తరవాతిప్లాన్‌లలో 1000 జీబీ ఉచితం.అలాగే ఈ ప్లాన్స్ అన్నింటిలోనే అన్లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్ ఉచితం. కాగా గత వారం, కంపెనీ తన బ్రాడ్ బ్యాండ్ ప్రణాళికలను రిఫ్రెష్ చేసింది. కొత్త ప్రణాళికల్లో ఎయిర్టెల్ హోమ్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు 100 శాతం అదనపు డేటాను అందిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.