ఆ ఫోన్ ఉన్నవారికి జియో ఎక్స్ట్రా డేటా
ఆ ఫోన్ ఉన్నవారికి జియో ఎక్స్ట్రా డేటా
Published Mon, Jun 12 2017 4:24 PM | Last Updated on Tue, Sep 5 2017 1:26 PM
న్యూఢిల్లీ : రిలయన్స్ జియో ఎల్వైఎఫ్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ ఎల్వైఎఫ్ స్మార్ట్ ఫోన్లు వాడే కస్టమర్లకు 20 శాతం అదనపు డేటా ప్రయోజనాలను అందించనున్నట్టు పేర్కొంది. మైఎల్వైఎఫ్ వెబ్ సైట్ లో ఈ విషయాన్ని తెలిపింది. అయితే ఈ ఆఫర్ కేవలం రూ.6,600 నుంచి రూ.9,700 మధ్యలో ధర కలిగిన హ్యాండ్ సెట్ వాడే వారికి మాత్రమే అందుబాటులో ఉంటుందని పేర్కొంది. అంటే వాటర్ సబ్ బ్రాండ్ మోడల్ కిందకి వచ్చే వాటిపై మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తోంది. ఈ ప్రకటనతో ప్రస్తుతం 1జీబీ 4జీ ఉచిత డేటాను పొందుతున్న ఎల్వైఎఫ్ స్మార్ట్ ఫోన్లు కలిగిన యూజర్లు ఇకనుంచి రోజుకు 1.2జీబీ డేటా పొందనున్నారు.
ఇటీవలే ఎల్వైఎఫ్ స్మార్ట్ ఫోన్ అమ్మకాలు పడిపోయినట్టు రిపోర్టులు వచ్చాయి. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో ఎల్వైఎఫ్ కస్టమర్ల కోసం స్పెషల్ గా ఈ ఆఫర్ తీసుకొచ్చింది. ముందు కూడా ఎల్వైఎఫ్ స్మార్ట్ ఫోన్ హ్యాండ్ సెట్ ఉన్నవారికే రిలయన్స్ జియో ఆఫర్లు అందుబాటులో ఉండేవి. అనంతరం జియో ఇతర స్మార్ట్ ఫోన్ కంపెనీలతో భాగస్వామ్యం ఏర్పరుచుకోవడంతో ప్రతి స్మార్ట్ ఫోన్ యూజర్ కు ప్రస్తుతం ఈ ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. ఎల్వైఎఫ్ స్మార్ట్ ఫోన్లు రూ.2999 నుంచే అందుబాటులో ఉండటం, ఉచిత 4జీ డేటా వస్తుండటంతో అప్పట్లో ఈ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో సంచలనం సృష్టించాయి. రిలయన్స్ జియో 4జీ వాయిస్ ఓవర్ ఎల్టీఈ స్మార్ట్ ఫోన్లు అన్ని రిలయన్స్ రిటైల్స్ లోనూ దొరుకుతున్నాయి.
Advertisement
Advertisement