new cards
-
AB-PMJAY: 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ.5 లక్షల ఆరోగ్య బీమా
న్యూఢిల్లీ: డెబ్భై ఏళ్లు, ఆ పైబడిన వృద్ధుల ఆరోగ్య సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయంతో నిమిత్తం లేకుండా వృద్ధులందరికీ ఆయుష్మాన్ భారత్ ప్రధాన్‌మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీపీఎంజేఏవై) కింద రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమాకు కేంద్ర కేబినెట్ అంగీకారం తెలిపింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ పలు ప్రతిపాదనలను ఆమోదించింది. అర్హులైన లబి్ధదారులకు త్వరలో కొత్త కార్డులు మంజూరు చేయనున్నట్లు తెలిపింది.కుటుంబసభ్యులు ఏబీపీఎంజేఏవై కింద లబ్దిదారులుగా ఉన్నా 70 ఏళ్లు, ఆపై వయసు సీనియర్ సిటిజన్లకు విడిగా ఏటా రూ.5 లక్షల ఆరోగ్యబీమా కల్పించనున్నారు. వృద్ధులు ప్రైవేట్ ఆరోగ్య బీమా పాలసీలు, ఈఎస్ఐ పథకంలో ఉన్నా ఈ పథకం వర్తిస్తుంది. కేంద్రప్రభుత్వ ఆరోగ్య పథకం(సీజీహెచ్ఎస్), మాజీ సైనికుల కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ఈసీహెచ్ఎస్), ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్) పథకాల లబ్ది పొందుతున్న వాళ్లు మాత్రం వాటినో, ఏబీపీఎంజేఏవైనో ఏదో ఒకదానినే ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 4.5 కోట్ల కుటుంబాల్లోని వృద్ధులకు మేలు చేకూరనుంది. ఏబీపీఎంజేఏవై ప్రపంచంలోనే ప్రభుత్వరంగంలో అమలవుతోన్న అతిపెద్ద ఆరోగ్యబీమా పథకమని కేంద్రం తెలిపింది. 12.34 కోట్ల కుటుంబాల్లోని 55 కోట్ల మందికి ఈ పథకం లబ్దిచేకూరుస్తుందని కేంద్రం పేర్కొంది. వయసుతో సంబంధంలేకుండా కుటుంబంలోని అందరికీ ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథం కింద ఇప్పటికే 7.37 కోట్ల మంది ఆస్పత్రిలో వైద్యసేవలు పొందారు. వీరిలో 49 శాతం మంది మహిళలే ఉన్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.లక్ష కోట్లకుపైగా ఖర్చుచేసింది. తొలినాళ్లలో జనాభాలో దిగువ తరగతి 40 శాతం మంది ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. తర్వాత 2022 జనవరిలో లబ్దిదారుల సంఖ్యను 12 కోట్ల కుటుంబాలకు పెంచింది. తర్వాత 37 లక్షల ఆశా/అంగన్వాడీ/ఏడబ్ల్యూహెచ్ఎస్లకూ వర్తింపజేశారు. 31వేల మెగావాట్ల హైడ్రో ప్రాజెక్టులకూ గ్రీన్ సిగ్నల్ రూ.12,461 కోట్ల వ్యయంతో మొత్తంగా 31,350 మెగావాట్ల సామర్థ్యంతో జలవిద్యుత్ ప్రాజెక్టులకూ కేబినెట్ ఓకే చెప్పింది.→ పీఎం గ్రామ్ సడక్ యోజన–4 కింద అదనంగా 62,500 కి.మీ. మేర రోడ్ల నిర్మాణానికి కేబినెట్ సరేనంది. కొత్తగా 25వేల జనావాసాలను కలుపుతూ ఈ రోడ్లను నిర్మించనున్నారు. ఈ మార్గాల్లో వంతెనలనూ ఆధునీకరించనున్నారు. → విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన పీఎం ఈ–డ్రైవ్, పీఎం–ఈబస్ సేవా–పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం పథకాల అమలు కోసం రూ.14,335 కోట్లు కేటాయించేందుకు కేంద్రం అనుమతి ఇచి్చంది. విద్యుత్ ద్విచక్ర, త్రిచక్ర, అంబులెన్స్, ట్రక్కు, ఇతర వాహనాలపై రూ.3,679 కోట్ల మేర సబ్సిడీ ప్రయోజనాలు పౌరులకు కలి్పంచనున్నారు. → ముందస్తు వాతావరణ అంచనా వ్యవస్థలను మరింత బలోపేతం చేయనున్నారు. రెండేళ్లలో రూ.2,000 కోట్ల వ్యయంతో ‘మిషన్ మౌసమ్’ను అమలుచేయనున్నారు. భారత వాతావరణ శాఖతో పాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటరాలజీ, నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ విభాగాల ద్వారా ఈ మిషన్‌ను అమలు చేయనున్నారు. -
సీఎం జగన్ కి రుణపడి ఉంటాం..
-
విశాఖ నార్త్ నియోజకవర్గంలో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ
-
ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల పంపిణీ షురూ
-
ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు కొత్త కార్డులు, ఆఫర్ ఏంటంటే!
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్ భారతదేశపు మొట్టమొదటి పర్యావరణ అనుకూల డెబిట్ కార్డ్‌ను ప్రారంభించింది. పర్యావరణ హితంగా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ పొదుపు బ్యాంకు ఖాతాలను కలిగి తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కొత్తగా ఎకో ఫ్రెండ్లీ డెబిట్ కార్డులు ఆవిష్కరించింది. అంతేకాకుండా, మార్కెట్లోని సాంప్రదాయ PVC కార్డులతో పోలిస్తే, తమ 50,000 కార్డుల ప్రతి బ్యాచ్ 350 కిలోగ్రాముల కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుందని పేమెంట్స్ బ్యాంక్ పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కార్డ్‌లను తీసుకురానున్నామని భారతీ ఎయిర్టెల్ తెలిపింది. పర్యావరణ అనుకూలమైన ఆర్-పీవీసీ మెటీరియల్‌తో దీన్ని తయారు చేసినట్లు సంస్థ సీవోవో గణేష్ అనంతనారాయణన్ తెలిపారు. సాంప్రదాయ పీవీసీ కార్డులతో పోలిస్తే వీటి ఉత్పత్తి వల్ల కర్బన ఉద్గారాలు తగ్గగలవని, హైడ్రోకార్బన్ల వినియోగం గణనీయంగా తక్కువ స్థాయిలో ఉంటుందని పేర్కొన్నారు. తొలుత క్లాసిక్ వేరియంట్లో పర్సనలైజ్డ్, ఇన్‌స్టా కార్డులను ప్రవేశపెడుతున్నట్లు ఆయన చెప్పారు. వీటితో రూ. 10,000 వరకు విలువ చేసే ప్రయోజనాలను పొందవచ్చని తెలిపారు. -
మాస్టర్ కార్డ్‌కు ఆర్బీఐ భారీ షాక్!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నేడు మాస్టర్ కార్డ్‌కు భారీ షాక్ ఇచ్చింది. కొత్త దేశీయ డెబిట్, క్రెడిట్ లేదా ప్రీపెయిడ్ ఖాతాదారులను మాస్టర్ కార్డు నెట్‌వర్క్‌లోకి ఆన్ బోర్డింగ్ చేయకుండా ఆంక్షలు విధించింది. పేమెంట్ సిస్టమ్స్ డేటా నిల్వకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు మాస్టర్ కార్డ్‌పై ఈ చర్య తీసుకుంది. కొత్త మాస్టర్ కార్డ్ కార్డులను జారీ చేయకుండా నిషేధం అనేది జూలై 22 నుంచి అమల్లోకి వస్తుంది. "తగినంత సమయం, ఎక్కువ అవకాశాలు ఇచ్చినప్పటికి వినియోగదారుల పేమెంట్స్ డేటా నిల్వ విషయంలో ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకోలేదని" సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నిబందన వల్ల ఇప్పటికే మాస్టర్ కార్డ్ ఉన్న కస్టమర్లపై ఎలాంటి ప్రభావం పడదు. పేమెంట్స్‌కు సంబంధించిన డేటాను దేశీయంగానే భద్రపరచాలని 2018 ఏప్రిల్ 6న మాస్టర్ కార్డ్‌కు ఆర్బీఐ ఆదేశించింది. అప్పటి నుంచి డేటా నిల్వ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పేమెంట్ అండ్ సెటిల్ మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007(పీఎస్ఎస్ చట్టం) సెక్షన్ 17 కింద చర్యలు తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది. మాస్టర్ కార్డ్‌కు పీఎస్ఎస్ చట్టం కింద దేశంలో కార్డు నెట్ వర్క్ ఆపరేట్ చేయడానికి అధికారం ఇచ్చారు. గతంలో డిస్కవర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ యాజమాన్యంలోని అమెరికన్ ఎక్స్ ప్రెస్, డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కార్డులపైనా ఆర్బీఐ ఈ తరహా ఆంక్షలనే విధించింది. -
అందరికి ఆరోగ్య రక్ష
-
ఆరోగ్య ధీమా
మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నేతల జోక్యం ఎక్కడా లేకుండా తొలిసారిగా అర్హతే ప్రామాణికంగా కుల, మత, రాజకీయాలకు అతీతంగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులను ఎంపిక చేశారు. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం కింద అన్ని రకాల క్యాన్సర్లకూ, డెంగీ, మలేరియా, చికున్‌గున్యాతో పాటు సీజనల్ వ్యాధులకు కూడా చికిత్స అందిస్తారు. ఈ పథకం కింద శస్త్ర చికిత్స చేయించుకున్న వారు కోలుకునే వరకు రోజుకు రూ.225 చొప్పున, లేదా నెలకు రూ.5 వేలు ‘వైఎస్సార్ ఆరోగ్య ఆసరా’ పేరుతో ఆర్థిక సాయం చేస్తున్నారు. గత నెల 2వ తేదీన సీఎం వైఎస్ జగన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం తెలిసిందే. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేద, మధ్య తరగతి కుటుంబాలు ఇక డబ్బుల్లేక వైద్యం చేయించుకోలేని దుస్థితి ఉండదు. రాష్ట్రంలోని 95.85 శాతం కుటుంబాలకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్య భరోసా కల్పించారు. రాష్ట్రంలో 1,42,54,134 కుటుంబాలకు వైఎస్సార్ ఆరోగ్య శ్రీ వర్తింపచేసే కొత్త కార్డుల పంపిణీ కార్యక్రమానికి శుక్రవారం ఆయన పశ్చిమగోదావరి జిల్లాలో శ్రీకారం చుట్టనున్నారు. చికిత్స వ్యయం రూ.1,000 దాటితే ఈ పథకం వర్తింప చేస్తూ నేడు ఏలూరులో నాంది పలకనున్నారు. కొత్తగా 1,000 వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చి, మొత్తం 2,059 వ్యాధులకు వైద్యం అందించే పైలట్ ప్రాజెక్టును తొలుత ఈ జిల్లాలో అమలు చేయనున్నారు. మిగతా జిల్లాల్లో కూడా శుక్రవారం నుంచి 1,259 వ్యాధులకు ఆరోగ్యశ్రీని వర్తింప చేయనున్నారు. ఏప్రిల్ నుంచి ప్రతి నెలా ఒక్కో జిల్లాలో 2,059 రోగాలకు ఈ పథకాన్ని విస్తరిస్తూ వెళతారు. అప్పటి నుంచే ఆయా జిల్లాల్లో.. చికిత్స వ్యయం రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తించడం ప్రారంభమవుతుంది. అన్ని రకాల క్యాన్సర్లకూ ఈ పథకం వర్తించనుంది. ఆసుపత్రులతో టై అప్, ఇతర కార్యక్రమాలు పూర్తి చేసి ఈ నెలాఖరు కల్లా క్యాన్సర్ చికిత్సను రోగులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. కాగా, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల పంపిణీ పూర్తయ్యే వరకు పాత కార్డులు కూడా పని చేస్తాయి. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో తొలి రోజు అంటే శుక్రవారం 1.5 లక్షల కొత్త కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. కాగా, గతంలో ఈ పథకం కింద చిన్నారులకు ఒక చెవికి మాత్రమే కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేసేవారు. ఇప్పుడు దాన్ని రెండు చెవులకూ వర్తింప చేస్తున్నారు. వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉంటే వర్తింపు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ పథకాన్ని కొనసాగించడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. అయితే ఈ పథకానికి ప్రాధాన్యతను తగ్గించేశాయి. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. ఈ పథకాన్ని పూర్తిగా నీరుకార్చింది. పేద, మధ్య తరగతి ప్రజలు వైద్యం అందక పడుతున్న ఇక్కట్లను అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో కళ్లారా చూశారు. యూనివర్సల్ ఆరోగ్య బీమా తీసుకువస్తానని, చికిత్స వ్యయం రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీని వర్తింప చేస్తామని ప్రకటించారు. ఆదాయ పరిమితిని ఏకంగా రూ.5 లక్షలకు పెంచడంతో మధ్య తరగతి వర్గాల వారికి ఈ పథకం ఒక వరం అనడంలో ఎలాంటి సందేహం లేదు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించారు. నవంబర్ నెలలో వైఎస్సార్ నవశకం పేరుతో గ్రామ, వార్డు వలంటీర్లు ఇంటింటి సర్వే నిర్వహించారు. వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్న వారందరినీ అర్హులుగా గుర్తించారు. సామాజిక తనిఖీల నిమిత్తం గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలను ప్రదర్శించారు. అభ్యంతరాలు స్వీకరించారు. అనంతరం గ్రామ, వార్డు సభలు నిర్వహించి తుది జాబితా తయారు చేశారు. నాడు వైఎస్ కూడా ఇక్కడి నుంచే.. సాక్షి ప్రతినిధి, ఏలూరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని 2007 ఏప్రిల్ 1న ఏలూరు వేదికగా ప్రారంభించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన ఈ పథకానికి జవసత్వాలు నింపి, వినూత్న మార్పులతో నేడు ఆయన కుమారుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇదే ఏలూరు వేదికపై నుంచే ప్రారంభిస్తుండటం విశేషం. ఉదయం 11 గంటలకు ఏలూరు మండలం వంగాయగూడెంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం.. 11.25 గంటలకు ఏలూరు ఇండోర్ స్టేడియంలో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. ఈ పథకం కింద 2,059 వ్యాధులకు చికిత్స అందించడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారికి పింఛన్లకు శ్రీకారం చుట్టడం పేద, మధ్యతరగతి వర్గాల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న ఔదార్యాన్ని చాటుతోంది. డయాలసిస్ పేషంట్లకు ఇస్తున్న విధంగానే తలసేమియా, సికిల్‌సెల్ ఎనీమియా, హిమోఫిలియా రోగులకు రూ.10 వేల చొప్పున పెన్షన్ ఇవ్వనున్నారు. ప్రమాదాల కారణంగా లేదా పక్షవాతం, తీవ్రమైన కండరాల క్షీణత వల్ల మంచానికే పరిమితమైన వారికి, బోదకాలు, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగ్రస్తులకు (స్టేజ్ 3,4,5) నెలకు రూ.5 వేల పెన్షన్, కుష్టువ్యాధితో బాధపడుతున్నవారికి రూ.3 వేల పెన్షన్ ఇవ్వనున్నారు. రెండు నెలలు పైలట్ ప్రాజెక్టుగా అమలు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు నెలల పాటు పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి, అందులో ఉన్న లోటుపాట్లను గుర్తించి సరిచేశాక ఏప్రిల్ నుంచి ప్రతి నెలా ఒక్కో జిల్లా చొప్పున విస్తరిస్తూ వెళతారు. ఈ పథకాన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమర్థవంతంగా అమలు చేసేందుకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన దిశగా ‘నాడు–నేడు’ కింద అడుగులు వేస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా అన్ని సదుపాయాలున్న రాష్ట్రంలోని, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలోని కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ పథకం కింద వైద్యం అందుతుంది. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రితో పాటు ఏరియా ఆస్పత్రులతో కలిపి 18 ఆసుపత్రుల్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ అమలు అవుతుందని, మరో 33 ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. నాడు వైఎస్ కూడా ఇక్కడి నుంచే.. సాక్షి ప్రతినిధి, ఏలూరు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని 2007 ఏప్రిల్ 1న ఏలూరు వేదికగా ప్రారంభించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు ఆయన కుమారుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇదే ఏలూరు వేదికపై నుంచి ఈ పథకంలో విప్లవాత్మక మార్పులు చేసి నేడు ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు ఏలూరు మండలం వంగాయగూడెంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం.. 11.25 గంటలకు ఏలూరు ఇండోర్ స్టేడియంలో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. ఈ పథకం కింద 2,059 వ్యాధులకు చికిత్స అందించడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారికి పింఛన్లకు శ్రీకారం చుట్టనున్నారు. డయాలసిస్ పేషంట్లకు ఇస్తున్న విధంగానే తలసేమియా, సికిల్‌సెల్ ఎనీమియా, హిమోఫిలియా రోగులకు రూ.10 వేల చొప్పున పెన్షన్ ఇవ్వనున్నారు. ప్రమాదాల కారణంగా లేదా పక్షవాతం, తీవ్రమైన కండరాల క్షీణత వల్ల మంచానికే పరిమితమైన వారికి, బోదకాలు, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగ్రస్తులకు (స్టేజ్ 3,4,5) నెలకు రూ.5 వేల పెన్షన్, కుష్టువ్యాధితో బాధపడుతున్నవారికి రూ.3 వేల పెన్షన్ ఇవ్వనున్నారు. రెండు నెలలు పైలట్ ప్రాజెక్టుగా అమలు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు నెలల పాటు పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి, అందులో ఉన్న లోటుపాట్లను గుర్తించి సరిచేశాక ఏప్రిల్ నుంచి ప్రతి నెలా ఒక్కో జిల్లా చొప్పున విస్తరిస్తూ వెళతారు. ఈ పథకాన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమర్థవంతంగా అమలు చేసేందుకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన దిశగా ‘నాడు–నేడు’ కింద అడుగులు వేస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా అన్ని సదుపాయాలున్న రాష్ట్రంలోని, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలోని కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ పథకం కింద వైద్యం అందుతుంది. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రితో పాటు ఏరియా ఆస్పత్రులతో కలిపి 18 ఆసుపత్రుల్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ అమలు అవుతుందని, మరో 33 ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. -
విద్యార్థి ప్రగతికి ‘హాయ్’
సాక్షి, నెహ్రూనగర్(గుంటూరు) : వసతి గృహ విద్యార్థులకు పూర్తి వివరాలతో కూడిన హెల్త్, అకడమిక్ అండ్ ఐటెంటిటీ (హాయ్) కార్డుల అమలుకు బీసీ సంక్షేమ శాఖ శ్రీకారం చుట్టింది. ఈ విధానం గతంలో ఉండేది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మరుగున పడింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వెనకబడిన తరగతుల విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపధ్యంలో గుంటూరు జిల్లాలో ముందుగా బీసీ సంక్షేమ శాఖ అడుగు లేసింది. విద్యార్థి పూర్తి సమాచారం హాయ్కార్డు చూడగానే విద్యార్థి విద్య, ఆరోగ్యంతో పాటు వ్యక్తిగత వివరాలు ఉంటాయి. విద్యార్థి 3వ తరగతిలో హాస్టల్లో చేరగానే ఈ కార్డులో వివరాలు పొందుపరచాలి. మొదటి పేజీలోనే విద్యార్థి వ్యక్తిగత సమాచారం పూరించాలి. పేరు, బాలుడు/బాలిక, స్వస్థలం, చిరునామా, కాంటాక్ట్ నంబర్, కులం, ఆధార్ నంబర్, సంక్షేమ శాఖలో విద్యార్థి యూనిక్ నంబర్, గుర్తింపు చిహ్నాలు ఎంటర్ చేసి తండ్రి/సంరక్షకుడు సంతకం చేయాల్సి ఉంటుంది. మరో వైపు వసతి గృహ సంక్షేమ అధికారి సంతకం చేయాల్సి ఉంటుంది. తర్వాత కాలంలో విద్యార్థి, ఎత్తు, బరువు, రక్తం గ్రూపు, ఇతర వివరాలు నమోదు చేస్తారు. విద్యార్థి హాస్టల్ నుంచి బయటికి వెళ్లే దాకా కార్డులో అన్ని వివరాలు పొందుపరుస్తూ వస్తారు. హాయ్ కార్డులను వార్డెన్లే నిర్వహించాల్సి ఉంటుంది. వారిదే పూర్తి బాధ్యత ఇప్పటికే ముద్రణ జరుగుతుడంటతో...మరి కొద్ది రోజుల్లోనే కార్డులు సరఫరా చేసేందుకు బీసీ సంక్షేమ శాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. విద్యా సంబంధిత వివరాలు... విద్యార్థి త్రైమాసిక, అర్ధ సంవత్సరం, వార్షిక పరీక్షల్లో సాధించే మార్కుల వివరాలను ఎప్పటికప్పుడు ఇందులో నమోదు చేస్తారు. ఇందుకోసం కార్డులో ప్రత్యేక పట్టిక రూపొందించారు. సబ్జెక్టుల వారీగా సాధించిన మార్కులూ నమోదు చేస్తారు. సాధించిన మార్కులు, గరిష్టం, శాతం నమోదు చేయాల్సి ఉంటుంది. ఆరోగ్య వివరాలు... మరోవైపు ప్రతినెలా హాస్టళ్లలను వైద్యాధికారులు సందర్శించి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధన ఉన్నా ఇప్పటికి దాకా అమలైన దాఖాలాలు లేవు. ఇకపై ఆ పరిస్థితి ఉండదు. కచ్చితంగా వైద్యాధికారులు ప్రతినెలా వెళ్లాల్సిందే. వారు వెళ్లి విద్యార్థికి పరీక్షలు నిర్వహించి ఏవైనా ఆరోగ్య ఇబ్బందులను గుర్తిస్తే హాయ్కార్డులో పొందుపరచాలి. తల్లిదండ్రులకు విద్యార్థుల ప్రగతి... ప్రతి నెలా జరిగే తల్లిదండ్రుల సమావేశంలో పిల్లల హాయ్కార్డులను వార్డెన్ తల్లిదండ్రులకు చూపిస్తారు. వీటిని చూసి తమ పిల్లలకు పరీక్షల్లో వస్తున్న మార్కులు, ఏయే సబ్జెక్టులో వెనుక బడ్డారో తెలుసుకుని అవగాహన కల్పించే వీలుంటుంది. ఇది ట్యూటర్లకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి శిక్షణ ఇచ్చే వీలుంటుంది. అలాగే ఎవరైనా అధికారులు ఆకస్మిక తనిఖీ చేసిన సంధర్బంలో కార్డులను పరిశీలించి పిల్లల ప్రగతిని అంచనా వేసే వీలుంటుంది. పక్కగా అమలు చేస్తాం హాయ్ కార్డుల విధానాన్ని పక్కగా అమలు చేస్తాం. విద్యార్థుల చదువుతో పాటు, ఆరోగ్యానికి సంబంధించిన సమగ్ర వివరాలు ఇందులో నమోదు చేస్తాం. వీటి నిర్వహణ బాధ్యత హెచ్‌డబ్ల్యూఓలు తీసుకోవాలి. కార్డుల ముద్రణ జరుగుతుంది. మరి కొద్ది రోజుల్లోనే ఈ కార్డులను విద్యార్థులకు సరఫరా చేస్తాం. – డి.కల్పన, బీసీ సంక్షేమ శాఖ అధికారి -
పని చేస్తేనే ఉపాధి కార్డులు
జిల్లాలో మొత్తం జాబ్‌కార్డులు3.32 లక్షలు • వినియోగంలో ఉన్నవి 1.28 లక్షలు • ప్రభుత్వ నిర్ణయంతో రద్దయ్యేవి సుమారు 2 లక్షలు • 15 రోజుల్లో కొత్త కార్డులు ఖమ్మం మయూరిసెంటర్ : ఉపాధి హామీ పథకంలో ఇక నుంచి పనిచేసే వారికే జాబ్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పనిచేయని వారి కార్డులను తొలగించనుంది. అర్హులందరికీ పని కల్పించేందుకు ఈ ప్రక్రియ చేపట్టినట్లు ప్రభుత్వం చెబుతోంది. సుమారు పదిహేను రోజుల్లో కొత్త కార్డులు ఇవ్వనుంది. జాబ్‌కార్డు పొందినవారిలో సగం మంది పనులకు హాజరుకావడం లేదు. ఈ క్రమంలో పనిచేసేవారికే జాబ్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి 3.32 లక్షల జాబ్‌కార్డులు ఉన్నాయి. వీటిలో 1.28 లక్షల కార్డులు మాత్రమే అత్యధిక పనులు చేసిన జాబితాలో ఉన్నాయి. మొత్తం 7.75 లక్షల మంది కూలీలుగా నమోదు చేసుకోగా 2.28 లక్షల మంది మాత్రమే ఉపాధి పనికి హాజరవుతున్నారు. దీంతో ఉపాధి పనిని వినియోగించుకునేవారికి కార్డులు అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. సుమారు 2 లక్షల కార్డులు రద్దు కానున్నాయి. పథకాల కోసమే కార్డులు ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకునేందుకే జిల్లాలో జాబ్ కార్డులను ఉపయోగించుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాల్లో రాయితీ కల్పిస్తుండడంతో పాటు టాయిలెట్ల నిర్మాణం, ఇంకుడు గుంటలు, పొలంలో నాటేందుకు టేకు మొక్కలు వంటివి కార్డుదారులకు అందిస్తున్నారు. దీంతో చాలా మంది వీటికోసం కార్డులు తీసుకొని ప్రభుత్వం కల్పిస్తున్న పనికి వెళ్ళడం లేదు. కొందరు ఒకరిపై కార్డు తీసుకొని ఇంకొకరు పనికి వెళ్తున్నారు. వీటన్నింటికి చెక్‌పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయంతీసుకుంది. ప్రస్తుతం కొనసాగుతున్న కార్డులను రద్దు చేసి ప్రభుత్వం నూతన కార్డులు ఇవ్వనుంది. మూడు రకాలుగా ఆదివాసీలకు గ్రీన్‌కార్డు, వికలాంగులకు లైట్‌బ్లూ, సాధారాణ కూలీలకు బ్లూ కార్డులు ఇవ్వనుంది. ప్రభుత్వం కల్పిస్తున్న పని రోజుల్లో సగానికి పైగా పని దినాలు ఉపయోగించుకుంటేనే కార్డులు ఇవ్వనున్నారు. జాబ్‌కార్డులు రాగానే పనులు ప్రారంభించేందుకు యంత్రాం గం ప్రణాళికలు రూపొందించింది. అర్హులకు మాత్రమే కార్డులు ఉపాధి పథకాన్ని వినియోగించుకుని పని చేసే కూలీలకు మాత్రమే జాబ్‌కార్డులు అంది స్తాం. 2015–16 సంవత్సరంలో 45 లక్షల పనిదినాలకు 43.5 లక్షల పని దినాల పని జరిగింది. ప్రతి కూలికీ వంద రోజుల పని కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. పని చేయని వారి కార్డులను రద్దు చేస్తాం. – మురళీధర్‌రావు, డీఆర్డీఓ పని చేసేవారికి ఇస్తేనే ప్రయోజనం పని చేసేవారికే జాబ్‌కార్డు విధానం మంచిది. ఈ నిర్ణయంతో అర్హులకు కార్డుతో పాటు 100 రోజుల పని లభిస్తుంది. కూలీలు కూడా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వినియోగించుకొని అవకాశం ఉంటుంది. నూతన విధానాలతో అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చు. – మరికంటి నరేష్, ఉపాధి మేట్ -
కొత్త కార్డులకు అందని ‘కానుక’
- సంక్రాంతి కానుకల పంపిణీలో పలువురికి మొండిచేయి - అందరికీ ఇస్తామన్న మంత్రి మాటలు నీటిమూటలే - సర్కారు తీరుపై ప్రజల పెదవివిరుపు అనంతపురం అర్బన్ : జిల్లాలో చాలామంది రేషన్‌కార్డుదారులకు సంక్రాంతి కానుకలు అందలేదు. మరీముఖ్యంగా కొత్త కార్డుదారులకు అందకపోవడంతో వారు ప్రభుత్వ తీరుపై పెదవి విరుస్తున్నారు. కొత్త కార్డుదారులకూ కానుకలు ఇస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత, జిల్లా అధికారులు ఘనంగా ప్రకటించారు. ఇది ఉత్తిదేనని క్షేత్రస్థాయిలో పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది. జిల్లాలో 11,20,323 పాత రేషన్‌కార్డులు ఉన్నాయి. కొత్తగా 84,419 కార్డులు మంజూరయ్యాయి. వీటిలో 72,531 కార్డులను ఇటీవల ముగిసిన నాల్గో విడత జన్మభూమిలో పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అంటే పాత, కొత్త కార్డులు కలిపి 11,92,854 లబ్ధిదారుల వద్ద ఉన్నాయి. వీటిలో శుక్రవారం నాటికి 10,46,342 కార్డులకు సంక్రాంతి కానుకలు పంపిణీ చేశారు. దీన్నిబట్టి చూస్తే పాతకార్డుదారులకే ఇంకా పూర్తిస్థాయిలో అందజేయలేదని స్పష్టమవుతోంది. మొత్తమ్మీద 1,46,512 కార్డులకు సంబంధించి కానుకలు పంపిణీకి నోచుకోలేదు. దీనిపై పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ (డీఎం) శివశంకర్‌రెడ్డిని వివరణ కోరగా..కొత్తకార్డుల్లోనూ దాదాపు 30 వేల కార్డులకు సంక్రాంతి కానుకలు పంపిణీ చేసినట్లు తమకు సమాచారం ఉందన్నారు. పూర్తిస్థాయి వివరాలు అందితే గానీ కచ్చితమైన లెక్కలు చెప్పలేమన్నారు. -
ఆహారభద్రత కార్డులొచ్చాయ్
జిల్లాకు చేరిన 10.72 లక్షల కార్డులు తహసీల్దార్ కార్యాలయాలకు సీల్డ్బాక్సులు పంపిణీకి విడుదల కాని మార్గదర్శకాలు మరోసారి పరిశీలన తర్వాతే పంపిణీ ముకరంపుర : ఎట్టకేలకు ఆహారభద్రత కార్డులు జిల్లాకు వచ్చేశాయి. 121 సీల్డ్‌బాక్సుల్లో 10.72 లక్షల కార్డులు గురువారం జిల్లాకు చేరాయి. పౌరసరఫరాల శాఖ ద్వారా వీటిని ఆయా మండలాల తహసీల్దార్ కార్యాలయాలకు పంపిణీ చేయనున్నారు. కమిషనరేట్ నుంచి మార్గదర్శకాలు విడుదలైన తర్వాత సీల్డ్‌బాక్సులను తెరిచి మరోసారి కార్డులను పరిశీలన అనంతరం వాటిని గ్రామాల్లో పంపిణీ చేయనున్నామని డీఎస్వో నాగేశ్వర్రావు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో జారీ అయిన రేషన్‌కార్డుల స్థానంలో తెలంగాణ ప్రభుత్వం ఆహారభద్రత కార్డులను జారీ చేసినప్పటికీ ఇప్పటివరకు మీ–సేవలో ముద్రించిన కూపన్‌తోనే సరిపెట్టారు. ఆధార్ అనుసంధానం, ఆన్లైన్లో నమోదు, కార్డుల ముద్రణ వంటి కారణాలతో గత రెండేళ్లుగా కొత్త కార్డుల పంపిణీలో జాప్యం జరిగింది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లోగో, సీఎం కేసీఆర్ ఫొటోతో కార్డులను ముద్రించారు. వాటిని సీల్డ్‌బాక్సుల్లో పంపించడంతో కార్డుల నమూనా బయటికి తెలియడంలేదు. 10.72లక్షల కార్డులు.. గతంలో జిల్లాలో అన్ని రకాల కార్డులు కలిపి 10,93,674 ఉన్నాయి. ఇందులో ఆహారభద్రత కార్డులు 10,25,692, అంత్యోదయ కార్డులు 67,317, అన్నపూర్ణ కార్డులు 665. సింగిల్ కార్డులను ఒకే కుటుంబంలో మిళితం చేయడంతో 21,674 కార్డులు తగ్గాయి. బోగస్‌కార్డులు, మరణించిన వారి కార్డులు ఏరివేశారు. దీంతో తాజాగా కార్డుల సంఖ్య 10,72,000లకు చేరింది. ఈ కార్డులను ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ముద్రించి సీల్డ్‌బాక్సుల్లో జిల్లాకు పంపించారు. ఆహారభద్రత కార్డులు రేషన్ సరకులకు మాత్రమే ఉపయోగపడుతాయని ప్రభుత్వం ప్రకటించింది. సంక్షేమ పథకాలతో ఆహారభద్రత కార్డుకు ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికే స్పష్టం చేసింది. జిల్లాలో 38 లక్షల జనాభా ఉండగా.. 31,50,935 మంది ఆహారభద్రత కార్డులతో లబ్ధిపొందనున్నారు. కొత్త జిల్లాలో సంబంధం లేకుండానే... ప్రస్తుతం కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో కరీంనగర్ జిల్లా మూడు జిల్లాలుగా మారుతోంది. కరీంనగర్‌తోపాటు కొత్తగా జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కార్డుల జారీకి జిల్లాల విభజనకు సంబంధం లేదంటూ రాష్ట్ర కమిషనరేట్ కార్యాలయం తేల్చిందని జిల్లా అధికారులు చెబుతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత మరోసారి కొత్త కార్డులు ముద్రించే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పాత కార్డులు 10,93,674 తొలగించినవి 21,674 కొత్త కార్డులు 10,72,000 ఆహారభద్రత 10,25,692 అంత్యోదయ 67,317 అన్నపూర్ణ 665 -
కొత్త కార్డులెప్పుడో..?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : కొత్త ఆహార భద్రత కార్డుల జారీలో స్పష్టత కరువైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా జిల్లాలో జనవరి 1న కొత్త కార్డులు అందించే పరిస్థితి కని పించడం లేదు. ఒక వైపు ఆహారభద్రత కార్డుల పరిశీలన, డేటా ఎంట్రీ కొనసాగుతుండగా, మరో వైపు పథకం ప్రారంభ సమయం ముంచుకొస్తోంది. లబ్ధిదారులు, అధికారుల్లో ఆందోళన మొదలైంది. తెలంగాణ ప్రభుత్వం బోగస్ కార్డులను ఏరివేసి అర్హులకు మాత్రమే రేషన్ పంపిణీ చేసేందుకు నూతనంగా ఆహార భద్రత పథకాన్ని ప్రవేశపెట్టింది. జిల్లా వ్యాప్తంగా ఈ పథకాన్ని జనవరి 1 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే కార్డులపైన ప్రభుత్వం ఇంకా స్పష్టతను ఇవ్వకపోవడం, ఈ ప్రక్రియలో జాప్యం చోటుచేసుకోవడంతో కార్డుల జారీ ఇప్పట్లో లేనట్టేనని తెలుస్తోంది. ఏడు లక్షల మందికి పైగా అర్హులు.. జిల్లాలో 8,59,260 కుటుంబాలకు గానూ 7,93,694 మంది ఆహార భద్రత కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 7,75,689 దరఖాస్తులను పరిశీలించారు. 7,00,260 మందిని అర్హులుగా గుర్తించాల్సి ఉంది. మిగిలిన 18 వేల దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంది. పరిశీలించిన దరఖాస్తుల ఆన్లైన్ ప్రకియ కొనసాగుతోంది. అర్హుల దరఖాస్తులను ఆన్లైన్ చేయడంతో పాటు ఆధార్‌ను అనుసంధానం చేయాల్సి ఉంది. దీనిలో కొంతమేర జాప్యం జరుగుతోంది. అయితే సవరించిన నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాతాల్లో ఏడాదికి రూ. లక్షన్నర ఆదాయం, 7.5 ఎకరాల మెట్ట, 3.5 ఎకరాల మాగాణి భూమికి మించకుండా ఉన్న కుటుంబాలకు ఆహార భద్రత వర్తించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు ఆ దాయం మించకుండా ఉన్న వారు అర్హులు. ఆసరా ఫథకంలో అనేక మంది అర్హులకు అన్యాయం జరగడంతో ఆహార భద్రత కార్డులపై అందరి దృష్టి ఉంది. ఆహార భద్రత విషయంలోఎలాంటి తప్పులు దొర్లకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికార యత్రాంగం కిందిస్థాయి అధికారులను ఆదేశించింది. అయితే ఈ ప్రకియ పూర్తయితే తప్ప లోపాలు బయటపడే అవకాశం లేదు. ఆన్‌లైన్‌లోనూ వెనుకంజ ఆహారభద్రత కార్డుల అర్హుల జాబితాను ఆన్లైన్ చేయడంలోనూ రాష్ట్రంలోనే జిల్లా వెనుకబడే ఉంది. అన్ని జిల్లాల్లో 50 శాతం మేరకు నమోదు కాగా, జిల్లాలో మాత్రం 7,00,260 కార్డులకు లక్ష మాత్రమే ఆన్లైన్ చేశారు. ఇంకా 6 లక్షల కార్డులను ఆన్లైన్ చేయాల్సి ఉంది. దీంతోపాటు ఆధార్ అనుసంధానం చేయడంతో ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. మంత్రి తుమ్మలచే ప్రారంభం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఆహార భద్రత పథకాన్ని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతులు మీదుగా ప్రారంభించేందుకు జిల్లా అధికారులు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో జనవరి 1న లక్ష కుటుంబాలకు ఆహారభద్రతను అట్టహాసంగా ప్రారంభించాలని అధికారులు పరుగులు తీస్తున్నారు. అయితే ఈ పథకాన్ని ఎక్కడ ప్రారంభించాలనే విషయంపై స్పష్టత లేదు. ఈ ప్రకియ పూర్తయినా, కాకపోయినా జనవరి 1నుంచి కొత్త రేషన్ విధానం ప్రకా రం వ్యక్తికి 6 కిలోల చొప్పున అర్హులకు మాత్రమే పంపిణీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రతి పక్షాలు మాత్రం దీనిలో లోపాలను ఎత్తి చూపేందుకు సన్నద్ధం అవుతున్నాయి. ఇప్పటికే వార్డులు, గ్రామాల వారీగా అర్హుల జాబితాను బట్టి రేషన్‌షాపుల వారీగా విభజించేందుకు రెవెన్యూ యంత్రాంగం చర్యలు చేపడుతోంది. సన్నబియ్యం లేనట్టే.. ఆహారభద్రత పథకంలో జిల్లాలో అర్హులైనా కుటుంబాలకు సన్న బియ్యం అందించేలా చర్యలు చేపడతామని అధికారులు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో పండిన బియ్యం తెలంగాణకే ఉపయోగించాలని, జిల్లాలో ఉత్పత్తి అయిన బియ్యాన్ని జిల్లా అవసరాలకే ఉపయోగించాలని ప్రభుత్వం ఆదేశించిందని అధికారులు చెప్పారు. కానీ ఇప్పటి వరకు బియ్యం పూర్తిస్థాయిలో లేకపోవడంతో పాటు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాక పోవడంతో అధికారులకు ఏమి పాలుపోవడం లేదు. సంక్షేమ హాస్టల్స్, మధ్యాహ్న భోజనానికి మాత్రమే సన్నబియ్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.