డిపాజిట్ చేయండి... టాక్టైమ్ పొందండి.. | Airtel payments bank offers 1 minute talktime for Rs 1 deposit | Sakshi
Sakshi News home page

డిపాజిట్ చేయండి... టాక్టైమ్ పొందండి..

Published Sat, Dec 3 2016 1:20 AM | Last Updated on Mon, Sep 4 2017 9:44 PM

డిపాజిట్ చేయండి... టాక్టైమ్ పొందండి..

డిపాజిట్ చేయండి... టాక్టైమ్ పొందండి..

ప్రతి రూపారుుకి ఒక నిమిషం టాక్‌టైమ్
ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ వినూత్న ఆఫర్

 న్యూఢిల్లీ: అధిక సేవింగ్‌‌స ఖాతాల ఓపెనింగే లక్ష్యంగా కస్టమర్లను ఆకర్షించడం కోసం ఎరుుర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ వినూత్నమైన ఆఫర్‌ను ప్రకటించింది. కస్టమర్లు ఖాతాలో డిపాజిట్ చేసే ప్రతి రూపారుుకి ఒక నిమిషం టాక్‌టైమ్‌ను (ఎరుుర్‌టెల్ నుంచి ఎరుుర్‌టెల్‌కు) ఉచితంగా అందిస్తామని పేర్కొంది. ఈ సౌకర్యం తొలిసారి చేసిన డిపాజిట్లకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ఉదాహరణకు ఒక వ్యక్తి రూ.1,000ల డిపాజిట్‌తో బ్యాంక్ ఖాతాను తెరిచాడనుకోండి... అతను తన ఎరుుర్‌టెల్ మొబైల్ నెంబర్‌పై 1,000 నిమిషాల ఉచిత టాక్‌టైమ్‌ను పొందొచ్చు.

ఈ టాక్‌టైమ్‌తో దేశవ్యాప్తంగా ఉన్న ఏ ఎరుుర్‌టెల్ నెంబర్‌కై నా ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు. కాగా ఎరుుర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ నవంబర్ 23న రాజస్తాన్‌లో తన బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ‘కేవలం రాజస్తాన్‌లోనే ఈ ఏడాది చివరకు లక్ష మందికి పైగా వ్యాపారులను మా ప్లాట్‌ఫామ్ పరిధిలోకి తీసుకురావడం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నాం. వీరంద్దరూ ఎరుుర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్ల నుంచి జరిగే డిజిటల్ పేమెంట్స్‌కు ఎలాంటి చార్జీలను వసూలు చేయరు. దీంతో డిజిటల్ పేమెంట్స్ పెరుగుదలకు మా వంతు కృషి అందించినట్లు అవుతుంది’ అని ఎరుుర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ సీఈవో శశి అరోరా వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement