Apple Stops Debit And Credit Card Payments In India, Know Complete Details - Sakshi
Sakshi News home page

Apple Payments In India: భారతీయులకు యాపిల్‌ భారీ షాక్‌!

Published Fri, May 6 2022 2:32 PM | Last Updated on Fri, May 6 2022 2:44 PM

Apple Stops Debit,credit Card Payments In India - Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ భారతీయులకు భారీ షాకిచ్చింది. యాప్ స్టోర్‌లో యాప్‌లు, సబ్‌స్క్రిప్షన్‌ల కోసం డెబిట్, క్రెడిట్ కార్డ్‌ చెల్లింపులకు స్వస్తి పలికింది. యూజర్లు అల్ట్రనేట్‌గా చెల్లింపుల కోసం ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషించాలని యాపిల్‌ తన బ్లాగ్‌లో స్పష్టం చేసింది.  

మనదేశానికి చెందిన వినియోగదారులు  తాము సేవ్‌ చేసిన డెబిట్‌ కార్డ్‌, క్రెడిట్‌ కార్డ్‌లతో యాప్‌ సబ్‌స్క్రిప్షన్‌లపై చెల్లింపులు చేయలేకపోతున్నామంటూ యాపిల్‌ సంస్థకు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన యాపిల్‌ యాజమాన్యం డెబిట్‌ కార్డ్‌, క్రెడిట్‌ కార్డ్‌ పేమెంట్స్‌ను నిలిపివేసింది.  

అయితే వినియోగదారులు తమ యాపిల్‌ ఐడీలో ఉన్న బ్యాలెన్స్‌తో యాప్‌లు, సబ్‌స్క్రిప్షన్‌ల చెల్లింపులు చేసుకోవచ్చు. యాపిల్‌ ఐడీలో మరింత బ్యాలెన్స్‌ కావాలనుకుంటే యాప్ స్టోర్ కోడ్‌లు, నెట్ బ్యాంకింగ్, యూపీఐలను వినియోగించుకోవచ్చు.

చదవండి👉 ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారా! టెక్‌ లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement