debet
-
ట్రంప్ అమెరికాను చైనాకు అమ్మేశారు : హారిస్
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య తొలి ప్రత్యక్ష డిబేట్ జరిగింది. ఈ డిబేట్లో అమెరికా ఆర్థిక వ్యవస్థ, గర్భవిచ్ఛిత్తి అంశం, ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం,ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో పాటు ఇతర అంశాలపై చర్చ జరిగింది. డిబెట్లో ట్రంప్-హారిస్‌ల మధ్య మాటలు తూటాల్లా పేలాయి. అధ్యక్షుడిగా ట్రంప్ పాలనలో జరిగి తప్పిదాలను ప్రధాన అంశంగా చర్చిస్తూ హారిస్ పైచేయి సాధించారు. డిబెట్లో ఏబీసీ న్యూస్ యాంకర్లు డేవిడ్ ముయిర్,లిన్సే డేవిస్..ఆర్థిక వ్యవస్థ, కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయో చెప్పాలంటూ హారిస్‌ను ప్రశ్నించారు. అందుకు హారిస్ ముందుగా పేదరికం గురించి మాట్లాడారు. తనని అమెరికా అధ్యక్షురాలిగా గెలిస్తే.. పేదరికంపై దృష్టిసారిస్తామని చెప్పారు. చిరు వ్యాపారాల్ని ప్రోత్సహిస్తామన్నారు. చిరు వ్యాపారం చేసే వారికి అండగా నిలుస్తాం. అందుకు వద్ద ప్రణాళికలు ఉన్నాయి’అని వాటి గురించి వివరించారు. అదే సమయంలో హారిస్..ట్రంప్‌ను టార్గెట్ చేశారు. ఒకానొక దశలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చేసిన ఘోర తప్పిదాల్ని ప్రాస్తావిస్తూ ట్రంప్‌ను ఉక్కిరి బిక్కిరి చేశారు. మేం పేదలకు అండగా ఉంటే ట్రంప్ మాత్రం ధనికులకు, కార్పొరేట్ కంపెనీలకు అండగా నిలుస్తారు. ట్యాక్స్ కూడా తగ్గిస్తారు’ అని మండిపడ్డారు.అమెరికాను చైనాకి అమ్మేశారు : హారిస్అమెరికాను నెంబర్‌వన్‌గా నిలపడమే లక్ష్యం. తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ దేశాన్ని సమస్యల్లో వదిలేశారు. ప్రజాస్వామ్యంపై దాడి చేశారు. అమెరికా ఆర్ధిక వ్యవస్థను దెబ్బ తీశారు. దేశాన్ని చైనాకు అమ్మేశారు. ఇప్పటికే ట్రంప్ చేసిన తప్పుల్ని బైడెన్ నేనూ సరిచేశాం. అలాంటి ట్రంప్ మళ్లీ ఎన్నికైతే అమెరికాకు చిక్కులు తప్పువంటూ హారిస్ హెచ్చరించారు.జోబైడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ట్రంప్ నాశనం చేసిన ఆర్ధిక వ్యవస్థ తిరిగి గాడిలోకి పెట్టామంటూ నాటి ఆర్థిక పరిస్థితుల్ని ప్రస్తావించగా..డొనాల్డ్ ట్రంప్‌కు ఎలాంటి ప్రణాళికలు లేవనన్నారు. ట్రంప్ ఏం మారలేదు ఆ తర్వాత ట్రంప్ సైతం కమలా హారిస్‌కు ధీటుగా బదులిచ్చారు. జోబైడెన్ ప్రభుత్వంలో రికార్డ్ స్థాయిలో పెరిగాయంటూ వ్యాఖ్యానిస్తుండగా.. హారిస్ అడ్డుతగిలారు. చూశారా? ట్రంప్ ఏం మారలేదు. అవే అబద్ధాలు. అవే మోసాలు. చెప్పిన అబద్దాల్ని పదే పదే చెబుతున్నారు. ప్రజల అంచనాలకు తగ్గట్లుగా వాదనల్ని వినిపించాలి. అలా కాకుండా ప్రజల్ని మోసం చేసేలా అవే పాత వ్యూహాలు, అబద్దాలు చెప్పడం.. ట్రంప్ వ్యక్తిత్వం ఎలాంటిదో ప్రతిబింబిస్తున్నాయి.గర్భవిచ్ఛిత్తిపై.. ఇటీవలి కాలంలో అమెరికాలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గర్భవిచ్ఛిత్ (అబార్షన్)సహా పలు అంశాలు చర్చకు వచ్చాయి. డిబేట్ జరిగే సమయంలో ఇరువురు నేతలు పరస్పరం ఆరోపణలు, విమర్శలు గుప్పించుకున్నారు. అమెరికాలో గర్భవిచ్ఛిత్తిపై నిషేధాన్ని హారిస్ తప్పుబట్టారు. ఆ ప్రక్రియను అనుమతిస్తూ ‘రో వర్సెస్ వేడ్’ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పునకు మద్దతిస్తున్నట్లు చెప్పారు. మహిళల అభివృద్ధి ట్రంప్‌నకు గిట్టదు. అబార్షన్లపై ఆయన నిషేధం విధించాలనుకుంటున్నారు. ఇది మహిళలను అవమానించడమే’ అని హారిస్ అన్నారు.ఇదీ చదవండి : బీజేపీ అధ్యక్షుడి కుమారుడి కారు బీభత్సంఇజ్రాయెల్కే మా మద్దతుడిబేట్లో గాజాలో జరుగుతున్న ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంపై హారిస్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ రెండు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేయగా.. ఆమె అధ్యక్షురాలిగా ఉంటే సాధ్యం కాదంటూ ట్రంప్ విమర్శలు గుప్పించారు. హారిస్ ఇజ్రాయెల్‌తో పాటు అరబ్లను ద్వేషిస్తున్నారు’ అని అన్నారు. అందుకు హారిస్ కలగజేసుకుని.. ట్రంప్ చేస్తున్న వాదనలు నిజం కాదు. ఇజ్రాయెల్‌కు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. మీ మద్దతు ఎవరికి ఉక్రెయిన్ యుద్ధంపై హారిస్ స్పందిస్తూ.. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నట్లైతే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఉండేవారు. పుతిన్ కీవ్‌లో కూర్చుని పోలాండ్‌తో ప్రారంభించి యూరప్‌లోని మిగిలిన ప్రాంతాలపై దృష్టి సారిస్తూ ఉండేవారు అని అన్నారు. యుద్ధంలో రష్యాపై ఉక్రెయిన్ విజయ సాధించాలని కోరుకుంటున్నారా? అని డిబేట్లో ట్రంప్‌ను ఏబీసీ యాంకర్లు ప్రశ్నించారు. అందుకు ట్రంప్ నేరుగా సమాధానం ఇవ్వలేదు. అయితే యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డెమోక్రటిక్, రిపబ్లికన్ అభ్యర్థులు కమలాహారిస్ , డొనాల్డ్ ట్రంప్ మధ్య తొలి టీవీ డిబేట్ అమెరికా వార్తాసంస్థ ఏబీసీ న్యూస్ ఫిలడెల్ఫియాలోని నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్లో నిర్వహించింది. అమెరికా కాలమాన ప్రకారం రాత్రి 9.00 గంటలకు ప్రారంభం కాగా.. భారత్ కాలమానం ప్రకారం బుధవారం ఉదయం సుమారు 6.30 గంటల సమయంలో ప్రారంభమైంది. ఇక డిబెట్ జరిగే న్యూస్ స్టూడియోలో ప్రేక్షకులు ఎవ్వరూ లేదు. ఏబీసీ న్యూస్ యాంకర్లు డేవిడ్ ముయిర్, లిన్సే డేవిస్ చర్చకు కోఆర్డినేటర్లుగా ఉన్నారు. 90 నిమిషాల పాటు జరిగిన ఈ డిబేట్లో రెండు సార్లు స్వల్ప విరామం ఇచ్చారు. డిబేట్ చివరలో చెరో రెండు నిమిషాలు ముగింపు ప్రసంగం చేసేందుకు అనుమతిచ్చారు. -
కేంద్రం ఏపీకి ఇచ్చింది అప్పే.. గ్రాంట్ కాదు : మహవా
ఢిల్లీ : లోక్‌సభలో బడ్జెట్‌పై పశ్చిమ బెంగాల్ టీఎంసీ ఎంపీ మహవా మోయిత్ర మాట్లాడారు.కేంద్ర బడ్జెట్‌పై ఏపీ ప్రజలను ఫూల్స్ చేయొద్దన్నారు. ఏపీకి ఇచ్చేది అప్పేనని గ్రాంట్ కాదని అన్నారు. డాలర్ల లోను కట్టాల్సిన బాధ్యత ఏపీ భవిష్యత్తు తరాలదేనని అన్నారు టీఎంసీ ఎంపీ మహవా మోయిత్ర.ఇక ఉత్తరాంధ్ర,రాయలసీమ, ప్రకాశం వంటి వెనుకబడి జిల్లాలకు గ్రాంట్లు ఇస్తామని, కానీ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు లేవని సూచించారు. తెలివైన ఏపీ ప్రజల్ని ఫూల్స్ చేస్తున్నారంటూ ఫైరయ్యారు. -
ఎఫ్ఆర్ఎంబీ నిబంధనల ప్రకారమే ఏపీకి రుణాలు: దువ్వూరి కృష్ణ
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు ఏపీ సీఎం స్పెషల్ సెక్రటరీ దువ్వూరి కృష్ణ. ఎఫ్ఆర్ఎంబీ నిబంధనల ప్రకారమే రుణాలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ లెక్కలన్నీ కాగ్, ఆర్బీఐ ధృవీకరించినవే అని స్పష్టం చేశారు. కాగా, దువ్వూరి కృష్ణ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ఆర్థిక పరిస్థితిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పదేపదే ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు తప్పుడు ప్రచారం చేస్తే వారు నమ్ముతారని భావిస్తున్నారు. జర్నలిస్టులు కూడా విలువలు పాటించకుండా తప్పుడు వార్తలు రాస్తున్నారు. ఆర్బీఐ నివేదిక ప్రకారం రాష్ట్ర విభజన నాటికి ప్రభుత్వ అప్పులు రూ. 1,18,050 కోట్లు కాగా, టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.2.71 లక్షల కోట్లకి అప్పు చేర్చింది. ఇక, 2023 మార్చి నాటికి ఏపీ అప్పులు రూ.4కోట్లకు చేరుకున్నాయి. టీడీపీ హయాంలో ప్రతీ ఏటా 20 శాతం అప్పు పెరగగా.. ఈ ప్రభుత్వంలో ఏటా పెరిగిన అప్పు 15.42 శాతం మాత్రమే. ఏపీ రుణాలన్నీ ప్రస్తుత ప్రభుత్వానికి ఆపాదించడం సరికాదు. ఎఫ్ఆర్ఎంబీ నిబంధనల ప్రకారమే రుణాలు తీసుకుంటున్నాం. ఈ లెక్కలన్నీ కాగ్, ఆర్బీఐ ధృవీకరించినవే. విద్యుత్ డిస్కంల అప్పు విభజనకి ముందు రూ.2893 కోట్లు అయితే టీడీపీ హయాంలో రూ.21,541కోట్లకి పెరిగింది. ఈ ప్రభుత్వంలో ఈ అప్పులు రూ.11,602 కోట్లకు అప్పులు తగ్గాయి. మొత్తం విద్యుత్ సంస్థల అప్పులు విభజన నాటికి 32,596.27 కోట్లు అయితే టీడీపీ హయాంలో రూ.91,137కోట్లకి పెరిగాయి. ఇక, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.1,09,094 కోట్లకి మాత్రమే పెరిగాయి. విద్యుత్ పంపిణీ సంస్ధల అప్పులు గత ప్రభుత్వంలో 30.74 శాతం పెరిగితే ఈ ప్రభుత్వంలో 5.79 శాతం తగ్గాయి. రాష్ట్ర ప్రభుత్వం అనధికార అప్పులు చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాజ్యాంగ విరుద్దంగా చట్ట విరుద్దంగా అప్పులు ఎలా చేయగలుగుతాం. కేంద్ర పరిమితులకి లోబడే అప్పులు. అన్ని నిబంధనలు పాటిస్తేనే బ్యాంకులు సైతం అప్పులు ఇస్తాయి. టీడీపీ ప్రభుత్వం ఏర్పడే నాటికి రూ.1,53,346 కోట్ల అప్పులు 2019 నాటికి రూ.4,12,288 కోట్లకి పెరిగాయి. టీడీపీ ఐదేళ్ల కాలంలో రూ.2,58,941 కోట్లు అప్పులు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో అప్పులు పెరగలేదు. ఈనాడు పత్రిక రాసే వార్తల్లో నిజం లేదు. -
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్, డబ్బులు డిడక్ట్ అవుతున్నాయని మెసేజ్ వచ్చిందా!
ప్రముఖ ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఖాతాదారుల బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బులు కట్ అయినట్లు మెసేజ్‌లు వెళుతున్నాయి. అయితే తాము ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయకుండా డబ్బులు ఎందుకు డెబిట్ అవుతున్నాయని ప్రశ్నిస్తున్నారు. బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు డిడక్ట్ అవ్వడంపై ఖాతాదారులు కంగారు పడాల్సిన అసవరం లేదని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. బ్యాలెన్స్ మెయింటెన్స్/ సర్వీస్ ఛార్జీలు పేరుతో ఖతా నుంచి రూ.147.50 డబ్బుల్ని డెబిట్ చేస్తున్నట్లు తెలిపారు. నాన్ బ్యాంక్ ఏటీఎం నుంచి డబ్బులు చేసి, ఆ ట్రాన్స్‌క్షన్‌ల లిమిట్ దాటిపోతే అదనపు ఛార్జీల వసూళ్లు సర్వసాధారణమని బ్యాంకులు చెబుతున్నాయి. ఎస్బీఐ తన కస్టమర్లు ఉపయోగించే డెబిట్ కార్డ్‌ల యాన్యువల్ ఫీ రూ.125 ఉండగా..అదనంగా 18 శాతం జీఎస్టీని వసూలు చేస్తుంది. దీంతో రూ.125కి జీఎస్టీ కలిపితే రూ.147.50కి అవుతుంది. ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్ వివిధ క్రెడిట్ కార్డ్ సంబంధిత లావాదేవీలపై విధించే అదనపు ఛార్జీలను సవరించింది. ఎస్బీఐ కార్డ్ తన వెబ్సైట్లో నవంబర్ 15, 2022 నుంచి అన్ని అద్దె చెల్లింపు లావాదేవీలపై ప్రాసెసింగ్ రుసుము రూ.99 ప్లస్ జీఎస్టీ విధిస్తున్నట్ల పేర్కొంది. నాటి నుంచి అన్ని మర్చంట్ ఈఎంఐ లావాదేవీలపై ప్రాసెసింగ్ రుసుము రూ.199కి సవరించింది. -
స్లైస్ కార్డు యూజర్లకు అలెర్ట్, ఇక ఆ కార్డులు పనిచేయవ్!
స్లైస్ కార్డు యూజర్లకు ముఖ్య గమనిక. ఆర్బీఐ నిబంధనల మేరకు స్లైస్ కార్డు తన ప్రీపెయిడ్ కార్డు సేవల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. నవంబరు చివరి నుంచి ఈ కార్డులు వినియోగించే అవకాశం ఉండదని పేర్కొంది. ఆర్బీఐ నిబంధనల మేరకు స్లైస్ తరహా సంస్థలు లోన్లు ఇవ్వడం, తిరిగి చెల్లించే ట్రాన్సాక్షన్లు ఇకపై అన్నీ బ్యాంక్ అకౌంట్ల నుంచి జరపాల్సి ఉంది. ఇందులో భాగంగా స్లైస్ వినియోగదారులకు ఇచ్చే రుణాల్ని ఇకపై బ్యాంకు అకౌంట్లకే ట్రాన్స్ చేయనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఉన్న స్లైస్ కార్డులో ఉన్న నగదు రోజువారీ ట్రాన్సాక్షన్లకు ఉపయోగించుకోవచ్చు. స్లైస్ బారో పేరిట లోన్లు, యూపీఐ పేమెంట్స్ కోసం స్లైస్ యూపీఐ ఆప్షన్‌ను అందుబాటులోకి తెస్తామని తెలిపింది. -
అప్పుల ఊబి, వాటల విక్రయం..ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్‌కు వేల కోట్లు!
న్యూఢిల్లీ: రుణ ఊబిలో ఉన్న ఫ్యూచర్ గ్రూపు కంపెనీ ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ దివాలా ప్రక్రియ బారిన పడకుండా చర్యల మార్గం పట్టింది. ఫ్యూచర్ జనరాలి ఇన్సూరెన్స్ కంపెనీల్లో తనకున్న వాటాలను విక్రయించడం ద్వారా రూ.3,000 కోట్లను సమకూర్చుకోనుంది. ఈ నిధులతో రుణభారం తగ్గించుకోవాలన్నది కంపెనీ వ్యూహం. ఫ్యూచర్ జనరాలి ఇండియా ఇన్సూరెన్స్ అన్నది ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్, జనరాలి భాగస్వామ్య సంస్థ. ఇది సాధారణ బీమా సంస్థ. ఇందులో తనకున్న వాటాలో 25 శాతాన్ని భాగస్వామి జనరాలికి రూ.1,266 కోట్లను విక్రయించినట్టు గత వారమే ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ ప్రకటించింది. ఈ లావాదేవీ తర్వాత కూడా ఫ్యూచర్ జనరాలిలో ఫ్యూచర్ ఎంటర్ ప్రైజెస్‌కు 24.91 శాతం వాటా మిగిలే ఉంది. వచ్చే 30–40 రోజుల్లో మిగిలిన 25 శాతం వాటా విక్రయంతో రూ.1,250 కోట్లు లభిస్తాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇక ఫ్యూచర్ జనరాలి లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఉన్న 33.3 శాతం వాటాను సైతం విక్రయించనుంది. దీని ద్వారా మరో రూ.400 కోట్ల వరకు రానున్నాయి. ఈ మూడు లావాదేవీలతో మొత్తం రూ.2,950 కోట్ల వరకు సమకూరతాయి. ఈ ఏడాది మార్చి 31 నాటికి చెల్లించాల్సిన రూ. 2,911 కోట్ల రుణాల విషయంలో ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ డిఫాల్ట్ అయింది. దీనికి అదనంగా 30 రోజుల సమీక్ష కాలంలోనూ చెల్లించలేకపోయింది. -
భారతీయులకు యాపిల్ భారీ షాక్!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ భారతీయులకు భారీ షాకిచ్చింది. యాప్ స్టోర్‌లో యాప్‌లు, సబ్స్క్రిప్షన్ల కోసం డెబిట్, క్రెడిట్ కార్డ్ చెల్లింపులకు స్వస్తి పలికింది. యూజర్లు అల్ట్రనేట్గా చెల్లింపుల కోసం ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషించాలని యాపిల్ తన బ్లాగ్‌లో స్పష్టం చేసింది. మనదేశానికి చెందిన వినియోగదారులు తాము సేవ్ చేసిన డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్‌లతో యాప్ సబ్స్క్రిప్షన్లపై చెల్లింపులు చేయలేకపోతున్నామంటూ యాపిల్ సంస్థకు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన యాపిల్ యాజమాన్యం డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్‌ను నిలిపివేసింది. అయితే వినియోగదారులు తమ యాపిల్ ఐడీలో ఉన్న బ్యాలెన్స్‌తో యాప్‌లు, సబ్స్క్రిప్షన్ల చెల్లింపులు చేసుకోవచ్చు. యాపిల్ ఐడీలో మరింత బ్యాలెన్స్ కావాలనుకుంటే యాప్ స్టోర్ కోడ్లు, నెట్ బ్యాంకింగ్, యూపీఐలను వినియోగించుకోవచ్చు. చదవండి👉 ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా! టెక్ లవర్స్‌కు గుడ్ న్యూస్! -
‘గెట్ అవుట్’ అంటూ విశ్వక్ సేన్‌పై టీవీ యాంకర్ ఫైర్
Argument Between TV Anchor And Hero Vishwak Sen: హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’. విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే6న విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ స్పీడు పెంచిన చిత్ర బృందం ఓ ప్రాంక్ వీడియో చేసిన సంగతి తెలిసిందే. ఫిలింనగర్‌లోని రోడ్డులో ఓ అభిమాని చేత సూసైడ్ చేయిస్తున్నట్టుగా వీడియో చేయించి రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హీరో విశ్వక్ సేన్‌పై అరుణ్ కుమార్ అనే అడ్వకేట్ హ్యుమన్ రైట్స్ కౌన్సిల్లో(హెచ్ఆర్సీ) ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: హీరో విశ్వక్ సేన్‌పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు తాజాగా ఈ వీడియో కాస్తా కాంట్రవర్సి కావడంతో ప్రముఖ టీవీ చానల్ హీరో విశ్వక్ సేన్, సినీ ఇండస్ట్రీకి చెందిన త్రిపురనేని చిట్టితో డిబెట్ నిర్వహించింది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ కోసం ఇలా ప్రాంక్ వీడియోలు చేయడం ఏంటని, హీరో మెంటల్ స్టేటస్‌పై ప్రశ్నించింది యాంకర్. ఈ నేపథ్యంలో విశ్వక్‌ను డిప్రెషన్ పర్సన్, పాగల్ శ్రీను వంటి పదాలు వాడారు. దీంతో విశ్వక్ యాంకర్‌పై ఫైర్ అయ్యాడు. ‘నేను డిప్రెషన్‌కి వెళ్లిపోయానని మీరు స్టేట్మెంట్ పాస్ చేయడం కరెక్ట్ కాదు. అలా ఏ డాక్టర్ చెప్పాడో అతడి నెంబర్ ఇవ్వండి నేను మట్లాడుతాను. నా పర్సనల్ లైఫ్ గురించి మీకు తెలియదు. దాని గురించి మాట్లాడే హక్కు మీకు లేదు’ అన్నాడు. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలివే.. అలాగే ‘నాకు పాగల్ శీను అనే పేరు పెట్టారు. నేను కూడా మీపై పరువు నష్టం దావా వేయొచ్చు. కానీ నేను అలా చేయను. మీరు మీ నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడండి. డిప్రెషన్ పర్సన్, పాగల్ శీను అని అనడం సరికాదు’ అంటూ అసహనం వ్యక్తం చేశాడు. దీంతో యాంకర్ విశ్వక్ సేన్‌ను నువ్వు ముందు స్టూడియో నుంచి బయటకు వెళ్లిపోమ్మంటూ గట్టిగా అరించింది. దీంతో యాంకర్‌పై విశ్వక్ విరుచుకుపడుతు అభ్యంతరకర(ఎఫ్.. అనే పదం) పదాన్ని వాడాడు. దీంతో సహనం కోల్పోయిన యాంకర్ ‘యు గెటవుట్ ఫస్ట్ ఫ్రమ్ స్టూడియో’ అంటూ పదే పదే చెప్పడంతో ‘నేను బయటకు పోతే నా గురించి ఇష్టమొచ్చినట్లు చెబుతారు. యు జస్ట్ షటప్’ అనేసి విశ్వక్ స్టూడియో నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఈ వివాదం ఎంతవరకు వెళుతుందో చూడాలి. -
‘ఆస్క్ యువర్ కేటీఆర్’ .వారితో డిబేట్లో పాల్గొనను
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ‘ఆస్క్ యువర్ కేటీఆర్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో పలువురు నెటిజన్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. దీనిపై ఒక నెటిజన్ అడిగిన ప్రశ్న ప్రస్తుతం వార్తల్లో నిలిచింది.తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో డిబేట్లో పాల్గొనాలని కోరాడు. దీనికి కేటీఆర్ తనదైన శైలీలో సమాధానం ఇచ్చారు. ‘క్రిమినల్స్‌తో డిబేట్లో పాల్గొననని సమాధానం ఇచ్చారు’. గత కొన్ని రోజులుగా కేటీఆర్ నిర్వహిస్తున్న ‘ఆస్క్ యువర్ కేటీఆర్’ కార్యక్రమంలో నెటిజన్లు ఉత్సాహంగా పాల్గొంటున్న విషయం తెలిసిందే. చదవండి: కరోనా ఉధృతి.. రాష్ట్ర సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ -
క్రెడిట్ కార్డు వినియోగదారులకు శుభవార్త!
క్రెడిట్ కార్డు వినియోగదారులకు శుభవార్త. గతేడాది ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులు క్రెడిట్ కార్డులపై విధిస్తున్న ఛార్జీలను సవరించనున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఛార్జీలను ఫిబ్రవరి 10 నుంచి సవరించిన ఛార్జీలను అమల్లోకి తీసుకొని రానుంది. ►క్రెడిట్ కార్డ్ హోల్డర్లు క్యాష్ అడ్వాన్స్ ఫీజ్(క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించినందుకు బ్యాంక్ విధించే ఛార్జ్)లను సవరించింది. వాస్తవానికి అన్నీబ్యాంకులు క్రెడిట్కార్డులపై జరిపే లావాదేవీలపై 2.50 శాతం మొత్తాన్ని వసూలు చేస్తాయి. కానీ ఇప్పుడు ఆ ఛార్జీలను సవరించి 2శాతం మాత్రమే వసూలు చేయనున్నాయి. బ్యాంక్ ఇప్పుడు కనిష్టంగా రూ. 500 నుంచి క్రెడిట్ కార్డులపై 2శాతం ఛార్జీలను వసూలు చేయనున్నాయి. ►ఐసీఐసీ బ్యాంక్ ఎమరాల్డ్ క్రెడిట్ కార్డ్ మినహా అన్ని క్రెడిట్ కార్డ్‌లకు ఆలస్య చెల్లింపు ఛార్జీలను బ్యాంక్ సవరించనున్నాయి. కెడ్రిట్ కార్డ్‌లపై చెల్లించాల్సిన అవుట్ స్టాండింగ్ అమౌంట్ రూ.100 కంటే తక్కువ ఉంటే బ్యాంకులు అదనపు ఛార్జీలు విధించలేవు.మీరు చెల్లించాల్సిన మొత్తం ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు అవుట్ స్టాండింగ్ అమౌంట్ రూ.50,000 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే బ్యాంకులు గరిష్టంగా రూ.1200 వసూలు చేస్తాయి. ►హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్‌లు రూ. 50,000 కంటే ఎక్కువ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉంటే వరుసగా రూ.1300, రూ.1300,రూ.1000 వరకు వసూలు చేస్తున్నాయి. ► కాగా నవంబర్ నెల ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం..అక్టోబర్ 2021తో పోలిస్తే క్రెడిట్ కార్డ్‌ల సంఖ్య 1.84 శాతం పెరిగింది.గతేడాది అక్టోబర్ 2 శాతం,సెప్టెంబర్‌లో 1.7 శాతం పెరిగింది. చదవండి: క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు అలర్ట్..! వచ్చే ఏడాది నుంచి మారనున్న రూల్స్..! -
నిరుపేదను ఆదుకోరూ..!
భూదాన్‌పోచంపల్లి(భువనగిరి) : కలిసిరాని వ్యాపారంతో ఆర్థిక పరిస్థితులు కుంగదీశాయి.. మరోవైపు వెంటాడిన అప్పులు చేనేత కార్మికుడి గుండె ఆగేలా చేశాయి. ఇంటి యజమాని చనిపోవడంతో ఇద్దరు పిల్లల భవిష్యత్ కళ్లముందు కదలాడుతుంటే కడు దుఃఖంతో బతుకీడుతున్న చేనేత కార్మికురాలి ధీనగాథ ఇది.. మండలకేంద్రానికి చెందిన చేనేత కార్మికుడైన జెల్ల కిరణ్(38) మగ్గం నేసి కుటుంబాన్ని పోషించుకునేది. ఆయనకు భార్య చందన, కుమార్తె అనూష(11), అజయ్‌స్వామి(8) ఉన్నారు. గతంలో పోచంపల్లిలో చేనేత పరిశ్రమ సంక్షోభంలో ఉన్న సమయంలో నల్లగొండ జిల్లా చర్లపల్లికి వెళ్లి అక్కడ అప్పులు చేసి మరమగ్గాలపై తయారైన వస్త్రాన్ని బ్లీచింగ్ చేయడానికి అవసరమైన యంత్ర సామగ్రిని కొనుగోలు చేశాడు. కాని ఆ వ్యాపారం కలిసి రాక అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. తిరిగి గత ఏడాది పోచంపల్లికి వచ్చి భార్య, భర్తలు కలిసి కూలీ మగ్గం నేస్తూ పొట్టపోసుకుంటున్నారు. వేధించిన అప్పులు.. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఇటీవల వేధింపులు ఎక్కువయ్యాయి. అప్పులు ఇచ్చిన వారు ఇతనిపై చేయి కూడా చేసుకున్నారు. దాంతో తీవ్ర మనోవ్యధకు గురైన జెల్ల కిరణ్ ఈ నెల 3న ఇంట్లో మగ్గం నేస్తూనే గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. దయనీయస్థితిలో అంతిమ సంస్కారాలు... ఇతనికి సొంత ఇల్లు లేదు. మండల కేంద్రంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. సదరు ఇంటి యజమాని మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకురావొద్దని చెప్పడంతో రెండు గంటల పాటు రోడ్డుపైనే శవాన్ని ఉంచారు. చివరకు బంధువులకు చెందిన ఖాళీ స్థలంలో టెంట్‌వేసుకొని అక్కడే చాలా ధీనస్థితిలో అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేసుకున్నారు. దహన సంస్కారాలైతే పూర్తయ్యాయి కాని, ఆ తరువాత తాను, పిల్లలతో ఎక్కడ ఉండాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. చివరకు మండల కేంద్రానికి చెందిన కర్నాటి బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి, తమ కేవీటీ స్టోర్ట్స్ క్లబ్ భవనంలో తాత్కాలికంగా తలదాచుకోవడానికి చోటు ఇచ్చాడు. వెక్కిరిస్తున్న కడు పేదరికం, భర్త మరణం, పిల్లల భవిష్యత్ వీటినంటిని దిగమింగుకొంటుంది చందన. అయితే కొందరు దాతలు ముందుకు వచ్చి బియ్యం, సరుకులు, నగదు రూపంలో సహాయాన్ని అందజేశారు. నిరుపేద జెల్ల చందన కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు చేనేత నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఎవరైనా దాతలు ఆపన్నహస్తం అందించాలంటే ఎస్బీఐ బ్యాంకు ఖాతా నంబర్ (నల్లగొండ మైత్రి ఉమెన్స్ కాలేజ్ బ్రాంచ్)62296665320 ఆర్థిక సహాయాన్ని అందించాలని బాధితురాలు వేడుకుంటుంది. -
ప్రాజెక్ట్‌లపై చర్చకు సిద్ధం
నీటి విడుదల షెడ్యూల్ తప్పితే సీఈ ఆఫీస్‌పై దాడి టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు టవర్‌సర్కిల్ : ప్రాజెక్టులపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు టీఆర్ఎస్ నాయకుల సవాల్‌కు ప్రతిసవాల్ విసిరారు. నగరంలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఇచ్చిన ప్రాజెక్ట్‌లపై చర్చకు సవాల్‌కు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రెండేళ్లుగా ఏయే గ్రామాలకు సాగునీరందించారో నిరూపించాలన్నారు. తనకు మతిభ్రమించిందనడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సారెస్పీలో 25 టీఎంసీల నీరున్నప్పుడే ఆయకట్టు చివర భూములకు ఐదు దఫాలుగా నీరందింపజేసిన ఘనత టీడీపీకే దక్కిందన్నారు. 50 టీఎంసీల నీరు నిల్వ ఉన్నా సాగునీరందించలేని అసమర్థులు అధికార పక్షం నాయకులు అని విమర్శించారు. ఈద, దాసరిలకు చేతనైతే చివరి భూములకు నీరందించాలని సవాలు విసిరారు. తనపై ఇప్పటి వరకు 26 కేసులున్నాయని, ఎస్సారెస్పీకి సంబంధించినవే 12 కేసులు అని పేర్కొన్నారు. ఎస్సారెస్పీ నీటిని షెడ్యూల్ ప్రకారం విడుదల చేయకపోతే సీఈ కార్యాలయంపై దాడి చేయకతప్పదని హెచ్చరించారు. ఎల్లంపల్లి నీటి తరలింపును అడ్డుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. గంట రాములు, కళ్యాడపు ఆగయ్య, దామెర సత్యం, సదానందం, పుట్ట నరేందర్, గట్టు యాదవ్, బాలాగౌడ్, జగన్‌గౌడ్, గాజె రమేశ్, తీట్ల ఈశ్వరి, కమలాకర్, సలీం, రమేశ్, రాజమల్లయ్య, అజయ్‌రెడ్డి పాల్గొన్నారు.