Credit Card Late Fee: Amount Charged by ICICI, HDFC, SBI, Axis Bank - Sakshi
Sakshi News home page

క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు శుభవార్త!

Published Thu, Jan 13 2022 4:06 PM | Last Updated on Thu, Jan 13 2022 5:11 PM

Amount Charged By Hdfc Bank Sbi Card Icici Bank Axis - Sakshi

క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు శుభవార్త. గతేడాది ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా ప్రముఖ ప్రైవేట్‌ బ్యాంకులు క్రెడిట్‌ కార్డులపై విధిస్తున్న ఛార్జీలను సవరించనున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఛార్జీలను ఫిబ్రవరి 10 నుంచి సవరించిన ఛార్జీలను అమల్లోకి తీసుకొని రానుంది. 

క్రెడిట్ కార్డ్ హోల్డర్లు క్యాష్‌ అడ్వాన్స్‌ ఫీజ్‌(క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించినందుకు బ్యాంక్ విధించే ఛార్జ్)లను సవరించింది. వాస్తవానికి అన్నీబ్యాంకులు క్రెడిట్‌కార్డులపై జరిపే లావాదేవీలపై 2.50 శాతం మొత్తాన్ని వసూలు చేస్తాయి. కానీ ఇప్పుడు ఆ ఛార్జీలను సవరించి 2శాతం మాత్రమే వసూలు చేయనున్నాయి. బ్యాంక్ ఇప్పుడు కనిష్టంగా రూ. 500 నుంచి క్రెడిట్‌ కార్డులపై 2శాతం ఛార్జీలను వసూలు చేయనున్నాయి.   

ఐసీఐసీ బ్యాంక్ ఎమరాల్డ్ క్రెడిట్ కార్డ్ మినహా అన్ని క్రెడిట్ కార్డ్‌లకు ఆలస్య చెల్లింపు ఛార్జీలను బ్యాంక్ సవరించనున్నాయి. కెడ్రిట్‌ కార్డ్‌లపై చెల్లించాల్సిన అవుట్‌ స్టాండింగ్‌ అమౌంట్‌ రూ.100 కంటే తక్కువ ఉంటే బ్యాంకులు అదనపు ఛార్జీలు విధించలేవు.మీరు చెల్లించాల్సిన మొత్తం ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు అవుట్‌ స్టాండింగ్‌ అమౌంట్‌ రూ.50,000 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే బ్యాంకులు గరిష్టంగా రూ.1200 వసూలు చేస్తాయి. 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్లు రూ. 50,000 కంటే ఎక్కువ అవుట్‌ స్టాండింగ్‌ అమౌంట్‌ ఉంటే వరుసగా రూ.1300, రూ.1300,రూ.1000 వరకు వసూలు చేస్తున్నాయి.

► కాగా నవంబర్ నెల ఆర్బీఐ రిపోర్ట్‌ ప్రకారం..అక్టోబర్ 2021తో పోలిస్తే క్రెడిట్ కార్డ్‌ల సంఖ్య 1.84 శాతం పెరిగింది.గతేడాది అక్టోబర్ 2 శాతం,సెప్టెంబర్లో 1.7 శాతం పెరిగింది.

చదవండి: క్రెడిట్‌, డెబిట్‌ కార్డు యూజర్లకు అలర్ట్‌..! వచ్చే ఏడాది నుంచి మారనున్న రూల్స్‌..!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement