ఆర్బీఐ ఆంక్షల కారణంగా సంక్షోభంలో కూరుకుపోయిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బోర్డు నుంచి వైదొలిగేందుకు సిద్ధమైన ఇద్దరు స్వతంత్ర డైరెక్టర్లు రాజీనామా చేసేశారు.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బోర్డు నుంచి డైరెక్టర్లు షింజినీ కుమార్, మంజు అగర్వాల్ వైదొలిగినట్లుగా తెలిసింది. దీంతో ప్రస్తుతం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బోర్డులో అరవింద్ కుమార్ జైన్, పంకజ్ వైష్, రమేష్ అభిషేక్ అనే ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లు మాత్రమే మిగిలారు.
షింజినీ కుమార్ గతంలో సిటీ బ్యాంక్, పీడబ్ల్యూసీ ఇండియా, బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ వంటి సంస్థల్లో సీనియర్ పదవులను నిర్వహించారు. మంజు అగర్వాల్ ఎస్‌బీఐలో 34 ఏళ్లపాటు పనిచేశారు. అక్కడ ఆమె చివరి అసైన్‌మెంట్ డిప్యూటీ ఎండీ.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బోర్డులో ఇప్పుడు మిగిలిన ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లలో అరవింద్ కుమార్ జైన్ మాజీ పంజాబ్ & సింద్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. పంకజ్ వైష్ యాక్సెంచర్ మాజీ ఎండీ కాగా రమేష్ అభిషేక్ డీపీఐఐటీ మాజీ కార్యదర్శి.
ఇదీ చదవండి: ఆ జీతమే శాపమైందా.. దిక్కుతోచని పేటీఎం ఉద్యోగులు
Comments
Please login to add a commentAdd a comment