board
-
పోర్షే కారు కేసు: ‘నిందితుడిని మేజర్‌గా పరిగణించండి’
ముంబై: పుణెలో సంచలనం రేపిన పోర్షే కారు రోడ్డు ప్రమాదం ఘటన పూర్తి నివేదికను పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్టు(జేజేబీ)కి అందజేశారు. పూర్తిగా విచారించేందుకు నిందితుడిని మేజర్‌గా పరిగణించాలని పోలీసులు గతంలో జేజేబీలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తమ అభ్యర్థనకు మద్దతుగా కేసులోని పూర్తి వివరాలు, సాక్ష్యాధారాల నివేదికను క్రైం బ్రాంచ్ పోలీసులు జేజేబీకి అందజేశారు. చదవండి: రీల్‌ను మించిన రియల్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఇవేం ట్విస్టులు బాబోయ్!‘‘ రోడ్డు ప్రమాదం కేసుకు సంబంధించి అన్ని సాక్ష్యాధారాలను జేజేబీకి సమర్పించాం. ఈ రోడ్డు ప్రమాదంలో మైనర్ బాలుడే కీలకంగా ఉన్నాడు. రోడ్డు ప్రమాదం జరిగిన రోజు( మే 19) సాయంత్రం నుంచి ప్రమాదం జరిగే సమయంలో అన్ని సాక్ష్యాలు సేకరించాం. ప్రమాదానికి సంబంధించి ప్రత్యక్ష సాక్ష్యుల వద్ద స్టేట్మెంట్ తీసుకున్నాం. మైనర్ బాలుడు కారు నడిపినట్లు ప్రత్యక్ష సాక్షి చూశాడు. విచారణ సమయంలో సీసీటీవీ ఫుటేజీ పరిశీలించాం. కోసీ రెస్టారెంట్, బ్లాక్ క్లబ్ రెస్టారెంట్లో మద్యం సేవించినట్లు గుర్తించాము. ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మరణానికి కారణం మైనర్ బాలుడే. ఇలా.. మైనర్ బాలుడికి సంబంధించి పూర్తి వివరాలు జేజేబీకి అందించాం’’ అని క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపారు. నిందితుడిని ఇప్పటికైనా మేజర్‌గా పరిగణించి విచారించేందుకు సహకరిచాలని జేజేబీని క్రైం బ్రాంచ్ అధికారి కోరారు.ఈ కేసులో మైనర్ బాలుడి బ్లడ్ శాంపిళ్లు తారుమారు చేయడానికి అతని తల్లిదండ్రులు, సాసూన్ హాస్పిటల్ డాక్టర్ల సాయం తీసుకున్నారు. దీంలో విచారణలో వారి నిర్వాకం బయటపడటంతో పోలీసులు అరెస్ట్ చేయగా జైలులో ఉన్నారు. బ్లడ్ శాంపిళ్లను తారుమారు చేయడానికి ప్రయత్నించిన మైనర్ బాలుడి తండ్రికి, డాక్టర్లకు మధ్యవర్తులుగా పనిచేసిన మరో ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి: పుణె పోర్షే కేసు: ‘ నాకేం గుర్తు లేదు.. అప్పడు తాగి ఉన్నా..!’ -
రైల్వే స్టేషన్లలోని బోర్డులకు పసుపు రంగు ఎందుకు?
భారతీయ రైల్వే.. ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైలు నెట్వర్క్ కలిగివుంది భారతీయ రైళ్లలో ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణిస్తుంటారు. అలా రైలులో ప్రయాణిస్తున్నప్పుడు పలు రైల్వే స్టేషన్లలో పసుపు రంగు బోర్డులు మనకు కనిపిస్తాయి. వాటిపై ఆ రైల్వే స్టేషన్ పేరు, సముద్ర మట్టానికి అది ఎంత ఎత్తులో ఉన్నదీ రాసివుంటుంది. అయితే రైల్వే సైన్ బోర్డులకు పసుపు రంగునే ఎందుకు వేస్తారో తెలుసా? దీని వెనుక గల కారణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పసుపు రంగు ప్రత్యేకత ఏమిటంటే అది చాలా దూరం నుంచి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. రైలు స్టేషన్‌కు చేరుకోకముందే డ్రైవర్ దూరం నుండి పసుపు రంగును బోర్డును చూడగలుగుతాడు. తద్వారా అతనికి స్టేషన్ రాబోతున్నదని తెలుస్తుంది. ఇలా స్టేషన్ బోర్డు చూసిన తర్వాత రైలు డ్రైవర్లు మరింత అప్రమత్తంగా ఉంటారు. పసుపు రంగు అనేది సూర్యకాంతితో అనుసంధానమై ఉంటుంది. ఈ రంగును ఇతర రంగులతో పోలిస్తే ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది. ఈ రంగు చూపరుల మనసుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. దీనికి తోడు పసుపురంగు బోర్డుపై నలుపు రంగులో రాసే అక్షరాలు దూరం నుండి స్పష్టంగా కనిపిస్తాయి. ఇది కళ్లకు ఒత్తిడిని కూడా కలిగించదు. ఇదేవిధంగా విద్యాసంస్థల బస్సుల కూడా పసుపు రంగులో ఉండటాన్ని గమనించే ఉంటాం. దీనికి కారణం దూరం నుండి ఈ రంగు కనిపించడం. దీంతో ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తారు. రైలు లోకో పైలట్‌కు స్టేషన్‌కు సంబంధించిన పసుపురంగు బోర్డు కనిపించగానే హారన్ మోగిస్తాడు. దీంతో రైలులోని ప్రయాణికులు కూడా స్టేషన్ రాబోతున్న విషయాన్ని తెలుసుకోగలుగుతారు. -
టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు.. రమణ దీక్షితులుపై వేటు
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో జరిగింది. ఈ సమావేశంలో బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం అనంతరం చైర్మన్ ఈ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ఇక నుంచి ప్రతి ఏటా ఫిబ్రవరి 24న తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆరు రోజుల క్రితం రమణదీక్షితులు నీచాతినీచమైన ఆరోపణలు చేశారని, టీటీడీ అధికారులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, అహోబిలం మఠం, టీటీడీ జీయర్లపై నిరాధార నిందలు వేశారని, దీంతో రమణ దీక్షితులును ఉద్యోగం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. కాగా, దేవస్థానం ఉద్యోగులకు బోర్డు శుభవార్త చెప్పింది. 4736 ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, 4200 కార్పొరేషన్ ఉద్యోగులతో కలిపి 9వేల మందికి జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. టీటీడీ పాలకమండలి నిర్ణయాలు.. నడకదారిలో గాలిగోపురం, ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నిత్య సంకీర్తన అర్చన కార్యక్రమం నిర్వహణకు నిర్ణయం తాళ్లపాకలో అన్నమయ్య కళామందిరం నిర్మాణం తిరుమల పెద్ద జీయర్‌స్వామి అనుమతి మేరకు, ద్వారపాలకులు అయినా జయవిజయలకు బంగారు తాపడం రూ.4 కోట్లతో తాళిబొట్లు తయారికి అంగీకారం పీఠాధిపతులు సదస్సులో సూచించిన సూచనలు ఆమోదం వడమాలపేట వద్ద టీటీడీ ఉద్యోగులకు కేటాయించే స్థలానికి రూ.8.16 కోట్లు తిరుచానూరు పద్మావతి అమ్మవాతి ఆలయాని విద్యుత్ అలంకరణలకు అమోదం భక్తుల సౌఖర్యార్థం శాశ్వత గోశాలకు బోర్డు మెంబర్ విరాళం ఎక్కవ సంఖ్యలో లడ్డు తయారికి సూపర్వైజర్ పోస్టుల కోసం ప్రభుత్వానికి లేఖ పాపవునాశానం వద్ద 682 మోటర్ పంపు సెట్లకు 3.18 కోట్లు ఆమోదం ఎంఏమ్ఎస్ సేవలు మూడు సంవత్సరాలు పోడొగింపు 1700 సంవత్సరాల చరిత్ర ఉన్న తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆలయానికి రూ.50 లక్షలు మంజూరు అలిపిరి , గాలిగోపురం నరసింహ స్వామి ఆలయం వద్ద ఉన్న ముగ్గు బావి ఆధునీకరణ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంచాలని నిర్ణయం బాలబాలికల్లో భక్తి పెంపొందించడానికి 99 లక్షలు పుస్తాల ముద్రణకు స్విమ్స్‌లో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వారికి ఉచిత వైద్యం టీటీడీలో ఉన్న కాంట్రాక్టు, ఒఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు క్యాంటీన్లో రూ.10కే భోజనం అన్నప్రసాద కేంద్రం సూపర్ వైజర్ పోస్టుల మంజూరు కోసం ప్రభుత్వానికి లేఖ ఇదీ చదవండి.. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం -
ఎయిర్‌పోర్టు భద్రతా వలయాన్ని దాటి.. టిక్కెట్ లేకుండా ఫ్లైట్ ఎక్కి..
అమెరికాలోని ఓ మహిళ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ కన్నుగప్పి టిక్కెట్ లేకుండా ఫ్లైట్ ఎక్కింది. ఈ నెల ప్రారంభంలో నాష్విల్లే విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ మహిళ ప్రతీ సెక్యూరిటీ చెక్‌పాయింట్‌ను దాటుకుని, బోర్డింగ్ పాస్, గుర్తింపు కార్డు లేకుండా లాస్ ఏంజెల్స్‌కు వెళ్లేందుకు అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఎక్కింది. ‘న్యూయార్క్ పోస్ట్’ అందించిన వివరాల ప్రకారం ఆ మహిళా ప్రయాణికురాలు నాష్విల్లే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (టీఎస్ఏ) స్క్రీనింగ్ లైన్‌లోని మానవరహిత ప్రాంతంలో అడ్డంకిని దాటారు. ఇక్కడ ప్రయాణీకులు తమ గుర్తింపును చూపించవలసి ఉంటుంది. దీనిపై విమానాశ్రయ అధికారులు విచారణ ప్రారంభించారు. ఫిబ్రవరి 7న నాష్విల్లే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ చెక్‌పాయింట్‌లో ఆ ప్రయాణికురాలితో పాటు ఆమె క్యారీ ఆన్ బ్యాగేజీని ఫ్లైట్ ఎక్కే ముందు చెక్ చేసినట్లు నిర్ధారణ అయ్యింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఈ ఉదంతంలో తమ పొరపాటును అంగీకరించింది. ఐదు గంటల తరువాత ఆమె టిక్కెట్ లేకుండా ప్రయాణించినట్లు గుర్తించింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్- 1393 ఫిబ్రవరి 7న లాస్ ఏంజిల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్న వెంటనే ఆ మహిళా ప్రయాణీకురాలిని ఎఫ్‌బీఐ అదుపులోకి తీసుకుని, విచారణ మొదలుపెట్టింది. ఆమెపై ఇంకా కేసు నమోదు కాలేదని, విచారణ కొనసాగుతోందని ఏజెన్సీ తెలిపింది. -
పేటీఎంలో మరో కీలక పరిణామం..
ఆర్బీఐ ఆంక్షల కారణంగా సంక్షోభంలో కూరుకుపోయిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బోర్డు నుంచి వైదొలిగేందుకు సిద్ధమైన ఇద్దరు స్వతంత్ర డైరెక్టర్లు రాజీనామా చేసేశారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బోర్డు నుంచి డైరెక్టర్లు షింజినీ కుమార్, మంజు అగర్వాల్ వైదొలిగినట్లుగా తెలిసింది. దీంతో ప్రస్తుతం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బోర్డులో అరవింద్ కుమార్ జైన్, పంకజ్ వైష్, రమేష్ అభిషేక్ అనే ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లు మాత్రమే మిగిలారు. షింజినీ కుమార్ గతంలో సిటీ బ్యాంక్, పీడబ్ల్యూసీ ఇండియా, బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ వంటి సంస్థల్లో సీనియర్ పదవులను నిర్వహించారు. మంజు అగర్వాల్ ఎస్బీఐలో 34 ఏళ్లపాటు పనిచేశారు. అక్కడ ఆమె చివరి అసైన్మెంట్ డిప్యూటీ ఎండీ. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బోర్డులో ఇప్పుడు మిగిలిన ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లలో అరవింద్ కుమార్ జైన్ మాజీ పంజాబ్ & సింద్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. పంకజ్ వైష్ యాక్సెంచర్ మాజీ ఎండీ కాగా రమేష్ అభిషేక్ డీపీఐఐటీ మాజీ కార్యదర్శి. ఇదీ చదవండి: ఆ జీతమే శాపమైందా.. దిక్కుతోచని పేటీఎం ఉద్యోగులు -
పాన్ షాప్ దగ్గర రాజకీయ ముచ్చట్లు.. విసుగెత్తిన ఓనర్ ఏం చేశాడంటే..
రాయ్‌పూర్: ఎన్నికలు వచ్చాయంటే చాలు ఊళ్లలోని టీ కొట్లు, పాన్ షాప్‌ల దగ్గర జనం రాజకీయ ముచ్చట్లు పెడుతుంటారు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు.. ఎందుకు గెలుస్తారు.. ఏ పార్టీ అధికారంలోని వస్తుంది.. ఇలా చర్చోపచర్చలు చేస్తుంటారు. ఇవి ఒక్కోసారి శ్రుతి మించి ఘర్షణలు, గొడవలకు దారి తీస్తుంటాయి. ఛత్తీస్‌గడ్‌లోని ఓ పాన్ షాప్ వద్ద కూడా జనం ఇలాగే చేస్తుండటంతో విసుగెత్తిపోయిన ఆ షాప్ నిర్వాహకుడు ఏం చేశాడంటే.. డిసెంబర్ 3 వరకు ఆగండి.. ఛత్తీస్‌గఢ్‌లోని మారుమూల ముంగేలి జిల్లాలోని ఓ ఊరిలో పాన్, టీ విక్రయించే చిన్నపాటి దుకాణంలో ఓ బోర్డు దర్శనమిస్తోంది. ‘డిసెంబర్ 3 వరకు ఆగండి. ఇక్కడ రాజకీయాల గురించి చర్చలు పెట్టి నా సమయాన్ని వృధా చేయకండి.. మీ సమయాన్ని చేసుకోకండి’ అని ఆ బోర్డులో రాసిఉంది. ఇక్కడికి వచ్చే జనం రాజకీయాల గురించి చర్చిస్తున్నారని, పార్టీలవారీగా విడిపోయి వాదనలకు దిగుతున్నారని పాన్ షాప్ నిర్వహకుడు మహావీర్ సింగ్ ఠాకూర్ చెబుతున్నారు. వీరి వాదనలు శ్రుతి మించి తరచుగా గొడవలు జరుగుతుండటంతో తన షాప్ వద్ద రాజకీయ చర్చలు వద్దని బోర్డును పెట్టినట్లు పేర్కొన్నారు. దీని వల్ల వ్యాపారం తగ్గినా పరవాలేదని ఆయన చెబుతున్నారు. బోర్డు పెట్టినప్పటి నుంచి అక్కడి వచ్చే జనంలో మార్పు వచ్చిందని, రాజకీయ చర్చలు తగ్గుముఖం పట్టాయని ఠాకూర్ తెలిపారు. కాగా ముంగేలి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. కాంగ్రెస్‌కు చెందిన సంజీత్ బంజారే, మాజీ మంత్రి బీజేపీ అభ్యర్థి పున్నూలాల్ మోహ్లేల మధ్య ఇక్కడ తీవ్ర పోటీ ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 7, 17 తేదీల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 3న మిగిలిన నాలుగు రాష్ట్రాలతోపాటు ఓట్ల లెక్కింపు జరగనుంది. -
ఆర్బీఐ సంచలన నిర్ణయం.. మరో బ్యాంకుపై చర్యలు
'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI) గత కొన్ని రోజులుగా నియమాలను ఉల్లంఘించిన బ్యాంకుల మీద కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కొన్ని బ్యాంకుల లైసెన్సులు రద్దు చేసింది, మరి కొన్ని బ్యాంకులకు భారీ జరిమానా విధించింది. కానీ ఇటీవల ఆర్బీఐ 'అభ్యుదయ కోఆపరేటివ్ బ్యాంకు'పై గట్టి చర్యలు తీసుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ చూద్దాం.. బ్యాంకుల పనితీరుపై నిఘాపెట్టిన ఆర్బీఐ.. సరైన పాలన లేని కారణంగా, ముంబై ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అభ్యుదయ కోఆపరేటివ్ బ్యాంకు బోర్డును తాత్కాలికంగా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రభావం కస్టమర్ల మీద ఏ మాత్రం ఉండదని వెల్లడించింది. అభ్యుదయ కోఆపరేటివ్ బ్యాంకుపై ఆర్బీఐ జారీ చేసిన ఈ ఉత్తర్వులు ఏడాది పాటు అమలులో ఉంటాయి. కానీ బ్యాంకింగ్ కార్యకలాపాల మీద అటువంటి ఆంక్షలు విధించలేదు. ఈ సమయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ జనరల్ మేనేజర్ 'సత్య ప్రకాష్ పాఠక్'ను అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. బ్యాంకింగ్ కార్యకలాపాల మీద ఎటువంటి ఆంక్షలు లేకపోవడం వల్ల రోజువారీ ట్రాన్సక్షన్స్‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలుస్తోంది. కాబట్టి బ్యాంక్ కస్టమర్లకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 సెక్షన్ 56, సెక్షన్ 36 AAA కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. అభ్యుదయ కోఆపరేటివ్ బ్యాంకుపై ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. అడ్మినిస్ట్రేటర్‌కు సలహాలు అందించేందుకు ఆర్బీఐ ఒక కమిటీని నియమించింది. ఇందులో వెంకటేష్ హెగ్డే, ఎస్బీఐ మాజీ జనరల్ మేనేజర్, మహేంద్ర ఛాజెడ్, సుహాస్ గోఖలే వంటి బ్యాంక్ అధికారులు, చార్టర్డ్ అకౌంటెంట్లు ఉన్నారు. అభ్యుదయ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ సందీప్ ఘండాత్ మాట్లాడుతూ.. మా బ్యాంక్‌కు గత రెండు సంవత్సరాల నుంచి ఆర్బీఐ నియమించిన అదనపు డైరెక్టర్ (రాజేంద్ర కుమార్) ఉన్నారని, ఆయన సెంట్రల్ బ్యాంక్‌లో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారని వెల్లడించారు. అంతే కాకుండా ఆయనతో 29న బ్యాంక్ అధికారుల సమావేశం ఉంది, అంతలోపే ఆర్బీఐ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ప్రపంచంలో యంగెస్ట్ బిలియనీర్స్ వీరే.. ఒక్కొక్కరి ఆస్తి ఎంతంటే? గత రెండు సంవత్సరాల్లో సహకార బ్యాంకు మొండి బకాయిలను రూ.1,550 కోట్ల నుంచి రూ.1,200 కోట్లకు తగ్గించగలిగిందని, బ్యాంకు మెరుగుపడుతున్న సమయంలో ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం ధైర్యాన్ని దెబ్బతీసినట్లు వెల్లడించారు. అభ్యుదయ కోఆపరేటివ్ బ్యాంకుకు 109 బ్రాంచులు, 113 ఏటీఎంలు ఉన్నాయి. 2022 మార్చి నాటికి బ్యాంక్ డిపాజిట్లు రూ.10,838.07 కోట్లు కాగా.. రుణాల విలువ రూ. 6,654.37 కోట్లుగా ఉన్నాయి. ఈ బ్యాంక్ మహారాష్ట్రలో ,మాత్రమే కాకుండా కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా సేవలను అందిస్తోంది. -
రైల్వే ఉద్యోగులకు దీపావళి కానుక
రైల్వే ఉద్యోగులు దీపావళి కానుక అందుకోనున్నారు. ఉద్యోగుల కరువు భత్యాన్ని నాలుగు శాతం పెంచుతున్నట్లు రైల్వే బోర్డు ప్రకటించింది. దీంతో రైల్వే కార్మికుల డియర్నెస్ అలవెన్స్ బేసిక్ జీతంలో 46 శాతానికి పెరగనుంది. గతంలో ఉద్యోగులు ప్రాథమిక వేతనంలో 42 శాతం డీఏ పొందేవారు. డీఏ పెంపుదల 2023, జూలై ఒకటి నుంచి అమలులోకి రానుంది. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల డీఏను నాలుగు శాతం మేరకు పెంచుతూ కేంద్ర కేబినెట్ ప్రకటించిన ఐదు రోజుల తర్వాత రైల్వే బోర్డు ఈ ప్రకటన చేయడం విశేషం. దీపావళికి ముందు చేసిన ఈ ప్రకటనపై రైల్వే ఉద్యోగుల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. డీఏ అనేది ఉద్యోగుల హక్కు అని అఖిల భారత రైల్వేమెన్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శివగోపాల్ మిశ్రా అన్నారు. దీపావళికి ముందే ఈ చెల్లింపును ప్రకటించడం ఆనందదాయకమన్నారు. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ జనరల్ సెక్రటరీ ఎం. రాఘవయ్య మాట్లాడుతూ వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారంగా రైల్వేశాఖ డీఎ చెల్లిస్తుందని, ద్రవ్యోల్బణాన్ని తటస్థీకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. కాగా కోవిడ్-19 కారణంగా ప్రభుత్వం జనవరి 2020 నుండి జూన్ 2021 వరకు నిలిపివేసిన డీఎను చెల్లించాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్‌లో రెండు రైళ్లు ఢీ.. 20 మంది మృతి -
ముకేశ్ అంబానీ బాటలోనే..
న్యూఢిల్లీ: బిలియనీర్ ముకేశ్ అంబానీ బాటలోనే ఆయన ఇద్దరు కుమారులు, కుమార్తె జీతాలు తీసుకోకుండా బాధ్యతలు నిర్వహించనున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు, కమిటీ సమావేశాలలో పాలుపంచుకుంటున్నందుకు ఆకాశ్, ఈషా, అనంత్ ఫీజులు మాత్రమే పొందనున్నారు. అంతేకాకుండా నికర లాభాల నుంచి కమీషన్ అందుకోను న్నారు.ముకేశ్ సంతానాన్ని బోర్డులో నియమించేందుకు వాటాదారుల అనుమతి కోరుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా ఈ అంశాలను వెల్లడించింది. 66ఏళ్ల అంబానీ 2020–21 ఏడాది నుంచి ఎలాంటి జీతాన్ని అందుకోవడంలేదు. అయితే అంబానీ బంధువులు నిఖిల్, హిటల్ వేతనాలతోపాటు.. ఇతర అలవెన్సులు తదితరాలను పొందుతున్నారు. (వాహన స్క్రాపేజీ పాలసీ: కంపెనీలకు నితిన్ గడ్కరీ కీలక సూచనలు) నీతా అంబానీ తరహాలో 2014లో ముకేశ్ భార్య నీతా అంబానీ ఎంపిక తరహాలోనే కవలలు 31ఏళ్ల ఆకాశ్, ఈషా సహా 28ఏళ్ల అనంత్‌ను ఆర్ఐఎల్ బోర్డులో నియమించనున్నారు. 2022–23లో నీతా అంబానీ రూ. 6 లక్షల సిటింగ్ ఫీజు, రూ. 2 కోట్ల కమీషన్ అందుకున్నట్లు ఆర్ఐఎల్ తాజా వార్షిక నివేదికలో పేర్కొంది. గత నెలలో నిర్వహించిన కంపెనీ వార్షిక సమావేశంలో ఆర్ఐఎల్ బోర్డులోకి ముగ్గురునీ ఎంపిక చేశారు. అయితే ముకేశ్ ఆర్ఐఎల్ చైర్మన్, సీఈవోగా మరో ఐదేళ్లు బాధ్యతలు నిర్వహించనున్నారు. తద్వారా తదుపరితరం నాయకులకు మార్గదర్శకత్వం వహించనున్నారు. కాగా.. ముకేశ్ సంతానాన్ని బోర్డులో నియమించేందుకు వీలుగా ఆర్ఐఎల్ పోస్టల్ బ్యాలట్ ద్వారా వాటాదారుల అనుమతి కోరుతోంది. (సీఈవో సంచలన వ్యాఖ్యలు: ఉద్యోగుల నెత్తిన పిడుగు) -
ఆమె చేతిలో ‘భర్త కావాలి’ బోర్డు.. 30 నిముషాల్లో మారిన సీన్!
ఎవరైనాసరే తనకొక జీవిత భాగస్వామి కావాలని, సుఖదుఃఖాల్లో తోడుగా నిలవాలని కోరుకుంటారు. అయితే అందరికీ తగిన జీవిత భాగస్వామి లభించడం అంత సులభంకాదు. అనువైన జీవిత భాగస్వామిని దక్కించుకునేందుకు కొంత శ్రమించాల్సి వస్తుంది. ఇందుకోసం కొందరు డేటింగ్ యాప్‌లను ఆశ్రయిస్తుంటారు. అయితే ఒక యువతి దీనికి భిన్నంగా కొత్త పద్ధతిని అనుసరించింది. అమెరికాలో రెండేళ్లుగా సింగిల్‌గా ఉంటున్న బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ కరోలినా గీట్స్ భర్తను ఎన్నుకునేందుకు కొత్తగా ప్రయత్నించింది. కరోలీనాకు మంచి భార్త కావాలట. ఇందుకోసం ఆమె తన చేతులతో ఒక బోర్డు పట్టుకుని రోడ్డుపై నిలుచుంది. ఆ బోర్డుపై ‘భర్త కోసం వెదుకుతున్నాను’ అని రాసివుంది.ఈ బోర్డు పట్టుకుని ఆమె పట్టణంలో తిరుగుతోంది. సోహో పట్టణానికి చెందిన గీట్స్ మీడియాతో మాట్లాడుతూ తాను ఒక సైన్ బోర్టుపై ‘భర్త కోసం వెదుకుతున్నాను’ అని రాసి దానిని పట్టుకుని, పట్టణంలో తిరగాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. టిండర్, హింజ్ లాంటి డేటింగ్ యాప్‌ల ద్వారా కొందరు పురుషులతో స్నేహం చేసి, వాళ్లెవరూ నచ్చక తన టైమ్ వృథా చేసుకున్నానని ఆమె తెలిపింది. అందుకే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొంది. ఆమె పట్టణంలోని రోడ్లపై ఈ బోర్టు పట్టుకుని తిరుగుతుండగా 30 నిముషాల అనంతరం ఒక వ్యక్తి ఆమెకు తారసపడ్డాడు. దీంతో వారు ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. అనంతరం గీట్స్ మీడియాతో మాట్లాడుతూ భర్త కోసం వెదుకుతూ రోడ్డు మీదకు వచ్చిన 30 నిముషాలకు తనకు ఫలితం కనిపించిందని, ఇకపై తాము ఒకరికొకరు తెలుసుకోవాల్సి ఉందని, ఇప్పుడంతా కొత్తగా ఉందని, ఈ పరిచయం ఎక్కడికి దారితీస్తుందో చూడాలని అన్నారు. ఇది కూడా చదవండి: ఇంటి తవ్వకాల్లో పురాతన బాక్సు.. తెరిచి చూడగానే.. -
స్విచ్‌బోర్డ్‌లో రూ. 15 కోట్ల గోల్కొండ వజ్రం
కోల్‌కతా: సత్యజిత్ రే దర్శకత్వంలో 1979లో వచ్చిన ‘జోయ్ బాబా ఫెలూనాథ్’ అనే బెంగాలీ సినిమాలో అత్యంత ఖరీదైన వజ్రం దుర్గామాత అధిష్టించిన సింహం బొమ్మ నోటిలో చాలాకాలం తర్వాత దొరుకుతుంది. మిస్టరీ వీడిపోతుంది. అలాంటి సంఘటనే పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జరిగింది. ఇక్కడ కరెంటు స్విచ్‌బోర్డులో రూ.15 కోట్ల విలువైన 32 క్యారెట్ల బరువైన గోల్కొండ వజ్రం దొరికింది. అసలు విషయమేమి టంటే.. ప్రణబ్ కుమార్ రాయ్ అనే వ్యక్తి వద్ద ఈ వజ్రం ఉండేది. 2002లో దాని నాణ్యత, ధర తెల్సుకునేందుకు ఇంద్రజిత్ తపాదార్ అనే వజ్రాల మధ్యవర్తిని సంప్రదించాడు. 2002 జూన్‌లో ఇంద్రజిత్ మరొకడిని తీసుకొని ప్రణబ్ ఇంటికి వచ్చాడు. వారిద్దరూ కలిసి ప్రణబ్‌ను పిస్తోల్‌తో బెదిరించి వజ్రంతో ఉడాయించారు. బాధితుడి ఫిర్యాదులో పోలీసులు రంగంలోకి దిగారు. ఇంద్రజిత్ ఇంట్లో గాలింపు చేపట్టారు. వజ్రం ఆచూకీ దొరకలేదు. మరోవైపు తనకేమీ తెలియదని ఇంద్రజిత్ బుకాయించాడు. వజ్రం కచి్చతంగా అతడి ఇంట్లోనే ఉంటుందున్న నమ్మకంతో పోలీసులు అన్వేషణ కొనసాగించారు. అయినాదొరకలేదు. చిట్టచివరకు చాలా రోజుల తర్వాత అదే ఇంట్లో మెట్ల కింద కరెంటు స్విచ్‌బోర్డు లోపలున్న చిన్న సొరంగంలో వజ్రం లభ్యమైంది. నిందితుడు ఇంద్రజిత్‌కు ట్రయల్ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. ఇంకోవైపు వజ్రం యజమాని ప్రణబ్ కుమారేనా కాదా అనే దానిపై న్యాయ వివాదం కొనసాగింది. ఆ వజ్రం అసలు సొంతదారు అతడేనని సిటీ సెషన్స్ కోర్టు గతవారం తీర్పునిచి్చంది. వజ్రం రూపురేఖలు మార్చొద్దని, ఇందుకోసం రూ.2 కోట్ల విలువైన బాండ్ సమర్పించాలని ప్రణబ్‌ను ఆదేశించింది. ప్రపంచ ప్రఖ్యాత కోహినూర్, షాజహాన్ వజ్రాలు సైతం గోల్కొండ ప్రాంతానికి చెందినవే. -
ఏఎన్ఎం పోస్టులు 1520
సాక్షి, హైదరాబాద్: వైద్యారోగ్యశాఖలో ఏఎన్ఎం(మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్–ఫిమేల్) పోస్టుల భర్తీకి ప్రకటన జారీ అయ్యింది. మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సభ్యకార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆన్లైన్లోనే దరఖాస్తులు సమర్పించాలి. రాతపరీక్ష ఇంగ్లిష్‌లో ఉంటుంది. పేస్కేల్ రూ. 31,040 నుంచి రూ.92,050 మధ్య ఉంటుంది. బహుళ ఐచ్చిక ఎంపిక విధానంలో రాతపరీక్ష ప్రాతిపదికన ఓఎంఆర్ లేదా కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అయితే ఈ రెండు పద్ధతుల్లో ఏ విధంగా పరీక్ష నిర్వహిస్తారన్న దానిపై త్వరలో వెల్లడిస్తామని గోపీకాంత్‌రెడ్డి తెలిపారు. దరఖాస్తు రుసుము రూ. 500, ప్రాసెసింగ్ ఫీజు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్ తదితర కేటగిరీలకు మినహాయింపు ఉంటుంది. ఇవీ అర్హతలు: అభ్యర్థులు తప్పనిసరిగా మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (ఫిమేల్) ట్రైనింగ్ కోర్సు చేసి ఉండాలి. లేదా ఇంటర్లో మల్టీపర్పస్ హెల్త్ వర్క ర్ (ఫిమేల్) శిక్షణ కోర్సు పాసై ఉండాలి. తెలంగాణ రాష్ట్ర నర్సెస్ అండ్ మిడ్ వైవ్స్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకొని ఉండాలి. నిర్ధారించిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏడాదిపాటు క్లినికల్ ట్రైనింగ్ చేసి ఉండాలి. లేదా గుర్తించిన ఆస్పత్రుల్లో ఏడాది అప్రెంటిషిప్ పూర్తి చేసి ఉండాలి. వారు తెలంగాణ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ చేసుకొని ఉండాలి. ఎవరైనా అభ్యర్థి ఈ అర్హతలకు సమానమైన ఇతర అర్హతలను కలిగి ఉంటే, ఆ విషయాన్ని బోర్డు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీకి రిఫర్ చేస్తారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా బోర్డు తుది నిర్ణయం తీసుకుంటుంది. దరఖాస్తుదారులు 18 – 44 ఏళ్ల మధ్యలో ఉండాలి. వివిధ వర్గాలకు సంబంధించి వారికి ప్రభుత్వం నిర్ణయించిన వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి. పరీక్షలో మార్కులకు గరిష్టంగా 80 పాయింట్లు ఉంటాయి. వైద్యారోగ్యశాఖలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసిన/చేస్తున్న వారికి గరిష్టంగా 20 పాయింట్ల వరకు అదనంగా ఇస్తారు. గిరిజన ప్రాంతాల్లో సేవలు అందించినవారికి ప్రతి 6 నెలలకు 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో అయితే 2 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. కాంట్రాక్టు/ఔట్సోర్సింగ్ అనుభవమున్న వారు ధ్రువీకరణపత్రాన్ని పొందిన తర్వాత ఆ వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. కాంట్రాక్టు/ఔట్సోర్సింగ్ ఏ సేవలు అందించి ఉంటే, ఆ కేటగిరీ పోస్టులకు మాత్రమే పాయింట్లు వర్తింపజేస్తారు. అప్లోడ్ చేయాల్సినవి : అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులో వివరాలు నమో దు చేయడంతోపాటు అవసరమైన పత్రాల సాఫ్ట్ కాపీ (పీడీఎఫ్)లను అప్లోడ్ చేయాలి. ఆధార్ కార్డ్, పదోతరగతి సర్టిఫికెట్, అర్హత సాధించిన కో ర్సులకు చెందిన సర్టిఫికెట్లు ఉండాలి. అనుభవ ధ్రు వీకరణ పత్రం (వర్తిస్తే), స్థానికత గుర్తింపు కోసం 1 నుంచి 7వ తరగతి వరకు చదివిన సర్టిఫికెట్లు లేదా నివాస ధ్రువీకరణపత్రం, ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే కులధ్రువీకరణ పత్రం, బీసీల విషయంలో తాజా నాన్–క్రిమీలేయర్ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ రిజర్వే షన్ కోరేవారు తాజా ఆదాయం, ఆస్తి సర్టిఫికెట్, స్పోర్ట్స్ సర్టిఫికెట్, సదరం నుంచి దివ్యాంగ సర్టిఫికెట్, ఎన్సీసీ ధ్రువీకరణపత్రం వంటివి అవసరాన్ని బట్టి జత చేయాల్సి ఉంటుంది. జోన్లవారీగా స్థానికులకు 95 శాతం రిజర్వేషన్ ఏఎన్ఎం పోస్టులను జోన్లవారీగా భర్తీ చేస్తా రు. ఆయా జోన్ల అభ్యర్ధులకే 95% పోస్టులు కేటా యిస్తారు. మిగతావి ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తారు. జోన్–1 (కాళేశ్వరం)లో ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి,ములుగు జిల్లాలు. జోన్–2 (బాసర)లో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జోన్–3 (రాజన్న)లో కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జోన్–4 (భద్రాద్రి)లో కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్ జోన్–5(యాదాద్రి)లో సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి, జనగాం జోన్–6(చార్మినార్)లో మేడ్చల్ మల్కాజిగి రి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జోన్–7(జోగులాంబ)లో మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగుళాంబ–గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలున్నాయి. మొత్తం పోస్టులు: 1520 (ఫిమేల్) దరఖాస్తులు స్వీకరణ: వచ్చేనెల 25న ఉదయం 10:30 నుంచి దరఖాస్తులకు చివరి తేదీ : సెప్టెంబర్ 19వ తేదీ సాయంత్రం 5:30 వరకు పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ -
69 మంది పదో తరగతి విద్యార్థుల సర్టిఫికేట్లలో ఒకే ఫొటో..
ఒడిశా: సెకంటరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన పదో తరగతి సర్టిఫికేట్లలో 69 మంది విద్యార్థులకు ఒకే ఫొటో వచ్చింది. దీంతో చిన్నారులు ఆందోళనకు గురయ్యారు. కటక్ జిల్లాలోని నిశింతకోహిలీ మండలంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సర్టిఫికేట్లలపై వేరొకరి ఫొటో ఉన్న కారణంగా ఉన్నత విద్య కోసం కాలేజీల్లో అడ్మిషన్లు రద్దవుతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 69 మంది విద్యార్థుల సర్టిఫికేట్లలో వేరొకరి ఫొటో వచ్చింది. అందరి మెమోలపై ఒకరి ఫొటోనే రిపీట్ అయింది. సమ్మేటివ్ అసెస్మెంట్లో తప్పుగా ఉన్న అడ్మిట్ కార్డులు వచ్చినప్పుడే విషయాన్ని పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లామని బాధిత విద్యార్థులు తెలిపారు. ఆ తప్పును రెండో సమ్మేటివ్ అసెస్మెంట్లో సరిదిద్దుతామని పాఠశాల యాజమాన్యం హామీ ఇచ్చినట్లు విద్యార్థులు తెలిపారు. కానీ రెండో సమ్మేటివ్ అసెస్‌మెంట్‌లోనూ అడ్మిట్ కార్డ్‌లో అదే లోపం కనిపించినట్లు విద్యార్థులు తెలిపారు. అడ్మిట్ కార్డులపై తమ ఫొటోలు అతికిస్తే పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతించారని విద్యార్థులు తెలిపారు. మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్లు తీసుకోవడానికి వెళ్లినప్పుడు అందరి మెమోల్లోనూ అదే తప్పు దొర్లినట్లు విద్యార్థులు చెప్పారు. అందరి సర్టిఫికెట్‌పై ఒకటే ఫొటో ముద్రించినట్లు పేర్కొన్నారు. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగానే ఈ తప్పు దొర్లినట్లు ఒడిశా బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ వైస్ ప్రెసిడెంట్ నిహార్ రంజన్ మొహంతి స్పష్టం చేశారు. త్వరలోనే తప్పును సవరించి బాధిత విద్యార్థులకు కొత్త సర్టిఫికేట్లను విడుదల చేస్తామని తెలిపారు. ఇదీ చదవండి: ఏమైందో తెలియదు.. యువకుని చెంప చెల్లుమనిపించింది.. వీడియో వైరల్ -
అన్ని కోర్టుల్లో బోర్డులు ఏర్పాటు చేస్తారేమో!
సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సికింద్రాబాద్ సివిల్ కోర్టు ఆవరణలో సదరు భూమి ప్రభుత్వానిదని పేర్కొంటూ నోటీసు బోర్డు ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించింది. ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో అన్ని కోర్టుల్లోనూ ఇలా బోర్డులు ఏర్పాటు చేస్తారేమో అని ఘాటుగా వ్యాఖ్యానించింది. నోటీసు బోర్డు ఎందుకు ఏర్పాటు చేశారో వచ్చే విచారణ నాటికి తప్పకుండా కౌంటర్ దాఖలు చేయాలని, లేని పక్షంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా కోర్టుకు హాజరై వివరణ ఇచ్చేలా సమన్లు జారీ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూలై 25కు వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయకపోవడంపై అసహనం సికింద్రాబాద్ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి అనుమతి లేకుండా న్యాయస్థానం ఆవరణలో ‘ఈ భూమి ప్రభుత్వానిది’ అంటూ రెవెన్యూ అధికారులు నోటీసు బోర్డు ఏర్పాటు చేశారు. దీనిపై అందిన ఒక లేఖను హైకోర్టు సుమోటో టేకెన్ అప్ రిట్ పిటిషన్‌గా విచారణకు స్వీకరించింది. కాగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీ ధర్మాసనం గురువారం మరోసారి ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున ఏజీపీ మతీన్ వాదనలు వినిపించారు. ఈ సమయంలో సీజే స్పందిస్తూ.. ‘సికింద్రాబాద్ సివిల్ కోర్టు ప్రాంగణంలో నోటీసు బోర్టు ఎవరు ఏర్పాటు చేశారు? వారు రేపు హైకోర్టులో వ్యక్తిగతంగా హాజరుకావాలి. ఇవాళ సివిల్ కోర్టులో ఆ భూములు ప్రభుత్వానికి చెందినవని నోటీసు బోర్డు ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో హైకోర్టు ఆవరణలో కూడా ఈ భూమి ప్రభుత్వానిదేనని నోటీసు బోర్డు ఏర్పాటు చేస్తారు..’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 6న విచారణ సందర్భంగా.. నోటీసు బోర్డు ఏర్పాటుపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ), హైదరాబాద్ కలెక్టర్, సీపీ, మారేడుపల్లి తహసీల్దార్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అయినా వారు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. వచ్చే విచారణ నాటికి తప్పకుండా కౌంటర్ వేయాలని ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేసింది. -
‘AI’ వల్ల ఉద్యోగాలు ఉంటాయా? ఊడతాయా?.. సత్య నాదెళ్ల ఏమన్నారంటే?
కృత్తిమ మేధ ఆధారిత టూల్స్ చాట్‌జీపీటీ, గూగుల్ బార్డ్‌ల వినియోగంతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నాయనే అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. టెక్నాలజీ ఆధారిత నిపుణులతో పాటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు సైతం మానవ వినాశనం కోరే కృత్తిమ మేధస్సు వినియోగాల్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. ఈ తరుణంలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై స్పందించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోతాయంటే ఎవరూ నమ్మలేదు. కానీ ఎప్పుడైతే చాట్‌జీపీటీ, బార్డ్ వంటి టూల్స్ వినియోగంలోకి వచ్చాయో అప్పటి నుంచి అందరూ దీన్ని నమ్మడం మొదలుపెట్టారు. చాట్‌జీపీటీ వల్ల ఏఐ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చింది. దీని వల్ల ఉన్న ఉపయోగాలను పక్కనబెడితే.. వేర్వేరు రంగాలకు చెందిన కోట్లాది మంది ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో సీఎన్‌బీసీ ఇంటర్వ్యూలో సత్యనాదెళ్ల మాట్లాడుతూ.. ఏఐలాంటి అధునాతన టెక్నాలజీ వినియోగం ఉద్యోగాలపై ప్రభావం ఉంటుంది. అలాగే ఉద్యోగాలకు స్థాన భ్రంశం కలుగుతుంది. అదే సాంకేతికత భవిష్యత్తులో కొత్త ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యాన్ని కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని అన్నారు. అంతేకాదు మనుషులు రాసిన కంటెంట్‌ని చదవడం, సవరించడం, ఆమోదించడం వంటి విభాగాలకు కొత్త టెక్నాలజీ అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయా రంగాల్లో పనిచేస్తున్న వారికి ఏఐ’ సంతృప్తిని ఇస్తుంది. కొత్త ఉద్యోగాల్ని సృష్టిస్తుంది. ఉత్పాదకత పెరిగి కంపెనీల ప్రణాళికలతో ఉద్యోగుల జీతాలు పెరుగుతాయని చెప్పారు. చదవండి👉 ఇంట్లో ఇల్లాలు.. 200 కోట్ల ఆస్తికి యజమాని! -
ఆస్టిన్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు
ఆస్టిన్: అమెరికాలోని ఆస్టిన్ నగరంలో తెలుగు కల్చరల్ అసోసియేషన్ (టీసీఏ) నూతన కార్యవర్గం ఏర్పాటయ్యింది. బ్రశీ క్రీక్ కమ్యూనిటీ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో నూతన కార్యావర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా అర్జున్ అనంతుల, ప్రెసిడెంట్ ఎలెక్ట్‌గా పరమేష్ రెడ్డి నంగీ , కార్యదర్శిగా శివ దుర్భాకుల, కోశాధికారిగా మధుకర్ రెడ్డి గంగాడి నియమితులు అయ్యారు. సంయుక్త కార్యదర్శులుగా శైలజ కోమటి ( కల్చరల్), జగన్ మల్కారెడ్డి( ఫైనాన్స్ & స్పాన్సర్షిప్) ,భరత్ పిస్సాయ్(మెంబర్షిప్), గోపాల కృష్ణ అయితాబత్తుల(ఫుడ్ & లాజిస్టిక్స్), చిన్నప్ప కుందూరు(స్పోర్ట్స్), బోర్డు అఫ్ డైరెక్టర్‌గా శ్రీనివాస్ బత్తుల నియమితులయ్యారు. బోర్డు అఫ్ డైరెక్టరులుగా కొనసాగుతున్న రామ్ హనుమంతు , మురళీధర్ వేలూరికి నూతన సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. -
నూతనంగా ఎర్పాటైన ఆటా బోర్డు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) నూతన అధ్యక్షురాలిగా మధు బొమ్మినేని బాధ్యతలు స్వీకరించారు. లాస్ వేగాస్లోని ది మిరాగ్ లో శనివారిం జరిగిన ఆటా బోర్డు మీటింగ్ లో ప్రస్తుత అధ్యక్షులు భువనేశ్ భూజల చేతుల మీదుగా మధు బొమ్మినేని నూతన అధ్య క్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సమావేశానికి యూఎస్ లోని అన్ని ప్రాంతాల నిండి ఆటా డైరెక్టర్లు, సలహాదారులు, మాజీ అధ్యక్షులు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఇతర ప్రతినిధులు హాజరయ్యారు. నార్తు కరోలినా ప్రాంతానికి చెందిన మధు బొమ్మినేని 2004 నిండి ’ఆటా’ లో చురుగ్గా ఉిండడంతో పాటు, ఆటా సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వంటి అనేక పదవుల్లో సేవలందించారు. 2023 జనవరిలో ఆటాలోని 16 బోర్తుఆఫ్ ట్రస్టీ స్థానాలకు ఎన్నికలు జరిగాయ. ఎన్నికైన సభ్యులు నాలుగేండ్లు పాటు పదవిలో కొనసాగుతున్నారు. అనిల్ బొదిరెడ్డి, సన్నిరెడ్డి, కిరణ్ పాశం, కిషోర్ గూడూరు, మహీదర్ ముస్కుల, నర్సిరెడ్డి గడి కొప్పుల, రామకృష్ణారెడ్డి అల, రాజు కక్కెర్ల, సాయి సుధిని, శ్రీకాంత్ గుడిపాటి, నర్సింహారెడ్డి ధ్యాసాని, రఘవీర్ మరిపెద్ది, సాయినాథ్ బోయపల్లి, సతీష్‌రెడ్డి, శ్రీనివాస్ దర్గుల, వినోద్ కోడూరు బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఆటా బోర్డు ఏకగ్రీవంగా జయింత్ చల్లాను కాబోయే ప్రెసిడెంట్‌గా ఎన్నుకుంది. ఆటా బోర్డు 2023, 2024 టర్మ్‌కి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు రామకృష్ణారెడ్డి అల (కార్యదర్శి), సతీష్ రెడ్డి (కోశాధికారి), తిరుపతి రెడ్డి యర్రంరెడ్డి ( జాయింట్ సెక్రటరీ), రవీందర్ గూడూరు (జాయింట్ ట్రెజరర్), హరి ప్రసాద్ రెడ్డి లింగాల (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్)గా ఎన్నికయ్యారు. -
ఆయనకు లేదా బాధ్యత? ముందు గూగుల్ సీఈవోను తొలగించండి: పెల్లుబుకిన ఆగ్రహం
న్యూఢిల్లీ: దిగ్గజ టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోత టెకీలను షాక్‌కు గురిచేస్తుండగా, అటు సోషల్ మీడియాలో బిజినెస్ వర్గాల్లో కూడా తీవ్ర నిరసన వ్యక్త మవుతోంది. ఇప్పటికే దీనిపై కొంతమంది కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ 12 వేలమందిని తొలగించడంపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. దీనికి తోడు యువర్‌డోస్ట్ ఇంజినీరింగ్ డైరెక్టర్ విశాల్ సింగ్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. 12వేల మంది ఉద్యోగులను తొలగించిన గూగుల్ చర్య బయట ఉన్న బాధిత సిబ్బంది మరియు టెక్కీలను దిగ్భ్రాంతికి గురి చేసింది. దీనిపై సోషల్ మీడియాలో స్పందించిన విశాల్ సింగ్ కంపెనీ తాజా పరిస్థితికి సీఈవోగా సుందర్ పిచాయ్ బాధ్యత వహించాలన్నారు. అలాగే కంపెనీ బోర్డు ముందు సీఈవోను తొలగించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యకు ప్రగాఢంగా చింతిస్తున్నానని, కంపెనీ ఈ స్థితికి దారితీసిన నిర్ణయాలకు పూర్తి బాధ్యత వహిస్తానని, ఉద్యోగులకు పంపిన ఇమెయిల్‌లో రాసిన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ గూగుల్‌లో ఎందుకు కొనసాగాలి అని ప్రశ్నించారు. వాస్తవానికి ముందుగా ఆయనే రిజైన్ చేయాలన్నారు. తప్పుడు నిర్ణయాలకు వారే బాధ్యత వహించాలి. కంపెనీ వైఫ్యల్యానికి ఆయనే మూల్యం చెల్లించాలి. సింపుల్‌గా కఠిన నిర్ణయాలకు చింతిస్తున్నాం అని తప్పించుకుంటే సరిపోదు..చివరికి రాజకీయ నాయకులు కూడా ఒక్కోసారి దిగి రాక తప్పదు..రాజీనామా చేయాల్సిందే కదాఅంటూ లింక్డ్ఇన్లో రాశాడు. ఇదే నియమం మైక్రోసాఫ్ట్‌లో సత్య నాదెళ్లకు కూడా వర్తిస్తుందంటూ మండిపడ్డారు. మరోవైపు గత త్రైమాసికంలోనే 17 బిలియన్ డాలర్ల లాభాలను ఆర్జించిన కంపెనీకి ఇది ఆమోదయోగ్యం కాదని ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ (AWU) కంపెనీ నిర్ణయాన్ని విమర్శించింది. దీనిపై టెక్ ఉద్యోగులు సమిష్టిగా పోరాడాలని పిలుపు నిచ్చింది. -
ఎన్డీటీవీ బోర్డు: అదానీ గ్రూప్‌నకు 2 సీట్లు ఆఫర్
న్యూఢిల్లీ: మీడియా సంస్థ ఎన్డీటీవీ బోర్డులో పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ గ్రూప్‌నకు రెండు సీట్లు లభించ నున్నాయి. సంస్థలో 29.18 శాతం వాటాను సొంతం చేసుకున్న నేపథ్యంలో డైరెక్టర్ల బోర్డు రెండు సీట్లను ఆఫర్ చేసినట్లు ఎన్డీటీవీ తాజాగా వెల్లడించింది. అదానీ గ్రూప్ ఇటీవలే మరో 26 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్‌ను చేపట్టింది. తద్వారా పబ్లిక్ వాటాదారుల నుంచి 8.26 శాతం వాటాకు సమానమైన 53 లక్షల షేర్లను పొందింది. ఇదీ చదవండి: StockmarketUpdate కొనసాగుతున్న ఐటీ షేర్ల పతనం: మార్కెట్ ఢమాల్! ఫలితంగా ఎన్డీటీవీలో అదానీ గ్రూప్ వాటా 37.44 శాతానికి ఎగసింది. వెరసి సంస్థ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌ల సంయుక్త వాటా 32.26 శాతాన్ని అధిగమించింది. ఇద్దరు డైరెక్టర్లను నామినేట్ చేసేందుకు వీలుగా అదానీ ఎంటర్ప్రైజెస్ అనుబంధ సంస్థ ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్ ప్రయివేట్ లిమిటెడ్‌ను ఆహ్వానించే ప్రతిపాదనను ఈ నెల 9న డైరెక్టర్ల బోర్డు అనుమతించినట్లు ఎన్డీటీవీ స్టాక్ ఎక్స్చేంజీజలకు సమాచారమిచ్చింది.(గుడ్‌న్యూస్..ఈ ఐటీ కంపెనీలో కొలువులే కొలువులు) తదుపరి ఈ నెల 23న నిర్వహించనున్న బోర్డు సమావేశంలో ప్రతిపాదిత అంశాన్ని చేపట్టనున్నట్లు తెలియజేసింది. కాగా.. ఎన్డీటీవీలో అతిపెద్ద వాటాదారుగా ఆవిర్భవించడంతో చైర్మన్‌ను నియమించేందుకు సైతం అదానీ గ్రూప్ హక్కును పొందినట్లు తెలుస్తోంది. అయితే ఓపెన్ ఆఫర్ తదుపరి అదానీ గ్రూప్ వాటా వివరాలను ఎన్డీటీవీ తాజాగా ఫైలింగ్‌లో స్పష్టం చేయకపోవడం గమనార్హం! (‘క్రోమా’ వింటర్ సీజన్ సేల్..బంపర్ ఆఫర్లు) -
దేశ స్థాయిలో ఎగ్ బోర్డ్ ఏర్పాటు చేయాలి : తెలంగాణ స్టేట్ పౌల్ట్రీ ఫెడరేషన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పౌల్ట్రీ రంగం నష్టాల ఊబి నుంచి గట్టెక్కాలంటే దేశ స్థాయిలో ఎగ్ బోర్డ్ ఏర్పాటు చేయాలని తెలంగాణ స్టేట్ పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి ప్రదీప్ కుమార్ రావు డిమాండ్ చేశారు. అప్పుడే రైతుకు మద్దతు ధర లభిస్తుందని, పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందని చెప్పారు. ‘ఉత్పత్తి వ్యయాలకు తగ్గట్టుగా మాత్రమే గుడ్డు ధర నిర్ణయించాలి. మార్కెట్లో ధర విషయంలో పూర్తిగా బోర్డుదే తుది నిర్ణయం కావాలి. తద్వారా రైతులకు, వినియోగదార్లకు ప్రయోజనం ఉంటుంది. బోర్డుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలి. ప్రభుత్వమే గిడ్డంగులు ఏర్పాటు చేయాలి. లేదా ప్రైవేటు గిడ్డంగులను లీజుకు తీసుకోవాలి. డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరాను కట్టడి చేయాలి. బోర్డు కార్యరూపంలోకి వస్తే కొత్తగా లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుంది. పౌల్ట్రీకి పూర్తిగా వ్యవసాయ రంగ హోదా ఇచ్చి ప్రయోజనాలు కల్పించాలి’ అని వివరించారు. రైతులు ఒక్కో గుడ్డు ఉత్పత్తిపై సగటున 50–60 పైసలు, బ్రాయిలర్‌పై రూ.10–20 నష్టపోతున్నారని తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కాసర్ల మోహన్ రెడ్డి తెలిపారు. నేటి నుంచి పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో.. పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో 22–25 తేదీల్లో ఇక్కడి హైటెక్స్‌లో జరుగనుంది. తొలిరోజు నాలెడ్జ్ డే టెక్నికల్ సెమినార్ నిర్వహిస్తారు. 370 కంపెనీలు స్టాళ్లను ఏర్పాటు చేశాయని ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చక్రధర్ రావు పొట్లూరి తెలిపారు. -
ట్విటర్ డీల్: ఈలాన్ మస్క్ మరో అడుగు ముందుకు
న్యూఢిల్లీ: బిలియనీర్, టెస్లా సీఈవో ఈలాన్ మస్క్, మైక్రో-బ్లాగింగ్ సైట్ ట్విటర్ డీల్‌కు ట్విటర్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 44 బిలియన్ డాలర్ల కొనుగోలు ఒప్పందానికి బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కంపెనీని టేకోవర్ చేయడానికి మస్క్ బిడ్ ఇప్పటిదాకా పెండింగ్ ఉన్న సంగతి తెలిసింది. తాజాగా డీల్‌కు ట్విటర్ బోర్డు ఏకగ్రీవంగా ఓటు వేయడంతో మెర్జర్ డీల్‌కు మరో అడుగు ముందుకు పడింది. ఇకపై దీనికి వాటాదారుల ఆమోదం కావాల్సి ఉంది. ప్రత్యేక స్టాక్‌హోల్డర్ల సమావేశంలో విలీన ఒప్పందాన్ని ఆమోదించాలా అనేదానిపై ఇన్వెస్టర్లు ఓటు వేయ నున్నారు. షేర్హోల్డర్లు తమ స్టాక్‌లోని ప్రతి షేరుకు 54.20డాలర్ల నగదుకు అర్హులు. ఇది మస్క్ తన తొమ్మిది శాతం వాటా కొనుగోలుకు చివరి రోజు ట్రేడింగ్ విలువను పరగణనలోకి తీసుకుంటారు. ఈ మేరకు ట్విటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఫైలింగ్ సమాచారాన్ని టెక్ క్రంచ్ వెల్లడించింది. నష్ట పరిహారానికి అంగీకరిస్తూనే విలీన ఒప్పందానికి వాటాదారులు ఓటు వేయాలని ట్విటర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు దాదాపు 5 శాతం నకిలీ ఖాతాలు ఉన్నాయని వాదిస్తున్న మస్క్ ఇటీవల ఖతార్ ఎకనామిక్ ఫోరమ్‌లో ఒక ఇంటర్వ్యూలో అదే విషయాన్ని మరోసారి నొక్కి చెప్పారు. ఇందులో చాలా ముఖ్యమైన ప్రశ్నలున్నాయని వ్యాఖ్యానించారు. అలాగే ఈ డీల్‌కు సంబంధించి మరో ప్రధాన అడ్డంకి వాటాదారుల ఆమోదం కూడా ఒకటని అన్నారు. అయితే గత వారం ట్విటర్ ఉద్యోగులతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో డీల్ విషయంలో ముందుకు సాగాలనే భావిస్తున్నట్టు మస్క్ పేర్కొన్నారు. -
బ్లూ ఎకానమీ.. ఆ దిశగా ఏపీ సర్కార్ వేగంగా అడుగులు..
సాక్షి, అమరావతి: సముద్ర ఆధారిత వాణిజ్యం (బ్లూ ఎకానమీ)పై దృష్టిసారించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఏపీ మారిటైమ్ బోర్డు విదేశీ పోర్టుల భాగస్వామ్య అంశాలపై దృష్టిసారించింది. యూరప్‌లోనే అతిపెద్ద పోర్టుగా పేరొందిన నెదర్లాండ్స్‌లోని రోట్టర్ డ్యామ్, బెల్జియంకు చెందిన యాంట్‌వెర్ప్‌లతో కలిసి పనిచేసేందుకు అడుగులు వేస్తోంది. గత నెలలో దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు సందర్భంగా ఏపీ మారిటైమ్ బోర్డు ప్రతినిధులు రోట్టర్ డ్యామ్, యాంట్వెర్ప్ పోర్టు ప్రతినిధులను కలిసి రాష్ట్రంలోని పోర్టుల్లో పెట్టుబడుల అవకాశాలను వివరించారు. ఏపీలో సుమారు రూ.30,000 కోట్ల వ్యయంతో కొత్తగా నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టడంతో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిందిగా ఆ రెండు సంస్థలను కోరినట్లు ఏపీ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి ‘సాక్షి’కి వివరించారు. అంతర్జాతీయ పోర్టులతో చేతులు కలపడం ద్వారా విదేశీ వాణిజ్య అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం రాష్ట్ర పోర్టులకు వేగంగా కలుగుతుందన్నారు. ఇక రాష్ట్ర ప్రతిపాదనలపై రోట్టర్ డ్యామ్, యాంట్వెర్ప్ పోర్టు ప్రతినిధులు ఆసక్తిని వ్యక్తంచేశాయని, త్వరలోనే రాష్ట్ర పర్యటనకు రావడానికి సుముఖతను వ్యక్తంచేసినట్లు ఆయన తెలిపారు. నౌకల తయారీ, రిపేరింగ్ రంగంలోనూ.. అదే విధంగా.. షార్జాకు చెందిన డామన్ షిప్‌యార్డ్ ప్రతినిధులతో కూడా సమావేశం జరిగిందని, రాష్ట్రంలో నౌకల తయారీ, రిపేరింగ్ రంగంలో పెట్టుబడుల అవకాశాలను వివరించినట్లు రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. దావోస్ పర్యటన సందర్భంగా ఆయా పోర్టులను సందర్శించి స్థానిక పరిశ్రమల ప్రతినిధులు, పోర్టు చైర్మన్లతో సమావేశమైనట్లు ఆయన తెలిపారు. ఈ చర్చలకు కొనసాగింపుగా దావోస్ పర్యటన అనంతరం విదేశీ పోర్టుల ప్రతినిధులను రాష్ట్ర పర్యటనకు ఆహ్వానిస్తూ తాజాగా ఈ–మెయిల్స్ పంపామన్నారు. ఈ పర్యటనలో ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి, మారిటైమ్ బోర్డు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అలాగే, గత దుబాయ్ ఎక్స్పో సందర్భంగా షరాఫ్ గ్రూపు రాష్ట్ర లాజిస్టిక్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని చూపించిందని, త్వరలోనే ఈ కంపెనీ ప్రతినిధులు రాష్ట్ర పర్యటనకు రానున్నట్లు రవీంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారు. -
ఇండిగో ఓవర్ యాక్షన్: డీజీసీఏ స్ట్రాంగ్ రియాక్షన్
న్యూఢిల్లీ: విమానంలో ఎక్కకుండా నిరాకరించి దివ్యాంగ బాలుడిని ఘోరంగా అవమానించిన విమానయాన సంస్థ ఇండిగోకు షాక్ తగిలింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన టాప్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, పౌన విమానయాన నిబంధనలను ఉల్లంఘించారని సిబ్బందిపై మండిపడింది. ఈ క్రమంలో ఇండిగోకు 5 లక్షల రూపాయల జరిమానా విధించింది. ప్రత్యేక అవసరాల పిల్లల పట్ల ఇండిగో గ్రౌండ్ స్టాఫ్ అమర్యాదగా ప్రవర్తించారని విచారణలో తేలిందని డీజీసీఏ తాజాగా ప్రకటించింది. అలాగే మరోసారి ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా సంస్థ నిబంధనలను పునఃపరిశీలించాలని కూడా ఆదేశించింది. ఇటీవల (మే 7న) చోటు చేసుకున్న ఈ ఘటనపై విమాయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై దర్యాప్తు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్వయంగా తానే పర్యవేక్షిస్తానని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా దివ్యాంగ కుమారుడితో కలిసి రాంచీ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఒక కుటుంబం పట్ల ఇండిగో సిబ్బంది అనుచితంగా ప్రవర్తించారు. ఆ చిన్నారి వల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది అంటూ వారిని అడ్డుకున్నారు. దీనిపై బాలుడి తల్లిదండ్రులు వాదించినా ఫలితం లేక పోయింది. దీంతో వారంతా తమ ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి మనీషా గుప్తా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో ఇండిగో సిబ్బంది తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడిన సంగతి తెలిసిందే. -
AP Cabinet Reshuffle: కొడాలి నానికి కీలక పదవి
సాక్షి, అమరావతి: ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో గతంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన కొడాలి నానికి ఏపీ స్టేట్ డెవలప్మెంట్ బోర్డు ఛైర్మన్‌గా అవకాశం కల్పించనున్నారు. కేబినెట్ హోదాలో ఆయనకు రాష్ట్ర అభివృద్ధి బోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించనున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఏపీ స్టేట్ డెవలప్మెంట్ బోర్డును త్వరలో ఏర్పాటు చేయనున్నారు. ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్‌గా మల్లాది విష్ణును నియమించనున్నారు. చదవండి: (ఏపీ నూతన కేబినెట్.. కొత్త మంత్రులు వీరే..) -
యాహూ! నేను పగలుగొట్టేశాను
ఒక్కోసారి మనం ఈ పనులు చేయగలమా అనిపిస్తుంది. మనం చేయలేమో ఆనే సందేహంతోనే చాలా వరకు కొన్ని పనులు చేయం. కానీ ఇక్కడొక మార్షల్ అర్ట్స్ నేర్చుకున్న చిన్నారి కూడా అలానే భావిస్తోంది. కానీ చివరకు తాను చేయగలనని అనుకుంటుంది. (చదవండి: సూప్ నచ్చకపోతే మరీ అలా చేస్తావా!) అసలు విషయంలోకెళ్లితే....మార్షల్ ఆర్ట్స్ నేరుకున్న చిన్నారిని తన టీచర్ ఒక బోర్డు పట్టకుని పగలకొట్టమని చెబుతుంది. ఆ తర్వాత ఆ చిన్నారి ఒకే ఒక్క షార్ట్‌లో పగలు కొట్టేసింది. దీంతో ఆ చిన్నారి వెంటనే తానేన ఇది పగలుగొట్టింది అని ఆశ్చర్యపోతుంది. ఒక్కసారిగా నేను పగలుగొట్టేగలిగాను అంటూ ఆనందంగా గెంతులేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింగ తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు "ఈ ఘటనతో ఆమె చాలా ఆత్మవిశ్వాసాన్ని పొందింది" అంటూ ఆ చిన్నారిని ప్రశంసిస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: బంపర్ ఆఫర్....వ్యాక్సిన్ తీసుకో..బహుమతి పట్టు) View this post on Instagram A post shared by Dear Dorans (@deardorans) -
కంటోన్మెంట్ విలీనంపై మంత్రి కేటీఆర్ ట్వీట్
సాక్షి, కంటోన్మెంట్(హైదరాబాద్): కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీలో కలిపేద్దామా? అంటూ ట్విటర్ వేదిక మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కంటోన్మెంట్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ‘కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో కలపాలంటూ అక్కడి ప్రాంత ప్రజలు కోరుతున్నట్లు వార్త చూశా.. దీనికి నేను అంగీకరిస్తున్నా, మీరేమంటారు?’ అంటూ నెటిజన్లను ఆయన ప్రశ్నించారు. దీంతో కంటోన్మెంట్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీలో కలపడమే ఏకైక లక్ష్యంగా ఏర్పాటైన కంటోన్మెంట్ వికాస్ మంచ్ ప్రతినిధులు తమ పోరాటానికి వెయ్యేనుగుల బలం వచ్చిందంటున్నారు. సాక్షాత్తూ మున్సిపల్ శాఖ మంత్రి తమ పోరాటానికి మద్దతు పలకడంతో సగం విజయం సాధించనట్లేనని అభిప్రాయపడుతున్నారు. కంటోన్మెంట్ వికాస్ మంచ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గడ్డం ఏబెల్, సంకి రవీందర్‌లు బుధవారం ఎమ్మెల్యే సాయన్నను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తాలని కోరారు. అదే సమయంలో మంత్రి కేటీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్‌ల ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు పంపేందుకు ప్రయత్నించాలని ఎమ్మెల్యేను కోరారు. టీఆర్ఎస్ ఎంపీల ద్వారా పార్లమెంట్ సమావేశాల్లోనే జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనంపై చర్చ లేవనెత్తాలని కోరారు. Read a couple is news reports today where citizens overwhelmingly opined that Secunderabad Cantonment Board has to be merged in GHMC I am in agreement too. What do you guys say? — KTR (@KTRTRS) September 22, 2021 మూడేళ్లుగా చర్చ కంటోన్మెంట్ బోర్డుల రద్దు అంశంపై మూడేళ్లుగా వార్తలు వెలువుడుతున్నాయి. తాగా గతేడాది కేంద్ర రక్షణ శాఖ కంటోన్మెంట్లను సమీప మున్సిపాలిటీలు/ కార్పొరేషన్లలో విలీనంపై అభిప్రాయం కోరినట్లు కూడా ప్రచారం జరిగింది. తాజాగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్‌తో కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలన్న డిమాండ్‌కు బలం చేకూరింది. కాగా ఈ అంశంపై తాను సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తానని ఎమ్మెల్యే సాయన్న పేర్కొన్నారు. చదవండి: TS High Court: ఎన్ని ప్రాణాలు పోవాలి? -
గత ప్రభుత్వం మారిటైమ్ బోర్డును నిర్లక్ష్యం చేసింది
-
ఇదేం రూల్ సారూ.. టులెట్ బోర్డుకు రూ.2 వేల జరిమానా!
సాక్షి, మోతీనగర్(హైదరాబాద్): ప్రజలు తమ ఇళ్లలోని గదులను, దుకాణాలను అద్దెకు ఇవ్వడానికి బయట తమ ఇంటి గోడపై టులెట్ బోర్డును పెట్టడం సర్వసాధారణం. కానీ.. గ్రేటర్ కార్పొరేషన్ ప్రకారం ఇది కుదరదు. టులెట్ బోర్డు పెట్టిన మూసాపేట డివిజన్ పాండురంగనగర్‌లోని ఓ ఇంటి యజమానిని జీహెచ్ఎంసీ కంగు తినిపించింది. టులెట్ బోర్డుకి రూ.2 వేలు పన్ను విధించారు. ప్రజా సమస్యలపై స్పందించని జీహెచ్ఎంసీ.. ప్రజలతో ఏ విధంగా పన్నులు కట్టించాలనే విధంగా పని చేస్తోందని కూకట్పల్లి బీ బ్లాక్ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్ ఆరోపించారు. ఇటువంటి ప్రజావ్యతిరేక విధానాలపై మంతి కేటీఆర్, జిహెచ్ఎంసీ కమిషనర్ స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చదవండి: chicken: భర్త చికెన్ తిన్నాడని క్షణికావేశంలో భార్య ఆత్మహత్య -
నేడు గోదావరి, కృష్ణా బోర్డుల సంయుక్త సమన్వయ కమిటీ భేటీ
-
సీఎం జగన్ అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంగళవారం ‘స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు’ సమావేశం జరిగింది. పలు పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు బోర్డు ఆమోదం తెలిపింది. ఏర్పాటు కానున్న కంపెనీల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఏర్పాటవుతున్న పరిశ్రమల వల్ల పర్యావరణ ప్రభావాన్ని కూడా పరిగణనలోనికి తీసుకోవాలని సీఎం సూచించారు. జాగ్రత్తలు తీసుకుంటూ పారిశ్రామిక ప్రగతిలో ముందడుగు వేయాలన్నారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూశాఖ) ధర్మాన కృష్ణదాస్, ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, కార్మికశాఖ మంత్రి జి జయరాం, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, పలు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. పలు ప్రతిపాదనలకు ఆమోదం ►కడప సమీపంలో కొప్పర్తి వద్ద పిట్టి రెయిల్ ఇంజినీరింగ్ కాంపోనెంట్స్ లిమిటెడ్‌కు అంగీకారం ►ఎలక్ట్రికల్, లోకోమోటివ్, విద్యుత్తు, పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు ఇక్కడ తయారీ ►ఈ పరిశ్రమవల్ల ప్రత్యక్షంగా 2వేల మంది ఉద్యోగాలు ►మొత్తంగా రూ.401 కోట్ల పెట్టుబడి పెట్టనున్న కంపెనీ ►కడప సమీపంలోని కొప్పర్తి వద్ద నీల్కమల్ లిమిటెడ్‌కూ బోర్డు అంగీకారం. ►నీల్‌కమల్‌కు దేశవ్యాప్తంగా పలు పరిశ్రమలు. అన్నికంటే ఇక్కడ పెద్ద పరిశ్రమలను ఏర్పాటు చేయనున్న నీల్కమల్. ►రూ. 486 కోట్ల పెట్టుబడి పెట్టనున్న నీల్కమల్. ►ప్రత్యక్షంగా 2030 మంది ఉద్యోగాలు. ►ఫర్నీచర్ మరియు ఇతర గృహోపకరణాల తయారీ ►నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీంలో గ్రీన్‌టెక్ ఇండస్ట్రీస్ విస్తరణకు బోర్డు ఆమోదం. ►ఫోర్డ్, హ్యుందాయ్, ఫోక్స్‌వాగన్ తదితర కంపెనీలకు స్టీల్, ఐరన్ ఉత్పత్తులు అందిస్తున్న గ్రీన్‌టెక్ ఇండస్ట్రీస్. ►జపాన్, కొరియాలకు చెందిన అత్యాధునిక రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానంతో ఉత్పత్తుల తయారీ. ►జర్మనీ నుంచి ఐఎల్టీ ప్లాస్మా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్న గ్రీన్‌టెక్. ►ప్రస్తుతం 2700 మందికి ఉద్యోగాలు, విస్తరణ ద్వారా అదనంగా 2200 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు. ►చిత్తూరు జిల్లా జిల్లా నిండ్ర మండలం ఎలకటూరులో అమ్మయప్పర్ టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమకు బోర్డు అంగీకారం ►సుమారు 30 కోట్ల పెట్టుబడి, 2304 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు ►ఇందులో 90 శాతం మహిళలకే ఉద్యోగాలు ►పురుషులు, పిల్లల బట్టలుతయారీ ►నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం మోమిడి, తమ్మినపట్నం గ్రామాల వద్ద జిందాల్ స్టీల్ ఆంధ్రా లిమిటెడ్‌కు 860 ఎకరాలు తక్కువ ఖర్చుకు ఇచ్చేందకు ఎస్ఐపీబీ ఆమోదం ►2.25 మిలియన్ మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యంతో ఇంటిగ్రేటెడ్ స్టీల్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి జిందాల్ ఆంధ్రా లిమిటెడ్ ఏర్పాట్లు.. తద్వారా 2500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు ►విశాఖపట్నం జిల్లా అచ్చుతాపురంలో నిర్మాణం అవుతున్న సెయింట్ గోబియాన్ పరిశ్రమకు ఏర్పాటుకు డెడ్‌లైన్‌ను పొడిగింపునకు ఎస్ఐపీబీ ఆమోదం ►కోవిడ్ పరిస్థితులు కారణంగా ఫ్యాక్టరీ నిర్మాణ గడువును పెంచాలని కోరిన సెయిట్ గోబియాన్ ►జూన్ 2022 వరకూ పెంచుతూ నిర్ణయం ►టెక్స్టైల్స్, గార్మెంట్స్ మార్కెట్ ప్లేస్‌లో భాగంగా మెగా రిటైల్ పార్క్ నిర్మాణానికి ఎస్ఐపీబీ ఆమోదం ►గుంటూరు జిల్లా తాడేపల్లిలో 5 ఎకరాల స్థలంలో రిటైల్ బిజినెస్ పార్క్ ►రూ. 194.16 కోట్ల పెట్టుబడి ►పార్క్‌లో భాగంగా 900 వరకూ రిటైల్ యూనిట్స్ ►సుమారు 5వేల మందికిపైగా ప్రత్యక్ష ఉద్యోగాలు, మరో 20వేల మందికి పరోక్ష ఉద్యోగాలు ►దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా కొనుగోలు, విక్రయాలకు హబ్‌గా ఈ పార్క్ ఏర్పాటు ►రాష్ట్రంలో తయారయ్యే వాటిలో దాదాపు 70శాతం విక్రయాలు ఇక్కడనుంచే జరుగుతాయని అంచనా ►పార్క్‌లో భాగంగా ఏర్పాటవుతున్న స్టోర్స్ నుంచి ఒక్కో స్టోర్‌లో ఏడాదికి సుమారు రూ.11 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా ►ఎస్ఐపీబీలో రిటైల్ పాలసీకి సూత్రప్రాయ అంగీకారం. సుమారు 25 వేల మందికి ఉద్యోగాలు: మంత్రి గౌతమ్‌రెడ్డి సమావేశం అనంతరం పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కీలకంగా 5 పెట్టుబడుల ప్రతిపాదనలపై చర్చించామని పేర్కొన్నారు. భారీ పరిశ్రమలకు సంబంధించి రూ.14 వేల కోట్ల పెట్టుబడులపై సీఎం చర్చించారని తెలిపారు. జిందాల్ స్టీల్‌ప్లాంట్ 2.5 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో రాబోతుందన్నారు. ఒక్క జిందాల్ ప్లాంట్‌లోనే రూ.7,500 కోట్ల పెట్టుబడులు పెడుతున్నారని ఆయన వివరించారు. సుమారు 25 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. టీడీపీ విమర్శలు పట్టించుకోనవసరం లేదని గౌతమ్‌రెడ్డి అన్నారు. చదవండి: ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్: సీఎం జగన్ సీఎం జగన్ సమక్షంలో ‘దిశ యాప్’ లైవ్ డెమో -
మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పోరేషన్ బోర్డుకు ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పోరేషన్ బోర్డును నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్‌గా 8మంది ఉన్నతాధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. బోర్డు సభ్యులుగా.. వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విధాన పరిషత్ కమిషనర్లు, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓ, ఎంఎస్ఐడీసీ ఎండీ, వైద్యవిద్యా డైరెక్టర్ తదితర అధికారులు ఉంటారు. ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పోరేషన్ రాష్ట్రంలో వైద్యారోగ్య సేవల్ని మరింత విస్తృత పరచటంతో పాటు ప్రస్తుత ఆస్పత్రులు, నర్సింగ్ కళాశాలల అభివృద్ధి, కొత్త వైద్య కళాశాలల నిర్మాణంపై దృష్టి పెట్టనున్నది. నూతన బోధనాసుపత్రుల నిర్మాణం కోసం ఆర్ధిక వనరుల సమీకరణ బాధ్యతనూ రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎంఈఆర్సీకి అప్పగించింది. -
పిల్లల తెలివి మామూలుగా లేదు
-
వైరల్: పిల్లల తెలివి మామూలుగా లేదు
ఇంట్లోనే ఆడే ఆటలు(ఇండోర్) కొన్నైతే ఆరుబయట ఆడే(అవుట్ డోర్) ఆటలు మరికొన్ని. అయితే ఈ ఇండోర్ గేమ్స్‌లో కొన్ని ఆటలు కూర్చున్నచోట నుంచే ఆడినప్పటికీ వాటికి కొన్ని వస్తువులు అవసరపడుతాయి. అందులో 'స్నూకర్స్' గేమ్ ఒకటి. కొందరు పిల్లలు ఇటుకలు, కట్టెలతో స్నూకర్ బోర్డు, స్టిక్స్ తయారు చేశారు. దీని కోసం ఇటుకలను ఒక క్రమపద్ధతిలో సమానంగా పరిచి బోర్డు తయారు చేశారు. అనంతరం వాటిపై కొన్ని బంతులను వేసి ఉంచారు. ఆ తర్వాత ఓ బుడ్డోడు ఓ కట్టె పట్టుకుని బంతిని గురి చూసి కొడుతున్నాడు. అది నేరుగా వెళ్లి అక్కడున్న రంధ్రం(ఖాళీ ప్రదేశం)లో పడుతుంది. మిగతావాళ్లు అతడిని ఎంకరేజ్ చేస్తున్నారు. (అమ్మ కోసం ఆస్పత్రి గోడెక్కి కిటికీ దగ్గరే జపం) దీంతో మరింత ఉత్సాహంతో ఆ బుడ్డోడు మిగతా బంతులను కొడుతున్నాడు. పనిలో పనిగా బోర్డెక్కి మరీ ఆటాడటం నవ్వు తెప్పిస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను లెఫ్టినెంట్ జనరల్ జ్ఞాన్ భూషణ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీరి ఆట సృజనాత్మకంగా ఉందని క్యాప్షన్ జోడించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. పిల్లలు తమ ఆనందం కోసం ఎన్ని ప్రయోగాలైనా చేస్తారంటున్నారు నెటిజన్లు. అయినా ఆ పిల్లోడు ఎంతో అనుభవమున్నవాడిలా ఆడుతున్నాడంటూ మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఇంతకు ముందు కూడా ఓ చోట పిల్లలందరూ చతురస్రాకారంలో నిలబడి క్యారమ్‌బోర్డ్ ఆట ఆడుకున్న విషయం తెలిసిందే. (గుడ్డుపై వాక్యూమ్ క్లీనర్ ప్రయోగించాడు!) -
పప్పు ధాన్యాల బోర్డు ఏర్పాటుపై శాసనసభలో బిల్లు
-
జీ ఎంటర్టైన్మెంట్కు చైర్మన్ గుడ్‌బై
సాక్షి, ముంబై: జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (జీల్) ఛైర్మన్ సుభాష్ చంద్ర రాజీనామా చేశారు. ఈ రాజీనామా తక్షణమే అమల్లోకి రానుంది. అయితే బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్‌గా డైరెక్టర్‌గా ఆయన కొనసాగునున్నారు.అలాగే ఈయనతోపాటు పునీత్ గోయంకా కూడా ఎస్సెల్ గ్రూపు ప్రతినిధులుగా బోర్డులో కొనసాగుతారు. అలాగే జీ బోర్డును పునర్యవస్థీకరించిన బోర్డును కొత్తగా ఆరుగురిని ఇండిపెండెంట్ డైరెక్టర్లగా నియమించుకుంది. వాటాదారుల మార్పుల దృష్ట్యా, సుభాష్ చంద్ర వెంటనే బోర్డు ఛైర్మన్ పదవికి రాజీనామాను బోర్డు అంగీకరించింది. తాజా ఒప్పందం ప్రకారం, రెగ్యులేషన్ 17 (ఎల్బీ) నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. మరోవైపు సింగపూర్ ప్రభుత్వం, సింగపూర్ మానిటరీ అథారిటీ తమ మొత్తం హోల్డింగ్‌ను (సెకండరీ మార్కెట్ ప్లేస్మెంట్ ద్వారా) 8.44 శాతానికి పెంచిందని సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. నవంబర్ 21 న జీల్లో 2.9 శాతానికి సమాన మైన మొత్తం 2.85 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసిందనీ తెలిపింది. కాగా రుణ సంక్షోభంలో చిక్కుకున్న జీ 16.5 శాతం వాటాను ఇన్వెస్కో-ఒపెన్‌హైమర్ ఫండ్‌కు రూ. 4,224 కోట్లకు విక్రయించన్నుట్టు ఈ నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విక్రయం ద్వారా సమకూరిన నిధులను రుణాల చెల్లింపునకు వినియోగించుకోనుంది. ఈ 16.50 శాతంలో ఇన్వెస్కో ఒపెన్‌హైమర్ డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ అనుబంధ సంస్థ ఓఎఫ్సీ గ్లోబల్ చైనా ఫండ్‌కు 2.3శాతం వాటాను విక్రయించనుంది. ఈ సంస్థ ఇప్పటికే జీ లిమిడెలో 8.7శాతం వాటాను కలిగి ఉంది. -
నీతా అంబానీకి అరుదైన గౌరవం
సాక్షి, ముంబై : రిఫైనింగ్-టు-టెలికాం దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ భార్య, దాత నీతా అంబానీ (57) అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. దేశ కళలు, సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహిస్తున్న ఆమె న్యూయార్క్‌లో అతిపెద్ద ఆర్ట్ మ్యూజియం బోర్డులో స్థానం దక్కించుకున్నారు. ప్రపంచం నలుమూలల నుండి కళను అధ్యయనం చేసి, ప్రదర్శించే మ్యూజియం సామర్థ్యానికి నీతా అంబానీ మద్దతు భారీ ప్రయోజనాన్ని చేకూర్చిందని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ చైర్మన్ డేనియల్ బ్రోడ్స్‌స్కీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలోనే నీతా అంబానీని మ్యూజియం గౌరవ ధర్మకర్తగా ఎంపిక చేసినట్టు తెలిపారు. మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ చైర్మన్ డేనియల్ బ్రోడ్స్‌స్కీ, సీఈవో, డైరెక్టర్లతో నీతా అంబానీ కాగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీలో పనిచేసిన మొదటి భారతీయ మహిళగా ఖ్యాతి గడించిన నీతా క్రీడల రంగంలో రిలయన్స్ ఫౌండేషన్ చేసిన కృషికి భారత రాష్ట్రపతి నుంచి రాష్ట్ర ఖేల్ ప్రోత్సాహాన్ అవార్డును అందుకున్నారు. అలాగే ఆసియాలో అత్యంత శక్తివంతమైన 50 మంది వ్యాపారవేత్తల ఫోర్బ్స్ జాబితాలో ఒకరిగా నిలిచారు. రిలయన్స్‌కు చెందిన స్వచ్ఛంద సేవా సంస్థ రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్‌గా ఉన్న నీతా అంబానీ దేశీయంగా పలు సేవా కార్యక్రమాలతో పాటు విద్య, వైద్యం, సంస్కృతి,కళలు, క్రీడాభివృద్ధికోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ లో కూడా ప్రతి ఏడాది ఆమె షోలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 149 సంవత్సరాల పురాతనమైన లాభాపేక్షలేని, మెట్రోపాలిటన్ మ్యూజియం ప్రపంచవ్యాప్తంగా 5,000 సంవత్సరాల నుండి విస్తరించి ఉన్న కళలను ప్రదర్శిస్తుంది. ప్రతి ఏటా మిలియన్ల మంది బిలియనీర్లు, ప్రముఖులు ఈ మ్యూజియాన్ని సందర్శిస్తారు. -
నిస్సాన్ ఛైర్మన్‌పై వేటు
టోక్యో: ఆర్థిక అక్రమాలకు పాల్పడిన కేసులో ప్రపంచం ఆటోదిగ్గజం నిస్సాన్ ఛైర్మన్ కార్లోస్ ఘోన్ వేటుపడింది. రెండురోజులక్రితం గోన్‌ను టోక్యో విచారణ అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. నిస్సాన్ బోర్డునుంచి ఆయన్ను తొలగించాలని బోర్డు ఏకగ్రీవ నిర్ణయం తీసుకుందని నిస్సాన్ గురువారం వెల్లడించింది. అలాగే మరో ఎగ్జిక్యూటివ్ రిప్రెజెంటేటివ్ డైరెక్టర్ గ్రెగ్ కెల్లీని కూడా తొలగించినట్టు తెలిపింది. సంస్థ నిర్వహించిన అంతర్గత నివేదికను పూర్తిగా పరిశీలించిన అనంతరం బోర్డు ఈ నిర్ణయం తీసుకుందని ఒక ప్రకటనలో తెలిపింది. యోకోహామాలో సంస్థ ప్రధాన కార్యాలయంలో బోర్డు అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. మరోవైపు ఘోన్ స్థానంలో సమర్ధుడైన నాయకుడిని ఎన్నుకునేందుకు ఒక ఎడ్వైజరీ కమిటీని నియమించినట్టు నిస్సాన్ ప్రకటించింది. ముగ్గురు సభ్యుల ఈ కమిటీలో జపనీస్ మహిళా రేసింగ్ డ్రైవర్ కైకో ఇహారా కూడా ఉన్నారు. -
త్వరలో ‘జాతీయ మదర్సా బోర్డు’
న్యూఢిల్లీ: దేశంలోని మదర్సాలన్నిటినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు వీలుగా జాతీయ మదర్సా బోర్డు ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు మైనారిటీ విద్య జాతీయ పర్యవేక్షణ కమిటీ (ఎన్‌ఎంసీఎంఈ) వెల్లడించింది. ఇందుకోసం ముందుగా గుర్తింపు లేకుండా పెద్ద సంఖ్యలో నడుస్తున్న మదర్సాల వివరాలను సేకరించనున్నట్లు తెలిపింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్చార్డీ) శాఖ నేతృత్వంలో పనిచేసే ఈ కమిటీ ఇటీవల సమావేశమై పలు ప్రతిపాదనలు రూపొందించింది. అన్ని రాష్ట్రాల్లో మదర్సా బోర్డులు ఏర్పాటు చేయాలంది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అధ్యక్షతన పనిచేసే ఈ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, విద్యావేత్తలు, వివిధ సంస్థల కార్యకర్తలు, హెచ్చార్డీ అధికారులు సభ్యులుగా ఉంటారు. -
ఆర్బీఐ బోర్డులోకి గురుమూర్తి, సతీష్ మరాథే
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర బ్యాంకు రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బోర్డులో ప్రత్యేక సభ్యుడుగా ఆర్ఎస్ఎస్ సానుభూతిపరుడు, పాత్రికేయుడు స్వామినాథన్ గురుమూర్తి (తమిళనాడు) ఎంపికయ్యారు. గురుమూర్తితోపాటు సహకార భారతీ చీఫ్ సతీష్ కాశీనాథ్ మరాథెని ఆర్బీఐ బోర్డులో పార్ట్ టైం డైరెకర్లుగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. వీరి పదవీకాలం నాలుగేళ్లు ఉంటుందని, క్యాబినెట్ అపాయింట్మెంట్ ఆమోదం తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. తాజా నియామకాలతో ఆర్బీఐ బోర్డులో సభ్యుల సంఖ్య 10కి చేరింది. కాగా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ, స్వదేశీ జాగరణ్ మంచ్‌కు ఉప కార్యదర్శిగా ఉన్న గురుమూర్తి అర్థశాస్త్రవేత్త, సీఏ పూర్తి చేశారు. వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయినా, తమిళంలో తుగ్లక్ అనే రాజకీయ వార పత్రికకు ఎడిటర్‌గా ఉన్నారు. -
రసాభాసగా తుంగభద్ర అడ్వైజరీ బోడు భేటీ
-
ఐసీఐసీఐ నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా గిరీశ్ చతుర్వేది
-
ఐసీఐసీఐ నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా గిరీశ్ చతుర్వేది
సాక్షి,ముంబై: దేశీయ ప్రయివేటు బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త ఎగ్జిక్యూటివ్ నియామకాన్ని చేపట్టింది. బ్యాంకు నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా గిరీశ్ చంద్ర చతుర్వేదిని నియమిస్తున్నట్టు ఐసీఐసీఐ బ్యాంకు శుక్రవారం ప్రకటించింది. మాజీ ఐఏఎస్ అధికారి గిరీశ్ చంద్ర చతుర్వేదిని పార్ట్‌టైమ్ ఛైర్మన్‌గా నియమిస్తున్నట్లు బ్యాంకు వెల్లడించింది. ఈ మేరకు బోర్డు అంగీకరించిందని ఐసీఐసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. జులై 1న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. చతుర్వేది నియామకానికి వాటాదారులు సమ్మతిస్తే ఆయన మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. కాగా ప్రస్తుతం ఛైర్మన్‌గా ఉన్న ఎం.కే శర్మ పదవీకాలం రేపటితో (జూన్,30) ముగియనుంది. ఛైర్మన్‌గా శర్మను మరోసారి కొనసాగించాలని బోర్డు సభ్యులు భావించినప్పటికీ ఆయన అయిష్టత వ్యక్తం చేశారు. దీంతో బ్యాంకు ఈ నియమకాన్ని చేపట్టింది. తొలుత ఐసీఐసీఐ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా ఉన్న ఎండీ మాల్యా పేరు వినిపించినప్పటికీ చతుర్వేది నియామకానికి బోర్డు సమ్మతించింది.1977 బ్యాంచ్ ఐఏఎస్ అధికారి అయిన చతుర్వేది 2013 జనవరిలో చమురు మంత్రిత్వశాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. -
బోర్డు తిప్పేసిన మోసాలపై విచారణ
కమలాపూర్: వాయిదాల పద్దతిలో డబ్బులు చెల్లిస్తే తక్కువ సమయంలో రెట్టింపు డబ్బులు ఇవ్వడంతో పాటు ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని చెప్పి కమలాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో పలువురి నుంచి డబ్బులు వసూలు చేసి గడువు ముగిసినా డబ్బులు ఇవ్వకుండా మోసగిస్తున్న ఘటనపై మండలంలోని గుండేడులో గురువారం కాజీపేట ఏసీపీ కె.సత్యనారాయణ విచారణ జరిపారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు ఏసీపీ ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. బాధితుల కథనం మేరకు.. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కేంద్రంగా శ్రీరాం రియల్ ఎస్టేట్, బిజినెస్ సొల్యూషన్ లిమిటెడ్ పేరిట కొందరు ఓ సంస్థను నెలకొల్పారు. వరంగల్లోనూ ఆ సంస్థ శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సంస్థకు చెందిన జయశంకర్ జిల్లా మొగుళ్లపెల్లి మండలం వేములపల్లికి చెందిన పెరుమాండ్ల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి 2012లో కన్నూరుకు చెందిన వీఓ అధ్యక్షురాలు పబ్బు కవితతో పాటు మండలంలోని పలు గ్రామాలకు చెందిన పలువురిని 2 శాతం కమీషన్‌తో ఏజెంట్లుగా నియమించుకున్నారు. వారు మండలంలోని పలువురు మహిళలను సంస్థలో సభ్యులుగా చేర్పించుకుని రెండు నుంచి ఆరేళ్ల కాలంలో వారు చెల్లించిన డబ్బులకు రెట్టింపు డబ్బులు ఇస్తామని చెప్పి వారి నుంచి వాయిదా పద్దతిలో డబ్బులు వసూలు చేసి కంపెనీకి అప్పగిస్తున్నారు. 2012 నుంచి 2016 వరకు రీ–పేమెంట్లు సైతం సక్రమంగా జరుగగా ఆ తర్వాత సంస్థ సీఎండీ అరెస్టై సంస్థ మూడపడింది. అప్పటి నుంచి మండలానికి చెందిన పలువురికి రావాల్సిన సుమారు రూ.4 కోట్ల చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో పలుమార్లు ఏజెంట్లను డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చినా లాభంలేకపోవడంతో ఈ నెల 2న డీజీపీకి ఫిర్యాదు చేశారు. అనంతరం 10న మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. తమకు అందిన సమాచారం మేరకు గుండేడులో విచారణ చేపట్టి ఏజెంట్లు, బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నామని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఏసీపీ కె.సత్యనారాయణ తెలిపారు. ఈ విచారణలో ఎల్కతుర్తి సీఐ రవికుమార్, కమలాపూర్ ఎస్సై సందీప్‌కుమార్, సర్పంచ్ రాజబోస్, ఏజెంట్లు, బాధితులు పాల్గొన్నారు. -
శిఖా శర్మకు గుడ్ బై.. కానీ
సాక్షి, ముంబై : యాక్సిస్ బ్యాంకు సీఈవో శిఖాశర్మ పదవీకాలం పొడిగింపు అంశంలో బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. శిఖా శర్మకు గుడ్ బై చెప్పేందుకు మొగ్గు చూపింది. ఈ మేరకు సోమవారం నిర్ణయం తీసుకుంది. బ్యాంకు ఎండీ, సీఈవో తన పదవీకాలాన్నిపొడిగించాల్సిందిగా శిఖా శర్మ బోర్డును కోరారని బోర్డు ఎక్సేంజీలకు ఇచ్చిన సమాచారంలో తెలిపింది. దీంతో ఆమె పదవీ విరమణ కాలాన్ని జులైలో కాకుండా డిసెంబర్ దాకా కొనసాగించేందుకు బోర్డు ఆమోదించిందనీ, దీన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం కోసం పంపినట్టు వెల్లడించింది. జులై 2018 ,డిసెంబర్ 2018దాకా తన పదవీకాలాన్ని పొడిగించాలన్న సీఈవో శిఖా శర్మ అభ్యర్థనను బోర్డు ఆర్బీఐ పరిశీలనకు పంపినట్టు తెలిపింది. అనంతరం కొత్త సీఈవో ఎంపికను చేపట్టనున్న్టటు ప్రకటించింది. వరుసగా మూడవ సారి సీఈవో బాధ్యతలు చేపట్టిన శిఖాశర్మ ప్రస్తుత పదవీకాలం 2018 జులైతో ముగియనుంది. అయితే నాలుగవసారికూడా ఆమెను కొనసాగించే ప్రతిపాదనను ఆమోదించిన బోర్డు ఆర్బీఐ ఆమోదం కోసం పంపింది. ఆర్బీఐ అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో బ్యాంకు బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై ఆర్బీఐ ఈ నిర్ణయాన్ని పునరాలోచించాల్సిందిగా బోర్డును కోరడంతో ఆమె నాలుగవ సారి సీఈవో అయ్యే ప్రక్రియకు అడ్డుకట్ట పడింది. కాగా యాక్సిస్ బ్యాంకుకు తొలిసారి సీఈఓగా శిఖా శర్మ ప్రస్థానం 2009లో మొదలైంది. దాదాపు ఎనిమిదేళ్ల 10నెలల కాలంలో యాక్సిస్ బ్యాంకును విజయపథంలో నడిపించిన ఘనతను ఆమె సొంతం చేసుకున్నారు. మరోవైపు మొండిబాకీల విషయంలో ఆమె ఆరోపణలను కూడా మూట గట్టుకున్నారు. దీనికి తోడు గత సంవత్సరం అక్టోబర్‌లో యాక్సిస్ బ్యాంకు మొండి బాకీల అంచనా లెక్కల్లో లోపాలు తలెత్తడంతో ఆర్బీఐ రూ.3 కోట్ల పెనాల్టీ విధించిన సంగతి తెలిసిందే. -
సిటీ బస్సు.. బోర్డు తుస్సు
నగరంలో ప్రతిరోజు సుమారు 32 లక్షల మంది సిటీ బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. రవాణా సాధనాలు ఎన్ని మారినా ప్రజల నుంచి వీటికున్న ఆదరణ అద్భుతంగా ఉంది. కానీ ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో మాత్రం ఆర్టీసీ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. సిటీ బస్సుల డెస్టినేషన్ బోర్డుల తీరుపై ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పరిశీలించింది. సికింద్రాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు తిరిగే బస్సుల్లో సుమారు 40 శాతం బస్సులు అస్పష్టమైన బోర్డులతోనే దర్శనమిచ్చాయి. డెస్టినేషన్ బోర్డులు రంగు వెలిసి ప్రయాణికులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. బోర్డులపై అక్షరాలు కనిపించక తాము ఎక్కాల్సిన బస్సు ఏదో గుర్తించలేని పరిస్థితి నెలకొంది. ఏ బస్సు ఎటు వెళ్తుందో తెలియక బస్టాప్‌లో ఆగినా ప్రయాణికులు ఎక్కేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఈ పరిస్థితి ప్రతిరోజు ఆ రూట్లోనే రాకపోకలు సాగించే వాళ్లకు సైతం తప్పడం లేదు. సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో ఆర్టీసీ సేవలు మసకబారుతున్నాయి. మెట్రోరైలు వచ్చాక సిటీ బస్సుల వినియోగం తగ్గుతుందని లెక్కలు వేసినా అవన్నీ తప్పేనని తేలిపోయింది. ఇప్పటికీ ప్రతిరోజు సుమారు 32 లక్షల మంది సిటీ బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. వందలాది కాలనీలకు, ప్రధాన రహదారులకు, నగర శివారు ప్రాంతాలకు ఈ బస్సులే కనెక్టివిటీగా ఉన్నాయి. కానీ బస్సుల నిర్వహణ మాత్రం అస్తవ్యస్తంగా ఉంది. అధికారులు బస్సులను డిపో నుంచి రోడ్డెక్కించడం వరకే పరిమితమవుతున్నారు గాని, ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించడంలో మాత్రం దారుణంగా విఫలమవుతున్నారు. అన్ని రూట్లలోనూ ఇంతే.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, రేతిఫైల్, చిలకలగూడ క్రాస్‌రోడ్స్, బ్లూసీ హోటల్, గురుద్వారా తదితర ప్రాంతాల నుంచి రోజూ సుమారు 1500 బస్సులు వివిధ ప్రాంతాలకు తిరుగుతుంటాయి. పటాన్చెరు, బీహెచ్ఈఎల్, కూకట్పల్లి, జగద్గిరిగుట్ట, బాలానగర్, అల్వాల్, రిసాలాబజార్, బోయిన్పల్లి, బొల్లారం, జూపార్కు, ఆఫ్జల్‌గంజ్, నాంపల్లి, ఈసీఐఎల్, కోఠి, మహాత్మ గాంధీ బస్‌స్టేషన్, బార్కాస్, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్, కొండాపూర్, హైటెక్‌సిటీ తదితర ప్రాంతాలకు వేలాది టిప్పులు రాకపోకలు సాగిస్తాయి. ఒక్క సికింద్రాబాద్ నుంచే వివిధ ప్రాంతాలకు కనీసం 10 వేల ట్రిప్పులకు పైగా బస్సులు తిరుగుతాయి. ఈ ప్రాంతం నుంచే సుమారు 15 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. కానీ ప్రయాణికుల డిమాండ్, ఆదరణకు తగినవిధంగా సదుపాయాలు మాత్రం లేవు. సికింద్రాబాద్ నుంచి పటాన్చెరు, బీహెచ్ఈఎల్ వైపు, మల్కాజిగిరి, ఈసీఐఎల్, నేరేడ్మెట్, కోఠి తదితర మార్గాలకు వెళ్లే బస్సుల్లో చాలావాటికి అస్పష్టమైన డెస్టినేషన్ బోర్డులే దర్శనమిచ్చాయి. బస్సు దగ్గరకు వచ్చే దాకా బోర్డు కనిపించదు. తీరా తెలిసి అది ఏ రూట్లో వెళ్తుందో కనుక్కోవడం కూడా కష్టమే. బస్సు రూట్‌తో పాటు ఈ ప్రాంతం (వయా) మీదుగా వెళ్తుందో స్పష్టంగా తెలియాలి. ఆ వివరాలు కూడా బోర్డులపై లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ♦ సికింద్రాబాద్ నుంచి ఈసీఐఎల్ (16ఏ రూట్) వరకు ప్రతి రోజు వందలాది బస్సులు రాకపోకలు సాగిస్తాయి. సికింద్రాబాద్, మెట్టుగూడ, మల్కాజిగిరి, వాణీనగర్, నేరేడ్మెట్ మీదుగా ఈ బస్సులు ఈసీఐఎల్‌కు వెళ్తాయి. కానీ ఈ బస్సులు అస్పష్టమైన బోర్డులతోనే తిరుగుతున్నాయి. ♦ సికింద్రాబాద్ నుంచి ఈసీఐఎల్‌కు వెళ్లే బస్సులు కొన్ని సాయినగర్ మీదుగా వెళ్తాయి. కానీ ‘సాయినగర్’ అనే పేరు కనిపించక చాలా మంది ఎక్కేస్తున్నారు. తీరా అది సాయినగర్ మీదుగా వెళ్తుందని తెలిసి ఇబ్బందులకు గురవుతున్నారు. ♦ తెలుపు రంగు బోర్డులపైన కనీసం వంద అడుగుల దూరంలో ఉన్న ప్రయాణికులకు కూడా స్పష్టంగా కనిపించేలా తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో రూట్ వివరాలతో డెస్టినేషన్ బోర్డులు ఉండాలి. కానీ చాలా బస్సులకు రంగులు వెలిశాయి. ♦ ఎల్ఈడీ డిస్ప్లే ఉన్న మెట్రో బస్సుల్లోనూ స్పష్టత కొరవడింది. కొరవడిన సమీక్ష.. ప్రతి 6 నెలలకు ఓసారి బస్సుల డెస్టినేషన్ బోర్డులను మార్చాలి. ఎప్పటికప్పుడు కొత్తవి ఏర్పాటు చేయాలి. ఇందుకు డిపో మేనేజర్ స్థాయి అధికారులకు ఆర్టీసీ పూర్తి బాధ్యతలను అప్పగించింది. కానీ చాలామంది డీఎంలు బోర్డుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రయాణికుల ఫిర్యాదులను కూడా పట్టించుకోరు. అవసరమైన చోట ఏర్పాటు చేస్తాం... డెస్టినేషన్ బోర్డుల బాధ్యతను డిపో మేనేజర్లకే అప్పగించాం. బస్సులను పరిశీలించి ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకొనే అవకాశం వారికి ఉంది. అయినా ప్రయాణికుల ఫిర్యాదుల మేరకు అన్ని డిపోల్లో మరోసారి పరిశీలించి డెస్టినేషన్ బోర్డులను ఏర్పాటు చేస్తాం. – పురుషోత్తమ్ నాయక్, ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాలుగేళ్లుగా పోరాడుతున్నా డెస్టినేషన్ బోర్డులు సరిగ్గా లేవని గత 4 సంవత్సరాలుగా డిపో మేనేజర్ నుంచి ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ రమణారావు వరకు, చైర్మన్ వరకు అందరినీ కలిశాను. సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. దాదాపు అన్ని రూట్లలోనూ ఇదే పరిస్థితి. ఇక బస్సుల టైమింగ్స్ కూడా ఎక్కడా కనిపించవు. ఎక్కడో ఓ చోట బస్టాపులో టైమింగ్స్ బోర్డు ఉంటుంది. కానీ ఆ టైమ్‌లో బస్సు ఉండదు. – జేఎన్ఎన్ శాస్త్రి, రిటైర్డ్ ఇంజినీర్ -
‘అమర్నాథ్ యాత్ర’కు ఆధునిక హంగులు
సాక్షి, న్యూఢిల్లీ : అమర్నాత్ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త. మంచు లింగాన్ని దర్శించి తరించాలని వేల సంఖ్యలో భక్తులు కోరుకుకుంటారు. అయితే అమర్నాథ్ యాత్ర అంత సులువుకాదన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రధానంగా మౌలిక సదుపయాలు, రవాణ వంటి సమస్యలు ఈ యాత్రలో భక్తులను విపరీతంగా వేధిస్తాయి. ఈ నేపథ్యంలో అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని అమర్నాథ్ బోర్డును నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. అంతేకాక మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం అడిషనల్ సెక్రెటరీ హోదా కలిగిన అధికారి నేతృత్వంలో ఒక కమిటీని ఎన్జీటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అమర్నాథ్ యాత్రపై పరిశీలన చేసి.. భక్తులకు అవసరమైన వసతులు, సౌకర్యాల ఏర్పాటుపై ప్రణాళిక రూపోందిస్తుందని ఎన్జీటీ ప్రకటించింది. ఈ కమిటీ ప్రధానంగా రహదారి, దేవస్థానం సమీపంలో పరిశుభ్రత, భక్తులకు అవసరాలను పరిశీలిస్తుందని ఎన్జీటీ తెలిపింది. -
గూగుల్ సీఈవో మరో ఘనత
శాన్ ఫ్రాన్సిస్కో: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్(45) మరో ఘనతను సాధించారు. చెన్నైకు చెందిన ఐఐటీ పూర్వ విద్యార్థి భారత సంతతికి చెందిన టెక్ నిపుణుడు తన ఖాతాలో మరో విశిఫ్టతను చేర్చుకున్నారు. గత రెండేళ్లుగా గూగుల్ సంస్థను విజయవంతంగా నడిపిస్తున్న సుందర్ పిచాయ్ తాజాగా గూగుల్ పేరెంటల్ కంపెనీ, గ్లోబల్ టెక్ దిగ్గజం అల్పాబెట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు ఎంపికయ్యారు. యూ ట్యూబ్, గూగుల్ యాజమాన్య సంస్థ అయిన ఆల్పాబెట్ బోర్డుకు పిచాయ్ నియమితులయ్యారు. గూగుల్ సీఈవోగా సుందర్ మంచి కృషిని కొనసాగిస్తున్నారని, భాగస్వామ్యాలు, అద్భుతమైన నూతన ఆవిష్కరణలతో బలమైన అభివృద్ధిని నమోదు చేస్తున్నారని ఆల్ఫాబెట్ ఒక ప్రకటనలో తెలిపింది. 26 బిలియన్ డాలర్ల అమ్మకాలపై 3.5 బిలియన్ డాలర్ల నికర ఆదాయం సాధించినట్టు తెలిపింది. అలాగే యూరోపియన్ యూనియన్ విధించిన యాంటీ ట్రస్ట్ ఫైన్ (2.7 బిలియన్ డాలర్లు)లేకపోతే రికార్డ్ స్థాయి భారీ లాభాలను సాధించేవారమని పేర్కొంది. ఆల్ఫాబెట్ ఇంక్. సోమవారం ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో ఆదాయంలో 21 శాతం పెరుగుదలను నమోదు చేసింది. గూగుల్ ప్రకటన ఆదాయం 18.4 శాతం పెరిగి 22.67 బిలియన్ డాలర్లకు చేరింది. మరోవైపు ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా సంస్థ డిజిటల్ యాడ్ రెవెన్యూ 73.75 బిలియన్ డాలర్లుగా నమోదుకానుందని అంచనా. ఫేస్బుక్ 36.29 బిలియన్ డాలర్లకు చేరుకోగలదని పరిశోధనా సంస్థ ఇమార్కెటర్ తెలిపింది. మొత్తం మార్కెట్లో ఇరు కంపెనీలు 49 శాతం వాటా ఉంటుందని తెలిపింది. కాగా సుందర్ పిచాయ్ 2004లో గూగుల్ చేరారు. 2015 ఆగస్టులో గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు -
సిగ్నిటీ బోర్డులోకి కొత్తగా ముగ్గురు డైరెక్టర్లు
హైదరాబాద్: ప్రముఖ సాఫ్ట్వేర్ టెస్టింగ్ సర్వీసెస్ సంస్థ ‘సిగ్నిటీ టెక్నాలజీస్’ తాజాగా ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లను బోర్డులోకి తీసుకుంది. వీరిలో క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆర్.కె.అగర్వాల్, గ్లోబల్ ఐటీ ఇండస్ట్రీ వెటరన్ ఫణీశ్ మూర్తి, ఇన్వెంచర్ అకాడమీ సీఈవో, సహ వ్యవస్థాపకురాలు, మేనేజింగ్ ట్రస్టీ నూరిన్ ఫజల్ ఉన్నారు. ‘సిగ్నిటీ బ్రాండ్‌ను బలోపేతం చేసే దిశగా ఇదో పెద్ద ముందడుగు. ఈ ముగ్గురిని బోర్డులోకి తీసుకోవడం అనేది కంపెనీకి విలువ జోడించడంతోపాటు భవిష్యత్‌లో మరింత అభివృద్ధిని లక్ష్యించి ముందుకు వెళ్తున్న మాకెంతో ఉపయోగపడుతుంది. వీరి సహకారంతో ప్రపంచంలో అతిపెద్ద, అత్యంత గౌరవనీయమైన స్వతంత్ర సాఫ్ట్వేర్ టెస్టింగ్ సర్వీసెస్ కంపెనీల్లో ఒకటిగా మా ప్రయాణం వేగవంతం అవుతుందని భావిస్తున్నాం’ అని సిగ్నిటీ టెక్నాలజీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సి.వి.సుబ్రమణ్యం వివరించారు. -
భారీ నిధుల సమీకరణ దిశగా టాటా స్టీల్
ముంబై: ప్రముఖ దేశీయ స్టీల్ సంస్థ టాటా స్టీల్ భారీ నిధుల సమీకరణపై దృష్టిపెట్టింది. ఫండ్ రైజింగ్ ప్రతిపాదనను పరిశీలించేందుకు ఈ వారంలో భేటీ నిర్వహించనున్నట్లు టాటా స్టీల్ సోమవారం ప్రకటించింది. ఏప్రిల్ 20 న గురువారం జరుగనున్న కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో నిధుల పెంపుదల ప్రతిపాదనపై చర్చించనున్నట్టు సంస్థ బిఎస్ఇకి తెలిపింది. 28 మిలియన్ టన్నుల స్టీల్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో అంతర్జాతీయ స్టీల్ కంపెనీల్లో టాప్ కంపెనీల్లో ఒకటిగా టాటా స్టీల్ కొనసాగుతోంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో టాటా స్టీల్ వార్షిక టర్నోవర్ 17.69 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ప్రపంచంలో రెండవ అతిపెద్ద స్టీల్ ఉత్పత్తిదారుగా ఉన్న టాటాస్టీల్ 26 దేశాలలో కార్యకలాపాలను, 50 పైగా దేశాలలో వాణిజ్యకార్యకలాపాలను నిర్వహిస్తోంది. -
ఇంతకీ ఇన్ఫీలో ముసలం ముగిసినట్టేనా?
ముంబై: ఇన్ఫోసిస్ సంస్థలో ఇటీవల చెలరేగిన విభేదాల నేపథ్యంలో సంస్థ నిర్వహించిన మీడియా సమావేశంపై మరిన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి సమస్యలు లేవని బోర్డ్ వివరణపై బోర్డ్ వివాదం ముగిసినట్టుగా కనిపించడం లేదనే వ్యాఖ్యలు వినిపించాయి. ఇలా పబ్లిగ్గా మీడియాకెక్కడం రావడం సరైందికాదనీ, ఇది ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజ కంపెనీలకు మంచిదికాదనే వాదన వినిపిస్తోంది. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తరువాత ఇన్ఫోసిస్ కార్పోరేట్ గవర్నెస్ వ్యవహారంపై మరింత గందరగోళం నెలకొందని పేర్కొన్నారు. సంస్థ ఛైర్మన్ శేషసాయి, సీఈవో విశాల్ సిక్కా మాట్లాడాని తీరు గానీ, బాడీ లాంగ్వేజెస్ గానీ సమస్యకు పరిష్కారం దిశగా సాగలేదని కొంతమంది విశ్లేషకులు వ్యాఖ్యానించారు. చాలా నిర్లక్ష్యంగా, బాధ్యతా రాహిత్యంగా వారి వివరణ సాగిందంటున్నారు. గతరెండేళ్లుగా వివాదం నడుస్తున్నపుడు మరింత పారదర్శకంగా వ్యవహరించి ఉండాల్సిందని ఎనలిస్టులు చెబుతున్నారు. ముఖ్యంగా రాజీవ్ బన్సల్‌కు చెల్లించిన పే విషయంలో బోర్డ్ ఇచ్చిన వివరణ, విశాల్ సిక్కా కు చెల్లిస్తున్న వేతనాలపై స్పష్టంగా లేదని తెలిపింది. ఇన్ఫోసిస్ సంస్థ కచ్చితంగా నిజాలను దాచి పెడుతోందని వ్యాఖ్యానించారు. అలాగే మీడియాద్వారా కాకుండా.. ప్రత్యక్షంగా సమస్యను పరిష్కరించుకొని ఉండే బావుండేదని పేర్కొన్నారు. ఇకముందైనా ఇలాంటి సాంప్రదాయాలను పాటించాలని కోరుతున్నారుదేశానికి గర్వకారణంగా ఉన్న ఇన్ఫోసిస్ సంస్థను గౌరవాన్ని కాపాడాల్సి ఉందన్నారు. ఇది షేర్ హోల్డర్స్ పై ప్రభావం చూపే అవకాశంఉందని తెలిపారు. మరి తాను వ్యక్తం ఆందోళనలపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసిన వ్యవస్థపాకులు తొలిఛైర్మన్ నారాయణ మూర్తి ఈ బోర్డ్ నిర్వహించిన మీడియా సమావేశంలో శేషశాయి, సీఈవో విశాల్ సిక్కా సమాధానాలపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. -
‘సాగర్’ కింద రబీకి 25 టీఎంసీలివ్వండి
కృష్ణా బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం మరో లేఖ సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద వేసిన పంటలకు తక్షణమే 25 టీఎంసీల నీటిని కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం మళ్లీ కృష్ణా బోర్డుకు విన్నవిం చింది. ఈ మేరకు సోమవారం బోర్డుకు లేఖ రాసింది. పట్టిసీమ లెక్కలను పరిగణన లోకి తీసుకుంటే ఏపీ 271.4 టీఎంసీలు వాడాల్సి ఉన్నా.. 298.62 టీఎంసీలను వాడిందని పేర్కొంది. తెలంగాణ 158.53 టీఎంసీలు వాడాల్సి ఉన్నా.. 131.34 టీఎంసీలే వాడిందని తెలిపింది. పట్టిసీమను పక్కనపెట్టి చూసినా ఏపీ 240.8 టీఎం సీలకు 250.1 టీఎంసీలు వాడిందని తెలిపింది. తెలంగాణకు 140.6 టీఎంసీలు రావాల్సి ఉండగా.. 131.34 టీఎంసీలే వినియోగించు కుందని వివరించింది. -
విద్యుత్ సంస్థలో ప్రైవేటీకరణను నిలిపివేయాలి
ఏపీఎస్ఈబీ ఇంజనీర్ల సంఘం డిమాండ్ బొమ్మూరు కార్యాలయం వద్ద నిరసన రాజమహేంద్రవరం రూరల్ : విద్యుత్ సంస్థలో ప్రైవేటీకరణను నిలిపివేయాలని ఏపీఎస్ఈబీ ఇంజనీర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. మంగళవారం భోజన విరామ సమయంలో బొమ్మూరులోని కార్యాలయం వద్ద ఏపీ ట్రాన్‌కోలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. ఇంజనీర్ల సంఘం బ్రాంచి కార్యదర్శి కె.రత్నాలరావు, జిల్లా కార్యదర్శి రాజ్‌కుమార్, అడిషనల్ సెక్రటరీ జనరల్ ఎన్ .శామ్యూల్ మాట్లాడుతూ ప్రపంచంలో ఏపీ ట్రా¯Œ్సకో సమర్థమైన సంస్థలలో ఒకటని, దీనిని బిల్డ్ ఓన్ ఆపరేట్ అండ్ మెయింటైన్ పేరుతో ప్రైవేటీకరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. తెలంగాణ నుంచి విడుదల చేసిన ఉద్యోగులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కింద స్థాయిలో అసిస్టెంట్ ఇంజనీర్లను నియమించాలన్నారు. అనంతరం ఏపీట్రాన్ సకో ఎస్ఈ శ్యాంప్రసాద్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ట్రాన్ , ఏపీఈపీడీసీఎల్, టీఎల్ అండ్ ఎస్ఎస్ జిల్లాలోని ఇంజనీర్లు పాల్గొన్నారు. -
ఉద్యాన పంటల గిట్టుబాటు ధరలకు కృషి
నేషనల్ హార్టికల్చర్ బోర్డు డైరెక్టర్ సత్యకృష్ణం రాజు తుని రూరల్ : జాతీయస్థాయిలో ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు గిట్టుబాటు ధరలు లభించేందుకు నిరంతరం కృషి చేస్తానని నేషనల్ హార్టికల్చర్ బోర్డు డైరెక్టర్ చోడ్రాజు సత్యకృష్ణంరాజు అన్నారు. పదవీ బాధ్యతలు చేపటి సోమవారం తొలిసారిగా తుని వచ్చిన ఆయనకు ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, బీజేపీ నాయకులు పైడా కృష్ణమోహన్, పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు రైల్వే స్టేషన్లో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వీఐపీ లాంజ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కోకో, కొబ్బరి, ఆయిల్‌పామ్, బొప్పాయి, నిమ్మ, దానిమ్మ, మామిడి, జీడి మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం, గిట్టుబాటు ధరల సాధనకు కృషి చేస్తానన్నారు. పండ్లు, కూరగాయల నిల్వకు కోల్డ్ స్టోరీజీలు ఏర్పాటు, రుణ పరపతి పెంపునకు బోర్డులో చర్చకు తీసుకువస్తానని, సాగులో యంత్రీకరణకు అధిక నిధులు కేటాయింపునకు చర్యలు తీసుకుంటానన్నారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించి స్వగ్రామం తేటగుంటకు చేరుకున్నారు. ఈముని అనంతశేషగిరి, ఆకెళ్ల శాస్త్రి, లోవదేవస్థానం ధర్మకర్తలు పుల్లంరాజు, నారాయణాచార్యులు, నియోజకవర్గ కార్యకర్తలు పాల్గొన్నారు. -
బోర్డు పరిధిలో బ్యారేజీ
నీటి వాడకాన్ని పరిశీలించనున్న గోదావరి బోర్డు ధవళేశ్వరం : గోదావరి బోర్డు పరిధిలోకి ధవళేశ్వరం కాట¯ŒSబ్యారేజ్ చేరింది. ఈ మేరకు శుక్రవారం నోటిఫికేష¯ŒS విడుదలైంది. గోదావరికి సంబంధించి రాష్ట్రంలో నిర్మాణం పూర్తయి న ప్రాజెక్ట్ ధవళేశ్వరంలోని సర్ఆర్థర్ కాట¯ŒS బ్యారేజ్. ప్రస్తుతం గోదావరిపై ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి నీటి వినియోగాన్ని బోర్డు పరిశీలిస్తుంది. రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందాల మేరకు నీటి వినియోగం జరిగేలా బోర్డు చూస్తుంది. ఒకవేళ ఇరురాష్ట్రాలకు మధ్య ఏదైనా వాదనలు చోటుచేసుకున్న సమయంలో బోర్డు మధ్యవర్తిత్వం వ్యవహరించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తుంది. ట్రిబ్యునల్‌లో ఇచ్చిన కేటాయింపుల ప్రకారం నీటి పంపిణీ చేయాల్సి ఉంటుంది. గోదావరిపై ప్రాజెక్టులకు సంబంధించి అన్ని నివేదికలను గోదావరి బోర్డుకు సమర్పించాల్సి ఉంటుంది. ధవళేశ్వరం కాట¯ŒSబ్యారేజీకి సంబంధించి ఖరీఫ్‌లో ఎటువంటి నీటి ఇబ్బందులు లేవు. ఖరీఫ్ సమయంలో వరదల సీజ¯ŒS కావడంతో భారీగా మిగులు జలాలు సముద్రంలోకి వెళ్లిపోతున్నాయి. ప్రధానంగా రబీలోనే నీటి ఇబ్బందులు ఉంటున్నాయి. ఒక్కోసారి సహజలాలు పూర్తిగా తగ్గిపోవడంతో ఎగువ ప్రాంతాలపై ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా సీలేరుపైనే ఆధారపడాల్సి వస్తుంది. బ్యారేజ్‌కు సంబంధించి నిర్వహణ పనులు,నీటి వినియోగాన్ని కూడా ఇకపై బోర్డే పర్యవేక్షించనుంది. -
ఇంటి వద్ద కూర్చోబెట్టి.. హైటెక్ మోసం
నెలకు రూ.30 వేలు సంపాదించవచ్చంటూ ఆశ పెట్టిన సంస్థ ∙బోర్డు తిప్పేసిన ‘ఆపిల్ ఔట్ సోర్సింగ్’! కంబాలచెరువు (రాజమõß ంద్రవరం) : ‘ఎలాంటి ఖర్చు లేకుండా ఇంటి వద్దే ఉంటూ నెలకు రూ.30 వేలు సంపాదించవచ్చు..’ ఇలాంటి ప్రకటన ఎవరికైనా ఇట్టే ఆకట్టుకుంటోంది. అలాగే ఆశపడిన అనేక మంది సొమ్ము పోగొట్టుకుని, ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. ఇంటి వద్ద కంప్యూటర్ ద్వారా వారు చెప్పినట్టు చేస్తే.. ఒక్క రూపాయి రాకపోగా, ఇంటర్నెట్ కనెక్షన్‌కు తడిసిమోపెడైంది. రాజమహేంద్రవరంలో ‘ఆపిల్ ఔట్సోర్సింగ్’ సంస్థ నిర్వాకంతో బాధితులు లబోదిబోమంటున్నారు. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తన ఫేస్బుక్ అకౌంట్లో శ్రీవల్లి అనే యువతి ఓ ఆకర్షిణీయమైన ప్రకటన చూసింది. ఇంటి వద్ద నుంచే నెలకు వేలకు వేల రూపాయలు సంపాదించవచ్చనేది దాని సారాంశం. ఆమె అందులో ఫోన్ నంబర్‌కు ఫోన్ చేసింది. ఓ వ్యక్తి ఆమెతో మాట్లాడి, రాజమహేంద్రవరంలోని దానవాయిపేటలో ఉన్న ఆపిల్ ఔట్సోర్సింగ్ కార్యాలయానికి వెళ్లమన్నాడు. అక్కడ నాయుడు అనే వ్యక్తి ఆమెను కలిశాడు. తమ వద్ద నాలుగు రకాల ప్లాన్లు ఉన్నాయని, ఎస్ఎంఎస్లు చేయడం, రోజుకు 500 వీడియోలు వీక్షించడం, రోజంతా నెట్ ఆ¯Œæలో ఉంచడం వంటి ప్లాన్లు చెప్పారు. వాటికి రూ.5,500 నుంచి రూ.10 వేలు చెల్లించాల్సి ఉందన్నాడు. ముందుగా ఫీజు చెల్లించి రిజిస్టర్ చేసుకోవాలని పేర్కొన్నాడు. నగలు తాకట్టు పెట్టి.. మరుసటి రోజు శ్రీవల్లి తన వద్ద ఉన్న బంగారు చెవిదిద్దులు తాకట్టుపెట్టి, రూ.5,500 చెల్లించి, ఆ సంస్థలో రిజిస్టర్ అయింది. ఆమెకు ధ్రువపత్రంతో పాటు కంప్యూటర్ ఐడీ ఇచ్చారు. ఇంటర్నెట్ కనెక్షన్ కోసం ఆమె మరో రూ.వెయ్యి అప్పు చేయాల్సి వచ్చింది. రోజుకు 500 వీడియోలు చూసే ప్లాన్ చేపట్టి, కొద్దిరోజులకు అస్వస్థతకు గురైంది. రెండు నెలలు గడిచినా.. ఆమెకు ఒక్క పైసా కూడా రాలేదు. దీంతో సంస్థ కార్యాలయానికి వెళితే, ఆపిల్ ఔట్సోర్సింగ్ షిఫ్ట్ టు హైదరాబాద్ అనే బోర్డు కనిపించడంతో అవాక్కైంది. దీనిపై ఆరాతీస్తే.. నాయుడు అనే వ్యక్తి ఆఫీసు మార్చి వెళ్లిపోయాడని తెలిసింది. అదే సమయంలో మరికొందరు బాధితులు అక్కడకు చేరుకుని, విషయం తెలిసి బావురుమన్నారు. ఈ విషయాన్ని ‘సాక్షి’కి వివరించారు. అక్కడున్న సిబ్బందిని ప్రశ్నించగా, పొంతన లేని సమాధానాలు చెప్పారు. నాయుడు అనే వ్యక్తి తమకూ జీతాలు ఇవ్వలేదని తెలిపారు. ప్రస్తుతం ఆఫీసు నిర్వహిస్తున్న రాజు అనే వ్యక్తి.. తాను ఎనిమిది ఐడీలకు సొమ్ము చెల్లించానని పేర్కొన్నాడు. బాధితులు ఫిర్యాదు చేస్తే చర్యలు సంస్థ బోర్డు తిప్పేయడంపై అర్బన్‌జిల్లా ఎస్పీ రాజకుమారిని వివరణ కోరగా, ఈ సంఘటనపై ఆరా తీస్తామని చెప్పారు. బాధితులు ఒన్‌టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చే స్తే, చర్యలు తీసుకుంటామన్నారు. -
శ్రీశైలం విద్యుత్‌పై కొత్త వివాదం!
♦ ‘తాగునీటి’ విద్యుత్‌లో తెలంగాణకు ♦ సగం వాటా ఇచ్చేందుకు ఏపీ తిరస్కరణ ♦ న్యాయం చేయాలని కోరుతూ కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ సాక్షి , హైదరాబాద్ : తెలంగాణ, ఏపీల మధ్య మరో విద్యుత్ జగడం మొదలైంది. ఇరు రాష్ట్రాల తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం నుంచి విడుదలయ్యే నీటితో ఉత్పత్తయ్యే విద్యుత్ పంపకంలో వివాదం ముసురుకుంది. ఈ విద్యుత్‌ను చెరిసగం పంచుకోవాల్సి ఉన్నా... 50 శాతం వాటా ఇచ్చేందుకు ఏపీ నిరాకరిస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం కుడి, ఎడమ కాల్వల కింద సుమారు 42 టీఎంసీల మేర నీటిని విడుదల చేసేందుకు బోర్డు అంగీకరించిన విషయం తెలిసిందే. ఆ నీటితో విద్యుదుత్పత్తి జరుగుతున్నా.. తమకు రావాల్సిన వాటా విద్యుత్‌ను ఏపీ ఇవ్వకపోవడంపై తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఈ అంశాన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్లడంతోపాటు.. సోమవారం బోర్డు సభ్య కార్యదర్శికి లేఖ రాసింది. మొత్తం వాడేస్తున్న ఏపీ.. ఇరు రాష్ట్రాల తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం కుడి, ఎడమ కాల్వల కింద నీటిని విడుదల చేసి, విద్యుదుత్పత్తి కూడా చేస్తారు. ఇలా ఉత్పత్తయ్యే విద్యుత్‌లో తెలంగాణ, ఏపీలు చెరిసగం పంచుకోవాలని కృష్ణా బోర్డు గతంలోనే ఆదేశించింది. కానీ ఇది అమలుకావడం లేదు. ఇటీవలి కృష్ణాబోర్డు భేటీ సందర్భంగా ఈ అంశాన్ని తెలంగాణ లేవనెత్తగా.. కేంద్ర విద్యుత్ శాఖ పరిధిలో ఉన్నందున ఈ అంశాన్ని బోర్డు తేల్చజాలదని ఏపీ తెగేసి చెప్పింది. నీళ్ల పంపకంలో అనుసరిస్తున్న 67ః33 నిష్పత్తి ప్రకారమే విద్యుత్‌ను ఇస్తామంది. జూరాలలో వినియోగిస్తున్న నీటిలో ఏపీకి భాగమిస్తేనే ఈ నిష్పత్తి ప్రకారం నీటిని, విద్యుత్‌ను ఇస్తామని... లేకపోతే 75ః25 పద్ధతిలో ఇస్తామని ఏపీ వాదిస్తోంది. దీంతో విద్యుత్‌ను చెరిసగం పంచాలని తెలంగాణ సోమవారం కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. విద్యుత్ పంపకంలో అన్యాయాన్ని సవరించాలని విజ్ఞప్తి చేసింది. -
ప్రత్యేక సేవలతో ఆకట్టుకున్న హైస్పీడ్ ట్రైన్!
హైస్పీడ్ ట్రైన్ ప్రారంభమైన తరుణంలో హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ లో కొత్తగా కనిపించిన దృశ్యం.. ప్రయాణీకులను అమితంగా ఆకట్టుకుంది. నీలం కోట్లు, బ్లాక్ ప్యాంట్లు ధరించి, ముఖంలో చిరు మందహాసంతో హోస్టెస్ లు మంగళవారం ఉదయం ప్రయాణీకులకు ప్రత్యేకంగా ఆహ్వానం పలకడం.. అత్యంత ఆసక్తికరంగా కనిపించింది. ఇప్పటివరకూ ఒక్క విమాన ప్రయాణీకులకు మాత్రమే అందుబాటులో ఉన్న హోస్టెస్ సేవలు ఇప్పుడు హై స్పీడ్ ట్రైన్.. గతిమాన్ ఎక్స్ ప్రెస్ లో కూడ ప్రవేశ పెట్టడంతో రైల్వే స్టేషన్ లోని సన్నివేశం అందరినీ ఆకర్షించింది. లేడీజ్ అండ్ జెంటిల్మెన్.. అంటూ ప్రయాణీకులు రైల్లో పాటించాల్సిన నియమ నిబంధనలను ప్రయాణీకులకు హోస్టెస్ లు వివరించడం విమాన ప్రయాణాన్ని తలపించింది. సీట్ బెల్టులు పెట్టుకోమని, ఆక్సిజన్ మాస్క్ లు ఎలా సిద్ధం చేసుకోవాలో తెలుపుతూ వారిచ్చే సలహాలు, సూచనలపై ప్రయాణీకులు ఆసక్తిగా వినటం కొత్త గతిమాన్ ఎక్స్ ప్రెస్ లో కనిపించింది. హోస్టెస్ ఉద్యోగం అంటే ఆషామాషీ కాదు... ఎంతో ఛాలెంజింగ్ గా చేయాల్సిన పని. దేలో మొట్టమొదటిసారిగా ప్రవేశ పెట్టిన అత్యంత వేగవంతమైన ట్రైన్ గతిమాన్ ఎక్స్ ప్రెస్. మొదటిరోజు ప్రయాణం ప్రారంభించగానే ఢిల్లీ ఆగ్రాల మధ్య అది అందుకున్న స్సీడ్ గంటకు సుమారు 160 కిలోమీటర్ల పైమాటే. అలా రైలు వేంగంగా ప్రయాణిస్తున్న సమయంలో హోస్టెస్ లు సీట్ల మధ్యనుంచి ఆహార పదార్థాలతో కూడిన ట్రేలు బ్యాలెన్స్ చేస్తూ, వేడి పానీయాల వంటివి ప్రాయాణీకుల మీద పడకుండా జాగ్రత్తగా సర్వ్ చేయాలి. అటువంటి పనిని సవాలుగా తీసుకొన్న హోస్టెస్ లు.... ఎంతో చాక చక్యంగా నిర్వహించారు. శాఖాహార, మాంసాహార భోజన వివరాలు, రైలు వివరాలను ఎప్పటికప్పుడు ప్రయాణీకులకు అందిస్తూ... గతిమాన్ ఎక్స్ ప్రెస్ మొదటి ప్రయాణం ముగింపులో హోస్టెస్ లు ప్రయాణీకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రయాణీకులు తమకు ఎంతో సహకరించారని, వారు చాలా ఆనందంగా ఉన్నారని, తమనిని సాదరంగా ఆహ్వానించి అభినందించారని గతిమాన్ ఎక్స్ ప్రెస్ లో మొదటిరోజు విధులు నిర్వహించిన హోస్టెస్ మాయా తెలిపారు. అయితే ఇటువంటి సేవలు ప్రతి రైల్లోనూ అందించవచ్చుకదా అని అడిగిన ప్రశ్నకు ఆమె సానుకూలంగానే స్పందించినా... అన్ని రైళ్ళలో ఈ సేవలు మహిళలు అందించడం అంత సులభం కాదన్నారు. గతిమాన్ హైక్లాస్ ట్రైన్ కావడంతోపాటు... అందులో ఉన్న సౌకర్యాలు, సమయం అన్నివిధాల మహిళలకు సహకరించే విధంగా ఉంటుందన్నారు. ఈ ట్రైన్ లో ఆన్ బోర్డ్ సేవల ఏర్పాట్లను (క్యాటరింగ్ నుంచి హౌస్ కీపింగ్ వరకూ) ఐఆర్ సీటీసీ ద్వారా నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం రైల్వే మంత్రి సురేష్ ప్రభు జెండా ఊపగా పట్టాలెక్కిన గతిమాన్ ఎక్స్ ప్రెస్.. 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణీకులకు ప్రత్యేక అనుభవాన్ని అందించింది. హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ నుంచి ఆగ్రావరకూ కేవలం 100 నిమిషాల్లో చేరుకొంది. విమాన సర్వీసుకు దీటుగా అన్ని ప్రత్యేక సదుపాయాలను అందుకున్న ప్రయాణీకులు ఆనందం వ్యక్తం చేశారు. -
పర్యాటకం టర్నోవర్ రూ.100 కోట్లు..
టీ పర్యాటక అభివృద్ధి సంస్థ లక్ష్యం ఐదు కోట్ల నికరలాభం కోసం యత్నం కొత్త పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కార్పొరేషన్ బోర్డు సమావేశంలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థను కొత్త పుంతలు తొక్కించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ర్టంలో నూతన పర్యాటక ప్రాంతాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేయడంతోపాటు, గతంలో నిర్లక్ష్యానికి గురైన పర్యాటక ప్రాంతాలకూ పునర్వైభవం తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 100 కోట్ల టర్నోవర్ సాధించాలన్న లక్ష్యంగా పెట్టుకుంది. పర్యాటకాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి బీపీ ఆచార్య నేతృత్వంలో సమావేశమైన రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. గతేడాదితో పోలిస్తే.. తెలంగాణ ప్రాంతాల నుంచి టర్నోవర్ రూ. 60 కోట్లకు పైగా చేరినట్లు అధికారవర్గాలు వివరించాయి. దీనిని మరింత పెంచి రూ.5 కోట్ల నికర ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం 45 కోట్ల రూపాయలు రావాల్సి ఉండగా... ఇటీవలే తొమ్మిది కోట్ల రూపాయలు విడుదల చేసిందని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి బీపీ ఆచార్య వివరించారు. పర్యాటకాభివృద్ధి సంస్థకు జిల్లాల్లో ఉన్న ఆస్తుల పరిరక్షణ, కొత్త ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రస్తుతం రెండు జిల్లాలకు ఒక డివిజనల్ మేనేజర్ ఉన్నారని, ఇకపై ప్రతి జిల్లాకు ఒక మేనేజర్‌ను నియమించాలని పాలక మండలి నిర్ణయించిందన్నారు. వీరికి అత్యవసర మరమ్మతులు ఇతర కార్యక్రమాల కోసం రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వ్యయం చేయడానికి అనుమతినిస్తున్నట్లు తెలిపారు. కార్పొరేషన్‌కు ప్రధాన పర్యాటక కేంద్రం వద్ద ఈ మేనేజర్లు ఉంటార ని పేర్కొన్నారు. పర్యాటక పరంగా జిల్లాల్లోని పర్యాటక శాఖ అధికారులకు, కార్పొరేషన్ అధికారుల మధ్య వీరు సమన్వయం చేస్తారు.