న్యూఢిల్లీ: మీడియా సంస్థ ఎన్‌డీటీవీ బోర్డులో పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ గ్రూప్‌నకు రెండు సీట్లు లభించ నున్నాయి. సంస్థలో 29.18 శాతం వాటాను సొంతం చేసుకున్న నేపథ్యంలో డైరెక్టర్ల బోర్డు రెండు సీట్లను ఆఫర్ చేసినట్లు ఎన్‌డీటీవీ తాజాగా వెల్లడించింది. అదానీ గ్రూప్ ఇటీవలే మరో 26 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్‌ను చేపట్టింది. తద్వారా పబ్లిక్ వాటాదారుల నుంచి 8.26 శాతం వాటాకు సమానమైన 53 లక్షల షేర్లను పొందింది.
ఇదీ చదవండి: StockmarketUpdate కొనసాగుతున్న ఐటీ షేర్ల పతనం: మార్కెట్ ఢమాల్!
ఫలితంగా ఎన్‌డీటీవీలో అదానీ గ్రూప్ వాటా 37.44 శాతానికి ఎగసింది. వెరసి సంస్థ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌ల సంయుక్త వాటా 32.26 శాతాన్ని అధిగమించింది. ఇద్దరు డైరెక్టర్లను నామినేట్ చేసేందుకు వీలుగా అదానీ ఎంటర్‌ప్రైజెస్ అనుబంధ సంస్థ ఆర్‌ఆర్‌పీఆర్ హోల్డింగ్ ప్రయివేట్ లిమిటెడ్‌ను ఆహ్వానించే ప్రతిపాదనను ఈ నెల 9న డైరెక్టర్ల బోర్డు అనుమతించినట్లు ఎన్‌డీటీవీ స్టాక్ ఎక్స్చేంజీజలకు సమాచారమిచ్చింది.(గుడ్‌న్యూస్..ఈ ఐటీ కంపెనీలో కొలువులే కొలువులు)
తదుపరి ఈ నెల 23న నిర్వహించనున్న బోర్డు సమావేశంలో ప్రతిపాదిత అంశాన్ని చేపట్టనున్నట్లు తెలియజేసింది. కాగా.. ఎన్‌డీటీవీలో అతిపెద్ద వాటాదారుగా ఆవిర్భవించడంతో చైర్మన్‌ను నియమించేందుకు సైతం అదానీ గ్రూప్ హక్కును పొందినట్లు తెలుస్తోంది. అయితే ఓపెన్ ఆఫర్ తదుపరి అదానీ గ్రూప్ వాటా వివరాలను ఎన్‌డీటీవీ తాజాగా ఫైలింగ్‌లో స్పష్టం చేయకపోవడం గమనార్హం! (‘క్రోమా’ వింటర్ సీజన్ సేల్..బంపర్ ఆఫర్లు)
Comments
Please login to add a commentAdd a comment