NDTV channel
-
9 భాషల్లో ఎన్డీటీవీ న్యూస్ ఛానల్స్
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌లో భాగమైన మీడియా దిగ్గజం న్యూఢిల్లీ టెలివిజన్ (ఎన్డీటీవీ) తొమ్మి ది భారతీయ భాషల్లో న్యూస్ ఛానల్స్‌ను మొదలుపెట్టే యోచనలో ఉంది. దశలవారీగా వీటిని ప్రారంభించనున్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు సంస్థ తెలియజేసింది. ఇందుకోసం సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అనుమతులు తీసుకోవాలన్న ప్రతిపాదనకు గురువారం జరిగిన సమావేశంలో బోర్డు ఆమోదముద్ర వేసినట్లు వివరించింది. అనుమతులు వచ్చాక చానళ్ల ప్రారంభ తేదీలను స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేస్తామని పేర్కొంది. ఎన్డీటీవీ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌ల వాటాలను కూడా కొనుగోలు చేసిన తర్వాత అదానీ గ్రూప్ గతేడాది డిసెంబర్లో కంపెనీని పూర్తిగా దక్కించుకుంది. 2023 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎన్డీటీవీ రూ. 221 కోట్ల ఆదాయం నమోదు చేసింది. -
ఎన్డీటీవీ బోర్డు: అదానీ గ్రూప్‌నకు 2 సీట్లు ఆఫర్
న్యూఢిల్లీ: మీడియా సంస్థ ఎన్డీటీవీ బోర్డులో పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ గ్రూప్‌నకు రెండు సీట్లు లభించ నున్నాయి. సంస్థలో 29.18 శాతం వాటాను సొంతం చేసుకున్న నేపథ్యంలో డైరెక్టర్ల బోర్డు రెండు సీట్లను ఆఫర్ చేసినట్లు ఎన్డీటీవీ తాజాగా వెల్లడించింది. అదానీ గ్రూప్ ఇటీవలే మరో 26 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్‌ను చేపట్టింది. తద్వారా పబ్లిక్ వాటాదారుల నుంచి 8.26 శాతం వాటాకు సమానమైన 53 లక్షల షేర్లను పొందింది. ఇదీ చదవండి: StockmarketUpdate కొనసాగుతున్న ఐటీ షేర్ల పతనం: మార్కెట్ ఢమాల్! ఫలితంగా ఎన్డీటీవీలో అదానీ గ్రూప్ వాటా 37.44 శాతానికి ఎగసింది. వెరసి సంస్థ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌ల సంయుక్త వాటా 32.26 శాతాన్ని అధిగమించింది. ఇద్దరు డైరెక్టర్లను నామినేట్ చేసేందుకు వీలుగా అదానీ ఎంటర్ప్రైజెస్ అనుబంధ సంస్థ ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్ ప్రయివేట్ లిమిటెడ్‌ను ఆహ్వానించే ప్రతిపాదనను ఈ నెల 9న డైరెక్టర్ల బోర్డు అనుమతించినట్లు ఎన్డీటీవీ స్టాక్ ఎక్స్చేంజీజలకు సమాచారమిచ్చింది.(గుడ్‌న్యూస్..ఈ ఐటీ కంపెనీలో కొలువులే కొలువులు) తదుపరి ఈ నెల 23న నిర్వహించనున్న బోర్డు సమావేశంలో ప్రతిపాదిత అంశాన్ని చేపట్టనున్నట్లు తెలియజేసింది. కాగా.. ఎన్డీటీవీలో అతిపెద్ద వాటాదారుగా ఆవిర్భవించడంతో చైర్మన్‌ను నియమించేందుకు సైతం అదానీ గ్రూప్ హక్కును పొందినట్లు తెలుస్తోంది. అయితే ఓపెన్ ఆఫర్ తదుపరి అదానీ గ్రూప్ వాటా వివరాలను ఎన్డీటీవీ తాజాగా ఫైలింగ్‌లో స్పష్టం చేయకపోవడం గమనార్హం! (‘క్రోమా’ వింటర్ సీజన్ సేల్..బంపర్ ఆఫర్లు) -
స్వతంత్ర మీడియాని అణచివేసేందుకు యత్నాలు
న్యూఢిల్లీ: దేశంలో స్వతంత్ర మీడియాని అణచివేయడానికి బీజేపీ కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రముఖ మీడియా కంపెనీ న్యూఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ (ఎన్డీటీవీ)ను పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ బలవంతపు కొనుగోలుపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ప్రధాని మోదీ ‘‘ఖాస్ దోస్త్’’ (ఆప్త మిత్రుడు) స్వతంత్ర మీడియాని తన గుప్పిట్లోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించింది. ఈ మేరకు కాంగ్రెస్ నాయకులు జైరామ్ రమేష్, కపిల్ సిబల్ ఈ కొనుగోలు వ్యవహారాన్ని తప్పు పట్టారు. ‘అదానీ గ్రూప్ ఎన్డీటీవీని బలవంతంగా కొనుగోలు చేయడం అంటే వారి రాజకీయ, ఆర్థిక అధికారాలను కేంద్రీకరించుకోవడం, స్వతంత్ర మీడియా గొంతు అణిచివేయడమే’ అని జైరామ్ దుయ్యబట్టారు. స్వతంత్ర జర్నలిజంను పారిశ్రామికవేత్తలు తమ గుప్పిట్లోకి తీసుకోవడం ఆందోళనకరమని సిబల్ అన్నారు. ఎన్డీటీవీ షేర్లు 29.18% ఇప్పటికే పరోక్ష పద్ధతిలో దక్కించుకున్న అదానీ గ్రూపు అదనంగా మరో 26% కొనుగోలు చేయడానికి ఓపెన్ ఆఫర్ ఇవ్వడంతో ఈ విషయం బయటకి వచ్చింది. ఇదీ చదవండి: మా ప్రభుత్వాన్ని కూల్చే యత్నం -
వారెవరో తెలిస్తే కాంగ్రెస్‌కే ఇబ్బంది
నల్లకుబేరుల పేర్ల వెల్లడిపై జైట్లీ న్యూఢిల్లీ: విదేశాల్లో అక్రమంగా సంపద దాచుకున్న ఖాతాదార్ల పేర్లు బహిర్గతమైతే ఇరకాటంలో పడేది కాంగ్రెస్ పార్టీయేనని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ వ్యాఖ్యానించారు. నల్లధనం ఖాతాలున్నవారి పేర్లు త్వరలోనే బహిర్గతమవుతాయని, అపుడు బీజీపీకి ఎలాంటి ఇబ్బందీ ఉండబోదని, కాంగ్రెస్‌కే సమస్య ఎదురవుతుందన్నారు. ఎన్డీటీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జైట్లీ మంగళవారం ఈ వ్యాఖ్యలు చేశారు. అభియోగాలు ఎదుర్కొంటున్న నల్లధనం ఖాతాదార్ల పేర్లను త్వరలోనే కోర్టుకు నివేదిస్తామన్నారు. ‘నల్లధనం ఖాతాదార్ల పేర్లు మేం వెల్లడించబోమంటూ మీడియా చెబుతోంది, చట్టప్రకారం పాటించవలసిన నిబంధనలను అమలుచేసిన తర్వాతనే పేర్లను వెల్లడిస్తామని మేం చెబుతున్నాం’. అని జైట్లీ అన్నారు. జర్మనీతో ఉన్న ద్వంద్వ పన్నుల విధింపు నివారణ ఒప్పందం కారణంగా ఖాతాలపై సమాచారం మీడియకు వెల్లడించేందుకు వీలుకాదని, కోర్టుకు వెల్లడించడానికి ఇబ్బందేమీలేదని, కోర్టులో ప్రకటించిన వెంటనే మీడియాలో ప్రచారమవుతుందని జైట్లీ అన్నారు. ఆర్థిక వ్యవహారాల ప్రధాన సలహాదారుగా నియమితుడైన అరవింద్ సుబ్రమణియణ్ అంతర్జాతీయు గుర్తింపు ఉన్న నిపుణుడు, అనుభవశాలి అని జైట్లీ అన్నారు.