Two seats
-
ఎన్డీటీవీ బోర్డు: అదానీ గ్రూప్‌నకు 2 సీట్లు ఆఫర్
న్యూఢిల్లీ: మీడియా సంస్థ ఎన్డీటీవీ బోర్డులో పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ గ్రూప్‌నకు రెండు సీట్లు లభించ నున్నాయి. సంస్థలో 29.18 శాతం వాటాను సొంతం చేసుకున్న నేపథ్యంలో డైరెక్టర్ల బోర్డు రెండు సీట్లను ఆఫర్ చేసినట్లు ఎన్డీటీవీ తాజాగా వెల్లడించింది. అదానీ గ్రూప్ ఇటీవలే మరో 26 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్‌ను చేపట్టింది. తద్వారా పబ్లిక్ వాటాదారుల నుంచి 8.26 శాతం వాటాకు సమానమైన 53 లక్షల షేర్లను పొందింది. ఇదీ చదవండి: StockmarketUpdate కొనసాగుతున్న ఐటీ షేర్ల పతనం: మార్కెట్ ఢమాల్! ఫలితంగా ఎన్డీటీవీలో అదానీ గ్రూప్ వాటా 37.44 శాతానికి ఎగసింది. వెరసి సంస్థ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌ల సంయుక్త వాటా 32.26 శాతాన్ని అధిగమించింది. ఇద్దరు డైరెక్టర్లను నామినేట్ చేసేందుకు వీలుగా అదానీ ఎంటర్ప్రైజెస్ అనుబంధ సంస్థ ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్ ప్రయివేట్ లిమిటెడ్‌ను ఆహ్వానించే ప్రతిపాదనను ఈ నెల 9న డైరెక్టర్ల బోర్డు అనుమతించినట్లు ఎన్డీటీవీ స్టాక్ ఎక్స్చేంజీజలకు సమాచారమిచ్చింది.(గుడ్‌న్యూస్..ఈ ఐటీ కంపెనీలో కొలువులే కొలువులు) తదుపరి ఈ నెల 23న నిర్వహించనున్న బోర్డు సమావేశంలో ప్రతిపాదిత అంశాన్ని చేపట్టనున్నట్లు తెలియజేసింది. కాగా.. ఎన్డీటీవీలో అతిపెద్ద వాటాదారుగా ఆవిర్భవించడంతో చైర్మన్‌ను నియమించేందుకు సైతం అదానీ గ్రూప్ హక్కును పొందినట్లు తెలుస్తోంది. అయితే ఓపెన్ ఆఫర్ తదుపరి అదానీ గ్రూప్ వాటా వివరాలను ఎన్డీటీవీ తాజాగా ఫైలింగ్‌లో స్పష్టం చేయకపోవడం గమనార్హం! (‘క్రోమా’ వింటర్ సీజన్ సేల్..బంపర్ ఆఫర్లు) -
ఇద్దరి కోసం బుల్లి కరెంటు కారు
విద్యుత్తుతో నడిచే కార్లు మనకు కొత్త కాదుకానీ.. పైకప్పు లేకుండా కనిపిస్తున్న ఈ కారు మాత్రం భలే కొత్తగా కనిపిస్తోంది. మోటర్‌బైక్‌కు ఎక్కువ.. కారుకు తక్కువ అన్నట్టుగా ఇందులో రెండు సీట్లు మాత్రమే ఉంటాయి. చిన్నసైజు కారణంగా చిన్న చిన్న గల్లీల్లోనూ హాయిగా దూసుకెళ్లవచ్చు. పార్కింగ్‌కూ, అటు ఇటు తిప్పడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నమాట. ఫర్ఈజ్ అనే సంస్థ డిజైన్ చేసి ఉత్పత్తి చేసింది. దీన్ని ఈ వారంలో జరగబోయే ప్యారిస్ మోటర్ షోలో తొలిసారి దీన్ని ప్రదర్శించనున్నారు. ఒకసారి ఛార్జ్ చేసుకుంటే దాదాపు 160 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలిగే ఈకారులో 17.6 కిలోవాట్/గంటల బ్యాటరీ ప్యాక్ ఉంది. రెండు నుంచి ఆరు గంటల్లోపు పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు. -
రెండు సీట్లున్న జిల్లాల్లో ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి స్థానిక సంస్థల కోటా ఎన్నికలపై ఉత్కంఠ మొదలైంది. గతంతో పోలిస్తే కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్సీ స్థానాల సంఖ్య పెరగడం ఈసారి ప్రాధాన్యం సంతరించుకుంది. తాజా మార్పులతో కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రెండేసి ఎమ్మెల్సీ స్థానాలు ఏర్పడ్డాయి. తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో మొత్తం సీట్ల సంఖ్య 14కు చేరింది. హైదరాబాద్ పరిధిలోని రెండు సీట్ల నుంచి ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్సీల పదవీ కాలం ఇంకా ముగియలేదు. దీంతో మిగతా తొమ్మిది జిల్లాల్లో మొత్తం 12 మంది ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు నగారా మోగింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపాలిటీ, నగర పంచాయతీ కౌన్సిలర్లు, కార్పొరేషన్ పరిధిలోని కార్పొరేటర్లకు ఓటు హక్కు ఉంటుంది. బ్యాలెట్ పద్ధతిన జరిగే ఈ ఓటింగ్‌లో పోటీలో ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలో ఓటు వేసే విధానాన్ని అనుసరిస్తారు. మొత్తం ఓట్లలో సగం కంటే ఎక్కువ ప్రాధాన్య ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ఒక్కో జిల్లాకు ఒక్క సీటు ఉన్నప్పుడు ఈ విధానంలో సందేహాలేమీ ఉత్పన్నం కాలేదు. కానీ, రెండు స్థానాలున్న జిల్లాల్లో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు... నియోజకవర్గ పరిధిలోని ఓటర్లను రెండు సెగ్మెంట్లుగా విభజిస్తారా.. లేదా ప్రతి ఓటరు ఇద్దరు అభ్యర్థులను ఎన్నుకునే అవకాశం కల్పిస్తారా... అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ ఓటింగ్ విధానంపై ఈసీ అధికారులను కలసి సందేహాలు వెలిబుచ్చారు. రెండు స్థానాలున్న జిల్లాలోనూ ఎమ్మెల్సీల ఎన్నిక పాత పద్ధతిలోనే జరుగుతుందని ఈసీ వర్గాలు ధ్రువీకరించాయి. అక్కడి ఓటర్లందరికీ ఇద్దరు అభ్యర్థులను ఎంచుకునే అవకాశముంటుంది. రెండు సీట్లున్నప్పటికీ పోటీ చేసిన అభ్యర్థులందరి పేర్లతో ఒకే బ్యాలెట్ ఉంటుంది. ఆ జిల్లాలోని ఓటర్లు ప్రాధాన్యక్రమంలో తమ ఓటును నమోదు చేయాల్సి ఉంటుంది. వీరిలో అత్యధిక ప్రాధాన్యత ఓట్లు గెలుచుకున్న ఇద్దరు అభ్యర్థులు విజేతలుగా నిలుస్తారు. మొత్తం ఓట్లలో సగం కంటే ఎక్కువ ప్రాధాన్య ఓట్లు సాధించిన అభ్యర్థిని తొలి విజేతగా, తర్వాత సగం కంటే ఎక్కువ ప్రాధాన్య ఓట్లు పొందిన అభ్యర్థిని మరో విజేతగా ప్రకటిస్తారు.