
విద్యుత్తుతో నడిచే కార్లు మనకు కొత్త కాదుకానీ.. పైకప్పు లేకుండా కనిపిస్తున్న ఈ కారు మాత్రం భలే కొత్తగా కనిపిస్తోంది. మోటర్‌బైక్‌కు ఎక్కువ.. కారుకు తక్కువ అన్నట్టుగా ఇందులో రెండు సీట్లు మాత్రమే ఉంటాయి. చిన్నసైజు కారణంగా చిన్న చిన్న గల్లీల్లోనూ హాయిగా దూసుకెళ్లవచ్చు.
పార్కింగ్‌కూ, అటు ఇటు తిప్పడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నమాట. ఫర్‌ఈజ్ అనే సంస్థ డిజైన్ చేసి ఉత్పత్తి చేసింది. దీన్ని ఈ వారంలో జరగబోయే ప్యారిస్ మోటర్ షోలో తొలిసారి దీన్ని ప్రదర్శించనున్నారు. ఒకసారి ఛార్జ్ చేసుకుంటే దాదాపు 160 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలిగే ఈకారులో 17.6 కిలోవాట్/గంటల బ్యాటరీ ప్యాక్ ఉంది. రెండు నుంచి ఆరు గంటల్లోపు పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment