సాక్షి, మోతీనగర్(హైదరాబాద్): ప్రజలు తమ ఇళ్లలోని గదులను, దుకాణాలను అద్దెకు ఇవ్వడానికి బయట తమ ఇంటి గోడపై టులెట్ బోర్డును పెట్టడం సర్వసాధారణం. కానీ.. గ్రేటర్ కార్పొరేషన్ ప్రకారం ఇది కుదరదు. టులెట్ బోర్డు పెట్టిన మూసాపేట డివిజన్ పాండురంగనగర్‌లోని ఓ ఇంటి యజమానిని జీహెచ్‌ఎంసీ కంగు తినిపించింది. టులెట్ బోర్డుకి రూ.2 వేలు పన్ను విధించారు. ప్రజా సమస్యలపై స్పందించని జీహెచ్‌ఎంసీ.. ప్రజలతో ఏ విధంగా పన్నులు కట్టించాలనే విధంగా పని చేస్తోందని కూకట్‌పల్లి బీ బ్లాక్ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్ ఆరోపించారు. ఇటువంటి ప్రజావ్యతిరేక విధానాలపై మంతి కేటీఆర్, జిహెచ్‌ఎంసీ కమిషనర్ స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
చదవండి: chicken: భర్త చికెన్ తిన్నాడని క్షణికావేశంలో భార్య ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment