సిగ్నిటీ బోర్డులోకి కొత్తగా ముగ్గురు డైరెక్టర్లు | Signity Technologies appointed three Independent Directors in Board | Sakshi
Sakshi News home page

సిగ్నిటీ బోర్డులోకి కొత్తగా ముగ్గురు డైరెక్టర్లు

Published Wed, Jul 5 2017 2:15 AM | Last Updated on Tue, Sep 5 2017 3:12 PM

సిగ్నిటీ బోర్డులోకి కొత్తగా ముగ్గురు డైరెక్టర్లు

సిగ్నిటీ బోర్డులోకి కొత్తగా ముగ్గురు డైరెక్టర్లు

హైదరాబాద్‌: ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌ సర్వీసెస్‌ సంస్థ ‘సిగ్నిటీ టెక్నాలజీస్‌’ తాజాగా ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లను బోర్డులోకి తీసుకుంది. వీరిలో క్వాలిఫైడ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్‌ ఆర్‌.కె.అగర్వాల్, గ్లోబల్‌ ఐటీ ఇండస్ట్రీ వెటరన్‌ ఫణీశ్‌ మూర్తి, ఇన్వెంచర్‌ అకాడమీ సీఈవో, సహ వ్యవస్థాపకురాలు, మేనేజింగ్‌ ట్రస్టీ నూరిన్‌ ఫజల్‌ ఉన్నారు. ‘సిగ్నిటీ బ్రాండ్‌ను బలోపేతం చేసే దిశగా ఇదో పెద్ద ముందడుగు.

ఈ ముగ్గురిని బోర్డులోకి తీసుకోవడం అనేది కంపెనీకి విలువ జోడించడంతోపాటు భవిష్యత్‌లో మరింత అభివృద్ధిని లక్ష్యించి ముందుకు వెళ్తున్న మాకెంతో ఉపయోగపడుతుంది. వీరి సహకారంతో ప్రపంచంలో అతిపెద్ద, అత్యంత గౌరవనీయమైన స్వతంత్ర సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌ సర్వీసెస్‌ కంపెనీల్లో ఒకటిగా మా ప్రయాణం వేగవంతం అవుతుందని భావిస్తున్నాం’ అని సిగ్నిటీ టెక్నాలజీస్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సి.వి.సుబ్రమణ్యం వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement