Signity Technologies
-
ఐడీసీ మార్కెట్‌స్కేప్‌లో సిగ్నిటీకి చోటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ ఇంజినీరింగ్ సేవలందించే సిగి్నటీ టెక్నాలజీస్‌కు ఐడీసీ మార్కెట్‌స్కేప్ అధ్యయనంలో దిగ్గజ సంస్థగా గుర్తింపు లభించింది. వెండార్ల సేవలను మదింపు చేసే ఈ నివేదికలో.. కస్టమర్లు సిగి్నటీకి అత్యధిక రేటింగ్ ఇచ్చారు. వినూత్న సరీ్వసులను అందించడంలోనూ, తమ సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ సేవల ప్రమాణాలు, వ్యాపా రాలపై వాటి సానుకూల ప్రభావాల గురించి అర్థమయ్యేలా వివరించడంలోనూ సంస్థ సమర్ధమంతంగా పనిచేస్తోందని కస్టమర్లు అభిప్రాయపడ్డారు. కస్టమర్లు తమ వెండార్ల నుంచి నాణ్యత, నైపుణ్యాలు, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ పరిజ్ఞానాన్ని ఆశించడంతో పాటు వారు తమ వ్యాపార వృద్ధికి ఎలా దోహదపడగలరనేది ఆలోచిస్తారని, తదనుగుణంగా వ్యవహరించే సంస్థలే అధిక వృద్ధి సాధించగలవని ఐడీసీ రీసెర్చ్ రీసెర్చ్ వీపీ ముకేశ్ దయలానీ తెలిపారు. కస్టమర్లు తమపై ఉంచిన నమ్మకానికి, వారి వ్యాపారాలకు ఉపయోగపడే సేవలందించడంలో తమ సామరŠాధ్యలకు ఐడీసీ మార్కెట్‌స్కేప్ గుర్తింపు నిదర్శనమని సిగి్నటీ టెక్నాలజీస్ సీఈవో శ్రీకాంత్ చక్కిలం తెలిపారు. -
సిగ్నిటీకి మెడ్‌టెక్ అవార్డు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ ఇంజినీరింగ్ సేవల సంస్థ సిగ్నిటీ టెక్నాలజీస్ 7వ వార్షిక మెడ్‌టెక్ బ్రేక్‌థ్రూ అవార్డ్స్ కార్యక్రమంలో ప్రతిష్టాత్మక పురస్కారం దక్కించుకుంది. తమ ఇంటర్నెట్ ఆఫ్ మెడికల్ థింగ్స్ (ఐవోఎంటీ) డిజిటల్ క్వాలిటీ ఇంజినీరింగ్ ఆటోమేషన్ ఫ్రేమ్‌వర్క్‌కు ’ఉత్తమ ఐవోటీ హెల్త్‌కేర్ ప్లాట్‌ఫాం’ అవార్డు దక్కినట్లు సంస్థ తెలిపింది. వైద్య పరికరాల రంగంలో ఐవోఎంటీ, కనెక్టెడ్ డివైజ్‌ల ప్రాధాన్యం పెరుగుతోందని, ఇవి వ్యయాలను తగ్గించడంతో పాటు హెల్త్‌కేర్ పరిశ్రమ ఎదుర్కొనే సవాళ్ళనూ పరిష్కరించగలవని ఈ సందర్భంగా సిగ్నిటీ సీఈవో శ్రీకాంత్ చకిలం తెలిపారు. మెడికల్ పరికరాల టెస్టింగ్‌కు అవసరమైన అన్ని సామర్థ్యాలు ఐవోఎంటీ ప్లాట్‌ఫామ్‌కు ఉన్నాయని మెడ్‌టెక్ బ్రేక్‌థ్రూ ఎండీ జేమ్స్ జాన్సన్ పేర్కొన్నారు. -
సిగ్నిటీ టెక్నాలజీస్‌కు 36 కోట్ల లాభం
హైదరాబాద్: సిగ్నిటీ టెక్నాలజీస్ సంస్థ సెప్టెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో రూ.215 కోట్ల టర్నోవర్‌పై రూ.36 కోట్ల లాభాన్ని ప్రకటించింది. క్రితం ఆరి్థక సంవత్సరం ఇదే కాలంలో ఉన్న రూ.205 కోట్ల ఆదాయంతో పోలిస్తే 5 శాతం వృద్ధి నమోదైంది. కానీ, నికర లాభం మాత్రం క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఉన్న రూ.49.52 కోట్లతో పోలిస్తే 25 శాతం వరకు తగ్గినట్టు తెలుస్తోంది. కానీ, సీక్వెన్షియల్‌గా చూస్తే మాత్రం కూ1లో నికర లాభం రూ.28.5 కోట్లతో పోలిస్తే వృద్ధి నమోదైంది. క్యూ2లో ఎబిటా రూ.68.52 కోట్లకు పెరిగింది. ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ సేవల్లో సిగ్నిటీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
సిగ్నిటీ బోర్డులోకి కొత్తగా ముగ్గురు డైరెక్టర్లు
హైదరాబాద్: ప్రముఖ సాఫ్ట్వేర్ టెస్టింగ్ సర్వీసెస్ సంస్థ ‘సిగ్నిటీ టెక్నాలజీస్’ తాజాగా ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లను బోర్డులోకి తీసుకుంది. వీరిలో క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆర్.కె.అగర్వాల్, గ్లోబల్ ఐటీ ఇండస్ట్రీ వెటరన్ ఫణీశ్ మూర్తి, ఇన్వెంచర్ అకాడమీ సీఈవో, సహ వ్యవస్థాపకురాలు, మేనేజింగ్ ట్రస్టీ నూరిన్ ఫజల్ ఉన్నారు. ‘సిగ్నిటీ బ్రాండ్‌ను బలోపేతం చేసే దిశగా ఇదో పెద్ద ముందడుగు. ఈ ముగ్గురిని బోర్డులోకి తీసుకోవడం అనేది కంపెనీకి విలువ జోడించడంతోపాటు భవిష్యత్‌లో మరింత అభివృద్ధిని లక్ష్యించి ముందుకు వెళ్తున్న మాకెంతో ఉపయోగపడుతుంది. వీరి సహకారంతో ప్రపంచంలో అతిపెద్ద, అత్యంత గౌరవనీయమైన స్వతంత్ర సాఫ్ట్వేర్ టెస్టింగ్ సర్వీసెస్ కంపెనీల్లో ఒకటిగా మా ప్రయాణం వేగవంతం అవుతుందని భావిస్తున్నాం’ అని సిగ్నిటీ టెక్నాలజీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సి.వి.సుబ్రమణ్యం వివరించారు.