
హైదరాబాద్: సిగ్నిటీ టెక్నాలజీస్ సంస్థ సెప్టెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో రూ.215 కోట్ల టర్నోవర్‌పై రూ.36 కోట్ల లాభాన్ని ప్రకటించింది. క్రితం ఆరి్థక సంవత్సరం ఇదే కాలంలో ఉన్న రూ.205 కోట్ల ఆదాయంతో పోలిస్తే 5 శాతం వృద్ధి నమోదైంది. కానీ, నికర లాభం మాత్రం క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఉన్న రూ.49.52 కోట్లతో పోలిస్తే 25 శాతం వరకు తగ్గినట్టు తెలుస్తోంది. కానీ, సీక్వెన్షియల్‌గా చూస్తే మాత్రం కూ1లో నికర లాభం రూ.28.5 కోట్లతో పోలిస్తే వృద్ధి నమోదైంది. క్యూ2లో ఎబిటా రూ.68.52 కోట్లకు పెరిగింది. ఇంజనీరింగ్, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ సేవల్లో సిగ్నిటీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment