
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ ఇంజినీరింగ్ సేవల సంస్థ సిగ్నిటీ టెక్నాలజీస్ 7వ వార్షిక మెడ్‌టెక్ బ్రేక్‌థ్రూ అవార్డ్స్ కార్యక్రమంలో ప్రతిష్టాత్మక పురస్కారం దక్కించుకుంది. తమ ఇంటర్నెట్ ఆఫ్ మెడికల్ థింగ్స్ (ఐవోఎంటీ) డిజిటల్ క్వాలిటీ ఇంజినీరింగ్ ఆటోమేషన్ ఫ్రేమ్‌వర్క్‌కు ’ఉత్తమ ఐవోటీ హెల్త్‌కేర్ ప్లాట్‌ఫాం’ అవార్డు దక్కినట్లు సంస్థ తెలిపింది.
వైద్య పరికరాల రంగంలో ఐవోఎంటీ, కనెక్టెడ్ డివైజ్‌ల ప్రాధాన్యం పెరుగుతోందని, ఇవి వ్యయాలను తగ్గించడంతో పాటు హెల్త్‌కేర్ పరిశ్రమ ఎదుర్కొనే సవాళ్ళనూ పరిష్కరించగలవని ఈ సందర్భంగా సిగ్నిటీ సీఈవో శ్రీకాంత్ చకిలం తెలిపారు. మెడికల్ పరికరాల టెస్టింగ్‌కు అవసరమైన అన్ని సామర్థ్యాలు ఐవోఎంటీ ప్లాట్‌ఫామ్‌కు ఉన్నాయని మెడ్‌టెక్ బ్రేక్‌థ్రూ ఎండీ జేమ్స్ జాన్సన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment