medtech zone
-
కోవిడ్ సమయంలో విశాఖలోనే ఉన్నా: చంద్రబాబు
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అనకాపల్లి: ‘కోవిడ్ సమయంలో విశాఖలోనే ఉన్నా. పరిస్థితిని చక్కదిద్దా.. డ్రోన్లతో దోమల్ని నాశనం చేసే టెక్నాలజీని నేనే తీసుకొచ్చా. వాటిని గుర్తించి, డ్రోన్లతోనే చంపించేసి, దోమలరహిత రాష్ట్రంగా ఏపీని చేస్తా.. బెంగళూరు ఎయిర్‌పోర్టు సమీపంలో అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం’..– సీఐఐ ప్రతినిధులతో, మెడ్‌టెక్ జోన్‌లోని భాగస్వాములు, సిబ్బందితో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే వ్యాఖ్యలు.ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా గురువారం విశాఖ పర్యటనకు వచ్చిన చంద్రబాబు విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గురువారం సాయంత్రం ఆయన మెడ్‌టెక్ జోన్‌ను సందర్శించారు. అక్కడ తయారు చేసిన పరికరాల ప్రదర్శనని తిలకించారు. గ్లోబల్ యూనివర్సిటీ ఫర్ మెడికల్ టెక్నాలజీ, నేషనల్ సెంటర్ ఫర్ మెడికల్ మెటీరియల్స్ని ప్రారంభించారు. అనంతరం అక్కడ జరిగిన సదస్సుల్లో మాట్లాడుతూ.. కోవిడ్ సమయంలో విశాఖపట్నంలోనే 8 రోజులు ఉంటూ.. పరిస్థితి మొత్తం చక్కదిద్దిన తర్వాతే వెళ్లాననీ, అదీ తన పని తీరని చెప్పారు. దీంతో విస్తుపోయిన మెడ్‌టెక్ జోన్ ప్రతినిధులు ‘హుద్ హుద్ మయంలో ఉన్నారు’ అని చెప్పారు. వెంటనే చంద్రబాబు సర్దుకుని అవును హుద్‌హుద్ సమయంలో ఉన్నానని అన్నారు. తాను గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మెడ్‌టెక్ జోన్‌కి చాలా ఇబ్బందులొచ్చాయని, ఆటంకాలు సృష్టించారని చెప్పారు. జితేంద్ర శర్మ దీన్ని కాపాడారన్నారు. గత ప్రభుత్వం దీనికి ఎలాంటి సహకారం అందించలేదని అన్నారు. తాను మొదటిసారి సీఎం అయ్యాక ఐటీ పార్క్ క్రియేట్ చేశానని, రెండోసారి సీఎం అయ్యాక బయోటెక్నాలజీ పార్క్ క్రియేట్ చేశానని చెప్పుకొన్నారు. మూడోసారి సీఎం అయ్యాక 275 ఎకరాల్లో మెడికల్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరింగ్ సిస్టమ్ క్రియేట్ చేశానన్నారు. ఇది రూ. 10 వేల కోట్ల టర్నోవర్ సాధించిందని చెప్పారు. ఈ మూడూ చాలా సంతృప్తినిచ్చాయని అన్నారు. మెడ్‌టెక్ జోన్ త్వరలోనే గ్లోబల్ హబ్‌గా మారబోతోందని, దానికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. కోవిడ్ సమయంలో 20 రాష్ట్రాల వారు ఇక్కడ తయారైన సామాగ్రినే వినియోగించినప్పటికీ ఏపీలో గత ప్రభుత్వం వినియోగించలేదని అన్నారు. ఆరోగ్యానికి సంబంధించి పబ్లిక్ పాలసీలు తెవాల్సిన అవసరం ఉందని తెలిపారు. హాస్పిటల్స్, యూనివర్సిటీలు, డయాగ్నసిస్ సెంటర్స్ భాగస్వామ్యంతో నూతన ఆలోచనల్ని ఆవిష్కరించాలని చెప్పారు. ట్రిపుల్ ఐటీల్ని తానే ప్రారంభించానని చెప్పారు. డ్రోన్లతో దోమల్ని నాశనం చేసే టెక్నాలజీని తానే తీసుకొచ్చానన్నారు. వాటిని గుర్తించి, డ్రోన్లతోనే చంపించేసి, దోమలరహిత రాష్ట్రంగా ఏపీని చేస్తానని ప్రకటించారు. లండన్, సింగపూర్‌ను మోడల్‌గా తీసుకొని విశాఖను ఫిన్ టెక్ హబ్‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు.పీ4 విధానంలో భాగస్వామ్యం కండిరాష్ట్ర అభివృద్ధి కోసం పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్ట్నర్షిప్ (పీ4) విధానంలో భాగస్వామ్యం కావాలని సీఐఐ ప్రతినిధులను చంద్రబాబు కోరారు. రాష్ట్రాన్ని పునర్నించే క్రమంలో పరిశ్రమలకు మెరుగైన రాయితీలు కల్పిస్తామన్నారు. సంస్కరణలు రాజకీయంగా నష్టం చేకూర్చినా ప్రజలకు మంచి చేస్తాయన్నారు. ఆర్థికంగా దేశం నంబర్ వన్‌గా ఉన్నప్పుడు ప్రజలు పేదరికంలో మగ్గుతుండటం దేశానికి మంచిది కాదన్నారు. 4, 5 నెలల్లో సోలార్, విండ్ , పంప్డ్ ఎనర్జీ అమలు చేసే తొలి కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. సీఐఐ 2వ యూనివర్సిటీని అమరావతిలో ప్రారంభించాలని కోరారు.పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేంఅనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం దార్లపూడి వద్ద పోలవరం ఎడమ కాలువ అక్విడెక్టు నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని అన్నారు. తన హయాంలో దార్లపూడిలో కాలువ పనులు 70 శాతం జరిగితే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2 శాతమే జరిగాయన్నారు.గత ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని అన్నారు. రాష్ట్రంలో ఒక భూతం ఉందిని, దన్ని పూర్తిగా కంట్రోల్ చేసే భూత వైద్యులు ప్రజలేనంటూ వ్యాఖ్యలు చేశారు. వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలో స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు జరిగితే తానే అడ్డుకున్నానని అన్నారు.ఆ 500 ఎకరాలు జీఎంఆర్‌కే!సాక్షి ప్రతినిధి, విజయనగరం: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ సంస్థ జీఎంఆర్‌కు మరో 500 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధమని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆ భూమిని ఏ విధంగా ఉపయోగిస్తారో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆ సంస్థ ప్రతినిధులకు సూచించారు. ఆయన గురువారం అనకాపల్లి నుంచి హెలికాప్టర్లో భోగాపురం విమానాశ్రయానికి వచ్చి, నిర్మాణంలో ఉన్న రన్‌వేపై దిగారు. ఈ విమానాశ్రయంతో విశాఖపట్నం, విజయనగరం కలిసిపోతాయని, తర్వాత శ్రీకాకుళం జిల్లా కూడా కలుస్తుందని మీడియాతో చెప్పారు. ఈ విమానాశ్రయం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 2015 మే 20న తలపెట్టిందని, తర్వాత వీళ్లు (వైఎస్సార్సీపీని ఉద్దేశించి) వచ్చి ప్రాజెక్టును అడ్డుకునే పరిస్థితి తెచ్చారని వ్యాఖ్యానించారు. 500 ఎకరాలపై లేనిపోని సమస్యలు సృష్టించారన్నారు. కుప్పం, దగదర్తి, నాగార్జునసాగర్, మూలపేట వద్ద విమానాశ్రయాలు నిర్మించాలని ఆలోచిస్తున్నామని చెప్పారు.ప్రజాప్రతినిధులకు చేదు అనుభవంమెడ్టెక్ జోన్ గాజువాక, పెందుర్తి నియోజకవర్గాల పరిధిలో ఉంది. అయినా గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా అయిన పల్లా శ్రీనివాస్‌కు, పెందుర్తి జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబుని అక్కడి కార్యక్రమంలో వేదిక పైకి ఆహ్వానించలేదు. దీంతో వారిద్దరూ అసహనం వ్యక్తం చేశారు.వలంటీర్లతో పనేముంది? మహారాణిపేట (విశాఖ దక్షిణ): రాష్ట్రంలో వలంటీర్లతో పనేముందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆయన గురువారం రాత్రి అధికారులు, ప్రజాప్రతినిధులతో విశాఖ ఎయిర్‌పోర్టులో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వలంటీర్ల వ్యవస్థను ప్రస్తావించారు. వలంటీర్లు లేకపోతే పింఛన్లు ఇవ్వలేరా అంటూ ప్రశ్నించారు. తొలిసారిగా సచివాలయ ఉద్యోగులతో అద్భుతంగా పింఛన్లు పంపిణీ చేశామని చెప్పారు. ఇక వలంటీర్లతో పనేముందంటూ వ్యాఖ్యానించారు. విశాఖ నుంచి బీమిలి మీదుగా భోగాపురం వరకు బీచ్ కారిడార్ అభివృద్ధి చేయాలని, ఈ బీచ్రోడ్ని శ్రీకాకుళం వరకూ వెయ్యాలని సూచించారు.దేశవ్యాప్త నిరసనతో దాడులపై వెనక్కిటీడీపీ మూకలు విశాఖలోని డెక్కన్ క్రానికల్ పత్రిక కార్యాలయంపై దాడి చేయడంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. రాష్ట్రంలో టీడీపీ దాడులను దేశం మొత్తం ఖండించడంతో సీఎం చంద్రబాబు వెనక్కితగ్గేలా మాట్లాడారు. ఇకపై దాడులు, ఆఫీసుల వద్ద నిరసనలు అవసరం లేదనీ, చట్ట ప్రకారం ముందుకెళ్దామని పార్టీ శ్రేణులకు సూచించారు. -
మెడ్‌టెక్ జోన్లో ఎల్‌సీఎన్‌జీ స్టేషన్
సాక్షి, విశాఖపట్నం: సౌత్ ఈస్ట్రన్ రీజియన్ పైప్‌లైన్ (ఎస్ఈఆర్పీఎల్) పరిధిలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మొట్టమొదటి లిక్విఫైడ్ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌సీఎన్‌జీ) స్టేషన్‌ను విశాఖపట్నంలోని ఏపీ మెడ్‌టెక్ జోన్లో ఏర్పాటు చేసింది. ఈ గ్యాస్ స్టేషన్‌ను ఇండియన్ ఆయిల్ సంస్థకు చెందిన సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్(సీజీడీ) బృందం శుక్రవారం ప్రారంభించింది. ఏపీ మెడ్‌టెక్ జోన్‌లోని ఎల్‌సీఎన్‌జీ హబ్ ద్వారా ఏపీ రీజియన్‌కు సంబంధించిన సీఎన్జీ అవసరాలను తక్షణమే తీర్చడంతోపాటు నేచురల్ గ్యాస్ లభ్యత, నిల్వ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచేందుకు అవకాశం ఉంటుంది. -
మెడ్‌టెక్ జోన్లో మెగా ఎక్స్పో సిటీ
సాక్షి, విశాఖపట్నం: కోవిడ్ సమయంలో ర్యాపిడ్ టెస్ట్ కిట్ల తయారీ... భారత వైద్యరంగంలో ప్రపంచస్థాయి గామా రేడియేషన్ సెంటర్... ప్రపంచంలోనే మొదటి డేటా సెంటర్ ఏర్పాటు.. ఇలా వైద్యరంగంలో విప్లవాత్మక ఆవిష్కరణలకు కేంద్రంగా మారిన విశాఖపట్నంలోని ఏపీ మెడ్ టెక్ జోన్ మరో రికార్డును సొంతం చేసుకుంది. తాజాగా ఇండియా ఎక్స్పో సిటీ పేరుతో భారీ ఎగ్జిబిషన్ సెంటర్‌ను నిర్మించింది. కేవలం 150 రోజుల్లోనే లక్షకు పైగా చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఎగ్జిబిషన్ సెంటర్‌ను ఏర్పాటుచేసి రికార్డు సృష్టించింది. ఈ ఇండియా ఎక్స్పో సిటీని శుక్రవారం ప్రారంభించారు. ఇక్కడ తొలి రోజే 5వ ఇంటర్నేషనల్ క్లినికల్ ఇంజినీరింగ్ అండ్ హెల్త్ టెక్నాలజీ మేనేజ్మెంట్ కాంగ్రెస్ ప్రారంభం కావడం విశేషం. ఇవీ ప్రత్యేకతలు... మెడ్‌టెక్ జోన్‌లోని ప్రగతి మైదాన్‌లో 1,03,951 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇండియా ఎక్స్పో సిటీ నిర్మాణ పనులు జూన్ 14న ప్రారంభించారు. శుక్రవారం పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువచ్చారు. మొత్తం 5.40లక్షల పని గంటల్లో నిర్మాణం పూర్తిచేశారు. ఈ ఎక్స్పో సిటీ నిర్మాణం కోసం 3,577 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 718 మెట్రిక్ టన్నుల స్టీల్ వినియోగించారు. రోజుకు 10వేల మంది సందర్శించేలా ఎక్స్పో సిటీని నిర్మించారు. లోపల భాగంలో ఒక్క కోలమ్ కూడా నిర్మించకుండా దీనిని పూర్తి చేయడం విశేషం. ఎక్స్పో సిటీలో నాలుగు కాన్ఫరెన్స్ హాల్స్, బోర్డ్‌రూమ్‌లు ఉన్నాయి. 16 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో డిస్ప్లే షాప్స్ ఏర్పాటుచేసుకోవచ్చు. తొలి రోజే అంతర్జాతీయ సదస్సు ఇండియా ఎక్స్పో సిటీ అందుబాటులోకి వచ్చిన తొలి రోజే అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ మెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్(ఏఏఎంఐ), గ్లోబల్ క్లినికల్ ఇంజినీరింగ్ అలయెన్స్(జీసీఈఏ) ఆధ్వర్యంలో 5వ ఇంటర్నేషనల్ క్లినికల్ ఇంజినీరింగ్ అండ్ హెల్త్ టెక్నాలజీ మేనేజ్మెంట్ కాంగ్రెస్ (ఐసీఈహెచ్‌టీఎంసీ) ప్రారంభమైంది. ఈ నెల 13వ తేదీ వరకు నిర్వహించనున్న సదస్సులో కోవిడ్–19 అనంతర పరిణామాలతోపాటు వైద్య పరికరాల వినియోగం, అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్య పరికరాలు, హెల్త్ మేనేజ్మెంట్ తదితర అంశాలపై చర్చిస్తారు. అమెరికా, చైనా, వెనుజులా, మెక్సికో, స్కాట్లాండ్, బ్రెజిల్, స్పెయిన్, కొలంబియా తదితర దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కాంగ్రెస్‌లో భాగంగానే 14 నుంచి 16వ తేదీ వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆధ్వర్యంలో ఇన్నోవేషన్ ఫోరం సమావేశం కూడా మెట్‌టెక్ జోన్లో నిర్వహించనున్నట్లు ఏఏఎంఐ చీఫ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫీసర్ రాబర్ట్ బరోస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 80కి పైగా దేశాలకు చెందిన జాతీయ ఆరోగ్య మంత్రిత్వ శాఖల ప్రతినిధులు హాజరవుతారని వెల్లడించారు. -
సిగ్నిటీకి మెడ్‌టెక్ అవార్డు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ ఇంజినీరింగ్ సేవల సంస్థ సిగ్నిటీ టెక్నాలజీస్ 7వ వార్షిక మెడ్‌టెక్ బ్రేక్‌థ్రూ అవార్డ్స్ కార్యక్రమంలో ప్రతిష్టాత్మక పురస్కారం దక్కించుకుంది. తమ ఇంటర్నెట్ ఆఫ్ మెడికల్ థింగ్స్ (ఐవోఎంటీ) డిజిటల్ క్వాలిటీ ఇంజినీరింగ్ ఆటోమేషన్ ఫ్రేమ్‌వర్క్‌కు ’ఉత్తమ ఐవోటీ హెల్త్‌కేర్ ప్లాట్‌ఫాం’ అవార్డు దక్కినట్లు సంస్థ తెలిపింది. వైద్య పరికరాల రంగంలో ఐవోఎంటీ, కనెక్టెడ్ డివైజ్‌ల ప్రాధాన్యం పెరుగుతోందని, ఇవి వ్యయాలను తగ్గించడంతో పాటు హెల్త్‌కేర్ పరిశ్రమ ఎదుర్కొనే సవాళ్ళనూ పరిష్కరించగలవని ఈ సందర్భంగా సిగ్నిటీ సీఈవో శ్రీకాంత్ చకిలం తెలిపారు. మెడికల్ పరికరాల టెస్టింగ్‌కు అవసరమైన అన్ని సామర్థ్యాలు ఐవోఎంటీ ప్లాట్‌ఫామ్‌కు ఉన్నాయని మెడ్‌టెక్ బ్రేక్‌థ్రూ ఎండీ జేమ్స్ జాన్సన్ పేర్కొన్నారు. -
ఏపీ, పశ్చిమ ఆ్రస్టేలియా పరస్పర సహకారం
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ – పశ్చిమ ఆస్ట్రేలియా ప్రభుత్వాలు వైద్య రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలను పరస్పరం ఇచ్చిపుచ్చుకోనున్నట్లు పశ్చిమ ఆస్ట్రేలియా ఇన్నోవేషన్, డిజిటల్ ఎకానమీ, మెడికల్ రీసెర్చి మంత్రి స్టీఫెన్ డాసన్ తెలిపారు. శనివారం విశాఖలోని ఏపీ మెడ్‌టెక్ జోన్‌లోని పలు సంస్థలను డాసన్ నేతృత్వంలోని వెస్టర్న్ ఆస్ట్రేలియా ప్రభుత్వ బృందం సందర్శించింది. అనంతరం మంత్రి డాసన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. పరస్పర సహకారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఇప్పటికే ఎనిమిది ఎంవోయూలు కుదుర్చుకున్నట్లు చెప్పారు. అవి సత్వరమే కార్యరూపం దాల్చేలా రెండు ప్రభుత్వాలు చర్యలు కూడా చేపట్టాయన్నారు. వెస్టర్న్ ఆస్ట్రేలియాకు, ఆంధ్రప్రదేశ్‌కు దగ్గర పోలికలున్నాయని చెప్పారు. సుదీర్ఘ తీర ప్రాంతం, వనరుల లభ్యత వంటి వాటిలో సామీప్యత ఉందన్నారు. రోబోటిక్, ఆటోమేషన్, స్పేస్, రక్షణ, ఇంధన రంగాలపై తాము 60 ఏళ్లుగా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామని, వీటి సాంకేతికతను భారత్‌కూ అందిస్తామని తెలిపారు. తమ విద్యార్థులను భారత్‌లో విద్యాభ్యాసానికి పంపిస్తామన్నారు. ఏపీ మెడ్‌టెక్ జోన్ అద్భుత ఆవిష్కరణలతో ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోందని కొనియాడారు. కోవిడ్–19 సమయంలో మెడ్‌టెక్ జోన్ జరిపిన పరిశోధనలు ప్రపంచానికి ఎంతో ఉపయోగపడ్డాయన్నారు. కోవిడ్‌తో వైద్యపరమైన అనేక సవాళ్లు ఎదురయ్యాయని, వాటిని వైద్య సాంకేతికతతో ఎదుర్కోగలుగుతున్నామని, వ్యాక్సిన్‌తో ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామని తెలిపారు. అంతకుముందు మెడ్‌టెక్ జోన్లో వివిధ సంస్థల ప్రతినిధులు, స్టార్టప్‌లతో మంత్రి డాసన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సమావేశమైంది. ఈ సమావేశంలో డాసన్ మాట్లాడుతూ వైద్య రంగంలో అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా మేధావులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. వైద్య, ఆరోగ్య పరిశోధకులకు మూడు, ఐదు సంవత్సరాల ఫెలోషిప్లను అందిస్తున్నట్లు తెలిపారు. అత్యధిక వృద్ధి సామర్థ్యం కలిగిన స్టార్టప్‌లకు మద్దతు ఇచ్చేందుకు పెర్త్ ల్యాండింగ్ ప్యాడ్ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. సాంకేతిక రంగంలోని కంపెనీలు వెస్టర్న్ ఆస్ట్రేలియాలో పెట్టుబడులు పెట్టి వ్యాపారాలను వృద్ధి చేసుకోవచ్చని సూచించారు. ఏపీ మెడ్‌టెక్ జోన్ ఎండీ, సీఈవో జితేంద్రశర్మ మాట్లాడుతూ జీ–20లో భాగంగా వెస్టర్న్ ఆస్ట్రేలియా మెడ్‌టెక్ జోన్‌తో జీ2జీ ఒప్పందానికి ఆలోచన చేయాలని కోరారు. సమావేశంలో వెస్టర్న్ ఆస్ట్రేలియా ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడ్ కమిషనర్ (ఇండియా–గల్ఫ్ రీజియన్) నషీద్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
మెడ్‌టెక్ జోన్లో కృత్రిమ అవయవాల తయారీ
సాక్షి, విశాఖపట్నం: భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) కృత్రిమ అవయవాల తయారీపై దృష్టిసారించింది. ఇందుకోసం పలు ప్రాంతాల్లో అసిస్టివ్ టెక్నాలజీ సెంటర్ల(ఏటీసీ)ను ఏర్పాటు చేసిన ఐసీఎంఆర్.. తాజాగా విశాఖలోనూ ప్రారంభించింది. ఈ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోగా.. కేవలం 30 రోజుల వ్యవధిలోనే నిర్మించడం విశేషం. మరోవైపు, వైద్య ఉపకరణాలకు వేదికగా నిలుస్తూ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్లో మరో తయారీ సంస్థ తన కార్యకలాపాలు ప్రారంభించింది. చక్కెర స్థాయిల్ని తెలిపే బీజీఎంఎస్ పరికరాల తయారీ ప్రాజెక్టుకు యాక్యూరెక్స్ సంస్థ శ్రీకారం చుట్టింది. విశాఖలోని ఏపీ మెడ్‌టెక్ జోన్లో వైద్య పరికరాల తయారీ క్రమక్రమంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం మెడ్‌టెక్ జోన్లో 100కి పైగా సంస్థలు వైద్య పరికరాల ఉత్పత్తి, పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. తాజాగా యాక్యురెక్స్ సంస్థ కూడా తమ పరికరాల తయారీ కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించింది. బ్లడ్ గ్లూకోజ్ మోనిటరింగ్ సిస్టమ్(బీజీఎంఎస్) పరికరాల్ని మెడ్‌టెక్‌జోన్‌లో ఇక నుంచి తయారు చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. దీనికి సంబంధించిన పరిశ్రమని ఇటీవల ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డా.రాజీవ్‌భాల్, ఏఎంటీజెడ్ సీఈవో, ఎండీ డా.జితేంద్రశర్మ ప్రారంభించారు. దేశంలో మొట్టమొదటి యూరిన్ స్ట్రిప్స్ తయారీ సంస్థగా రికార్డు సృష్టించామని, భవిష్యత్తులో మరిన్ని నూతన పరికరాల్ని తయారు చేసేందుకు విశాఖ కేంద్రంగా అడుగులు వేస్తున్నామని యాక్యురెక్స్ ఎండీ అభినవ్ ఠాకూర్ తెలిపారు. -
వైద్య రంగానికి దిక్సూచి.. మెడ్‌టెక్ జోన్
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్.. వైద్య ఉపకరణాల తయారీలో అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన ఈ సంస్థ.. ఇప్పుడు ప్రపంచస్థాయి ఆవిష్కరణలకు, సంస్థలకు కూడా కేరాఫ్‌గా మారింది. వైద్య రంగానికే దిక్సూచిలా మారుతోంది. కోవిడ్ సమయంలో ర్యాపిడ్ టెస్ట్ కిట్స్‌ని తయారు చేసి ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్న మెడ్ టెక్ జోన్ అదే జోరును కొనసాగిస్తోంది. వైద్య రంగంలో ప్రపంచంలోనే మొట్టమొదటి డేటా సెంటర్ ఇటీవల ఇక్కడ ప్రారంభమైంది. రెండు రోజుల క్రితం ప్రపంచస్థాయి గామా రేడియేషన్ సెంటర్ కూడా ప్రారంభమైంది. ఇలాంటి విప్లవాత్మక సంస్థలు ఎన్నో ఈ జోన్లో చోటు కోసం క్యూ కడుతున్నాయి. కరోనాను ఎదుర్కోవడంలో.. కరోనా వైరస్ విజృంభించిన సమయంలో ఆ మహమ్మారిని సమర్ధంగా ఎదుర్కోవడానికి అవసరమైన కిట్లు, ఉపకరణాలను మెడ్‌టెక్ జోన్ అందించింది. ర్యాపిడ్ టెస్ట్ కిట్లని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత మోల్బియో డయాగ్నోస్టిక్స్ కిట్లు, వెంటిలేటర్లు, థర్మల్ స్కానర్ల ఉత్పత్తి చేపట్టింది. ప్రపంచ దేశాలకు అవసరమైన పలు ఉపకరణాలను అందించింది. ప్రతి రోజూ 100 వెంటిలేటర్లు, 500 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, 10 లక్షల ఆర్టీపీసీఆర్ కిట్లు తయారు చేసేది. దీంతో ప్రపంచం దృష్టి మెడ్‌టెక్ జోన్‌పై పడింది. పరిశోధనలు, ఆవిష్కరణలు: ప్రస్తుతం మెడ్‌టెక్ జోన్లో 100 సంస్థలు వైద్య పరికరాల ఉత్పత్తి, పరిశోధనలు చేపడుతున్నాయి. ఎప్పటికప్పుడు అత్యాధునిక వైద్యానికి అవసరమైన పరికరాలు, ఉత్పత్తుల్ని తయారు చేయడంలో ప్రపంచంలోనే ఈ జోన్ ముందు వరసలో నిలుస్తోంది. ఎమ్మారై పరికరాల్లో ఉపయోగించే మాగ్నెట్స్‌లో అత్యుత్తమ ఫలితాల్ని తక్కువ కాలంలోనే అందించేలా సూపర్ కండక్టింగ్ మాగ్నెట్స్‌ని ఇటీవలే తయారు చేసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1.5 టెస్లా ఎమ్మారై కండక్టింగ్ మాగ్నెట్స్‌ని మాత్రమే వినియోగిస్తున్నారు. ఇక్కడ మాత్రం మరింత శక్తివంతమైన సూపర్ కండక్టింగ్ మాగ్నెట్స్‌ని తయారు చేస్తున్నారు. ఎమ్మారైని తయారు చేసే సంస్థకు ఇక్కడి నుంచే ఎగుమతి చేస్తుండటం విశేషం. మరోవైపు.. దేశవ్యాప్తంగా ఆస్పత్రులు, గ్రామీణ కేంద్రాలకు టెలీ రేడియాలజీ సేవలు అందించేందుకు టెలీ రేడియాలజీ సొల్యూషన్స్ (టీఆర్ఎస్) కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. దీని ద్వారా 70 శాతానికిపైగా గ్రామీణ ప్రాంత ప్రజలు రేడియాలజీ సేవల కోసం పట్టణాలు, నగరాలకు పరుగులు తీయాల్సిన అవసరం ఉండదు. ప్రపంచస్థాయి గామా రేడియేషన్ సెంటర్ అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు (ఏఈఆర్బీ) మార్గదర్శకాల మేరకు మెడ్ టెక్‌లో ప్రపంచస్థాయి గామా రేడియేషన్ సెంటర్‌ని రెండు రోజుల క్రితం ప్రారంభించారు. ఇందుకోసం ప్రత్యేక రేడియేషన్ సెంటర్‌ని ఏర్పాటు చేశారు. వైద్యం, వ్యవసాయం, సీ ఫుడ్‌లో నాణ్యమైన ఎగుమతులకు గామా రేడియేషన్ సేవల కేంద్రం ఉపయోగపడుతుంది. ఇందుకోసం కోబాల్ట్–60ని ఉపయోగించనున్నట్లు మెడ్‌టెక్ జోన్ ప్రతినిధులు తెలిపారు. దిగుమతుల నుంచి ఎగుమతులకు.. గతంలో భారత్.. ఏటా రూ.50 వేల కోట్ల విలువైన వైద్య పరికరాలు దిగుమతి చేసుకునేది. ఎప్పుడైతే.. ఏపీ మెడ్‌టెక్ జోన్లో ఉపకరణాల ఉత్పత్తి జోరందుకుందో.. ఈ పరిస్థితి మారిపోయింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే కోట్లాది రూపాయల విలువైన అత్యాధునిక యంత్రాలు ఇక్కడే తయారవుతున్నాయి. ఎమ్మారై యంత్రాలను దిగుమతి చేసుకోవాలంటే రూ.4.5 కోట్లు ఖర్చవుతుంది. మెడ్‌టెక్‌లో కేవలం రూ.98 లక్షలకే వీటిని తయారు చేస్తున్నారు. దీనివల్ల అత్యాధునిక ఎమ్మారై స్కానర్లు తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఒక్కో యంత్రానికి దాదాపు రూ.3.5 కోట్లు ఆదా అవుతుంది. తద్వారా ఎంతో విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. మరిన్ని ఆస్పత్రులు ఎమ్మారై యంత్రాలను ఏర్పాటు చేసుకొనే వెసులుబాటు కలిగింది. ప్రపంచంలోనే తొలిసారిగా.. హెల్త్ క్లౌడ్ వైద్య పరికరాల పరిశ్రమల అవసరాల్ని తీర్చేందుకు డేటా సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా మెడ్‌టెక్ జోన్ మరో అడుగు ముందుకు వేసింది. రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్ టెల్ కార్పొరేషన్‌తో కలిసి కొద్ది నెలల క్రితం ప్రపంచంలోనే తొలిసారిగా వైద్య రంగానికి సంబంధించి హెల్త్ క్లౌడ్ని రూపొందించింది. డిజిటల్ ఆరోగ్య సేవలు, ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ అలయన్స్, రేడియాలజీ ఇమేజింగ్ సర్వీసులు, హెల్త్ డిజిటల్ డేటా.. ఇలా భిన్నమైన ఆరోగ్య సేవల్ని అనుసంధానించేలా డేటా సెంటర్ ఏర్పాటు చేయడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి. ఈ డేటా సెంటర్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆస్పత్రులకు హెల్త్ కేర్ సౌకర్యాలు అందనున్నాయి. ప్రస్తుతం ఈ హెల్త్ క్లౌడ్ అభివృద్ధి దశలో ఉంది. త్వరలోనే పూర్తిస్థాయి సేవలు అందనున్నాయి. ఎంఎస్ఎంఈతో ఒప్పందం ఆరోగ్య రంగంలో సహకారం కోసం కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ ఆధీనంలో ఉన్న ఎంఎస్ఎంఈతోనూ మెడ్‌టెక్ జోన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆరోగ్య రంగంలోని ఎంఎస్ఎంఈల మధ్య పోటీతత్వం పెంచేందుకు ఈ ఒప్పందం ఉపయుక్తం కానుంది. ఇలా.. విభిన్న రీతుల్లో విప్లవాత్మకమైన వైద్య పరికరాల్ని ప్రపంచానికి అందించేలా.. వైద్య పరికరాల తయారీ, ఎగుమతుల్లో భారత్‌ను అగ్రగామిగా నిలిపేందుకు మెడ్‌టెక్ జోన్ కృషి చేస్తోంది. -
ఏపీ మెడ్‌టెక్ జోన్ నుంచి ఎంఆర్ఐ పరికరాలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: వైద్య ఉపకరణాల ఉత్పత్తికి వేదికగా నిలుస్తూ ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్న ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్ మరో అత్యాధునిక ఆవిష్కరణకు కేంద్ర బిందువుగా మారింది. ఎంఆర్ఐ పరికరాల్లో ఉపయోగించే మాగ్నెట్స్‌లో అత్యుత్తమ ఫలితాలను తక్కువ కాలంలోనే అందించేలా సూపర్ కండక్టింగ్ మాగ్నెట్స్‌ని తయారు చేసింది. మెడ్‌టెక్ జోన్ నుంచే పరికరాల ఉత్పత్తి, పరీక్షలు, అభివృద్ధి జరగడం దేశంలోనే తొలిసారి కావడం విశేషం. మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్(ఎంఆర్ఐ)ని అత్యంత శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం, రేడియో తరంగాలను ఉపయోగించడంపై ఆధారపడి ఉంటుంది. ఛాతీ, ఉదరం, మెదడు, వెన్నెముక లేదా కటి ప్రాంతంతో సంబంధం ఉన్న అనేక భాగాల ఆరోగ్య స్థితిగతుల్ని తెలుసుకునేందుకు ఎంఆర్ఐ తీస్తారు. ఎంఆర్ఐ స్కానర్ల నుంచి వచ్చే అయస్కాంత క్షేత్రాలు, రేడియో తరంగాలు శరీర కణజాలాల్లో ఉండే ప్రోటాలతో జరిపే పరస్పర చర్య ద్వారా ఆ భాగానికి సంబంధించిన చిత్రాన్ని తీస్తుంది. ఈ స్కాన్ ఆధారంగా.. ఆరోగ్య సమస్యల్ని వైద్యులు నిర్థారిస్తుంటారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 1.5 టెస్లా ఎంఆర్ఐ కండక్టింగ్ మాగ్నెట్స్‌ని మాత్రమే వినియోగిస్తున్నారు. కానీ.. ఏపీ మెడ్‌టెక్ జోన్లో మాత్రం ఎంఆర్ఐలలో అత్యంత కీలకమైన పరికరంగా పరిగణించే సూపర్ కండక్టింగ్ మాగ్నెట్స్‌ని మరింత శక్తివంతంగా తయారు చేశారు. దీని ద్వారా ఎంఆర్ఐ స్కానింగ్ తీసే సమయం మరింత తగ్గే అవకాశం ఉందని మెడ్‌టెక్ వర్గాలు వెల్లడించాయి. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ సూపర్ కండక్టింగ్ మాగ్నెట్స్‌ని ఉత్పత్తి చేయడమే కాకుండా.. మెడ్‌టెక్ జోన్లోనే పరీక్షలు నిర్వహించడంతో పాటు.. పరికరాలనూ అభివృద్ధి చేశారు. ఎంఆర్ఐ స్కానర్‌ను తయారు చేసే అసలు తయారీదారులకు అత్యంత కీలక భాగమైన సూపర్ కండక్టింగ్ మాగ్నెట్స్‌ని విశాఖ నుంచే ఎగుమతి చేస్తున్నారు. -
ఆరోగ్య రంగంలో అపార అవకాశాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆరోగ్య రంగంలో పెట్టుబడులకు దేశవ్యాప్తంగా అనుకూల పరిస్థితులున్నాయని, ఇందులో ఏపీలోని మెడ్‌టెక్ జోన్ కూడా ఉందని నీతి ఆయోగ్ తెలిపింది. ఆసుపత్రులు, వైద్య పరికరాలు, వైద్య బీమా, టెలీమెడిసిన్ తదితర అంశాల్లో పెట్టుబడుల అవకాశాలపై రూపొందించిన నివేదికను నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్, సీఈవో అమితాబ్‌కాంత్, అదనపు కార్యదర్శి డాక్టర్ రాకేశ్ సర్వాల్లు మంగళవారం విడుదల చేశారు. మెడ్‌టెక్ జోన్‌ను వైద్య పరికరాల తయారీ కేంద్రంగా నీతి ఆయోగ్ ప్రస్తావించింది. కరోనా మహమ్మారి చెలరేగిన సమయంలో 15,000 వెంటిలేటర్లు, 10 మిలియన్ల డయాగ్నస్టిక్ కిట్లు, ఐదు లక్షల ఎన్–95 మాస్కులు, 2 లక్షల పీపీఈ కిట్లు ఉత్పత్తైనట్లు తెలిపింది. ‘క్రిటికల్ కాంపొనెంట్లు తయారీ చేసే సంస్థలు దేశంలో చాలా తక్కువగా ఉన్నాయి. డిమాండ్ ఎక్కువగా ఉన్నందున ఈ రంగంలో పెట్టుబడులకు మెడ్‌టెక్ జోన్ అనుకూలం’’ అని నివేదికలో పేర్కొంది. కోవిడ్ సంక్షోభం విసిరిన సవాలు అనేక అవకాశాలకు దారితీయటం వల్ల ఆరోగ్య రంగంలో పెట్టుబడులు పెరుగుతున్నట్లు నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. నివేదికలో ఇతర అంశాలివీ.. ఆరోగ్యంతోపాటు ఉపాధి.. భారత్‌లో ఆరోగ్య రక్షణ రంగం 2016 నుంచి ఏటా 22% చొప్పున పెరుగుతూ వస్తోంది. ఇది 2022లో 372 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. 2015లో ఆరోగ్య రంగం ప్రత్యక్షంగా 4.7 మిలియన్ల మందికి ఉపాధి కల్పించగా 2022 నాటికి 7.5 మిలియన్లకు పెరుగుతుందని నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డీసీ) అంచనా వేసింది. ఆరోగ్య రంగం ఆదాయపరంగా, ఉద్యోగాలపరంగా అతిపెద్ద రంగాలలో ఒకటిగా మారింది. జీవనశైలి వ్యాధుల పెరుగుదల, ప్రభుత్వ –ప్రైవేటు భాగస్వామ్యం, డిజిటల్ టెక్నాలజీ వినియోగం వైద్య రంగం ఎదుగుదలకు కారణం. చికిత్స కోసం విదేశీయుల రాక.. మెడికల్ వీసాతో 2017లో విదేశాల నుంచి 4,95,056 మంది వస్తే 2019లో 6,97,000 మంది భారత్‌కు వచ్చారు. అఫ్గానిస్థాన్, పాకిస్తాన్, ఒమన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, నైజీరియా, కెన్యా, ఇరాక్ నుంచి ఎక్కువగా వస్తున్నారు. గుండె, ఆర్థోపెడిక్, అవయవాల మార్పిడి, న్యూరో, ఆంకాలజీ, బేరియాట్రిక్స్ తదితర చికిత్సల కోసం ఎక్కువ మంది విదేశీయులు వస్తున్నారు. అధునాతన వైద్య విధానాలతోపాటు ఆయుర్వేదం, యోగా ఇతర సంప్రదాయ వైద్య విధానాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. -
ఆ ఒప్పందంతో కీలక మలుపు..
సాక్షి, అమరావతి: కరోనా విజృంభణ నేపథ్యంలో అమెరికాకు చెందిన ఆంఫినాల్ సంస్థ - ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్ లిమిటెడ్ (ఏఎంటీజెడ్) మధ్య జరిగిన ఒప్పందం కీలక మలుపు అవుతుందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. అధునాతన వైద్య పరికరాల తయారీ కోసం సుమారు రూ.20 కోట్లకు పైగా పెట్టుబడులకు ఆంఫినాల్ ఒప్పందం చేసుకోవడం అభినందనీయమన్నారు. ఈ ఎంవోయూతో వందలాది మంది శాస్త్రవేత్తలు, మెడికల్, ఫార్మా, ఇంజినీరింగ్ నిపుణులకు ఉద్యోగవకాశాలు తథ్యమని మంత్రి పేర్కొన్నారు. (చౌకగా ఇంటర్నెట్ అందించడమే లక్ష్యం) వైద్య పరికరాల తయారీలో 70 ఏళ్ల అపార అనుభవమున్న ఆంఫినాల్.. మనిషి శరీరంలో భౌతికమై మార్పులకు సంబంధించిన ఉష్ణోగ్రత, ప్రాణ వాయువైన ఆక్సిజన్, హ్యుమిడిటీ, ఒత్తిడి వంటి వాటి స్థాయిలను కొలిచి, నిర్ధారించే పరికరాల రూపకల్పనలో ప్రత్యేక పేరుందన్నారు. తాజా ఒప్పందంతో ఆంఫినాల్ ఇపుడు అధునాతన సెన్సర్ల తయారీకి చిరునామాగా మారనుందన్నారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి మేకపాటి మాట్లాడుతూ.. ప్రపంచమంతా కోవిడ్-19 విపత్తులా విజృంభిస్తున్న సమయంలో ఇలాంటి వైద్యపరికరాల తయారీ ఒప్పందాలు ఎంతో అవసరమని మంత్రి స్పష్టం చేశారు. 4 నెలల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం, శుభ్రత, మంచి అలవాట్లపై ప్రజలకు శ్రద్ధ పెరిగిందన్నారు(కడప ఉక్కుపై దిగ్గజ కంపెనీల ఆసక్తి) కరోనా కారణంగా వైద్యరంగం, ఫార్మా, పరిశోధనలపై ప్రాముఖ్యత, సముచిత గౌరవం తెచ్చాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. యావత్ ప్రపంచానికి కీలకమైన వైద్యరంగాన్ని మరో స్థాయికి చేర్చే ఈ ఒక్క ఒప్పందం కోట్లాది మంది భవిష్యత్తుకు పరోక్షంగా, ప్రత్యక్షంగా భరోసా కలిగించడం ఖాయమన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ఎంవోయూలో కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్, ప్రొఫెసర్ విజయ్ రాఘవన్, ఫార్మాసిటికల్, మెడికల్ డివైజస్ సెక్రటరీ, పీడీ వాఘేలా, ఎలక్ట్రానిక్స్ శాఖ సెక్రటరీ అజయ్ సాహ్నీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ పాల్గొన్నారు. స్కిల్ యూనివర్శిటీలు, కాలేజీల ఏర్పాటులో మరింత వేగం పెంచాలి.. నైపుణ్య విశ్వవిద్యాలయాలు, కాలేజీల ఏర్పాటు దిశగా మరింత వేగం పెంచాలని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి నైపుణ్యశాఖధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటికే 30 స్కిల్ కాలేజీలకు అవసరమైన భూమిని గుర్తించినట్లు, 12 చోట్ల భూమికి సంబంధించిన సర్వే వివరాలు పూర్తయినట్లు నైపుణ్యవృద్ధి, శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంత రామ్.. మంత్రి గౌతమ్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. అయితే మిగతా భూమి సర్వేలను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి మేకపాటి సూచించారు. స్కిల్ కాలేజీల డిజైనింగ్, లేఅవుట్లకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితిపైనా మంత్రి అడిగి తెలుసుకున్నారు. కపూర్, నిరూప్ సహచరుల బృందాలు తీర్చిదిద్దిన డిజైన్లను మంత్రి పరిశీలించారు. ఒంగోలు, తిరుపతి ప్రాంతాలలో భూమి స్వాధీనం పూర్తయినట్లు వెల్లడించారు. చిత్తూరు జిల్లాలోని కోబాక ప్రాంతంలో ఏర్పాటు చేయాలనుకున్న నైపుణ్య విశ్వవిద్యాలయం కోసం 50 ఎకరాల స్థలాన్ని గుర్తించడం ఇప్పటికే పూర్తయినందున...ఇక తర్వాత పనులను వారంలోగా పూర్తిగా చేయాలని మంత్రి ఆదేశించారు. సీఎం ఆదేశాలనుసారం గుర్తించిన 48 టెక్నికల్ , 31 నాన్ టెక్నికల్ , 20 సెక్టోరల్ కోర్సులు, ల్యాబుల వివరాలపై మంత్రి చర్చించారు. 4 ఐఐటీ కోర్సులపై మంత్రి ఆరా తీశారు. 5 మంది సభ్యులతో కూడిన హైలెవల్ టెక్నికల్ కమిటీ (ఏపీఎస్ఎస్డీసీ, పరిశ్రమల శాఖ ప్రతినిధులు) ప్రతిపాదనలు, అభిప్రాయల మేరకు కోర్సులు, పరికరాలపై నిర్ణయం ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. అవసరమయితే మరో కమిటీని నియమించి రెండో అభిప్రాయం తీసుకుని ముఖ్యమంత్రి నిర్ణయిస్తారన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, కూర్పులో సింగపూర్ పాలిటెక్నిక్, జీఐజెడ్(జర్మనీ) అభిప్రాయాలు సేకరించనున్నట్లు మంత్రి తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన ప్రతిపాదనలు, నైపుణ్యం వంటి అంశాలపై అధ్యయనం కోసం ఈ నెల 22న(బుధవారం) జిల్లా కలెక్టర్లు, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశముంది. పరిశ్రమలకు కావలసిన శిక్షణ, నైపుణ్యం, కోర్సులవంటి విషయాలలో ఐఎస్బీ సహకారంపైనా మంత్రి చర్చించారు. నైపుణ్య కార్యక్రమాలన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడంలో కీలకమైన జీవో.ఎంఎస్.50 అమలులో నైపుణ్య శాఖకు సంబంధించిన అన్ని విభాగాలతో ఒక సమావేశం ఏర్పాటు చేసి కూలంకషంగా చర్చించి, విశ్లేషించుకున్న అనంతరం ముందుకు వెళ్లాలని మంత్రి తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో నైపుణ్యవృద్ధి, శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంతరామ్, ఏపీఎస్ఎస్డీసీ ఛైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, ఎండీ, సీఈవో అర్జా శ్రీకాంత్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పాల్గొన్నారు. -
మెడ్‌టెక్ మాయ
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలో ప్రతిష్టాత్మక మెడ్‌టెక్ జోన్లో రూ.20 కోట్ల వ్యయంతో పరిపాలనా భవనం నిర్మించారు. అది ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షానికే లోపల ఫ్లోరింగ్ 3 అడుగుల మేర కుంగిపోయింది. దీంతో మొత్తం తవ్వేసి, మళ్లీ కాంక్రీట్‌తో ఫ్లోరింగ్ వేశారు. (విశాఖ జిల్లా మెడ్‌టెక్ జోన్ నుంచి గుండం రామచంద్రారెడ్డి): విశాఖపట్నం మెడ్‌టెక్ జోన్లో తవ్వే కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. వైద్య ఉపకరణాల తయారీ కోసం ప్రారంభించిన ఈ జోన్లో రెండున్నరేళ్లుగా ఉత్పత్తులేవీ బయటకు రాలేదు. ఇప్పటిదాకా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు రూ.450 కోట్లు ఖర్చు చేసినా ఫలితం లేకుండాపోయింది. భవనాలు సైతం నాసిరకంగా ఉండటంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మెడ్‌టెక్ జోన్ ద్వారా రూ.5,000 కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నామని, 20,000 మందికి ఉద్యోగాలిస్తామని టీడీపీ ప్రభుత్వం నమ్మబలికింది. రూ.వందల కోట్ల విలువైన 270 ఎకరాల భూమిని ఓ ప్రైవేట్ కన్సల్టెన్సీకి అప్పగించింది. నాలుగు భవనాలు నిర్మించి, అరచేతిలో స్వర్గం చూపింది. కానీ, ఇప్పటికీ పట్టుమని పది ఉద్యోగాలు కూడా రాలేదు. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటివరకూ వచ్చింది కేవలం 10 కంపెనీలే. అవికూడా చిన్నచిన్న అంకుర సంస్థలే. ఇక్కడి పరిస్థితులను తట్టుకోలేక కొన్ని కంపెనీలు ఒప్పందాలు రద్దు చేసుకుని, వెనక్కి వెళ్లిపోయాయి. ఓక్సిల్ గ్రిడ్స్, ఎస్ఎస్ మేజర్, ఫీనిక్స్ వంటి కంపెనీలు ఒప్పందం చేసుకున్నా పనులు చేపట్టే పరిస్థితి లేక నిస్సహాయంగా మిగిలాయి. టీడీపీ సర్కారు హయాంలో ప్రారంభమైన మెడ్‌టెక్ జోన్ అనేది పెద్ద కుంభకోణమన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ జోన్ ముసుగులో అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దలు భారీగా నిధులు కొల్లగొట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మెడ్‌టెక్ జోన్లో చోటుచేసుకున్న అవినీతిపై విచారణకు అక్కడి ప్రతినిధులు తమకు సహకరించడం లేదని విజిలెన్స్ విభాగం అధికారులు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని, పరిస్థితిని చక్కదిద్దితే తప్ప తాము ఇక్కడ ఉండలేమని పెట్టుబడిదారులు తేల్చిచెబుతున్నారు. తనను మెడ్‌టెక్ జోన్ సీఈవో మోసం చేశాడని తమిళనాడు పారిశ్రామిక వేత్త రాసిన లేఖలోని భాగం విడి భాగాల తయారీ బోగస్ ఎంఆర్ఐ, సీటీ స్కాన్ యంత్రాల విడిభాగాలను ఇకపై మెడ్‌టెక్ జోన్లో తయారు చేస్తారని, ఫలితంగా వాటి ధర భారీగా తగ్గుతుందని టీడీపీ ప్రభుత్వం పేర్కొంది. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తే అంతా బోగస్ అని తేటతెల్లమైంది. విడిభాగాల తయారీ కోసం రూ.10 కోట్ల వ్యయంతో నిరి్మంచిన భవనం ఖాళీగా ఉంది. ఇప్పటివరకూ ఎలాంటి ఉత్పత్తులూ లేవు. అప్పట్లో క్యూరా హెల్త్‌కేర్ అనే సంస్థ టెండర్లు దక్కించుకుంది. ఇప్పుడు అడ్రస్ లేకుండాపోయింది. రూ.15 కోట్ల వరకూ వెచ్చించి మెడ్‌టెక్ జోన్లో ల్యాబొరేటరీ పరికరాలు ఏర్పాటు చేశారు. వాటిని వినియోగించుకోవడానికి కంపెనీలు లేకపోవడంతో వృథాగా పడి ఉన్నాయి. పరిశ్రమల శాఖ ప్రమేయం లేకుండా... రాష్ట్ర ప్రభుత్వం, పరిశ్రమల శాఖతో సంబంధం లేకుండా మెడ్‌టెక్ జోన్లో ఓ సమాంతర వ్యవస్థ రాజ్యమేలుతోంది. సాధారణంగా ప్రభుత్వం, పరిశ్రమల శాఖ అనుమతితోనే కొత్త పరిశ్రమలు వస్తుంటాయి. మెడ్‌టెక్ జోన్లో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహారం సాగుతోంది. ఇక్కడ ఏం జరుగుతోందో ప్రభుత్వానికి సమాచారమే ఉండడం లేదు. పరిశ్రమల శాఖ ఇచ్చే రాయితీలు తమకు అందడం లేదని మెడ్‌టెక్ జోన్‌లోని పెట్టుబడిదారులు వాపోతున్నారు. ప్రోత్సాహమా? రియల్ ఎస్టేట్ వ్యాపారమా? మెడ్‌టెక్ జోన్లో జరుగుతున్నది పరిశ్రమలకు ప్రోత్సాహమో, రియల్ ఎస్టేట్ వ్యాపారమో అర్థం కావడం లేదు. ఈ జోన్లో పరిశ్రమ స్థాపించడానికి ముందుకొచ్చా. రూ.11 లక్షలు చెల్లించి, నేను చేసుకున్న ఒప్పందాన్ని అర్ధంతరంగా ఎలాంటి కారణం చూపకుండానే రద్దు చేశారు. నేను చెల్లించిన సొమ్ము తిరిగి ఇవ్వాలని అడిగినందుకు నాకు ఇతర రాష్ట్రాల్లో ఉన్న నా కంపెనీపై దు్రష్పచారం చేశారు. అందుకే రూ.50 కోట్ల పరువు నష్టం దావా వేస్తా. – గోపీనాథ్, డైరెక్టర్, ఆన్లైన్ సర్జికల్స్, చెన్నై మెడ్‌టెక్ జోన్లోకి అనుమతించలేదు మెడ్‌టెక్ జోన్ విషయంలో వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలపై విచారణ చేస్తున్నాం. నన్ను ప్రశ్నించే స్థాయి మీకు లేదని మెడ్‌టెక్ జోన్ సీఈవో అంటున్నారు. విచారణకు కిందిస్థాయి సిబ్బందిని పంపిస్తున్నారు. మాకేమీ తెలియదు అని వారు చెబుతున్నారు. విచారణ చేపట్టడానికి మెడ్‌టెక్ జోన్లోకి మమ్మల్ని అనుమతించలేదు. కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదు. – విజిలెన్స్ అధికారుల బృందం, ఆంధ్రప్రదేశ్ -
‘మెడ్‌టెక్’లో భూముల పందేరం
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో వైద్య పరికరాల తయారీ పేరిట ఏర్పాటు చేసిన ‘మెడ్‌టెక్ జోన్’ అక్రమాలకు ఆలవాలమైంది. దీనికోసం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఆనుకుని కేటాయించిన అత్యంత విలువైన 270 ఎకరాల ప్రభుత్వ భూమిని పందేరం చేసే కార్యక్రమం విచ్చలవిడిగా జరుగుతోంది. ఆసియాలోనే అతిపెద్ద మెడికల్ డివైజెస్ టెక్నాలజీ పార్క్(ఏఎంటీజెడ్–మెడ్‌టెక్ జోన్) పేరుతో జరుగుతున్న ఈ భూపందేరానికి అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ఎవరికి పడితే వారికి పప్పులు, బెల్లానికి ఈ భూమిని కట్టబెడుతున్నారు. దాదాపు రూ.1,350 కోట్ల విలువ చేసే ఈ భూమిపై కన్నేసిన ప్రభుత్వ పెద్దలు.. ఫ్యాక్టరీలు పెడుతున్నారన్న పేరిట తమకు కావాల్సిన వారికి అతి తక్కువ ధరకు లీజుకు అప్పగిస్తున్నారు. ఊరూపేరు లేని కంపెనీలకు, కనీసం టర్నోవర్ కూడా చూపించని వాటికి కట్టబెడుతున్నారు. తద్వారా భారీగా ముడుపులు దండుకుంటున్నారు. అతి తక్కువ ధరకు లీజుకు... విశాఖపట్నం ఉక్కు కర్మాగారం అంటే ఆసియాలోనే పెద్ద పేరున్న పరిశ్రమ. దానికి పక్కనే 270 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇక్కడ ఎకరం కనిష్టంగా రూ.5 కోట్లు విలువ ఉంది. తద్వారా మొత్తం భూమి రూ.1,350 కోట్ల విలువ చేస్తుంది. అలాంటి ఈ భూమిని ప్రభుత్వ పెద్దలు ఫ్యాక్టరీలు పెడుతున్నారన్న పేరుతో తమకు కావాల్సిన వారికి ఎకరం రూ.పాతిక లక్షలకంటే తక్కువకే 33 ఏళ్ల లీజుకు ఇచ్చేస్తున్నారు. ఇప్పటివరకు అక్కడ పరిశ్రమలు పెడతామని వచ్చిన కంపెనీలకు ఊరూపేరూ లేదు. ఎక్కడా టర్నోవర్ చూపించట్లేదు. అలాంటివాటితో సంప్రదింపులు జరిపి ఎంఓయూలు చేసుకోవడం, భూములు ఇచ్చేయడం ద్వారా భారీ ఎత్తున కమీషన్లు కొట్టేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు ఐఏఎస్ అధికారుల్ని సీఈవోలుగా నియమిస్తే అన్యాయాల్ని ప్రశ్నిస్తారన్న ఉద్దేశంతో ఓ ముఖ్యనేత ఒక కన్సల్టెంట్‌ను సీఈఓగా నియమించి భారీస్థాయిలో దందా నడిపిస్తున్నారు. ఇది ఐఏఎస్ అధికారుల్లోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. రూ.5 వేల కోట్లు పెట్టుబడులు.. 20 వేల ఉద్యోగాలు ఎక్కడ? రాష్ట్రంలో వైద్య ఉపకరణాల రేట్లు భారీగా ఉన్నాయని, అవి ఇక్కడే తయారైతే భారీగా రేట్లు తగ్గుతాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మెడ్‌టెక్ జోన్ ఏర్పాటు వల్ల రూ.5 వేల కోట్లు పెట్టుబడులు వస్తాయని, 20 వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. అయితే ఇప్పటివరకు అక్కడ ఆరు షెడ్లు మాత్రమే నిర్మించారు. ఏ ఒక్క కంపెనీ ఇప్పటివరకూ నిర్మాణాలు మొదలుపెట్టలేదు. రూ.1,350 కోట్ల విలువైన భూమిని తీసుకుని కనీసం 13 ఉద్యోగాలు కూడా ఇవ్వలేని దుస్థితి. ఏ కంపెనీలు ఎంత పెట్టుబడి పెట్టాయి, వాటికి ఎక్కడ ఎన్ని ఎకరాలు కేటాయించారు అన్నదీ గోప్యంగా ఉంచారు. మెడ్‌టెక్ జోన్ నిర్మాణాలు చేసే బాధ్యత కూడా ఎలాంటి టెండర్లు పిలవకుండా పవర్‌మెక్ అనే కంపెనీకి కట్టబెట్టారు. ఇక్కడ మెడికల్ డివైజెస్ కంపెనీలు వస్తున్నాయంటూ రాష్ట్రంలో మూడున్నరేళ్లలో వైద్య పరికరాల కొనుగోళ్లలో భారీగా అవినీతికి పాల్పడ్డారు. ఇక్కడ ఫలానా కంపెనీ పెట్టుబడి పెడుతోంది.. అది చెప్పినచోట కొనాలని షరతు పెట్టారు. ఉదాహరణకు ఒక హిమోగ్లోబిన్ మీటర్ రూ.1,500 వాస్తవ ధర అయితే, దాన్ని రూ.16,500కు ప్రభుత్వంతో కొనిపించారు. ఇలా అధిక ధరలు చెల్లించడంవల్ల రాష్ట్రంలో మూడున్నరేళ్లలో కనీసం రూ.150 కోట్లు అధికంగా చెల్లించినట్టు అంచనా. ఇప్పటికీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) కింద నిర్వహణ బాధ్యతలు తీసుకున్న సర్వీస్ ప్రొవైడర్లను బెదిరించి కావాల్సిన వైద్యపరికరాలన్నింటినీ 50 రెట్లు అధిక ధరలకు కొనిపిస్తున్నారు. టెండర్లన్నీ మెడ్‌టెక్ జోన్ సీఈవో తయారు చేయడం, ఏ కంపెనీకి రావాలో అందులోనే నిర్ణయించడం, పనులు ఇవ్వడం, చెప్పినచోట ఎక్కువ రేటుకైనా కొనిపించడం.. వెరసి ఖజానాకు భారీగా దెబ్బపడింది. తక్కువ ధరకు వచ్చే వైద్య పరికరాల్ని దగ్గరుండి ఎక్కువ ధరకు కొనిపించి కమీషన్లు కొట్టేసిన వైనం కళ్లముందే జరుగుతున్నా ముఖ్యనేత ప్రమేయం ఉండటంతో కిమ్మనకుండా అన్నీ జరిగిపోయాయి. లగడపాటిపై ఎందుకంత ప్రేమ? మెడ్‌టెక్ జోన్ నిర్మాణం పనులు 2016లో లగడపాటి రాజగోపాల్‌కు చెందిన ల్యాంకో ఇన్ఫ్రా సంస్థకు అప్పజెప్పారు. అప్పటికే ఈ సంస్థ రిమ్స్‌ల నిర్మాణం సకాలంలో చెయ్యలేకపోయారని ప్రభుత్వమే ఆ సంస్థకు పెనాల్టీ వేసి, కాంట్రాక్టు రద్దు చేసింది. అలాంటి సంస్థనే తెరమీదకు తెచ్చి పనులు కట్టబెట్టారు. వాస్తవానికి ఈ అభివృద్ధి పనులు డీపీఆర్ ప్రకారం రూ.708 కోట్లు ఉండగా.. అంచనాలు భారీగా పెంచి రూ.2,435 కోట్లు చేశారు. ల్యాంకోకు పనులు అప్పజెప్పడమేగాక రూ.43 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సు కింద ఇచ్చారు. తర్వాత ఈ సంస్థపై పలు ఆరోపణలు రావడం, దీనిపై వివిధ మీడియాల్లో కథనాలు రావడంతో ల్యాంకోకు పనులు రద్దుచేశారు. కానీ మొబిలైజేషన్ అడ్వాన్సు కింద ఇచ్చిన నిధులను మాత్రం ల్యాంకో తిరిగివ్వలేదు. ఈ నిధులు రాబట్టడానికి ప్రభుత్వమూ కసరత్తు చేయలేదు. మెడ్‌టెక్ జోన్ పార్కులో మొదట్నుంచే అవినీతి పర్వం కొనసాగుతున్నదనేందుకు ఇది నిదర్శనం. -
సాక్షి ఎఫెక్ట్: మెడ్‌టెక్ జోన్ టెండర్ రద్దు
-
మెడ్‌టెక్ జోన్ వ్యవహారంలో కొత్త మలుపు
విశాఖపట్నం: విశాఖలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మెడ్ టెక్ జోన్ వ్యవహారం కొత్తమలుపు తిప్పింది. ప్రభుత్వ అవినీతిని బయటపెట్టినవారిపై కేసులు నమోదు అయ్యాయి. మెడ్ టెక్ జోన్ నిర్మాణానికి సంబంధించి రూ.500 కోట్ల విలువైన టెండర్ పనులను రూ.2400 కోట్లకు కట్టబెట్టారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యకు కొందరు ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసిన వాళ్ళు సంస్థ సమాచారాన్ని బయటకు పంపారంటూ మెడ్ టెక్ సీఈఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. సంస్థ మాజీ ఇద్దరు ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారం వైద్య శాఖలో తీవ్ర దుమారం రేపుతోంది. కాగా మెడ్ టెక్ జోన్ నిర్మాణంలో అక్రమాలు జరుగుతున్నాయని ఆ జోన్ మాజీ వైస్ ప్రెసిడెంట్(ప్లానింగ్) జూడిష్ రాజ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు అవినీతికి సంబంధించి సంబంధిత మంత్రి కామినేని శ్రీనివాస్ కానీ, ఆ శాఖ ప్రధాన కార్యదర్శిగానీ స్పందించలేదు. -
మెడ్‌టెక్ జోన్ టెండర్లలో గోల్మాల్?
విశాఖపట్నం: మెడ్‌టెక్ జోన్ టెండర్లలో గోల్మాల్ జరిగిందని మెడ్‌టెక్ జోన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ జుడీష్‌రాజు, రామరాజులు ఆరోపించారు. ఈ మేరకు ఆధారాలను వారు మీడియాకు అందజేశారు. మౌలిక వసతుల కల్పన టెండర్లలో అవకతవకలు జరిగాయని, రూ.500 కోట్ల పనులకు వైద్య ఆరోగ్య శాఖ టెండర్లు పిలవగా ఎక్కడా లేని విధంగా 387 శాతం అధిక మొత్తానికి అంటే రూ.2,432 కోట్లకు టెండర్లను ల్యాంకో సంస్థకు ఖరారు చేశారని చెప్పారు. అవినీతిపై ప్రశ్నించినందుకు జోన్ 8 మంది అధికారులను వైద్య ఆరోగ్య శాఖ తొలగించిందని తెలిపారు. ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, సీఈఓ జితేంద్రశర్మ, కామినేని ఓఎస్డీ అంకం సోదరులపై వీరు ఆరోపణలు చేశారు. అలాగే 108 వాహనాల కాంట్రాక్టులోనూ అక్రమాలు జరిగాయని, 76 వాహనాలను ఇంట్రో మెడిక్స్కు అధిక మొత్తానికి అప్పగించారని ఆరోపించారు.