రాజమహేంద్రవరం రూరల్ : విద్యుత్ సంస్థలో ప్రైవేటీకరణను నిలిపివేయాలని ఏపీఎస్‌ఈబీ ఇంజనీర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. మంగళవారం భోజన విరామ సమయంలో బొమ్మూరులోని కార్యాలయం వద్ద ఏపీ ట్రాన్‌కోలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. ఇంజనీర్ల సంఘం బ్రాంచి కార్యదర్శి కె.రత్నాలరావు, జిల్లా కార్యదర్శి రాజ్‌కుమార్, అడిషనల్ సెక్రటరీ జనరల్ ఎన్ .శామ్యూల్ మాట్లాడు
విద్యుత్ సంస్థలో ప్రైవేటీకరణను నిలిపివేయాలి
Nov 22 2016 11:57 PM | Updated on Sep 5 2018 2:25 PM
ఏపీఎస్‌ఈబీ ఇంజనీర్ల సంఘం డిమాండ్
బొమ్మూరు కార్యాలయం వద్ద నిరసన
రాజమహేంద్రవరం రూరల్ : విద్యుత్ సంస్థలో ప్రైవేటీకరణను నిలిపివేయాలని ఏపీఎస్‌ఈబీ ఇంజనీర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. మంగళవారం భోజన విరామ సమయంలో బొమ్మూరులోని కార్యాలయం వద్ద ఏపీ ట్రాన్‌కోలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. ఇంజనీర్ల సంఘం బ్రాంచి కార్యదర్శి కె.రత్నాలరావు, జిల్లా కార్యదర్శి రాజ్‌కుమార్, అడిషనల్ సెక్రటరీ జనరల్ ఎన్ .శామ్యూల్ మాట్లాడుతూ ప్రపంచంలో ఏపీ ట్రా¯Œ్సకో సమర్థమైన సంస్థలలో ఒకటని, దీనిని బిల్డ్ ఓన్ ఆపరేట్ అండ్ మెయింటైన్ పేరుతో ప్రైవేటీకరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. తెలంగాణ నుంచి విడుదల చేసిన ఉద్యోగులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కింద స్థాయిలో అసిస్టెంట్ ఇంజనీర్లను నియమించాలన్నారు. అనంతరం ఏపీట్రాన్ సకో ఎస్‌ఈ శ్యాంప్రసాద్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ట్రాన్ , ఏపీఈపీడీసీఎల్, టీఎల్ అండ్ ఎస్‌ఎస్ జిల్లాలోని ఇంజనీర్లు పాల్గొన్నారు.
Advertisement
Advertisement