Board Issues Class 10 Marks Sheets Carrying Same Photograph to 69 Students In Odisha - Sakshi
Sakshi News home page

Odisha 10th Certificates Issue: 69 మంది పదో తరగతి విద్యార్థుల సర్టిఫికేట్లలో ఒకే ఫొటో.. ఆందోళనలో చిన్నారులు..

Published Tue, Jul 4 2023 2:08 PM | Last Updated on Tue, Jul 4 2023 3:10 PM

Board Issues Class 10 Marks Sheets Carrying Same Photograph to 69 Students In Odisha  - Sakshi

ఒడిశా: సెకంటరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన పదో తరగతి సర్టిఫికేట్లలో 69 మంది విద్యార్థులకు ఒకే ఫొటో వచ్చింది. దీంతో చిన్నారులు ఆందోళనకు గురయ్యారు. కటక్ జిల్లాలోని నిశింతకోహిలీ మండలంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సర్టిఫికేట్లలపై వేరొకరి ఫొటో ఉన్న కారణంగా ఉన్నత విద్య కోసం కాలేజీల్లో అడ్మిషన్లు రద్దవుతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

69 మంది విద్యార్థుల సర్టిఫికేట్లలో వేరొకరి ఫొటో వచ్చింది. అందరి మెమోలపై ఒకరి ఫొటోనే రిపీట్ అయింది. సమ్మేటివ్ అసెస్‌మెంట్‌లో తప్పుగా ఉన్న అడ్మిట్ కార్డులు వచ్చినప్పుడే విషయాన్ని పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లామని బాధిత విద్యార్థులు తెలిపారు. ఆ తప్పును రెండో సమ్మేటివ్ అసెస్‌మెంట్‌లో సరిదిద్దుతామని పాఠశాల యాజమాన్యం హామీ ఇచ్చినట్లు విద్యార్థులు తెలిపారు. కానీ రెండో సమ్మేటివ్ అసెస్‌మెంట్‌లోనూ అడ్మిట్ కార్డ్‌లో అదే లోపం కనిపించినట్లు విద్యార్థులు తెలిపారు. 

అడ్మిట్ కార్డులపై తమ ఫొటోలు అతికిస్తే పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతించారని విద్యార్థులు తెలిపారు. మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్లు తీసుకోవడానికి వెళ్లినప్పుడు అందరి మెమోల్లోనూ అదే తప్పు దొర్లినట్లు విద్యార్థులు చెప్పారు. అందరి సర్టిఫికెట్‌పై ఒకటే ఫొటో ముద్రించినట్లు పేర్కొన్నారు. 

కొన్ని సాంకేతిక సమస్యల  కారణంగానే ఈ తప్పు దొర్లినట్లు ఒడిశా బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ వైస్ ప్రెసిడెంట్ నిహార్ రంజన్ మొహంతి స్పష్టం చేశారు. త్వరలోనే తప్పును సవరించి బాధిత విద్యార్థులకు కొత్త సర్టిఫికేట్లను విడుదల చేస్తామని తెలిపారు. 

ఇదీ చదవండి: ఏమైందో తెలియదు.. యువకుని చెంప చెల్లుమనిపించింది.. వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement