sheets
-
‘నేను పేదవాడిని.. పాస్ చేయండి’.. సమాధాన పత్రంలో వింత అభ్యర్థనలు!
బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు నిర్వహించిన ఇంటర్, మెట్రిక్యులేషన్ పరీక్షల జవాబు పత్రాలను సంబంధిత అధ్యాపకులు దిద్దుతున్నారు. ఈ సమాధాన పత్రాలలో పలువురు విద్యార్థులు తమకు తగినన్ని మార్కులు వేయాలని విన్నవించుకుంటున్నారు. ‘నేను పేదవాడిని. నన్ను పాస్ చేయించండి’ అని ఒక విద్యార్థి వేడుకోగా, మరో విద్యార్థిని ‘సార్, దయచేసి నన్ను పాస్ చేయండి, లేకపోతే మా నాన్న నాకు పెళ్లి చేస్తారు’ అని రాసింది. ఒక విద్యార్థి అత్యంత విచిత్రమైన రీతిలో ప్రశ్నలకు సమాధానాలు రాసే బదులు ప్రేమ లేఖ రాశాడు. జవాబు పత్రాలు దిద్దుతున్న ఉపాధ్యాయులకు వింతవింత సమాధాన పత్రాలు కనిపిస్తున్నాయి. వీటిలో కొన్ని బెదిరింపులు కూడా కనిపిస్తున్నాయని అధ్యాపకులు మీడియాకు తెలిపారు. ఫన్నీ కవితలు, పద్యాలు మొదలైనవి కూడా రాస్తున్నారు. ముఖ్యంగా గమనిక అంటూ పలు సందేశాలను రాస్తున్నారు. విద్యార్థులు తమను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పరీక్షా పత్రాలు దిద్దుతున్న అఖిలేష్ ప్రసాద్ అనే అధ్యాపకుడు మీడియాకు తెలిపారు. -
పుస్తకాలు చూస్తూనే పరీక్ష!
న్యూఢిల్లీ: పరీక్ష గదిలో విద్యార్థుల దగ్గర చీటీలు కనిపిస్తే వీపు వాయగొట్టే ఉపాధ్యాయులనే మనం చూశాం. అయితే పుస్తకాలు, నోటు పుస్తకాలు చూసుకుంటూ ఎగ్జామ్ ఎంచకా రాసుకోండర్రా అని చెప్పే విధానం ఒకదానికి పైలట్ ప్రాజెక్ట్‌గా పరీక్షించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) నిర్ణయించింది. ఈ వినూత్న ఆలోచన 2023 డిసెంబర్లోనే బోర్డ్ కార్యనిర్వాహక వర్గ సమావేశంలో చర్చకొచి్చంది. నిరీ్ణత కాలావధిలో పాఠ్యపుస్తకాలను చూస్తూనే విద్యార్థి పరీక్షగదిలో ఎంత సృజనాత్మకంగా సమాధానాలు రాబట్టగలడు, సూటిగాలేని తికమక, క్లిష్ట ప్రశ్నలకు ఎలా జవాబులు రాయగలడు, విద్యార్థి ఆలోచనా విధానం, విశ్లేషణ సామర్థ్యం వంటి వాటిని మదింపు చేసే ఉద్దేశంతో ఈ ‘ఓపెన్–బుక్ ఎగ్జామ్’ పైలట్ ప్రాజెక్టుకు సీబీఎస్ఈ పచ్చజెండా ఊపింది. అయితే ఈ పరీక్ష విధానాన్ని 10, 12 తరగతి బోర్డ్ పరీక్షలో అమలుచేసే ఆలోచన అస్సలు లేదని సీబీఎస్ఈ అధికారులు స్పష్టంచేశారు. కొన్ని ఎంపిక చేసిన పాఠశాలల్లో 9, 10వ తరగతి విద్యార్థులకు ఇంగ్లి‹Ù, గణితం, సామాన్య శా్రస్తాల్లో, 11, 12వ తరగతి విద్యార్థులకు ఇంగ్లి‹Ù, గణితం, జీవశా్రస్తాల్లో ఈ ఓపెన్–బుక్ ఎగ్జామ్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టనున్నారు. స్టడీ మెటీరియల్‌ను రిఫర్ చేస్తూనే ఇలాంటి ఎగ్జామ్ పూర్తిచేయడానికి విద్యార్థి ఎంత సమయం తీసుకుంటాడు? అనే దానితోపాటు విద్యార్థులు, టీచర్లు, సంబంధిత భాగస్వాముల అభిప్రాయాలనూ సీబీఎస్ఈ పరిగణనలోకి తీసుకోనుంది. ఫార్మాటివ్ అసెస్మెంట్(ఎఫ్ఏ), సమ్మేటివ్ అసెస్మెంట్(ఎస్ఏ)ల కోణంలో ఈ తరహా పరీక్ష అమలు తీరుతెన్నులపై సీబీఎస్ఈ ఓ నిర్ణయానికి రానుంది. -
ఏ సర్కారూ పరీక్షలే పెట్టనట్లు కమిషన్ కాకమ్మ కథలు
సాక్షి, హైదరాబాద్: ఇప్పటిదాకా ఏ సర్కారూ పరీక్షలే పెట్టనట్లు.. ఎవరూ ఉద్యోగాలే ఇవ్వనట్లు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) కాకమ్మ కథలు చెబుతోందని శుక్రవారం ఎక్స్(ట్విట్టర్) వేదికగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. నచ్చినోళ్లకు పదవులు, కావాల్సినోళ్లకు ఉద్యోగాలు.. ఇదే దొర తెచ్చిన బంగారు తెలంగాణ అని విమర్శించారు. చెప్పాలంటే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్‌ను కాస్త.. దొరలు ప్రగతిభవన్ సర్విస్ కమిషన్ గా మార్చారన్నారు. ‘గ్రూప్ 1 పరీక్షలు ఎంత మంది రాశారో ముందొక లెక్క.. ఓఎంఆర్ షీట్స్ లెక్కిస్తే మరో లెక్క.. ఇది చాలా కామన్ అట. ప్రశ్నపత్రాలనే అంగట్లో సరుకుల్లా అమ్ముకున్నోళ్లకు ఓఎంఆర్ షీట్స్ తారుమారుచేయడం ఒక లెక్కనా’అని అన్నారు. బయోమెట్రిక్ విధానం అమలు చేస్తే కమిషన్‌కు వచ్చిన నష్టం ఏంటని షర్మిల సూటిగా ప్రశ్నించారు. -
69 మంది పదో తరగతి విద్యార్థుల సర్టిఫికేట్లలో ఒకే ఫొటో..
ఒడిశా: సెకంటరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన పదో తరగతి సర్టిఫికేట్లలో 69 మంది విద్యార్థులకు ఒకే ఫొటో వచ్చింది. దీంతో చిన్నారులు ఆందోళనకు గురయ్యారు. కటక్ జిల్లాలోని నిశింతకోహిలీ మండలంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సర్టిఫికేట్లలపై వేరొకరి ఫొటో ఉన్న కారణంగా ఉన్నత విద్య కోసం కాలేజీల్లో అడ్మిషన్లు రద్దవుతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 69 మంది విద్యార్థుల సర్టిఫికేట్లలో వేరొకరి ఫొటో వచ్చింది. అందరి మెమోలపై ఒకరి ఫొటోనే రిపీట్ అయింది. సమ్మేటివ్ అసెస్మెంట్లో తప్పుగా ఉన్న అడ్మిట్ కార్డులు వచ్చినప్పుడే విషయాన్ని పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లామని బాధిత విద్యార్థులు తెలిపారు. ఆ తప్పును రెండో సమ్మేటివ్ అసెస్మెంట్లో సరిదిద్దుతామని పాఠశాల యాజమాన్యం హామీ ఇచ్చినట్లు విద్యార్థులు తెలిపారు. కానీ రెండో సమ్మేటివ్ అసెస్‌మెంట్‌లోనూ అడ్మిట్ కార్డ్‌లో అదే లోపం కనిపించినట్లు విద్యార్థులు తెలిపారు. అడ్మిట్ కార్డులపై తమ ఫొటోలు అతికిస్తే పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతించారని విద్యార్థులు తెలిపారు. మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్లు తీసుకోవడానికి వెళ్లినప్పుడు అందరి మెమోల్లోనూ అదే తప్పు దొర్లినట్లు విద్యార్థులు చెప్పారు. అందరి సర్టిఫికెట్‌పై ఒకటే ఫొటో ముద్రించినట్లు పేర్కొన్నారు. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగానే ఈ తప్పు దొర్లినట్లు ఒడిశా బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ వైస్ ప్రెసిడెంట్ నిహార్ రంజన్ మొహంతి స్పష్టం చేశారు. త్వరలోనే తప్పును సవరించి బాధిత విద్యార్థులకు కొత్త సర్టిఫికేట్లను విడుదల చేస్తామని తెలిపారు. ఇదీ చదవండి: ఏమైందో తెలియదు.. యువకుని చెంప చెల్లుమనిపించింది.. వీడియో వైరల్ -
నా భార్యను సౌదీ సేట్‌కు అమ్మేశాడు..
కడప రూరల్: నమ్మించి మోసగించిన గల్ఫ్ ఏజెంట్ తన భార్యను సౌదీ సేట్‌కు అమ్మేశాడని ఓబులవారిపల్లె మండలం జీవీ పురం ఎస్సీ కాలనీకి చెందిన భర్త సాల్వ వెంకటరమణ ఆరోపించారు. తన భార్య ప్రాణాపాయ స్ధితిలో ఉందని ఆమెను ఇండియాకు రప్పించాలని వేడుకున్నారు. శనివారం సాయంత్రం స్ధానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైల్వేకోడూరుకు చెందిన గల్ఫ్ ఏజెంట్ తమను నమ్మించి మోసగించాడని ఆరోపించారు. తన భార్యను 2017 ఆగస్టు 4వ తేదీన సౌదీ దేశ సేట్‌కు అమ్మేశాడని ఆరోపించారు. అక్కడ తన భార్యను సేట్ కుటుంబ సభ్యులు చిత్ర హింసలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఇండియాకు రప్పించాలని లేని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటానని ఆమె కన్నీటి పర్యంతమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై స్ధానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. తమను మోసగించిన ఏజెంట్‌పై చర్యలు చేపట్టాలని కోరారు. -
ఫస్ట్ ఏసీ ప్రయాణికులకు కవర్లలో దుప్పట్లు
► అన్ని ప్రధాన ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అమలు సాక్షి, హైదరాబాద్: ఇప్పటి వరకు ఫస్ట్‌క్లాస్ ఏసీ ప్రయాణికులకు సాధారణంగా అందజేస్తున్న దుప్పట్లను ఇక నుంచి ప్యాక్ చేసి అందజేసేందుకు చర్యలు చేపట్టినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్ కుమార్ తెలిపారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో శుక్రవారం చీఫ్ మెకానికల్ ఇంజనీర్ అర్జున్ ముండ్య, ఇతర అధికారులు.. ప్యాక్ చేసిన దుప్పట్లను ప్రయాణికులకు అందజేశారు. ఇక నుంచి సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్ల నుంచి బయలుదేరే అన్ని ప్రధాన ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని ఫస్ట్ ఏసీ ప్రయాణికులకు దుప్పట్లను కవర్లలో పెట్టి అందించనున్నారు. -
జవాబు పత్రాలు తండ్రికివ్వరా?
విశ్లేషణ ఒక తండ్రి విజయ్ కుమార్ మిశ్రా తన కుమారుడు (కేంద్ర ద్వితీయ స్థాయి విద్యామండలి) సీబీఎస్ఈ నిర్వహించిన 12వ తరగతి లెక్కలు, విజ్ఞాన శాస్త్రం పరీక్షలలో రాసిన జవాబుపత్రాల ప్రతులను ఇమ్మని సమాచార హక్కు చట్టం కింద కోరారు. తమ నియమాల ప్రకారం పరీక్ష రాసిన కొడుకే పత్రాలు అడగాలి కాని ఆయన తండ్రి అడగడానికి వీల్లేదనీ కనుక ఇవ్వబోమని సీబీఎస్ఈ పట్టుపట్టింది. పరీక్ష రాసిన విద్యార్థులకు జవాబు పత్రాల సమాచారం ఇవ్వబోనని సుప్రీంకోర్టు దాకా సీబీఎస్ఈ పోరాడింది. 2011లో ముగ్గురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం జవాబు పత్రాలు ఇచ్చితీరాలని సీబీఎస్ఈని ఆదేశించింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జవాబు పత్రాలు ఇవ్వకూడదని, ఈ విషయంలో ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8(1) (ఇ) ఇచ్చిన మినహాయింపు తమకు వర్తిస్తుందని సీబీఎస్ఈ చేసిన వాదనలన్నింటినీ సుప్రీంకోర్టు కొట్టి పారేసింది. పరోక్షంగా అనేకానేక ప్రతిబంధకాలు కల్పించి జవాబు పత్రాల సమాచారం నిరాకరించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. విజయ్ కుమార్ మిశ్రాను కూడా ఈ విధంగానే వేధించారు. రెండో అప్పీలులో కమిషన్‌కు రాక తప్పలేదు. తమ నియమాల ప్రకారం చివరి తేదీ దాటిన తరవాత దరఖాస్తు వచ్చిందని, అభ్యర్థి కాకుండా అతని తండ్రి అడిగాడు కనుక ఇవ్వబోమని సీబీఎస్ఈ వాదించింది. సంతకం పరిశీలించి అడ్మిట్ కార్డు దరఖాస్తులో ఒక సంతకం ఉంటేనే ఇస్తామని, కానీ మరెవరో సంతకం చేస్తే ఇవ్వబోమని చెప్పింది. ఫలి తాలు ప్రకటించిన పది రోజుల్లో మాత్రమే అడగాలని, దానికి తగిన రుసుము అనుబంధాలు ఇస్తేనే జవాబు కాపీలు ఇస్తామన్నారు. సొంతంగా అభ్యర్థి తన దస్తూరీతో అండర్ టేకింగ్ ఇవ్వాలి. సంతకాల్లో మార్పు ఉండరాదు. పరీక్షించిన అధికారిని సవాలు చేయడానికి వీల్లేదు. కూడికలో తప్పులు విద్యార్థి మాత్రమే పది రోజుల్లో ఎత్తిచూపాలి. మళ్లీ జవాబులు పరిశీలించాలని కోరడానికి వీల్లేదు. పరీక్షించిన అధికారి పేరును కనిపిం చకుండా చేస్తారు. ఆ విధంగా తీసుకున్న జవాబు పత్రా లను ప్రదర్శించడానికి గాను ఏ సంస్థకూ ఇవ్వకూడదు, వార్తాపత్రికలకు ఇవ్వకూడదు, వాణిజ్య అవసరాలకు వాడుకోకూడదు. ఆ విధంగా చేయబోనని ఒక వాగ్దాన పత్రం (అండర్ టేకింగ్)పైన సంతకం చేయాలి. అప్పు డు మాత్రమే జవాబు పత్రాలు ఇస్తామని, లేకపోతే లేదని వాదించారు. జవాబు పత్రాలు కోరిన సమయంలో సీబీఎస్ఈ వద్ద ఆ పత్రాలు ఉంటే వాటిని నిరాకరించడానికి సెక్షన్ 8, 9 కింద మినహాయింపులు వర్తిస్తాయా లేదా అని మాత్రమే పరిశీలించాలి. జవాబు పత్రాల ప్రతులను తయారు చేసే ఖర్చును తీసుకోవాలి. అదీ ఆర్టీఐ నియ మాల ప్రకారమే. జవాబులు పునఃపరిశీలించాలని కోరే హక్కు వదులుకుంటేనే ఇస్తామని, జవాబులు ఎవ్వరికీ చూపబోమని, వాణిజ్య ప్రయోజనాలకు వాడు కోబో మని, ప్రింట్ మీడియాకు ఇవ్వబోమని వాగ్దాన పత్రాలపైన సంతకాలు చేయాలనడం, హక్కులు వాడు కోకుండా ఒత్తిడి చేయడం అవుతుందని, ఇందువల్ల ఆ షరతులన్నీ అసమంజసమైన షరతులనీ, సమాచార హక్కును నిరాకరించడానికి కల్పించిన చట్టవ్యతిరేక పరిస్థితులని కమిషన్ భావించింది. పునః మూల్యాంకనం చేయాలని కోరే హక్కు సహజంగా పరీక్ష రాసిన విద్యార్థికి లభిస్తుంది. కేవలం జవాబు పత్రాన్ని అడిగిన విద్యార్థి ఆ హక్కును వదులుకోవాలని ఒత్తిడి చేయడం ప్రభుత్వ సంస్థకు న్యాయం కాదు. ఒకవేళ అత్యుత్తమ జవాబు పత్రమైతే, ఆ విద్యార్థి తన జవాబు పత్రాన్ని ఇతరులకు ఎందుకు చూపగూడదు? ఆ విద్యార్థికి పాఠాలు చెప్పిన విద్యా సంస్థ ఆ జవాబు పత్రాన్ని గ్రంథాలయంలో ఎందుకు పెట్టగూడదు? మంచి జవాబు రాసినా మార్కులు ఇవ్వకపోతే సీబీఎస్ఈని ఎందుకు విమర్శించకూడదు? అసలు సమాచారం కోరేదే అవసరమైతే వినియోగించడానికి. ఏ విధం గానూ వినియోగించకూడదని షరతులు పెట్టే అధికారం సీబీఎస్ఈకి ఎవరిచ్చారు? మీడియాకు ఇవ్వకూడదని షరతు విధించడం రాజ్యాంగం ఆర్టికల్ 19 (1)(ఎ) కింద పౌరులకు ప్రసాదించిన వాక్ స్వాతంత్య్రాన్ని, అభివ్యక్తి స్వాతంత్య్రాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. అభ్యర్థి తండ్రికి తన కుమారుడి జవాబు పత్రాలు కోరే హక్కు లేదా? అభ్యర్థి మైనర్ బాలకుడే అవుతాడు కనుక అతని సహజ సంరక్షకుడైన తండ్రికి తనయుడి తరపున చట్టపరమైన అన్ని హక్కులు కోరే అధికారం ఉంటుందని చట్టాలు వివరిస్తున్నప్పుడు ఆ హక్కులను నిరాకరించే అధికారం సీబీఎస్ఈకి ఎవరిచ్చారు? సహజ సంరక్షకుడి హోదాలో తండ్రికి తన కుమారుడి విద్యా ప్రయోజనాలను రక్షించే అధికారం ఉండి తీరు తుంది. ఒకవేళ తన కొడుకు జవాబు పత్రాలను సరిగ్గా మూల్యాంకనం చేయలేదని ఆయన అనుమానిస్తే ఆ పరిస్థితిని సవరించి న్యాయం కోరే అధికారం తండ్రికి ఉంది. కుమారుడి జవాబు పత్రాలు ఇవ్వడానికి నిరాకరించడం చట్టవ్యతిరేకం. అసమంజసమైన షరతులు విధించడం ద్వారా అభ్యర్థి సమాచార హక్కును పరిమితం చేయడానికి వీల్లేదు. ఈ విధంగా వేధించినందుకు 25 వేల రూపా యల పరిహారం చెల్లించాలంటూ జరిమానా ఎందుకు విధించకూడదో వివరించాలని కమిషన్ ఆదేశించింది. (విజయకుమార్ మిశ్రా వర్సెస్ సీబీఎస్ఈ పాట్నా, CIC/RM/A/2014/0000014-SA లో డిసెంబర్ 3న నా తీర్పు ఆధారంగా) (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్: మాడభూషి శ్రీధర్) professorsridhar@gmail.com