బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు నిర్వహించిన ఇంటర్, మెట్రిక్యులేషన్ పరీక్షల జవాబు పత్రాలను సంబంధిత అధ్యాపకులు దిద్దుతున్నారు. ఈ సమాధాన పత్రాలలో పలువురు విద్యార్థులు తమకు తగినన్ని మార్కులు వేయాలని విన్నవించుకుంటున్నారు.
‘నేను పేదవాడిని. నన్ను పాస్ చేయించండి’ అని ఒక విద్యార్థి వేడుకోగా, మరో విద్యార్థిని ‘సార్, దయచేసి నన్ను పాస్ చేయండి, లేకపోతే మా నాన్న నాకు పెళ్లి చేస్తారు’ అని రాసింది. ఒక విద్యార్థి అత్యంత విచిత్రమైన రీతిలో ప్రశ్నలకు సమాధానాలు రాసే బదులు ప్రేమ లేఖ రాశాడు.
జవాబు పత్రాలు దిద్దుతున్న ఉపాధ్యాయులకు వింతవింత సమాధాన పత్రాలు కనిపిస్తున్నాయి. వీటిలో కొన్ని బెదిరింపులు కూడా కనిపిస్తున్నాయని అధ్యాపకులు మీడియాకు తెలిపారు. ఫన్నీ కవితలు, పద్యాలు మొదలైనవి కూడా రాస్తున్నారు. ముఖ్యంగా గమనిక అంటూ పలు సందేశాలను రాస్తున్నారు. విద్యార్థులు తమను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పరీక్షా పత్రాలు దిద్దుతున్న అఖిలేష్ ప్రసాద్ అనే అధ్యాపకుడు మీడియాకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment