లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో విచిత్ర ఘటన వెలుగుచూసింది. పరీక్షల్లో జవాబు పత్రాలపై పాటలు, జైశ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్ధులను ప్రొఫెసర్‌లు పాస్ చేశారు. రాష్ట్రంలోని వీర్ బహదూర్ సింగ్ పుర్వాంచల్ యూనివర్సిటీలో ఈ ఉదంతం వెలుగు చూసింది. యూనివర్సీటీలో ఇటీవల ఫార్మసీ పరీక్షలు జరిగాయి. ‘ఫార్మసీని కెరీర్‌గా ఎంచుకోవడం’పై ప్రశ్న రాగా.. పలువురు విర్యార్ధులు తమ జవాబు పత్రాల్లో జై శ్రీరామ్ అని రాశారు.
అంతేగాక హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి క్రికెరట్ల పేర్లు కూడా రాశారు. విచిత్రమేంటంటే.. ఆ విద్యార్థులందరూ పాస్ అయ్యారు. అయితే పలువురు విద్యార్ధులు ఆర్టీఐ దరఖాస్తు ద్వారా ఈ బాగోతం బయటకు వచ్చింది. తమకు మంచి మార్కులు వేసి పాస్ చేసేందుకు పలువురు విద్యార్థులు ప్రొఫెసర్లకు లంచం ఇచ్చారని ఆరోపణలు రాగా, ఇద్దరు ప్రొఫెసర్లు డాక్టర్ వినయ్ వర్మ, మనీష్ గుప్తాలను సస్పెండ్ చే సినట్లు వీసీ పేర్కొన్నారు.
విద్యార్థులకు ఎక్కువ మార్కులు వేసినట్లు వచ్చిన ఆరోపణలపై తాము కమిటీని ఏర్పాటు చేసినట్లు వీసీ తెలిపారు. కమిటీ తన నివేదికలో ఇది నిరూపితం అయినట్లు పేర్కొన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు ఉపాధ్యాయులను హెచ్చరించామన్నారు. అయితే దీనికి పాల్పడినఉపాధ్యాయులను తొలగించాలని కమిటీ సిఫార్సు చేసిందని, అయితే మోడల్ ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున కోడ్ ఎత్తివేసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment