Jai Shri Ram
-
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో విచిత్ర ఘటన వెలుగుచూసింది. పరీక్షల్లో జవాబు పత్రాలపై పాటలు, జైశ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్ధులను ప్రొఫెసర్లు పాస్ చేశారు. రాష్ట్రంలోని వీర్ బహదూర్ సింగ్ పుర్వాంచల్ యూనివర్సిటీలో ఈ ఉదంతం వెలుగు చూసింది. యూనివర్సీటీలో ఇటీవల ఫార్మసీ పరీక్షలు జరిగాయి. ‘ఫార్మసీని కెరీర్‌గా ఎంచుకోవడం’పై ప్రశ్న రాగా.. పలువురు విర్యార్ధులు తమ జవాబు పత్రాల్లో జై శ్రీరామ్ అని రాశారు.అంతేగాక హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి క్రికెరట్ల పేర్లు కూడా రాశారు. విచిత్రమేంటంటే.. ఆ విద్యార్థులందరూ పాస్ అయ్యారు. అయితే పలువురు విద్యార్ధులు ఆర్టీఐ దరఖాస్తు ద్వారా ఈ బాగోతం బయటకు వచ్చింది. తమకు మంచి మార్కులు వేసి పాస్ చేసేందుకు పలువురు విద్యార్థులు ప్రొఫెసర్లకు లంచం ఇచ్చారని ఆరోపణలు రాగా, ఇద్దరు ప్రొఫెసర్లు డాక్టర్ వినయ్ వర్మ, మనీష్ గుప్తాలను సస్పెండ్ చే సినట్లు వీసీ పేర్కొన్నారు. విద్యార్థులకు ఎక్కువ మార్కులు వేసినట్లు వచ్చిన ఆరోపణలపై తాము కమిటీని ఏర్పాటు చేసినట్లు వీసీ తెలిపారు. కమిటీ తన నివేదికలో ఇది నిరూపితం అయినట్లు పేర్కొన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు ఉపాధ్యాయులను హెచ్చరించామన్నారు. అయితే దీనికి పాల్పడినఉపాధ్యాయులను తొలగించాలని కమిటీ సిఫార్సు చేసిందని, అయితే మోడల్ ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున కోడ్ ఎత్తివేసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
హ్యూస్టన్ వీధుల్లో ‘జై శ్రీరాం’ నినాదాలు.. భారీ ర్యాలీ!
జనవరి 22న అయోధ్యలోని నూతన రామాలయంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. భారత్‌లోనే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాల్లో ఈ కార్యక్రమంపై ఆసక్తి నెలకొంది. ఈ నేపధ్యంలో సప్త సముద్రాలు దాటి మరీ ‘జై శ్రీరామ్’ నినాదాలు మిన్నంటుతున్నాయి. అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్టపై అమెరికాలోనూ ఉత్సాహం కనిపిస్తోంది. జనవరి 22న అయోధ్యలో జరిగే పవిత్రోత్సవానికి హాజరుకావాలని ఆలయ నిర్వాహకులకు అమెరికాలోని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆహ్వానం పంపింది. ఈ నేపధ్యంలో హ్యూస్టన్‌లో భక్తులు ఎంతో ఉత్సాహంతో కారు ర్యాలీ చేపట్టారు. హిందూ అమెరికన్ కమ్యూనిటీ సభ్యులు హ్యూస్టన్‌లో ‘జై శ్రీరామ్’ నినాదాలు చేస్తూ, భారీ స్థాయిలో కారు ర్యాలీని చేపట్టారు. 500 మందికి పైగా భక్తులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. 216 కార్లతో ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీ 100 మైళ్ల మేర సాగింది. ఈ ర్యాలీని శ్రీ మీనాక్షి ఆలయం దగ్గర ప్రారంభించి, రిచ్మండ్లోని శ్రీ శారదాంబ ఆలయం వద్ద ముగించారు. జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ చేపట్టిన ఈ ర్యాలీ 11 దేవాలయాల మీదుగా సాగింది. సుమారు రెండు వేల మందికి పైగా భక్తులు సంకీర్తనలతో శోభాయాత్రకు స్వాగతం పలికారు. వీహెచ్‌పీఏ సభ్యుడు అమర్ మాట్లాడుతూ హ్యూస్టన్వాసుల హృదయాల్లో శ్రీరాముడు కొలువైవున్నాడన్నారు. -
పాక్ క్రికెటర్ల ఎదుట ఆ నినాదాలు సరైనవి కావు: ఉదయనిధి
చెన్నై: భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా అభిమానులు జై శ్రీరాం నినాదాలు చేయడాన్ని తమిళనాడు క్రీడా మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఖండించారు. పాకిస్థాన్ క్రికెటర్ల సమక్షంలో అభిమానుల ప్రవర్తన ఎంత మాత్రం అమోదయోగ్యం కాదని అన్నారు. క్రీడలు దేశాన్ని ఐక్యమత్యం చేయడానికి ఉపయోగపడాలి కానీ.. ద్వేషం వ్యాప్తి చెందడానికి సాధనంగా వాడకూడదని చెప్పారు. శనివారం గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ డ్రెస్సింగ్ రూంకు వస్తున్న క్రమంలో అభిమానులు జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిపై ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. సోషల్ మీడియాలో అభిమానుల ప్రవర్తనపై భిన్నరకాల స్పందనలు వచ్చాయి. అభిమానుల అర్ధం లేని వ్యూహంగా కొందరు కామెంట్ పెట్టారు. మరో పది రోజుల్లో చెన్నైలో పాక్ క్రీడాకారులు రెండు మ్యాచ్‌లు అడటానికి వస్తారు. వారందరిని గౌరవంగా స్వాగతించండి అంటూ మరికొందరు స్పందించారు. చెన్నైలో పిచ్ వారికి కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిన్న గుజరాత్లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లోనే బాబార్ ఆజాంకు కోహ్లీ ఆరుదైన బహుమతి కూడా అందించాడు. తన సంతకం చేసిన జెర్సీని కానుకగా పంపించి సోదరభావాన్ని చాటుకున్నాడు. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇండియా-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ సందర్భంగా మహ్మద్ షమీ బౌలింగ్ వేసే క్రమంలో అభిమానులు జై శ్రీ రామ్ అంటూ నినాదాలు చేయడం అప్పట్లో వార్తల్లో నిలిచింది. ఇదీ చదవండి: Udayanidhi Stalin: సనాతన ధర్మంపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు -
వింతగా ప్రవర్తించిన టీమిండియా అభిమానులు..
అహ్మదాబాద్ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు ఆసక్తికరంగా మారింది. ఆట తొలి రెండు రోజులు ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం చూపించింది. ఉస్మాన్ ఖవాజా 180 పరుగులతో టీమిండియాపై కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడగా.. కామెరాన్ గ్రీన్ డెబ్యూ టెస్టు శతకంతో చెలరేగాడు. వెరసి ఆస్ట్రేలియా సిరీస్‌లో తొలిసారి 400 పరుగులు మార్క్‌ను చేరుకుంది. టీమిండియా బౌలర్లు వికెట్లు తీయడంలో చెమటోడ్చారు. ఆ తర్వాత కూడా టెయిలెండర్లు ప్రతిఘటించడంతో 480 పరుగులకు ఆలౌటైంది. అశ్విన్ ఆరు వికెట్లతో చెలరేగాడు. ఇక రెండోరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. మూడోరోజు ఆట టీమిండియాకు కీలకం కానుంది. ఇక రెండోరోజు ఆటలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌కు హాజరైన అభిమానులు కాస్త వింతగా ప్రవర్తించారు. రెండో రోజు చివరి సెషన్లో సూర్యకుమార్ కనిపించగానే సూర్య.. సూర్య అంటూ గట్టిగా అరిచారు. ఆ తర్వాత మహ్మద్ షమీ కనిపించగానే షమీ.. జై శ్రీరామ్.. షమీ.. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. అయితే షమీ దీనిని పెద్దగా పట్టించుకోకుండా అభివాదం చేశాడు. ముస్లిం, హిందులకు ప్రతీకగానే జై శ్రీరామ్ నినాదాలు చేసినట్లు ఒక అభిమాని వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ గర్వంగా చెప్పుకున్నాడు. ఇక షమీ పీటర్ హ్యాండ్స్కోబ్తో పాటు మార్నస్ లబుషేన్ వికెట్లు సాధించాడు. ముఖ్యంగా పీటర్ హ్యాండ్స్‌కోబ్‌ను ఔట్ చేసిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఆసీస్ ఇన్నింగ్స్ 71 ఓవర్ వేసిన షమీ బౌలింగ్‌లో నాలుగో బంతిని హ్యాండ్స్కాంబ్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే మంచి లైన్ అండ్ లెంగ్త్‌లో పడ్డ బంతి బ్యాట్‌ను మిస్స్ అయి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. Shami Ko Jai Shree Ram 🚩 pic.twitter.com/rwVg1yMEaz — Gems of Shorts (@Warlock_Shabby) March 9, 2023 చదవండి: రెండోరోజు ఆట ముగింపు.. కోహ్లి చర్య వైరల్ 'బ్యాటర్‌గా విఫలం.. ఓటములకు పూర్తి బాధ్యత నాదే' -
గడ్కరీ కార్యక్రమంలో జైశ్రీరామ్ నినాదాలు
హైదరాబాద్: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్న ఓ కార్యక్రమంలో ‘జై శ్రీరామ్’ నినాదాలు హోరెత్తాయి. ఓ కార్యక్రమం కోసం గడ్కరీ హైదరాబాద్‌కు వచ్చారు. మైకులో తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతుండగా.. ‘జై శ్రీరామ్, భారత్‌మాతాకి జై’ అంటూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. అక్కడే ఉన్న మరో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జోక్యం చేసుకుని అందరూ ప్రశాంతంగా ఉండాలని వారించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు నినాదాలు ఆపేశారు. శుక్రవారం జాతీయ రహదారుల శంకుస్థాపన కార్యక్రమంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. -
ఫలితాల తర్వాత ఆమె ‘జై శ్రీరామ్’ అనక తప్పదు
కలకత్తా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మూడు విడతల పోలింగ్ ముగియగా ఐదు దశ పోలింగ్ ఉండడంతో పశ్చిమ బెంగాల్లో రాజకీయ వాతావరణం ఇంకా హాట్‌హాట్‌గా ఉంది. అన్ని రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో ప్రధాన పార్టీలు బెంగాల్‌పైనే ప్రధాన దృష్టి సారించాయి. ఈ క్రమంలో తాజాగా గురువారం జరిగిన ఎన్నికల ప్రచారంలో బీజేపీ నాయకుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నాడు. మమతా బెనర్జీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశాడు. మే 2వ తర్వాత మమతా బెనర్జీ ‘జై శ్రీరామ్’ అనక తప్పదని స్పష్టం చేశాడు. ఆ విధంగా అనిపిస్తామని పేర్కొన్నాడు. ఎన్నికల్లో భాగంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ‘హిందూత్వ రాజకీయం’ అంటూ బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలపై స్పందన యోగి ఆదిత్యనాథ్ పై వ్యాఖ్యలు చేశారు. హుగ్లీ జిల్లా కృష్ణరామ్‌పూర్‌లో నిర్వహించిన ప్రచార సభలోభాయన మాట్లాడుతూ.. తృణమూల్ కాంగ్రెస్ రోమియోలను కటకటాల పాలవుతారని తెలిపారు. సీఏఏ ఉద్యమానికి తృణమూల్ కాంగ్రెస్ మద్దతు పలికిందని గుర్తుచేశారు. ప్రస్తుతం వారి ఓటు బ్యాంక్ కోసం వెంపర్లాడుతోందని విమర్శించారు. పశ్చిమ బెంగాల్లో ఏప్రిల్ 9వ తేదీకి ఆఖరి దశ పోలింగ్ ఉంది. మే 2వ తేదీన ఫలితాలు వెలువడుతాయి. -
మీరు జై శ్రీరాం అనాల్సిందే : మంత్రి
రాంచి : దేశ వ్యాప్తంగా దళితులు, ముస్లింలు సహా ఇతర మైనార్టీలపై మూకదాడులపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. జై శ్రీరాం నినాదం పేరిట దాడులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వివిధ రంగాల ప్రముఖులు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలో జార్ఖండ్ పట్టణాభివృద్ధి మంత్రి సీపీ సింగ్ అసెంబ్లీ బయటే ఓ ముస్లిం ఎమ్మెల్యేను జై శ్రీరాం అనాలంటూ ఒత్తిడి చేయడం సంచలనం సృష్టించింది. గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. జార్ఖండ్ శాసన సభ ఆవరణలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ దగ్గరకు వచ్చిన సీపీ సింగ్(బీజేపీ)..ఆయనను గట్టిగా పట్టుకుని..‘ ఇర్ఫాన్ భాయ్, జై శ్రీరాం అని బిగ్గరగా అరవండి. మీ పూర్వీకులు బాబర్ నుంచి కాక రాముడి నుంచి వచ్చారని చెప్పండి. మీకు విఙ్ఞప్తి చేస్తున్నా’ అని ఆయనతో అన్నారు. ఇందుకు స్పందించిన అన్సారీ...‘ జై శ్రీరాం పేరిట మీరు ప్రజలను భయపెడుతున్నారు. రాముడి పేరును అప్రతిష్టపాలు చేస్తున్నారు. మనకు ఇప్పుడు కావాల్సింది ఉద్యోగాలు, ఎలక్ట్రిసిటీ, నీళ్లు, మురికి కాలువలు అంతే అని బదులిచ్చారు. ఈ క్రమంలో జేపీ సింగ్ మాట్లాడుతూ...‘ నేను మిమ్మల్ని భయపెట్టడం లేదండీ. మీ పూర్వీకులు రామనామ స్మరణ చేశారు. తైమూర్, బాబర్, ఘజిని మీ పూర్వీకులు కాదా ఏంటి. వాళ్లంతా రామ భక్తులేనని గుర్తుపెట్టుకోండి’ అని మరోసారి ఆయనతో వాగ్వాదానికి దిగారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో జేపీ సింగ్ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
‘ఆ వ్యాఖ్యలకు పార్లమెంట్ వేదిక కాదు’
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని అమరావతి లోక్‌సభ స్థానం నుంచి పార్లమెంట్‌కు ఎన్నికైన నవనీత్ కౌర్ రానా మొదటి సమావేశాల్లోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశాల్లో భాగంగా సోమవారం లోక్‌సభలో కొత్తగా ఎన్నికైన సభ్యులు పదవీ స్వీకార ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీలు ప్రమాణం చేసే సమయంలో ఆ పార్టీకి చెందిన కొందరు సభ్యులు జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. దీనిపై నవనీత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రమాణం అనంతరం పార్లమెంట్ బయట మీడియాతో మాట్లాడిన ఆమె..‘‘ జైశ్రీరాం అంటూ నినాదాలు చేయడానికి ఇది సరైన వేదిక కాదు. వాటి కోసం ప్రత్యేకంగా దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ అలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. ప్రజా సమస్యలపై చర్చకు మాత్రమే ఇక్కడ చోటుంది’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా అమరావతి నుంచి ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. సోమవారం ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. -
హీట్ తగ్గట్లే..!
-
బెంగాల్లో కొనసాగుతున్న బీజేపీ వర్సెస్ టీఎంసీ
-
'జై శ్రీరాం' అన్నందుకు మంత్రిపై ఫత్వా!
పట్నా: ఇటీవల ప్రమాణం చేసిన బిహార్ మంత్రి, జేడీయూ నేత ఖుర్షీద్ అలియాస్ ఫిరోజ్ అహ్మద్ చిక్కుల్లో పడ్డారు. 'జై శ్రీరాం' అని నినాదాలు చేసినందుకు ఆయనపై ఓ ముస్లిం మతపెద్ద ఫత్వా జారీచేశారు. ఈ 'తప్పిదం' చేసినందుకు ఆయన పెళ్లిని రద్దు చేస్తామని హెచ్చరించారు. శుక్రవారం బిహార్ అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో సీఎం నితీశ్‌కుమార్ విజయం సాధించిన అనంతరం సభ బయట బీజేపీ కార్యకర్తలు 'జై శ్రీరాం' అని నినాదాలు చేశారు. పశ్చిమ చంపారన్ జిల్లాలోని సిక్తా ఎమ్మెల్యే అయిన ఖుర్షీద్ సైతం వారితో కలిసి నినాదాలు చేశారు. ఆర్జేడీ-కాంగ్రెస్‌తో పొత్తును తెగదెంపులు చేసుకొని బీజేపీతో కలిసి నితీశ్ మళ్లీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. బిహార్, జార్ఖండ్, ఒడిశాలలో క్రియాశీలంగా ఉన్న మతసంస్థ ఇమారత్ షరియాకు చెందిన ముఫ్తి సోహైల్ క్వాస్మి మంత్రి ఖుర్షీద్‌కు వ్యతిరేకంగా ఫత్వా జారీచేశారు. అయితే, ఈ ఫత్వాను మంత్రి ఖుర్షీద్ తోసిపుచ్చారు. 'అన్ని మతాలను గౌరవించాలని ఇస్లాం బోధిస్తుంది. జై శ్రీరాం అనడం ద్వారా నేను ముస్లింలకు మంచి చేసే వీలుంటే.. ఇలా గగ్గోలు పెట్టడం దేనికి' అని మైనారిటీ సంక్షేమం, చక్కెర పరిశ్రమల శాఖమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఖుర్షీద్ క్షమాపణలు చెప్పారు. ఎవరి మనోభావాలు దెబ్బతీయొద్దన్న సీఎం సూచన మేరకు క్షమాపణలు చెప్తున్నట్టు తెలిపారు.