చెన్నై: భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా అభిమానులు జై శ్రీరాం నినాదాలు చేయడాన్ని తమిళనాడు క్రీడా మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఖండించారు. పాకిస్థాన్ క్రికెటర్ల సమక్షంలో అభిమానుల ప్రవర్తన ఎంత మాత్రం అమోదయోగ్యం కాదని అన్నారు. క్రీడలు దేశాన్ని ఐక్యమత్యం చేయడానికి ఉపయోగపడాలి కానీ.. ద్వేషం వ్యాప్తి చెందడానికి సాధనంగా వాడకూడదని చెప్పారు.
శనివారం గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ డ్రెస్సింగ్ రూంకు వస్తున్న క్రమంలో అభిమానులు జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిపై ఉదయనిధి స్టాలిన్ స్పందించారు.
సోషల్ మీడియాలో అభిమానుల ప్రవర్తనపై భిన్నరకాల స్పందనలు వచ్చాయి. అభిమానుల అర్ధం లేని వ్యూహంగా కొందరు కామెంట్ పెట్టారు. మరో పది రోజుల్లో చెన్నైలో పాక్ క్రీడాకారులు రెండు మ్యాచ్‌లు అడటానికి వస్తారు. వారందరిని గౌరవంగా స్వాగతించండి అంటూ మరికొందరు స్పందించారు. చెన్నైలో పిచ్ వారికి కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
నిన్న గుజరాత్‌లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లోనే బాబార్ ఆజాంకు కోహ్లీ ఆరుదైన బహుమతి కూడా అందించాడు. తన సంతకం చేసిన జెర్సీని కానుకగా పంపించి సోదరభావాన్ని చాటుకున్నాడు. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇండియా-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ సందర్భంగా మహ్మద్ షమీ బౌలింగ్ వేసే క్రమంలో అభిమానులు జై శ్రీ రామ్ అంటూ నినాదాలు చేయడం అప్పట్లో వార్తల్లో నిలిచింది.
ఇదీ చదవండి: Udayanidhi Stalin: సనాతన ధర్మంపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment