పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై ఆ దేశ క్రికెట్ జట్టు మాజీ కెప్టన్ జావేద్ మియాందాద్ ఫైర్ అయ్యారు. గతంలో తాను ఇమ్రాన్ ప్రధానమంత్రి కావడానికి సహకరించి చాలా పెద్ద తప్పు చేశానని ఈ లెజండరీ క్రికెటర్ విచారం వ్యక్తం చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మియాందాద్ మాట్లాడుతూ.. ఇమ్రాన్ ఖాన్ ప్రధాని కావడానికి నేను సహకరించా. అతని ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా హాజరయ్యాను. అయితే ఆ తర్వాత కనీసం నాకు థ్యాంక్స్ కూడా చెప్పలేదు. అది నాకు చాలా నిరాశ కలిగించిందని వెల్లడించారు.
కృతజ్ఞతలు చెప్పడం ఇమ్రాన్ కనీస బాధ్యతని.. అలాంటప్పుడు రాత్రి రెండు గంటలకు తన తలుపు ఎందుకు తట్టాడని మండిపడ్డారు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ.. 'మా నాన్నకు క్రికెట్ అంటే చాలా ఇష్టం.. నేనూ, మా సోదరులందరూ వీధుల్లో క్రికెట్ ఆడేవాళ్లం. జట్టు జాతీయ జట్టుకు ఆడినప్పుడల్లా, ఓడిపోతే కనీస మార్జిన్‌ను కాపాడుకోవడానికి ప్రయత్నించామని, ఆటగాళ్లెవరూ నా నాయకత్వాన్ని వ్యతిరేకించలేదని జావేద్ మియాందాద్ అన్నాడు.
ఇమ్రాన్ ఖాన్ ఆగస్టు 2018లో పాకిస్తాన్ ప్రధానమంత్రి అయ్యాడు. 3 సంవత్సరాలకు పైగా ప్రధానిగా కొనసాగి.. 4వ సంవత్సరం పూర్తి కాకముందే, ఏప్రిల్ 2022లో, విపక్షాల అవిశ్వాస తీర్మానంతో ప్రధాని పదవి కోల్పోయాడు.
కాగా ఇమ్రాన్ ఖాన్, జావేద్ మియాందాద్ 1992 ప్రపంచకప్‌ను పాకిస్తాన్‌కు గెలిపించడంలో కీలకమైన ఆటగాళ్ళు. మెల్‌బోర్న్‌లో జరిగిన ఫైనల్‌లో ఇంగ్లండ్‌ను 22 పరుగుల తేడాతో ఓడించి టైటిల్‌ను గెలుచుకున్నప్పుడు ఇమ్రాన్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ టోర్నీలో పాకిస్థాన్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మియాందాద్ నిలిచాడు.
చదవండి: ‘మత్స్య కన్య’గా మారిన ఇంగ్లీష్ టీచర్.. చూసేందుకు జనం పరుగులు!
Comments
Please login to add a commentAdd a comment