Javed Miandad
-
'సర్ఫరాజ్ ఒక అద్బుతం.. ఆ దిగ్గజాన్ని గుర్తు చేస్తున్నాడు'
బెంగుళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్నతొలి టెస్టులో భారత యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ అదరగొడుతున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో డకౌటైన సర్ఫరాజ్.. రెండో ఇన్నింగ్స్‌లో సత్తాచాటుతున్నాడు. శుబ్‌మన్ గిల్ స్దానంలో జట్టులోకి వచ్చిన 26 ఏళ్ల ముంబైకర్.. మూడో రోజు ఆటలో దుమ్ములేపాడు.భారత పోరాటంలో కీలక పాత్ర పోషించాడు. స్వీప్, ర్యాంప్ షాట్లు ఆడుతూ సర్ఫరాజ్ అలరించాడు. మూడు రోజు ఆట ముగిసే సమయానికి 70 పరుగులతో ఖాన్ అజేయంగా నిలిచాడు. నాలుగో రోజు భారత్ తమ రిథమ్‌ను కొనసాగించాలంటే వీలైనంత సమయం పాటు సర్ఫరాజ్ క్రీజులో ఉండాలి. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్‌పై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశంసల వర్షం కురిపించాడు. సర్ఫరాజ్‌ను భారత దిగ్గజ బ్యాటర్ జావేద్ మియాందాద్‌తో మంజ్రేకర్ పోల్చాడు."సర్పరాజ్ జావేద్ మియాందాద్‌ని గుర్తు చేస్తున్నాడు. 1980లలో జావేద్ ఈ విధంగానే ఆడేవాడు. సర్పరాజ్ మియాందాద్ 2024 వెర్షన్. అతడు ఆట తీరు నన్ను ఎంతోగానే ఆకట్టుకుంది. అతను స్పిన్‌ను బాగా ఆడతాడని మాకు తెలుసు, కానీ ఫాస్ట్ బౌలర్లను కూడా ఈ విధంగా ఆడుతాడని నేను అనుకోలేదు.అతడికి అద్భుతమైన గేమ్ ప్లాన్ ఉంది.మూడో రోజు ఆట ముగిసే సమయంలో తన వికెట్‌ను కోల్పోకుండా జాగ్రత్తపడ్డాడు. ఆఖరిలో డిఫెన్స్ ఆడుతూ మూడో రోజు ఆటను ముగించాడు. నాలుగో రోజు ఆటలో సర్ఫరాజ్ కీలకం కానున్నాడు. బౌన్సర్లను కూడా సర్ఫరాజ్ అద్బుతంగా ఆడుతున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు భారత్‌కు ఇది నిజంగా శుభసూచకమని" ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజ్రేకర్ పేర్కొన్నాడు. కాగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. భారత్ ఇంకా 125 పరుగుల వెనకంజలో ఉంది.చదవండి: IND vs AUS: ఆసీస్ టూర్‌కు భారత జట్టు ఇదే.. కెప్టెన్‌గా రుతురాజ్! తెలుగోడికి చోటు? -
ఇమ్రాన్‌ను ప్రధాని చేస్తే.. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు: పాక్ లెజండరీ క్రికెటర్
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై ఆ దేశ క్రికెట్ జట్టు మాజీ కెప్టన్ జావేద్ మియాందాద్ ఫైర్ అయ్యారు. గతంలో తాను ఇమ్రాన్ ప్రధానమంత్రి కావడానికి సహకరించి చాలా పెద్ద తప్పు చేశానని ఈ లెజండరీ క్రికెటర్ విచారం వ్యక్తం చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మియాందాద్ మాట్లాడుతూ.. ఇమ్రాన్ ఖాన్ ప్రధాని కావడానికి నేను సహకరించా. అతని ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా హాజరయ్యాను. అయితే ఆ తర్వాత కనీసం నాకు థ్యాంక్స్ కూడా చెప్పలేదు. అది నాకు చాలా నిరాశ కలిగించిందని వెల్లడించారు. కృతజ్ఞతలు చెప్పడం ఇమ్రాన్ కనీస బాధ్యతని.. అలాంటప్పుడు రాత్రి రెండు గంటలకు తన తలుపు ఎందుకు తట్టాడని మండిపడ్డారు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ.. 'మా నాన్నకు క్రికెట్ అంటే చాలా ఇష్టం.. నేనూ, మా సోదరులందరూ వీధుల్లో క్రికెట్ ఆడేవాళ్లం. జట్టు జాతీయ జట్టుకు ఆడినప్పుడల్లా, ఓడిపోతే కనీస మార్జిన్‌ను కాపాడుకోవడానికి ప్రయత్నించామని, ఆటగాళ్లెవరూ నా నాయకత్వాన్ని వ్యతిరేకించలేదని జావేద్ మియాందాద్ అన్నాడు. ఇమ్రాన్ ఖాన్ ఆగస్టు 2018లో పాకిస్తాన్ ప్రధానమంత్రి అయ్యాడు. 3 సంవత్సరాలకు పైగా ప్రధానిగా కొనసాగి.. 4వ సంవత్సరం పూర్తి కాకముందే, ఏప్రిల్ 2022లో, విపక్షాల అవిశ్వాస తీర్మానంతో ప్రధాని పదవి కోల్పోయాడు. కాగా ఇమ్రాన్ ఖాన్, జావేద్ మియాందాద్ 1992 ప్రపంచకప్‌ను పాకిస్తాన్‌కు గెలిపించడంలో కీలకమైన ఆటగాళ్ళు. మెల్బోర్న్లో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ను 22 పరుగుల తేడాతో ఓడించి టైటిల్‌ను గెలుచుకున్నప్పుడు ఇమ్రాన్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ టోర్నీలో పాకిస్థాన్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా మియాందాద్ నిలిచాడు. చదవండి: ‘మత్స్య కన్య’గా మారిన ఇంగ్లీష్ టీచర్.. చూసేందుకు జనం పరుగులు! -
మీరు వెనక్కి తగ్గకండి.. ముందు భారత జట్టు పాక్‌కు రాని! ఆ తర్వాతే ఏదైనా
ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ జట్టు పాల్గోనడంపై ఇంకా క్లారిటీ లేదు. తమ జట్టును భారత్‌కు పంపడంపై పీసీబీ పూటకో మాట మారుస్తోంది. ఆసియాకప్ విషయంలో బీసీసీఐ ఆవలంభించిన వైఖరిని ఇప్పుడు పీసీబీ కూడా అమలు చేయనునున్నట్లు తెలుస్తోంది. ఆసియాకప్‌లో పాల్గోనేందుకు భారత జట్టును పాక్‌కు పంపేందుకు బీసీసీఐ నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో ఆసియాకప్-2023ను శ్రీలంక, పాకిస్తాన్ వేదికలగా హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ సిద్దమైంది. ఈ ప్రాతిపాదనకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఒప్పుకుంది. అయితే భారత జట్టు తమ దేశంలో అడుగుపెట్టనప్పుడు.. పాక్ ప్రభుత్వం కూడా మా జట్టును పంపేందుకుఅనుమతి ఇస్తుందో లేదో తెలియదని పీసీబీ ఛీప్ సైతం అనుమానం వ్యక్తం చేశాడు. తాజాగా ఇదే విషయంపై పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ జావేద్ మియాందాద్ కీలక వాఖ్యలు చేశాడు. బీసీసీఐ తమ జట్టును ముందుగా పాకిస్తాన్‌కు పంపడానికి అంగీకరించే వరకు.. పాక్ వరల్డ్‌కప్‌తో పాటు ఈతర మ్యాచ్‌లు ఆడేందుకు భారత్‌కు వెళ్లకూడదని మియాందాద్ మరోసారి విషం చిమ్మాడు. కాగా ఐసీసీ డ్రాప్ట్ షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-పాకిస్తాన్‌లు తలపడాల్సి ఉంది. మీరు ఎందుకు వెళ్లాలి? "పాకిస్తాన్ జట్టు 2012, 2016లో భారత్‌కు వెళ్లింది. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ రావడం భారత్ వంతు. భారత్ జట్టు ఇక్కడకు రానింతవరకు పాకిస్తాన్.. ప్రపంచకప్‌తో సహా ఎటువంటి క్రికెట్ ఆడటానికి వారి గడ్డపై అడుగుపెట్టకూడదు. అయితే భారత్‌తో తలపడేందుకు మేము ఎప్పుడూ సిద్దంగా ఉంటాము. ప్రపంచ క్రికెట్లో పాకిస్తాన్ క్రికెట్‌కు పత్యేక గుర్తింపు ఉంది. మేము ఇప్పటికీ చాలా మంది అద్భుతమైన ఆటగాళ్లను తయారు చేస్తున్నాము. కాబట్టి మనం భారత్‌కు వెళ్లకపోయినా దాని వల్ల పెద్ద నష్టమేమి లేదు. నేను ఎప్పుడూ చెప్పేది ఒక్కటే. మనకు బలం ఉందని పొరుగువారిపై పెత్తనం చెలాయించకూడదు. కాబట్టి రెండు క్రికెట్ బోర్డులు ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకుపోవాలి. క్రికెట్ ఇరు దేశాల్లో చాలా మందికి ఒక ఎమెషనల్" అని ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జావేద్ మియాందాద్ పేర్కొన్నాడు. -
'మేం కాదు మీరే..' పాక్ మాజీ కెప్టెన్‌కు దిమ్మతిరిగే కౌంటర్
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్‌కు టీమిండియా మాజీ ఫాస్ట్‌బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) ఆసియాకప్ వేదికను మార్చడంలో బీసీసీఐ కీలకపాత్ర పోషించిదంటూ అసహనం వెళ్లగక్కిన మియాందాద్.. పాక్‌లో ఆడడానికి నిరాకరిస్తున్న టీమిండియాను ''గోటూ..హెల్(Go to Hell)'' అంటూ వ్యంగ్యంగా పేర్కొన్నాడు. క్రికెట్లో పెద్దన్నలా వ్యవహరించాల్సిన ఐసీసీ.. బీసీసీఐకి తొత్తుల మారిందన్నాడు. బీసీసీఐ చెప్పినట్లు ఆడితే ఐసీసీ ఉండి ప్రయోజనం ఏంటని అసహనం వ్యక్తం చేశాడు. మియాందాద్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న వెంకటేశ్ ప్రసాద్ ట్విటర్ వేదికగా భగ్గుమన్నాడు.'' పాకిస్తాన్‌తో ఆడకపోవడం వల్ల టీమిండియాకు ఒరిగేదేం ఉండదు. ఎటొచ్చి మనతో వాళ్లు ఆడకపోతే వాళ్లే తీవ్రంగా నష్టపోవడం ఖాయం. ఈ విషయం తెలుసుకుంటే బెటర్. మీ వ్యాఖ్యలతో పాక్ క్రికెట్‌ను మరింత ఊబిలోకి నెట్టేస్తున్నారు. నరకానికి వెళ్లేది మేం కాదు మీరే.. సిద్దంగా ఉండండి. ప్రపంచ క్రికెట్‌ను బీసీసీఐ శాసిస్తుందని నిరాధార ఆరోపణలు చేయడం తగదు. మీ వైఖరిని మార్చుకోండి. ప్రస్తుతం మీ దేశంలో శాంతి భద్రతలు సరిగా లేవు.. సెక్యూరిటీ కారణంగానే టీమిండియా ఆడేందుకు నిరాకరించింది. ఇదే విషయాన్ని కేంద్ర క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా పేర్కొన్నారు. తటస్థ వేదికపై ఆడేందుకు భారత్ అంగీకరించినట్లు గుర్తించడం మానేసి ఇలా పనికిమాలిన ఆరోపణలు చేయడం సరికాదు'' అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. But they are refusing to go to hell :) https://t.co/gX8gcWzWZE — Venkatesh Prasad (@venkateshprasad) February 6, 2023 చదవండి: టర్కీ భూకంపం.. శిథిలాల కింద స్టార్ ఫుట్‌బాలర్ -
వాళ్లు ఎక్కడికైనా పోనీ, ఏమైనా చేసుకోనీ..అయినా: పాక్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు
Javed Miandad Fumes At ICC Over Asia Cup 2023: ఆసియా కప్-2023 నిర్వహణ, వేదిక తదితర అంశాలపై చిక్కుముడి వీడలేదు. బహ్రెయిన్ వేదికగా జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయంపై మండలి ఓ నిర్ణయానికి వస్తుందని భావించినా అలా జరుగలేదు. దీంతో వచ్చే నెలలో మరోసారి సమావేశమైన తర్వాత ఈ మెగా టోర్నీ ఎక్కడ జరుగనుందన్న అంశంపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా ఈ ఏడాది సెప్టెంబరులో జరగాల్సిన ఆసియా వన్డే కప్ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఈవెంట్ ఆడేందుకు భారత జట్టు పాక్‌కు వెళ్లదని బీసీసీఐ కార్యదర్శి, ఏసీసీ అధ్యక్షుడు జై షా వ్యాఖ్యానించగా.. పాక్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇంకా రాని స్పష్టత అప్పటి నుంచి టోర్నీ నిర్వహణ ఎక్కడ అన్న అంశంపై సందిగ్దం కొనసాగుతోంది. ఈ క్రమంలో శనివారం బహ్రెయిన్‌లో జరిగిన సమావేశంలో యూఏఈ పేరు ప్రస్తావన(తటస్థ వేదిక)కు వచ్చినా.. ఇంకా స్పష్టత రాలేదు. దీంతో మార్చి వరకు వేచిచూడాల్సిన పరిస్థితి. ఏంటి ఇదంతా? ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దిగ్గజం, మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్ మద్దతు తమకేమీ అవసరం లేదని.. వాళ్లు పాకిస్తాన్లో ఆడకపోయినా పర్లేదని పేర్కొన్నాడు. అయినా ఐసీసీ ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని ప్రశ్నించాడు. భారత్‌పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. ఎక్కడికైనా పోనివ్వండి... ఐసీసీ ఏం చేస్తోంది? పాక్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇండియా తనకు ఇష్టం వచ్చినట్లు చేసుకోనివ్వండి.. వాళ్లు వస్తే ఏంటి? రాకపోతే ఏంటి? వాళ్లతో మాకేం పనిలేదు. అసలు మేము వాళ్లను పట్టించుకోము. నిజానికి ఇక్కడ తప్పుబట్టాల్సింది ఐసీసీని. ఈ సమస్యకు పరిష్కారం చూపని ఐసీసీ ఉంటే ఎంత.. లేకుంటే ఎంత.. దాని వల్ల ఉపయోగం ఏమిటి? మా దగ్గర ఇలాంటి చెల్లవు ప్రతి జట్టుకు ఒకే రకమైన నిబంధనలు ఉండాలి కదా. టీమిండియా పటిష్ట జట్టే కావొచ్చు. అయినంత మాత్రాన వాళ్లొక్కలే క్రికెట్ ప్రపంచాన్ని నడిపించడం లేదు కదా. భారత జట్టు సొంతగడ్డపై పవర్‌హౌజ్ లాంటిది అయి ఉండవచ్చు.. అదంతా వాళ్ల దేశంలోనే చెల్లుతుంది. మా దగ్గర కాదు. ప్రపంచం మొత్తం మీద వాళ్ల మాటే నెగ్గాలంటే కుదరదు. అయినా పాకిస్తాన్‌కు వచ్చి మీరెందుకు ఆడరు? ఒకవేళ ఇక్కడికి వచ్చి ఓడిపోతే ఆ దేశ ప్రజలు సహించరు. అందుకేనా’’ అంటూ కవ్వింపు మాటలు మాట్లాడాడు. అదే విధంగా.. ఐసీసీ ఇప్పటికైనా భారత బోర్డుపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. చదవండి: IND Vs AUS: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. ఆ ఐదుగురు యమ డేంజర్.. ఏమరపాటుగా ఉంటే! Jasprit Bumrah: ఆరోజు కోహ్లి బుమ్రాతో మాట్లాడతా అంటే నేనే వద్దన్నా! ఎందుకంటే -
'అందుకే మ్యాచ్ ఫిక్సింగ్ జరిగేది'.. పాకిస్తాన్ దిగ్గజం సంచలన వాఖ్యలు!
టీ20 ప్రపంచకప్-2022 ఫైనల్లో పాకిస్తాన్ ఓటమిని ఆ దేశ మాజీ క్రికెటర్లు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో తమ జట్టుపై పాక్ మాజీ ఆటగాడు జావేద్ మియాందాద్ కీలక వాఖ్యలు చేశాడు. విదేశీ కోచ్‌లను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నియమించడాన్ని మియాందాద్ తప్పు బట్టాడు. విదేశీ కోచ్‌ల వైపు మొగ్గు చూపుతుండటంతో ప్రస్తుత ఆటగాళ్ల భవిష్యత్తుపై అనిశ్చితి ఏర్పడుతుందని, ఇది మ్యాచ్ ఫిక్సింగ్ ఘటనలకు దారితీస్తుందని అతడు అభిప్రాయపడ్డాడు. కాగా ప్రస్తుతం పాకిస్తాన్ మోంటార్గా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్.. బౌలింగ్ కోచ్‌గా షాన్ టైట్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక గతేడాది టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ సహాయక సిబ్బందిలో భాగమైన వెరోన్ ఫిలాండర్ గురించి జావేద్‌ను ప్రశ్నించగా.. అతడు వ్యంగ్యంగా స్పందించాడు. 'వాళ్లను ఈ స్టూడియోకి తీసుకురండి. వాళ్లకి క్రికెట్ గురించి ఎంత తెలుసో మాట్లాడాలి' అంటూ జావేద్ బదులిచ్చాడు. అదే విధంగా గతంలో పాకిస్తాన్ క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ ఎందుకు తరచుగా జరిగిందనే విషయమై మియాంద్ మాట్లాడాడు. "గతంలో పాకిస్తాన్ తరుపున ఆడిన క్రికెట్లరను చూడంది. వాళ్లు రిటైర్మెంట్ అయ్యాక ఖాళీగా ఉండిపోయారు. నేను నా గురించి మాట్లాడటం లేదు. గతంలో నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ నేను వెళ్లలేదు. ప్రస్తుత ఆటగాళ్ల సంగతి ఏంటి? వాళ్లు ఎక్కడికి వెళ్లినా రాణించలేరు. ఇది ఆటగాళ్లను ఫిక్సింగ్‌కు పాల్పడేలా ప్రేరేపిస్తుంది. ప్రతీ ఒక్కరు తమ కెరీర్ కోసం భయపడతారని" అని పాకిస్తానీ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మియాంద్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: 'అంతా బాగానే ఉంది'.. మధ్యవర్తిగా పనిచేసిన ధోని! జడ్డూ ట్వీట్ వైరల్ -
రవిశాస్త్రి, మియాందాద్ల గొడవకు కారణమైన 'ఆడి' కారు.?!
టీమిండియా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి అందరికి సుపరిచితమే. మంచి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రవిశాస్త్రి.. ఆటకు గుడ్‌బై చెప్పిన తర్వాత కామెంటేటర్‌గా, టీమిండియా హెడ్‌కోచ్‌గానూ సేవలందించాడు. ఒకే ఓవర్లో ఆరు సిక్సులు కొట్టిన బ్యాట్స్ మెన్ లిస్టులోనూ తనది ప్రత్యేక స్థానం. ఇక గొప్ప ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న రవిశాస్త్రి టీమిండియా తరపున 80 టెస్టులు, 150 వన్డేలు ఆడాడు. 1983 వరల్డ్‌కప్ గెలిచిన టీమిండియా జట్టులో రవిశాస్త్రి సభ్యుడిగా ఉన్నాడు. విషయంలోకి వెళితే.. 1985లో ఆస్ట్రేలియా వేదికగా బెన్సన్ అండ్ హెడ్జెజ్ వరల్డ్ చాంపియన్‌షిప్ టోర్నమెంట్ జరిగింది. ఈ టోర్నీ ఫైనల్లో భారత్, పాకిస్తాన్‌లు తలపడ్డాయి. చిరకాల ప్రత్యర్థి పాక్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసిన టీమిండియా కప్‌ను ఎగరేసుకుపోయింది. ఫైనల్ మ్యాచ్‌తో టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన రవిశాస్త్రి 182 పరుగులతో పాటు 8 వికెట్లు తీశాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన రవిశాస్త్రి ఆడి కారును సొంతం చేసుకున్నాడు. విజయం అనంతరం ఆడి కారును రవిశాస్త్రి ఎంతో ఇష్టంగా డ్రైవ్ చేయగా.. తోటి టీమిండియా ఆటగాళ్లు కారు మీద కూర్చోని సెలబ్రేషన్స్ చేసుకోవడం అప్పట్లో ట్రెండింగ్‌గా మారింది. ఈ నేపథ్యంలో అదే ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ తనను అవమానించిన ఒక సంఘటనను.. ఆడి కారు గెలుచుకోవడం వెనుక ఉన్న కథను తాజాగా రివీల్ చేశాడు. ''1985 బెన్సన్ అండ్ హెడ్జెస్ టోర్నమెంట్ ఫైనల్లో పాకిస్థాన్ ను ఓడించడానికి మాకు మరో 15-20 రన్స్ అవసరం ఉంది. ఆ సమయంలో జావెద్ మియాందాద్ సెట్ చేసిన ఫీల్డ్ ను తెలుసుకోవడానికి స్క్వేర్ లెగ్ వైపు చూస్తున్నాను. అప్పుడు మిడ్ వికెట్ లో ఉన్న మియాందాద్ నా దగ్గరికి వచ్చి.. నువ్వు మళ్లీ మళ్లీ అక్కడేం చూస్తున్నావ్ అని తనదైన స్టైల్లో అన్నాడు. కారును ఎందుకు చూస్తున్నావ్.. అది నీకు దక్కదు అంటూ వెటకారంగా మాట్లాడాడు. దీనికి కౌంటర్‌గా అవును జావెద్.. నేను అటు వైపు చూడడం లేదు.. ఆ కారే నా వైపు చూస్తుంది.. నా ఇంటికి వస్తుంది అని పేర్కొన్నా'' అంటూ తెలిపాడు. ఇక 1983 వరల్డ్ కప్ గెలిచిన రెండేళ్లకే వరల్డ్ సిరీస్ గెలవడం తమకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నాడు. తన జీవితంలో తాను చేసిన ఎన్నో పనుల కంటే ఆడి కారు టాప్ స్థానంలో ఉంటుందని పేర్కొన్నాడు. ఆరు సిక్స్‌లు కూడా ఎప్పటికీ గుర్తొచ్చేదే అయినా.. తన కెరీర్లో మాత్రం 1985లో సాధించిన ఆడి కారుకే ఎక్కువ విలువుంటుందని తెలిపాడు. అప్పుడప్పుడే వన్డే క్రికెట్ లోకి రంగులు రావడం, డే నైట్ మ్యాచ్ లు, రంగుల దుస్తులు తొలిసారి ఇండియాకు రావడం లాంటివి ప్రత్యేకమైనవి. ఇక ఫైనల్లో పాకిస్థాన్ ను ఓడించడం అంటే అది పెద్ద అచీవ్మెంట్ కింద లెక్క అని శాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఇక రిటైర్మెంట్ అనంతరం కామెంటేటర్‌గా రాణిస్తున్నాడు. టీమిండియా హెడ్ కోచ్‌గా పనిచేసిన రవిశాస్త్రి కొన్ని అద్భుత విజయాల్లో భాగంగా నిలిచాడు. రవిశాస్త్రి హెడ్‌కోచ్‌గా టీమిండియా 43 టెస్టుల్లో 25 విజయాలు సాధించింది. ఇందులో రెండుసార్లు ఆసీస్ గడ్డపై సాధించిన టెస్టు సిరీస్ విజయాలు ఉండడం విశేషం. ఇక రవిశాస్త్రి 76 వన్డేల్లో 51 వన్డేలు, 65 టి20ల్లో 43 మ్యాచ్‌లు గెలిచింది. చదవండి: Arjun Tendulkar: తండ్రి పేరు తొలగించుకుంటే మంచిది.. కనీసం 50 శాతమైనా! Hardik Pandya-Ravi Shastri: ఇద్దరి బంధం ఎంతో ప్రత్యేకం.. అపూర్వ కలయిక -
అంతా బయటివాళ్లే... మనోళ్లు ఒక్కరు లేరు
చెన్నై: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. 100వ టెస్టులో సెంచరీ సాధించిన 9వ ఆటగాడిగా రూట్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇంతకముందు ఈ ఘనత సాధించిన వారిలో జావెద్ మియాందాద్, రికీ పాంటింగ్, ఇంజమామ్ ఉల్ హక్, గోర్డన్ గ్రీనిడ్జ్, కొలిన్ కౌడ్రే, అలెక్ స్టీవార్ట్, గ్రేమి స్మిత్, హషీమ్ ఆమ్లా ఉన్నారు. అయితే 100వ టెస్టులో సెంచరీ చేసిన ఆటగాడు టీమిండియా నుంచి ఒక్కరు లేకపోవడం విశేషం. కాగా ఈ ఘనత సాధించిన తొమ్మిది మందిలో రూట్ సహా మరో ఇద్దరు ఇంగ్లండ్‌కు చెందినవారు కాగా..పాకిస్తాన్, దక్షిణాఫ్రికా నుంచి ఇద్దరు ఉండగా.. ఆస్ట్రేలియా, విండీస్ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. దీంతో పాటు రూట్ 100వ టెస్టులో సెంచరీ సాధించిన 5వ కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు. 2012లో దక్షిణాఫ్రికా కెప్టెన్ గ్రేమి స్మిత్ సెంచరీ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు రూట్ కెప్టెన్‌గా 100వ టెస్టులో సెంచరీ చేయడం విశేషం. స్మిత్, రూట్ కంటే ముందు కెప్టెన్ హోదాలో 100వ టెస్టులో సెంచరీ సాధించిన వారిలో మియాందాద్, ఇంజమామ్, కొలిన్ కౌడ్రే ఉన్నారు. చదవండి: మ్యాచ్ మధ్యలో కోహ్లి, రూట్ ఏం మాట్లాడారో! జో రూట్ అరుదైన ఘనత -
‘కోహ్లితో కంటే వారితో పోలికనే ఆస్వాదిస్తా’
మాంచెస్టర్: ఇటీవల కాలంలో పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ అజామ్‌ను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో తరచు పోల్చుతున్న సంగతి తెలిసిందే. అయితే తాను కోహ్లితో పోల్చడాన్ని పెద్దగా ఆస్వాదించనని అజామ్ తాజాగా తెలిపాడు. పాకిస్తాన్ వన్డే, టీ20 జట్టు కెప్టెన్ అయిన అజామ్.. విలేకరులతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. దీనిలో భాగంగా తనను కోహ్లితో పోల్చడాన్ని ఎప్పుడూ గొప్పగా ఫీల్ కాలేదన్నాడు. కాగా, పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్లైన జావెద్ మియాందాద్, యూనిస్ ఖాన్, ఇంజమాముల్ హక్‌లతో పోలికనే ఎక్కువగా ఆస్వాదిస్తానన్నాడు. వారితో పోల్చితే తప్పకుండా చాలా గొప్పగా అనుకుంటానని అజామ్ అన్నాడు. ‘ నన్ను ఎవరితోనైనా పోల్చినప్పుడు అది పాకిస్తాన్ ప్లేయర్స్ అయితేనే దాన్ని ఆస్వాదిస్తా. (యూనిస్ నా పీకపై కత్తి పెట్టాడు: ఫ్లవర్) కోహ్లితో పోలిక కంటే పాక్ దిగ్గజాలతో పోల్చినప్పుడు గౌరవంగా భావిస్తా. మాకు మియాందాద్, యూనిస్ ఖాన్, ఇంజమాముల్ వంటి దిగ్గజ క్రికెటర్లు ఉన్నారు. వారితో పోల్చండి.. అప్పుడు నాకు గొప్పగా అనిపిస్తుంది’ అని అజామ్ తెలిపాడు. టీ20ల్లో అజామ్ నంబర్ వన్ ర్యాంకులో ఉండగా, వన్డేల్లో విరాట్ కోహ్లి టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఈ క్రమంలోనే అజామ్‌ను కోహ్లితో పోల్చడం ఎక్కువైంది. అయితే అది తనకు నచ్చదనే విషయాన్ని అజామ్ తన మాటల ద్వారా వెల్లడించాడు. కోహ్లి సాధించిన ఘనతలు పరంగా చూస్తే అజామ్ చాలా దూరంలోనే ఉన్నాడు., అయినప్పటికీ కోహ్లితో పోలిక వద్దని చెప్పడం, పాక్ దిగ్గజాలతో పోల్చాలని చెప్పడం గమనార్హం. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఇంకా భయాందోళనలు ఉన్నప్పటికీ పాకిస్తాన్ జట్టు ఆశావహ దృక్పథంతో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. 20 మంది ఆటగాళ్లతో పాటు 11 మంది సహాయక సిబ్బందితో కూడిన పాక్ బృందం మాంచెస్టర్‌లో అడుగుపెట్టింది. ఇరుజట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా ఆగస్టులో 3 టెస్టులు, 3 టి20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. పాక్ టెస్టు కెప్టెన్‌గా అజహర్ అలీ వ్యవహరించనున్నాడు. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన పాక్ జట్టులో ఆ దేశ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్‌కు ఎట్టకేలకు అవకాశం దక్కింది. శ్రీలంకతో స్వదేశంలో జరిగిన ద్వైపాక్షిక సిరీస్ తర్వాత సర్ఫరాజ్ జట్టులో చోటు కోల్పోగా, ఇప్పుడు అతనికి చోటు కల్పిస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లండ్ పర్యటన సర్ఫరాజ్‌కు కీలకం కానుంది. -
‘అదే కోహ్లిని గ్రేట్ ప్లేయర్‌ను చేసింది’
కరాచీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అమీర్ సొహైల్ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుత క్రికెట్ శకంలో కోహ్లినే గ్రేట్ ప్లేయర్ అంటూ కొనియాడు. విరాట్ కోహ్లి ఆట ఎప్పుడూ చూడమచ్చటగా ఉంటుందని, అతను చూపరులను ఇట్టే ఆకర్షిస్తాడని ప్రశంసించాడు. తమ శకంలో తమ దిగ్గజ ఆటగాడు జావెద్ మియాందాద్ ఆట ఎంత ఆకర్షణీయంగా ఉండేదో అదే తరహా ఆట కోహ్లిలో ఉందంటూ పోల్చాడు. తన యూట్యూబ్ చానలె్లో మాట్లాడిన అమీర్ సొహైల్.. జావెద్ మియాందాద్‌కు కోహ్లికి చాలా దగ్గర పోలికలున్నాయన్నాడు. ప్రపంచ క్రికెట్లో వీరిద్దరూ పెద్ద ఆటగాళ్లైనా వ్యక్తిగతంగా మాత్రమే సక్సెస్ ఎక్కువగా అయ్యారన్నాడు. ఓవరాల్‌గా చూస్తే జట్టుకు మాత్రం వీరి ప్రదర్శన పూర్తి స్థాయిలో ఉపయోగపడలేదన్నాడు. ప్రధానంగా మియాందాద్, కోహ్లిలు మేజర్ టోర్నీల్లో విఫలమైన సందర్భాన్ని సొహైల్ పరోక్షంగా ప్రస్తావించాడు. పాకిస్తాన్ క్రికెట్ చరిత్ర గురించి, గొప్పదనం గురించి చెప్పాలంటే తొలుత వినిపించే పేరు మియాందాద్దేనని అభిప్రాయపడ్డాడు. మియాందాద్ తన ఆట తీరుతో పాకిస్తాన్ క్రికెట్‌ను ఉన్నత శిఖరంలో నిలబెట్టాడనేది కాదనలేని వాస్తవమన్నాడు.(నన్ను ‘కాలూ’ అని పిలిచారు) దీనిలో భాగంగా అతనితో ఆడిన సందర్భాల్ని సొహైల్ గుర్తు చేసుకున్నాడు. మియాందాద్‌తో కలిసి ఎన్నో భాగస్వామ్యాల్లో పాలుపంచుకున్నందుకు సంతోషంగా ఉందన్నాడు. అతని నుంచి చాలా విషయాలను నేర్చుకోవడమే కాకుండా ఎంతో స్ఫూర్తి పొందానని సొహైల్ తెలిపాడు. అలానే కోహ్లి ద్వారా అనేక మంది యువ క్రికెటర్లు స్పూర్తి పొందుతున్నారన్నాడు. ఇప్పటికే గ్రేట్ ప్లేయర్ ట్యాగ్‌ను సంపాదించుకున్న కోహ్లి ఎంతో మందికి ఆదర్శమన్నాడు.అయితే కోహ్లి ఎలా గ్రేట్ ప్లేయర్ అయ్యాడనే విషయాన్ని కూడా సొహైల్ విశ్లేషించాడు. కోహ్లిలో దూకుడు, బ్యాటింగ్‌లో ఆకట్టుకునే నైజం జట్టులో భాగమైపోయాయన్నాడు. ఆటే జీవితం అనే విషయాన్ని కోహ్లి తొందరగా తెలుసుకున్నాడు కాబట్టి ఆ గేమ్ అతన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టిందన్నాడు. సాధ్యమైనంతవరకూ ప్రొఫెషనల్ కెరీర్‌ను వ్యక్తిగత జీవితాన్ని దూరంగా ఉంచుతాడు కాబట్టే కోహ్లి గ్రేట్ ప్లేయర్‌గా ఎదిగాడన్నాడు. (గంగూలీని ఆశ్రయిస్తా : పాక్ మాజీ క్రికెటర్) -
మియాందాద్‌ను కడిగేయాలనుకున్నారు..!
న్యూఢిల్లీ: పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్‌గా పేరుగాంచిన జావేద్ మియాందాద్.. ఒకానొక సందర్భంలో ఆ జట్టుకు కోచ్‌గా కూడా పని చేశారు. క్రికెటర్‌గా ఆడే సమయంలోనే కాకుండా కోచ్‌గా చేసే సమయంలో కూడా మియాందాద్ దూకుడుగా ఉండేవారు. జట్టు విజయం సాధించాలనే కసితో మియాందాద్ కోచ్‌గా పని చేసిన సమయంలో పదే పదే ప్రత్యర్థి జట్లపై నోరు పారేసుకున్న సందర్భాల్లో ఎన్నో ఉన్నాయి. మియాందాద్ ఆవేశానికి బాధపడ్డ వారులో ఇర్ఫాన్ పఠాన్ కుటుంబం కూడా ఉందట. 2003-04 పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు ఇర్ఫాన్ సభ్యుడు.. అప్పుడు ఈ ఎడమ చేతి వాటం పేసర్‌కు చేదు అనుభవం ఎదురైంది. దానికి ఇర్ఫాన్ పఠాన్‌పై అప్పటి కోచ్ మియాందాద్ చేసిన తీవ్రమైన కామెంటే కారణం. ఇర్ఫాన్ పఠాన్ వంటి బౌలర్లు తమ పాకిస్తాన్లో వీధికో బౌలర్ ఉంటాడని మియాందాద్ తీవ్రంగా అవమానించాడట. ఈ విషయాన్ని ఇర్ఫాన్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. ‘ నాకు బాగా గుర్తు. నా లాంటి బౌలర్లు పాక్‌లో వీధికి ఒకరు ఉంటారని మియాందాద్ అన్నాడు. ఆ న్యూస్ మా నాన్నకు చేరింది. దీన్ని మా నాన్న సీరియస్‌గా తీసుకున్నారు. మియాందాద్‌తో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఏకంగా పాకిస్తాన్‌కు వచ్చేశారు. మా డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చి.. పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళదామని పట్టుబట్టారు. నేను మియాందాద్‌ను కలిసి తీరుతానన్నారు. కానీ నేను అక్కడికి వెళ్లనివ్వలేదు. అదే సమయంలో మా నాన్నను మియాందాద్ చూశారు. నేను మీ అబ్బాయిని ఏమీ అనలేదు. ఏ విధమైన కామెంట్ చేయలేదు అని మియాందాద్ చెప్పుకొచ్చాడు. మా ఫాదర్ ముఖం బాగా ఎర్రబడిపోయింది. కానీ తమాయించుకున్న మా నాన్న.. నేను నీకు ఏమీ చెప్పడానికి ఇక్కడికి రాలేదు. నేను నిన్ను కలిసి ఒక మంచి ప్లేయర్ అని చెబుదామని వచ్చా’ అని బదులిచ్చారు.’ అని ఇర్ఫాన్ తెలిపాడు. -
'ఆ మ్యాచ్‌లో మియాందాద్ వాడిన బ్యాట్ నాదే'
కరాచి : సాధారణంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే హైవోల్టేజ్ లెవల్లో ఉంటుంది. ఇరు జట్లలో ఎవరు గెలిచినా , ఓడినా అభిమానులను ఆపడం ఎవరితరం కాదు. ఇక ఫైనల్లో ఇరు జట్లు తలపడితే ఆ మజా ఎలా ఉంటుందో ఇప్పటికే చాలా మ్యాచ్‌ల్లో చూశాం. సరిగ్గా 34 ఏళ్ల క్రితం ఇదే రోజున(ఏప్రిల్ 18) భారత్, పాకిస్థాన్ మధ్య ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. అసలే ఫైనల్ మ్యాచ్.. ఆపై ఉత్కంఠంగా జరిగింది. షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన దాయాదుల పోరు ఇప్పటికి అభిమానుల మదిలో మెదులుతూనే ఉన్నది. ('నీలాంటి వాళ్లతో నా ప్రవర్తన ఇలాగే ఉంటుంది') ఉత్కంఠంగా సాగిన ఆ మ్యాచ్‌లో లాస్ట్ బాల్‌కు నాలుగు పరుగుల అవసరం కాగా జావేద్ మియాందాద్ ' సిక్స్ కొట్టడంతో పాక్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ విషయం పక్కనపెడితే ఇదే మ్యాచ్‌లో మరో ఆసక్తికర ఘటన జరిగింది. ఈ మ్యాచ్‌లో మియాదాంద్ అక్రమ్ బ్యాట్‌తో బరిలోకి దిగాడంట. అదే బ్యాట్‌తో తన ఇన్నింగ్స్ కొనసాగించిన మియాందాద్ చేతన్ శర్మ వేసిన ఆఖరి ఓవర్లో ఆఖరి బంతికి సిక్స్ కొట్టి పాక్ జట్టుకు అపరూప విజయాన్ని అందించాడు. వసీం అక్రమ్ ఈ విషయాన్ని శనివారం ట్విటర్ వేదికగా పేర్కొన్నాడు. 'ఆరోజు జరిగిన మ్యాచ్‌లో మియాందాద్ నా బ్యాట్‌నే ఉపయోగించాడు. ఫైనల్ మ్యాచ్‌లో మియాందాద్ ఆఖరి బంతికి కొట్టిన సిక్స్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆఖరి బంతికి ఏ మాత్రం తడబడకుండా సిక్స్ కొట్టిన మియాందాద్ ఎంత గొప్ప బ్యాట్స్‌మెన్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ మియాదాంద్ సిక్స్ కొట్టిన బ్యాట్ నాదే. అంత గొప్ప మ్యాచ్‌లో నేను భాగస్వామినయినందుకు ఎంతో సంతోషిస్తున్నా. ఇది జరిగి 34 ఏళ్లు అయినా ఇంకా నా మదిలో మెలుగుతూనే ఉంది' అని అక్రమ్ చెప్పుకొచ్చాడు. Some moments are etched in ur memory and @I_JavedMiandad hit that epic six against India at Sharjah is 1 of them. It’s a piece of cricket beauties. Whenever you watch it, it gives you real joy and tells how great a batsman he was.BTW the bat from which that 6 was hit was mine😀 https://t.co/T90s0uOgN0 — Wasim Akram (@wasimakramlive) April 18, 2020 -
అది ఇమ్రాన్, అక్రమ్ల కుట్ర..!
లాహోర్: 1996 వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు ముందుగా ప్రకటించిన జాబితాలో దిగ్గజ క్రికెటర్‌ను జావెద్ మియాందాద్‌ను జట్టు నుంచి తొలగించడంలో అతి పెద్ద కుట్ర దాగి ఉందని ఆ దేశ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ వెల్లడించాడు. ఇందుకు ప్రస్తుత ప్రధాని, అప్పటి కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ సూత్రధారని సంచలన ఆరోపణ చేశాడు. ఆ కుట్రలో తనను పావుగా వాడుకున్నారన్నాడు.1992 వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన ఇమ్రాన్‌ఖాన్.. తన శిష్యుడు, కెప్టెన్‌గా ఎంపికైన వసీం అక్రమ్‌లు కలిసి మియాందాద్‌ను తొలగించారని అన్నాడు. (మా బ్యాట్స్‌మన్ తర్వాతే సెహ్వాగ్..) ‘1993 ప్రాంతంలో జట్టునుంచి మియాందాద్‌కు ఉద్వాసన పలకడానికి కుట్ర జరిగింది. అందుకే నన్ను జావెద్‌తో పోల్చడం ప్రారంభించాడు. నిజాయతీగా చెప్పాలంటే మియాందాద్‌తో పోలిస్తే ఒక్కశాతం కూడా అతడికి నేను సరితూగను. నాలుగోస్థానంలో దిగే నన్ను మియాందాద్‌ను తప్పించగానే ఆరోస్థానానికి దిగజార్చారు. ఇమ్రాన్ ఆదేశాలమేరకు నడుచుకునే కెప్టెన్ అక్రమ్ ఇదంతా చేశాడు’అని బాసిత్ ఆరోపించాడు. నా ఆట పట్ల నాకు ప్యాషన్ ఉండేది. నేను భారీ షాట్లు ఆడబోయి ఔటయ్యేవాడిని. ఇక 1996 ప్రపంచకప్ పాకిస్తాన్‌న్ జట్టులో ముందుగా మియాందాద్ పేరు లేదని, తాను వైదొలిగితేనే జావెద్ జట్టులోకి వచ్చాడని బాసిత్ తెలిపాడు. (అప్పటివరకూ ఐపీఎల్ వాయిదా..!) ‘ముందుగా ప్రకటించిన 1996 ప్రపంచకప్ పాకిస్తాన్ జట్టులో మియాందాద్ పేరు లేదు. 15 సభ్యులతో కూడిన టీమ్‌లో నేనొకడిని. కానీ మియాందాద్ ప్లేయర్ల దగ్గరకు వచ్చి అతనికి వరల్డ్‌కప్ ఆడాలనుందని విజ్ఞప్తి చేశాడు. అత్యధిక ప్రపంచకప్‌లు ఆడిన రికార్డు నమోదు చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. దాంతో మియాందాద్‌పై ఉన్న గౌరవంతో ఆ ప్లేస్‌ను త్యాగం చేశా’ అని బాసిత్ అలీ పేర్కొన్నాడు. -
కోహ్లి అంటే నాకూ ఇష్టమే
కరాచీ: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఆటను అభిమానించే మాజీల జాబితాలో మరో క్రికెటర్ చేరాడు. పాకిస్తాన్ దిగ్గజ బ్యాట్స్‌మన్ జావేద్ మియాందాద్ కూడా కోహ్లి ఆటంటే తనకు ఇష్టమని వెల్లడించాడు. విరాట్ గొప్పతనం ఏమిటో అతని ఘనతలే చెబుతాయని మియాందాద్ అన్నాడు. ‘భారత జట్టులో అత్యుత్తమ ఆటగాడు ఎవరని నన్ను కొందరు ప్రశ్నించారు. అప్పుడు నేను కోహ్లి పేరే చెప్పాను. నేను కొత్తగా అతని గురించి వివరించాల్సిందేమీ లేదు. అతని ప్రదర్శన, గణాంకాలు చూస్తే ఎవరైనా అంగీకరించాల్సిందే. దక్షిణాఫ్రికాలో అనూహ్యంగా స్పందించిన పిచ్‌పై కూడా అతను సెంచరీ చేశాడు. ఫాస్ట్ బౌలింగ్ అంటే భయపడతాడని, బౌన్సీ పిచ్‌లపై ఆడలేడని, స్పిన్‌ను ఎదుర్కోలేడని... ఇలా ఏ విషయంలోనైనా కోహ్లి గురించి ఎవరూ ప్రశ్నించలేరు. అతని సత్తా ఏమిటో అందరికీ తెలుసు. కోహ్లి చూడచక్కగా ఆడతాడు. అతని బ్యాటింగ్‌ను అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది’ అని మియాందాద్ ప్రశంసల వర్షం కురిపించాడు. 17 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో 124 టెస్టులు ఆడిన మియాందాద్ 52.57 సగటుతో 8832 పరుగులు చేసి పాక్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. -
‘మాటలు కాదు..చేతల్లో చూపించు’
కరాచీ: అత్యున్నత ప్రమాణాలు కల్గిన క్రికెటర్లు తమ ప్రస్తుత క్రికెట్ జట్టులో లేరంటూ పాకిస్తాన్ దిగ్గజ ఆటగాడు జావెద్ మియాందాద్ విమర్శలు గుప్పించాడు. పాకిస్తాన్ జట్టులో మోస్ట్ సక్సెస్ఫుల్ బ్యాట్స్‌మన్ అయిన మియాందాద్.. పీసీబీ పదే పదే తప్పులు చేయడంతోనే టాలెంట్ ఉన్న క్రికెటర్లు రావడం లేదని మండిపడ్డాడు. పేలవమైన ఫామ్‌తో ఉండే క్రికెటర్లకే ఎక్కువ అవకాశాలు ఇవ్వడంతో టాలెంట్ అనేది మరుగను పడుతుందన్నాడు. ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లండ్ జట్ల తరహాలో ఉండే క్రికెటర్లు తమ జట్టులో లేరన్నాడు. ఇక ఆ తరహా క్రికెటర్ల అన్వేషణ జరిగితే గానీ పాక్ క్రికెట్లో మార్పులు రావన్నాడు. ‘పాకిస్తాన్ క్రికెట్ బోర్డును ఒకటే అడుగుతున్నా. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లలో ఉండే క్రికెటర్లు పాకిస్తాన్ క్రికెట్లో ఎందుకు లేరు. ఆ జట్ల తరహాలో ఉండే క్రికెటర్లే పాక్‌లో కరువైపోయారు. మన బౌలింగ్ విభాగం బాగానే ఉంది.. కానీ బ్యాట్స్‌మెన్ ఎక్కడ. జీత భత్యాల విషయంలో ప్రపంచ క్రికెట్ పరుగులు పెడుతోంది. ఈ రోజు పరుగులు చేస్తే అప్పుడే వారిని ప్రోత్సహిస్తున్నారు. రేపు పరుగులు చేస్తే మళ్లీ వారికి అందుకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. మనం ప్రొఫెషనల్ క్రికెటర్లం. మరి అటువంటప్పుడు పరుగులు చేయకపోతే అప్పుడు వారికి డబ్బులు ఎందుకు. ఆడితే ప్రోత్సహకాలు ఇవ్వండి.. లేదంటే జీత భత్యలు కట్ చేయండి. ఇది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పని. అలా చేస్తేనే పాక్ క్రికెట్ బాగు పడుతుంది’ అని మియాందాద్ పేర్కొన్నాడు. ముందు నువ్వు ఆడి చూపించు.. తాను మరో 12 ఏళ్లు పాకిస్తాన్ క్రికెట్లో ఆడతానంటూ ఇటీవల అహ్మద్ షెహజాద్ చేసిన వ్యాఖ్యలపై మియాందాద్ మండిపడ్డాడు. ‘ ముందు నువ్వు నీ ప్రదర్శనతో ఆకట్టుకో. 12 ఏళ్లు ఏమిటి.. 20 ఏళ్లు ఆడొచ్చు. అందుకు నేను గ్యారంటి. నువ్వు బ్యాట్‌తో మెరుస్తూ ఉంటే నిన్ను ఎవరూ తీయరు. ఈ తరహా బాధ్యతారాహిత్య స్టేట్మెంట్లు కరెక్ట్ కాదు. ఫీల్డ్‌లో మన ఆట ద్వారా నిరూపించాలి. మాటల ద్వారా కాదు బాస్.. చేతల్లో ఉండాలి’ అని మియాందాద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
‘కనేరియా.. నువ్వు డబ్బు కోసం ఏమైనా చేస్తావ్’
కరాచీ: తాను క్రికెట్ ఆడిన రోజుల్లో పలువురు పాకిస్తానీ ఆటగాళ్లు అవమానించిన మాట వాస్తవమేని మాజీ లెగ్ స్పిన్నర్ దానిష్ కనేరియా స్పష్టం చేసిన నేపథ్యంలో అతనిపై విమర్శల వర్షం కురుస్తోంది. అతనొక నీతి లేని క్రికెటర్ అంటూ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ విమర్శించాడు. అసలు ఇప్పుడు ఏమి సాధించడానికి ఈ వ్యాఖ్యలు చేశారంటూ మియాందాద్ ప్రశ్నించాడు. ఇది కేవలం కనేరియా డబ్బు కోసం మాత్రమే ఇలా చేసి ఉంటాడన్నాడు. ఎప్పుడో ముగిసిన అధ్యాయాన్ని తాజాగా తెరపైకి ఎందుకు తీసుకొచ్చారో తనకు తెలియడం లేదన్నాడు.(ఇక్కడ చదవండి: అతను హిందూ కాబట్టే వివక్ష : అక్తర్) ‘కనేరియా.. నువ్వు డబ్బు కోసం ఏమైనా చేస్తావ్. నువ్వు ఎటువంటి విలువలు లేని క్రికెటర్‌వి. క్రికెట్లో ఫిక్సింగ్‌కు పాల్పడిన ఒక క్రికెటర్ మాటలు ప్రజలు ఎలా నమ్ముతున్నారో నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అతను దేశ పరువును తీశాడు. 2000 సంవత్సరానికి ముందు నేను పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్‌గా ఉన్నా. అప్పుడు కనేరియా జట్టులోనే ఉన్నాడు. ఆ సమయంలో కనేరియాను అవమానించిన ఏ ఒక్క ఘటన నాకు తారస పడలేదు. అతను హిందూ అనే వివక్ష ఎవరూ చూపట్టలేదు. నిన్ను అవమాన పరిస్తే 10 ఏళ్ల పాటు పాక్ క్రికెట్లో ఎలా కొనసాగావో తెలీడం లేదు. నీకు పాకిస్తాన్ చాలా గౌరవం ఇచ్చింది’ అని మియాందాద్ ధ్వజమెత్తాడు. పలువురు పాకిస్తానీ ఆటగాళ్లు దానిష్ కనేరియాపై వివక్ష చూపెట్టేవారంటూ ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ వెల్లడించడంతో వివాదం మొదలైంది. తన సహచర క్రికెటరైన కనేరియాను హిందూ అనే కారణంగా తీవ్రంగా అవమానించిన సందర్భాలు చాలానే ఉన్నాయన్నాడు. చివరకు అతనితో కలిసి భోజనం చేయడానికి కూడా అయిష్టత చూపెట్టడం తాను చూశానన్నాడు. ఇక్కడ మొత్తం జట్టు అంతా అలా ఉండేది కానీ, మెజార్టీ సభ్యులు మాత్రమే వివక్ష చూపెట్టేవారన్నాడు. ఇందుకు అక్తర్‌కు కనేరియా థాంక్స్ చెప్పడంతో వివాదం మరింత రాజుకుంది. వారి పేర్లను త్వరలోనే వెల్లడిస్తానంటూ కనేరియా స్పష్టం చేశాడు. దాంతో కనేరియాపై పాక్ మాజీ క్రికెటర్లు విమర్శలు ఎక్కుపెట్టారు. -
ఎవరొచ్చారనేది కాదు.. గెలిచామా? లేదా?
ఇస్లామాబాద్ : ఆటగాళ్లు ఎవరొచ్చినా సిరీస్ గెలవడంపైనే దృష్టిపెట్టాలని పాకిస్తాన్ క్రికెటర్లకు ఆ దేశ మాజీ ఆటగాడు జావేద్ మియాందాద్ సూచించాడు. వన్డే, టీ20 సిరీస్‌ల కోసం శ్రీలంక జట్టు పాకిస్తాన్లో పర్యటించాల్సి ఉంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా లసిత్ మలింగతో సహా పది మంది రెగ్యులర్ ఆటగాళ్లు పాక్‌కు వెళ్లి క్రికెట్ ఆడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఇప్పటికే ఆ దేశ క్రీడా మంత్రి ఆటగాళ్లతో స్వయంగా మాట్లాడినప్పటికీ పాక్‌కు వెళ్లేందుకు ఆటగాళ్లు విముఖత వ్యక్తం చేస్తున్నారు. అయితే సిరీస్‌ను తటస్థ వేదికపై నిర్వహించాలని లంక బోర్డు కోరగా పాక్ సున్నితంగా తిరస్కరించింది. దీంతో ఈ సిరీస్‌పై సందిగ్దత నెలకొంది. అయితే టాప్ ప్లేయర్స్‌ను కాకుండా జూనియర్ ఆటగాళ్లను పాక్‌కు పంపించాలనే ఆలోచనలో లంక బోర్డు ఉంది. దీనిపై మియాందాద్ స్పందించాడు. ‘ఆటగాళ్లు ఎవరొచ్చినా పాక్ ఆటగాళ్లు సిరీస్ గెలవడంపైనే దృష్టి పెట్టండి. ప్రత్యర్థి జట్టు బలంగా, బలహీనంగా ఉన్నా మన ఆట మనం ఆడాలి. గెలవాలి. సిరీస్ ఉందంటే ఆటగాళ్లు వెళ్లాలి ఆడాలి. అంతేగానీ మేం వెళ్లం అనడం సరైనది కాదు. శ్రీలంక క్రికెట్ బోర్డు ఆ ఆటగాళ్లపై చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నా’అంటూ మియాందాద్ వ్యాఖ్యానించాడు. ఐసీసీ కూడా పాక్‌లో ప్రస్తుత క్రికెట్ పరిస్థితుల, భద్రతా చర్యలపైనా ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఇక 2009లో పాక్‌లో పర్యటిస్తున్న శ్రీలంక జట్టుపై దాడులు జరిగాయి. బస్సులో ప్రయాణిస్తున్న శ్రీలంక క్రికెటర్లపై అగంతుకులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో బస్సులోని శ్రీలంక క్రికెటర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకూ ఏ క్రికెట్ జట్టు కూడా పాకిస్తాన్లో పర్యటించే సాహసం చేయలేదు. దీంతో తటస్థ వేదికల్లోనే పాక్ క్రికెట్ ఆడుతూ వస్తోంది. శ్రీలంక సిరీస్‌తో పాక్‌లో క్రికెట్ పునర్వైభం తీసుకరావాలని భావిస్తున్న పాక్‌కు నిరాశ తప్పేలా లేదు. -
26 ఏళ్ల రికార్డును తిరగరాసిన కోహ్లి
ట్రినిడాడ్ : వెస్టిండీస్‌తో క్వీన్స్‌పార్క్ ఓవల్ స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో రికార్డును అధిగమించాడు. వెస్టిండీస్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 26 ఏళ్లుగా పాకిస్తాన్ దిగ్గజ ఆటగాడు జావేద్ మియాందాద్ (1930 పరుగులు) పేరున ఉన్న రికార్డును తిరగరాశాడు. ఈ మ్యాచ్‌లో వ్యక్తిగత స్కోరు 19 వద్ద కోహ్లి మియాందాద్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక రన్‌మెషీన్‌గా పేరున్న కోహ్లి 34 మ్యాచ్‌ల్లోనే 71 సగటుతో ఈ ఘనత సాధించడం విశేషం. విండీస్‌పై అత్యధికంగా కోహ్లి 7 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు సాధించాడు. కోహ్లి తొలి వన్డే, తొలి సెంచరీ చేసింది కూడా విండీస్‌పైనే కావడం విశేషం. మియాందాద్ 64 మ్యాచ్‌ల్లో 1930 పరుగులు చేసి రెండో స్థానంలో.. ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు మార్క్‌వా 47 మ్యాచ్‌ల్లో 1708 పరుగులతో మూడో స్థానంలో ఉన్నారు. తదుపరి స్థానాల్లో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ దిగ్గజం జాక్వెస్ కలిస్ 40 మ్యాచ్‌ల్లో 1666 పరుగులు... పాకిస్తాన్ ఆటగాడు రమీజ్ రాజా 53 మ్యాచ్‌లు 1624 పరుగులతో ఉన్నారు. -
బాబర్ అజామ్ సరికొత్త రికార్డు
లండన్: వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ కథ లీగ్ దశలోనే ముగిసింది. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 9 వికెట్లకు 315 పరుగులు చేయడంతో సెమీస్ రేసు నుంచి వైదొలగక తప్పలేదు. 316 పరుగుల భారీ తేడాతో గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ అంతే లక్ష్యాన్ని బంగ్లాదేశ్‌కు నిర్దేశించింది. తద్వారా ఈ వరల్డ్‌కప్‌లో సెమీస్‌కు చేరాలన్న పాక్ ఆశలు తీరలేదు. ఇదిలా ఉంచితే, పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ అజామ్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఒక వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన పాక్ ఆటగాడిగా కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఈ మెగా టోర్నీలో బాబర్ అజామ్ చేసిన పరుగులు 474. ఫలితంగా పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ జావెద్ మియాందాద్ రికార్డును తిరగరాశాడు. 27 ఏళ్ల క్రితం 1992 వరల్డ్‌కప్‌లో మియాందాద్ 437 పరుగులు చేశాడు. ఇది ఇప్పటివరకూ పాకిస్తాన్ తరఫున అత్యధిక పరుగుల రికార్డు కాగా, దాన్ని ఈ వరల్డ్‌కప్‌లో బాబర్ అజామ్ బ్రేక్ చేశాడు. ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలతో పాకిస్తాన్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అజామ్(96) తృటిలో సెంచరీ కోల్పోయాడు. -
‘అందుకే గంగూలీ అలా మాట్లాడుతున్నాడు’
ఇస్లామాబాద్: త్వరలో ఇంగ్లండ్ వేదికగా ఆరంభం కాబోయే వన్డే వరల్డ్‌కప్‌లో తమతో మ్యాచ్‌ను బహిష్కరించాలంటూ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ప్రతిపాదించే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో దానిపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ ధ్వజమెత్తాడు. అది బీసీసీఐ చేసిన అనాలోచిత చర్యగా మియాందాద్ విమర్శించాడు. ‘ అది కచ్చితంగా ఐసీసీ ఆమోదించదు. మమ్మల్ని ఎలా బహిష్కరిస్తారు? ఐసీసీ రాజ్యాంగం ప్రకారం సభ్య దేశాలకు అన్ని టోర్నీల్లో పాల్గొనే హక్కుంది. అందువల్ల భారత్ ప్రతిపాదనను ఐసీసీ ఆమోదించే అవకాశం లేదు. ఒకవేళ బీసీసీఐ అలా చేస్తే అది ఒక అనాలోచిత పిచ్చి పనిగా మిగిలి పోతుంది’ అని మియాందాద్ పేర్కొన్నాడు. ( ఇక్కడ చదవండి: ఆ సాహసం భారత్ చేస్తుందా?: గంగూలీ) ఇక్కడ పాక్‌తో మ్యాచ్ వద్దంటూ భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలపై కూడా మియాందాద్ వ్యంగ్యంగా స్పందించాడు. ‘ భారత్‌లో జరగబోయే ఎన్నికల్లో సౌరవ్ గంగూలీ పోటీ చేసి సీఎం కావాలని అనుకుంటున్నాడేమో. గంగూలీ వ్యాఖ్యలు కచ్చితంగా పబ్లిక్ స్టంట్‌లో భాగమే. గంగూలీ సీఎం కావాలనే యోచనతోనే ఇలా వ్యాఖ్యానిస్తున్నాడు. ప్రజల మద్దతు కోసం గంగూలీ యత్నిస్తున్నట్లే కనబడుతోంది’ అని పేర్కొన్నాడు. ప్రభుత్వ నిర్ణయమే శిరోధార్యం -
‘టాస్ లేకపోవడమే మంచిది’
కరాచీ: టెస్టు క్రికెట్లో టాస్‌ను తొలగించే అంశంపై ఐసీసీ క్రికెట్ కమిటీ ఆలోచనలు చేస్తోంది. ఆతిథ్య జట్లు పిచ్‌లను తమకు అనుకూలంగా తయారు చేసుకుంటున్న రీత్యా ఈ విధానానికి స్వస్తి పలకాలనే భావిస్తోంది. దీన్ని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ స్వాగతించాడు. టెస్టుల్లో టాస్ లేకుండా ఉండటం వల్ల మంచి పిచ్‌లను రూపొందించడానికి ఆతిథ్య జట్లు కృషి చేస్తాయన్నాడు. దీనివల్ల లాభమే తప్పా నష్టమేమీ లేదని మియాందాద్ అభిప్రాయపడ్డాడు. ‘ఆతిథ్య జట్లు వారికి నచ్చిన తరహాలో పిచ్‌లను తయారు చేస్తున్నాయి. దీనివల్ల చాలా ఎక్కువ సందర్బాల్లో పేలవమైన పిచ్‌లను రూపొందిస్తున్నారు. ఒకవేళ టెస్టుల్లో టాస్ లేకపోతే అప్పుడు ఆతిథ్య మంచి పిచ్‌లను తయారు చేయడానికి వెనుకాడదు. ఈ ప్రయోగం మంచిదే’ అని మియాందాద్ తెలిపాడు. టెస్టుల్లో టాస్ తొలగించే అంశంపై ఈ నెల 28, 29 తేదీల్లో ముంబైలో జరగనున్న సమావేశంలో కమిటీ చర్చించనుంది. అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, ఆండ్రూ స్ట్రాస్, జయవర్ధనే, టిమ్ మే, న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్, అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో, ఐసీసీ రిఫరీలు రంజన్ మదుగలే, షాన్ పొలాక్‌లు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే 2021లో తలపెట్టిన ప్రతిపాదిత టెస్టు చాంపియన్‌షిప్ నాటికి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇంగ్లిష్ కౌంటీల్లో మూడు సీజన్లుగా టాస్ లేకుండా... బ్యాటింగ్, బౌలింగ్ ఎంపికను పర్యాటక జట్టుకే వదిలేస్తున్నారు. -
'అతనొక క్రికెట్ మేధావి'
కరాచీ: ఎప్పుడూ భారత క్రికెట్ జట్టును టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించే పాకిస్తాన్ దిగ్గజ ఆటగాడు జావెద్ మియాందాద్.. ప్రస్తుతం టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విరాట్ కోహ్లిపై ప్రశంసలు కురిపించాడు. విరాట్ ప్రపంచ అత్యుత్తమ క్రికెటరే కాకుండా, క్రికెట్ మేధావి అంటూ కొనియాడాడు. దాంతోనే ప్రపంచ క్రికెట్‌ను కోహ్లి శాసిస్తున్నాడనన్నాడు. రానున్న రోజుల్లో విరాట్ కోహ్లి మరింతగా చెలరేగిపోయే అవకాశం ఉందని మియాందాద్ జోస్యం చెప్పాడు. తన దృష్టిలో గొప్ప బ్యాట్స్‌మన్ అంటే బౌలర్ల బలాలు, బలహీతనల్ని పక్కకు పెట్టి టెక్నిక్స్‌ను మార్చుకోవడమేనన్నాడు. అది విరాట్‌లో చాలా ఎక్కువగా కనిపిస్తుందన్నాడు. 'విరాట్ ఒక మేధావి. అతనే ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మన్. కోహ్లి బ్యాటింగ్ విధానమే ప్రతిసారీ అతను ఎక్కువ పరుగులు చేయడానికి అవకాశమిస్తోంది. టెక్నిక్ పరంగా విరాట్ చాలా పరిణితి చెందాడు.ఒక ఆటగాడి టెక్నిక్ బాలేకపోతే కొన్నిసార్లు మాత్రమే ఆడి... మిగతా సమయాల్లో విఫలమవుతారు. నిలకడగా పరుగులు సాధించాలంటే టెక్నిక్ కోహ్లి తరహాలో ఉండాలి. అతనో పరిపూర్ణ ఆటగాడు' అని మియాందాద్ అన్నాడు. -
'టీమిండియాతో సిరీస్ మాటే వద్దు'
కరాచీ: దాదాపు పదేళ్లుగా తమతో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటానికి వెనకడుగు వేస్తున్న టీమిండియాతో మ్యాచ్‌ల విషయాన్ని ఇక మరచిపోతేనే బాగుంటుదని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ సూచించాడు. ఈ విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తమ ప్రయత్నం మానుకోవాలని విజ్ఞప్తి చేశాడు. 'టీమిండియాతో దైపాక్షిక సిరీస్‌లు గురించి ఇక ఆలోచన వద్దు. వారితో క్రికెట్ ఆడనంత మాత్రాన మన క్రికెట్‌కు ఏమీ నష్టం లేదు. పదేళ్లుగా మనతో భారత్ మ్యాచ్‌లు ఆడటం లేదు. మన క్రికెట్ ఏమైనా దిగజారిపోయిందా. లేదు కదా.. ఇందుకు చాంపియన్స్ ట్రోఫీనే ఉదాహరణ. అటువంటప్పుడు టీమిండియాతో మ్యాచ్‌లు కోసం పాకులాడటం అనవసరం' అని మియాందాద్ తన స్వరాన్ని పెంచాడు. 2009 నుంచి పాకిస్తాన్లో అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగనప్పటికీ తమ జట్టుకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాలేదని మియాందాద్ అభిప్రాయపడ్డాడు. -
టీమిండియాతో మ్యాచ్ లను బహిష్కరిస్తేనే..
కరాచీ: తమతో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ లు ఆడటానికి విముఖత వ్యక్తం చేస్తున్న భారత జట్టుతో పూర్తిస్థాయి సంబంధాలను తెంచుకోవటమే ఉత్తమమైన మార్గమని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ అభిప్రాయపడ్డాడు. భారత్ తో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిర్వహించే మ్యాచ్ లను సైతం బాయ్ కాట్ చేయాలని ఈ మేరకు పాక్ క్రికెట్ కు సూచించాడు. అసలు తమతో ద్వైపాక్షిక సిరీస్ లు జరపడానికి భారత్ ను ఒప్పించలేని ఐసీసీ.. వారు నిర్వహించే టోర్నీల్లో భారత్ తో పాకిస్తాన్ ను ఆడించడానిక ముందుకు రావడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించాడు. భారత్ తో మ్యాచ్ లను ఆడకుండా దూరంగా ఉన్నప్పుడే ఐసీసీకి తగిన బుద్ది చెప్పినట్లు అవుతుందన్నాడు. 'మనం ఎప్పుడైతై భారత్ తో జరిగే ఐసీసీ టోర్నీలకు దూరంగా ఉంటామో.. అప్పుడు ఆ టోర్నీ ఆదరణ కూడా తగ్గుతుంది. దాంతో ఐసీసీని ఆర్ధికంగా ఇబ్బందులకు గురి చేయొచ్చు. అలా చేసిన క్రమంలో మనకు తగిన గౌరవం ఉండటమే కాదు.. మన మాటను కూడా ఐసీసీ వినడానికి ముందుకొస్తుంది. అంతేకానీ ఐసీసీపై స్ట్రైక్ చేయకుండా ఉంటే మాత్రం మనం ఏమీ సాధించలేము. ఐసీసీలో మన మాట వినేవారే లేరు. అక్కడ అంతా బీసీసీఐదే హవా. ఐసీసీలో బీసీసీఐ చాలా బలంగా ఉంది. బీసీసీఐ రూ.100 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ఐసీసీని ఆశ్రయించడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఇక్కడ మన సమయంతో పాటు, డబ్బు కూడా వృథా ప్రయాసగానే మిగిలిపోతుంది. టీమిండియాతో మొత్తం మ్యాచ్ లను బహిష్కరించే ఐసీసీపై తిరుగుబాటు చేయండి. ఇప్పటికే చాలా నష్టపోయిన మనకు పోగొట్టుకోవడానికి ఏమీ లేదు.భారత్ తో ఐసీసీ మ్యాచ్ లను బాయ్ కాట్ ఒక్కటే సరైన మార్గం'అని మియాందాద్ పేర్కొన్నాడు. -
ఫిక్సింగ్‌కు పాల్పడే క్రికెటర్లను ఉరితీయాలి
న్యూఢిల్లీ: క్రికెట్లో ఫిక్సింగ్‌ను అరికట్టడానికి కఠినమైన చట్టాలు అవసరమని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ అన్నాడు. స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన క్రికెటర్లకు మరణశిక్ష విధించాలని సూచించాడు. పాకిస్థాన్‌లో ఇటీవల మరోసారి స్పాట్ ఫిక్సింగ్ భాగోతం వెలుగుచూసిన నేపథ్యంలో మియాందాద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్లో అవినీతిని అరికట్టడానికి క్రీడా సంఘాలు తగిన చర్యలు తీసుకోవాలని మియాందాద్ సూచించాడు. క్రికెట్లో ఫిక్సింగ్ సంఘటలను క్షమించరాదని అన్నాడు. నిందితులను కఠినంగా శిక్షించడం వల్ల మిగిలిన క్రికెటర్లు అవినీతికి పాల్పడేందుకు భయపడుతారని చెప్పాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న పేసర్ మహ్మద్ ఇర్ఫాన్‌పై పీసీబీ సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. అంతేగాక ఈ టోర్నీలోనే స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన మరో ఇద్దరు క్రికెటర్లు షర్జీల్ ఖాన్, ఖలీద్ లతీఫ్ సస్పెండ్ అయ్యారు. ఇదే కేసులో మరో పాక్ క్రికెటర్ నసీర్ జంషెడ్ అరెస్టయ్యాడు. గతంలో పాక్ అంతర్జాతీయ క్రికెటర్లు మహ్మద్ ఆమీర్, సల్మాన్ బట్, మహ్మద్ ఆసిఫ్‌లు ఫిక్సింగ్ కేసులో సస్పెండ్ కావడంతో పాటు జైలు శిక్ష అనుభవించారు.