ఇస్లామాబాద్: త్వరలో ఇంగ్లండ్ వేదికగా ఆరంభం కాబోయే వన్డే వరల్డ్‌కప్‌లో తమతో మ్యాచ్‌ను బహిష్కరించాలంటూ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ప్రతిపాదించే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో దానిపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ ధ్వజమెత్తాడు. అది బీసీసీఐ చేసిన అనాలోచిత చర్యగా మియాందాద్ విమర్శించాడు. ‘ అది కచ్చితంగా ఐసీసీ ఆమోదించదు. మమ్మల్ని ఎలా బహిష్కరిస్తారు? ఐసీసీ రాజ్యాంగం ప్రకారం సభ్య దేశాలకు అన్ని టోర్నీల్లో పాల్గొనే హక్కుంది. అందువల్ల భారత్ ప్రతిపాదనను ఐసీసీ ఆమోదించే అవకాశం లేదు. ఒకవేళ బీసీసీఐ అలా చేస్తే అది ఒక అనాలోచిత పిచ్చి పనిగా మిగిలి పోతుంది’ అని మియాందాద్ పేర్కొన్నాడు. ( ఇక్కడ చదవండి: ఆ సాహసం భారత్ చేస్తుందా?: గంగూలీ)
ఇక్కడ పాక్‌తో మ్యాచ్ వద్దంటూ భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలపై కూడా మియాందాద్ వ్యంగ్యంగా స్పందించాడు. ‘ భారత్‌లో జరగబోయే ఎన్నికల్లో సౌరవ్ గంగూలీ పోటీ చేసి సీఎం కావాలని అనుకుంటున్నాడేమో. గంగూలీ వ్యాఖ్యలు కచ్చితంగా పబ్లిక్ స్టంట్‌లో భాగమే. గంగూలీ సీఎం కావాలనే యోచనతోనే ఇలా వ్యాఖ్యానిస్తున్నాడు. ప్రజల మద్దతు కోసం గంగూలీ యత్నిస్తున్నట్లే కనబడుతోంది’ అని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment