జావెద్ మియాందాద్(ఫైల్‌ఫొటో)
కరాచీ: ఎప్పుడూ భారత క్రికెట్ జట్టును టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప‍్పించే పాకిస్తాన్ దిగ్గజ ఆటగాడు జావెద్ మియాందాద్.. ప‍్రస్తుతం టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విరాట్ కోహ్లిపై ప్రశంసలు కురిపించాడు. విరాట్ ప్రపంచ అత్యుత్తమ క్రికెటరే కాకుండా, క్రికెట్ మేధావి అంటూ కొనియాడాడు. దాంతోనే ప్రపంచ క్రికెట్‌ను కోహ్లి శాసిస్తున్నాడనన్నాడు. రానున్న రోజుల్లో విరాట్ కోహ్లి మరింతగా చెలరేగిపోయే అవకాశం ఉందని మియాందాద్ జోస్యం చెప్పాడు. తన దృష్టిలో గొప్ప బ్యాట్స్‌మన్ అంటే బౌలర్ల బలాలు, బలహీతనల్ని పక్కకు పెట్టి టెక్నిక్స్‌ను మార్చుకోవడమేనన్నాడు. అది విరాట్‌లో చాలా ఎక్కువగా కనిపిస్తుందన్నాడు.
'విరాట్ ఒక మేధావి. అతనే ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మన్. కోహ్లి బ్యాటింగ్ విధానమే ప్రతిసారీ అతను ఎక్కువ పరుగులు చేయడానికి అవకాశమిస్తోంది. టెక్నిక్ పరంగా విరాట్ చాలా పరిణితి చెందాడు.ఒక ఆటగాడి టెక్నిక్ బాలేకపోతే కొన్నిసార్లు మాత్రమే ఆడి... మిగతా సమయాల్లో విఫలమవుతారు. నిలకడగా పరుగులు సాధించాలంటే టెక్నిక్ కోహ్లి తరహాలో ఉండాలి. అతనో పరిపూర్ణ ఆటగాడు' అని మియాందాద్ అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment