కరాచీ: దాదాపు పదేళ్లుగా తమతో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటానికి వెనకడుగు వేస్తున్న టీమిండియాతో మ్యాచ్‌ల విషయాన్ని ఇక మరచిపోతేనే బాగుంటుదని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ సూచించాడు. ఈ విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తమ ప్రయత్నం మానుకోవాలని విజ్ఞప్తి చేశాడు.
'టీమిండియాతో దైపాక్షిక సిరీస్‌లు గురించి ఇక ఆలోచన వద్దు. వారితో క్రికెట్ ఆడనంత మాత్రాన మన క్రికెట్‌కు ఏమీ నష్టం లేదు. పదేళ్లుగా మనతో భారత్ మ్యాచ్‌లు ఆడటం లేదు. మన క్రికెట్ ఏమైనా దిగజారిపోయిందా. లేదు కదా.. ఇందుకు చాంపియన్స్ ట‍్రోఫీనే ఉదాహరణ. అటువంటప్పుడు టీమిండియాతో మ్యాచ్‌లు కోసం పాకులాడటం అనవసరం' అని మియాందాద్ తన స్వరాన్ని పెంచాడు. 2009 నుంచి పాకిస్తాన్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగనప్పటికీ తమ జట్టుకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాలేదని మియాందాద్ అభిప్రాయపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment