కరాచీ: కొన్నాళ్లుగా... భారత్ ఆతిథ్యమిచ్చే ప్రపంచకప్‌కు రాం రాం, భారత్‌లో ఆడబోం అంటూ మేకపోతు గాంభీర్యానికి పోయిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇప్పుడు ఆడేందుకు రెడీ అయ్యింది. క్రికెట్ లోకం కంటపడేందుకు, ఎక్కడలేని సస్పెన్స్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నించిన పీసీబీ ఇంకో మాట మాట్లాడకుండా వచ్చేందుకు సై అంటోంది.
ఈ మేరకు ఆదివారం పాకిస్తాన్ ప్రభుత్వం భారత్‌లో ఆడేందుకు పచ్చజెండా ఊపింది. ద్వైపాక్షిక సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టబోమని పాకిస్తాన్ విదేశీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
అంతర్జాతీయ క్రికెట్ టోర్నీల్లో తమ జట్టు ఎప్పటిలాగే పాల్గొంటుందని, తమ దేశం నిర్మాణాత్మక, బాధ్యతాయుత విధానాన్ని అవలంభిస్తుందనేదానికి తమ నిర్ణయమే నిదర్శనమని అందులో పేర్కొంది. భారత్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు భద్రతకు ఢోకా ఉండబోదనే ఆశిస్తున్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment