ఇమ్రాన్, మియాందాద్ లు ఒక్కటయ్యారు!
ఇమ్రాన్, మియాందాద్ లు ఒక్కటయ్యారు!
Published Mon, Sep 1 2014 4:58 PM | Last Updated on Sat, Mar 23 2019 8:32 PM
ఇస్లామాబాద్: పాకిస్థాన్ తెహరీక్ ఏ ఇన్పాఫ్ (పీటీఐ) అధినేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ కు తన సహచర ఆటగాడు జావేద్ మియాందాద్ బాసటగా నిలిచారు. పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్న ఇమ్రాన్ ఖాన్ కు మియాందాద్ మద్దతు తెలిపారు. దేశ రాజకీయాలు సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో ఇమ్రాన్ కు మియాందాద్ తోడుగా నిలవడం మీడియాలో కథనాల్ని ప్రముఖంగా ప్రచురించారు.
ఇమ్రాన్ జాతీయ సమైకత్య కోసం పాటుపడే గొప్ప నాయకుడు అని జావెద్ అన్నారు. దేశం భవిష్యత్ కోసం ఆయన చూసిన తపన, నిజాయితీని ఎవరూ శంకించలేరు అని జావెద్ తెలిపారు. పాకిస్థాన్ లో మార్పుకు, ప్రజలను చైతన్య పరిచే శక్తి ఇమ్రాన్ లో ఉందని.. అందుకే ఆయనకు మద్దతు తెలుపుతున్నానని ఆయన ప్రకటించారు. గతంలో పాక్ క్రికెట్ జట్టులో వీరిద్దరి మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే. 1986 లో షార్జాలో జరిగిన ఓ టోర్ని ఫైనల్ మ్యాచ్ లో జావెద్ మియాందాద్ సిక్స్ కొట్టి సంచలన విజయాన్ని పాకిస్థాన్ కు అందించారు.
Advertisement
Advertisement