
‘ఆఫ్రిది సిగ్గుపడాలి’
కరాచీ: భారతీయులు కురిపిస్తున్న ప్రేమ తమ దేశంలో కూడా చూడలేదని పాకిస్తాన్ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది చేసిన వ్యాఖ్యలను మాజీ సారథి జావెద్ మియాందాద్ తప్పుబట్టారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అవమానకరమని, అలా చేసిన ఆటగాళ్లు తమకు తామే సిగ్గుపడాలని విమర్శించారు. ‘పాకిస్తాన్ జట్టు టి20 ప్రపంచకప్ ఆడేందుకు మాత్రమే భారత్‌కు వెళ్లింది.
కానీ ఆటగాళ్లు ఆ దేశాన్ని ఆకాశానికి ఎత్తడానికి కాదు. అసలు భారతీయులు మనకు ఏం ఇచ్చారు? పాక్ క్రికెట్‌కు ఏమైనా చేశారా? పాక్ క్రికెట్‌కు ఎన్నో ఏళ్లు సేవలందించిన వ్యక్తిగా ఆఫ్రిది మాటలు విని షాక్‌కు గురయ్యా’ అని మియాందాద్ పేర్కొన్నారు. మరోవైపు పాక్ ప్రజల మనోభావాలు దెబ్బతీశాడంటూ ఆఫ్రిదికి ఓ సీనియర్ న్యాయవాది లీగల్ నోటీసు కూడా పంపారు.