బెంగుళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్నతొలి టెస్టులో భారత యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ అదరగొడుతున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో డకౌటైన సర్ఫరాజ్.. రెండో ఇన్నింగ్స్‌లో సత్తాచాటుతున్నాడు. శుబ్‌మన్ గిల్ స్దానంలో జట్టులోకి వచ్చిన 26 ఏళ్ల ముంబైకర్.. మూడో రోజు ఆటలో దుమ్ములేపాడు.
భారత పోరాటంలో కీలక పాత్ర పోషించాడు. స్వీప్, ర్యాంప్ షాట్‌లు ఆడుతూ సర్ఫరాజ్ అలరించాడు. మూడు రోజు ఆట ముగిసే సమయానికి 70 పరుగులతో ఖాన్ అజేయంగా నిలిచాడు. నాలుగో రోజు భారత్ తమ రిథమ్‌ను కొనసాగించాలంటే వీలైనంత సమయం పాటు సర్ఫరాజ్ క్రీజులో ఉండాలి. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్‌పై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశంసల వర్షం కురిపించాడు. సర్ఫరాజ్‌ను భారత దిగ్గజ బ్యాటర్ జావేద్ మియాందాద్‌తో మంజ్రేకర్ పోల్చాడు.
"సర్పరాజ్ జావేద్ మియాందాద్‌ని గుర్తు చేస్తున్నాడు. 1980లలో జావేద్ ఈ విధంగానే ఆడేవాడు. సర్పరాజ్ మియాందాద్ 2024 వెర్షన్. అతడు ఆట తీరు నన్ను ఎంతోగానే ఆకట్టుకుంది. అతను స్పిన్‌ను బాగా ఆడతాడని మాకు తెలుసు, కానీ ఫాస్ట్ బౌలర్లను కూడా ఈ విధంగా ఆడుతాడని నేను అనుకోలేదు.
అతడికి అద్భుతమైన గేమ్ ప్లాన్ ఉంది.మూడో రోజు ఆట ముగిసే సమయంలో తన వికెట్‌ను కోల్పోకుండా జాగ్రత్తపడ్డాడు. ఆఖరిలో డిఫెన్స్ ఆడుతూ మూడో రోజు ఆటను ముగించాడు. నాలుగో రోజు ఆటలో సర్ఫరాజ్ కీలకం కానున్నాడు.
బౌన్సర్లను కూడా సర్ఫరాజ్ అద్బుతంగా ఆడుతున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు భారత్‌కు ఇది నిజంగా శుభసూచకమని" ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజ్రేకర్ పేర్కొన్నాడు. కాగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. భారత్ ఇంకా 125 పరుగుల వెనకంజలో ఉంది.
చదవండి: IND vs AUS: ఆసీస్ టూర్‌కు భారత జట్టు ఇదే.. కెప్టెన్‌గా రుతురాజ్! తెలుగోడికి చోటు?
Comments
Please login to add a commentAdd a comment